మహిళా దర్శకులు

శ్రీనగర్ కాలనీలో ఒక film unit van ఆగి ఉంటుంది, దాని డోర్ పక్కన “స్త్రీలకి ప్రవేశం లేదు” అని రాసి ఉన్నది చూసి ఇదేంటి విచిత్రంగా ఉంది అనిపించింది, పిల్లలు రావద్దు అంటే అర్ధముంది, లోపల ఎలక్ట్రికల్ వస్తువులు ఉంటాయి కాబట్టి. అసలు ఆ డిపార్ట్మెంట్ లో ఆడవాళ్ళు ఉండరు, ఆ van లోకి lightmen తప్ప ఎవరూ ఎక్కరు, మరి ప్రత్యేకంగా ఎందుకు రాసినట్టు ? ఫలానా రోజు ఆడవాళ్ళు గుడిలోకి రావద్దు అనే దానికి ఏవో కారణాలు చెప్తారు, ఆ మూఢత్వం తరతరాలది, అది అలాగే ఉంటుంది అనుకోవచ్చు, కానీ యూనిట్ van లోకి స్త్రీలు ఎందుకు వెళ్ళకూడదు ? “గోడ మీద ఆవు పేడ ఎలా వేసింది” అని యమలీల లో బ్రహ్మానందం రేంజ్ లో కన్ఫ్యూజ్ అయ్యాను. తట్టుకోలేక ఒక ఇండస్ట్రీ ఫ్రెండ్ కి ఫోన్ చేసి అడిగా, ఇలా ఎందుకు రాసుంది? అని, అవును చాలా బళ్ళ మీద రాసుంటుంది ఎప్పుడూ చూడలేదా అని అడిగాడు వాడు? నేను Ad films కి పని చేసినపుడు యూనిట్ vans వచ్చేవి గాని అలాంటిది చూసిన గుర్తు లేదు. ఎందుకు రాస్తారు ? అని మళ్ళీ అడిగా, ఏముంటుంది బాసూ ఇండస్ట్రీ వుమెన్ కి safe place కాదు ఇంకోటి చీరలు కట్టుకుంటారు కాబట్టి safe కాదని చెప్పాడు. కరెక్టే చీరలు అగ్నిప్రమాదాలు చిన్నప్పట్నుచి చాలా విన్నాను కాబట్టి, safety కోసమే రాసుంటారులే అనుకున్నా. జీన్స్ వేసుకుని వస్తే ఎక్కచ్చా ? ఇది ఎవరినీ అడగలేదు.

నాకు బాగా గుర్తున్న ఇండ్స్ట్రీ vs వుమెన్ issues లో ఒకటి, ఆవిడ పేరు రూపాదేవి అనుకుంట, మేకప్ ఆర్టిస్ట్, ఆవిడకి యూనియన్ కార్డు ఇవ్వలేదు, అది లేకపోతే పని చేయనివ్వరు. చాలా fight చేసింది ఆవిడ, చివరకు సాధించింది. ఎందుకు ఇవ్వరు కార్డ్ అనే కారణాలు గుర్తులేవు గానీ, ఇది వివక్షే అని ఆవిడ అనటం మాత్రం గుర్తుంది.

ఇది ఇంతకు ముందు రాసిందే, మహిళా దర్శకులు ఎందుకంత rarity ? మా generation కి లెజెండరీ భానుమతి & విజయ నిర్మల బాగా తెల్సు, ఋతురాగాలు వల్ల మంజులానాయడు తెల్సు. Fire (1996) సినిమాతో దీపామెహతా సృష్టించిన సంచలనం మామూలుది కాదు, అదే సంవత్సరం Kama Sutra ఇంకో సంచలనం, మీరా నాయర్ దర్శకురాలు. విపరీతమైన డిబేట్లు విశ్లేషణలు జరిగాయి, ఆ సినిమాల్లో వాళ్ళు touch చేసిన subjects కి female perspective ఇచ్చారు అనేది బలంగా వినిపించిన వాదన. ఆ తర్వాత నేను మీరా నాయర్ సినిమా “Monsoon wedding” చూసి stun అయిపోయాను, అందులో ఉండే female characters ఆలోచనలు, అభిప్రాయాలు, వాళ్ళ relationships & romance, అలాంటిదెప్పుడూ చూడలేదు. చాలా female oriented సినిమాలు చూసినా ఇది వేరే, moreover girl child abuse ని అంత sensitive & intense గా చూపించడం wow అనిపించింది. Salaam bombay చూస్తే salaam meera అనాల్సిందే. మీరా is love.

Female filmmakers అంటే స్త్రీ కోణాన్ని చూపించాల్సిందేనా అంటే not necessary, but ఆ angle interesting అనిపిస్తుంది నాకు. Teenage లో mtv లో private music videos విపరీతంగా చూసే time లో రాధికా రావు అనుకుంట, crazy గా ఉండేవి తను డైరెక్ట్ చేసినవి, హే అమ్మాయి డైరెక్టర్ లు ఇలాంటివి కూడా చేస్తారా ఆశ్చర్యపోయిన మధ్యతరగతి మానవుణ్ణి నేను. అలా నన్ను మళ్ళీ surprise చేసింది దివ్య బండారు, తన Pickpocket (2022) చూసి కుళ్ళుకున్నాను. ఒకమ్మాయి ఇలాంటి సినిమా చేసిందా అని నా middle class mindset ఆలోచన మళ్ళీ, అదెప్పటికీ అంతే అనుకోండి.

ఇదెందుకు రాయాలి అనిపించింది అంటే, నిన్న youtube లో ఎవరో discuss చేస్తున్న video చూసా, Yash next గీతూ మోహన్ దాస్ తో సినిమా చేస్తున్నాడు, KGF తర్వాత Yash female director తో చేస్తున్నాడంటే గ్రేటే, ఇలా ఏదో మాట్లాడుకున్నారు. నిజమే అనిపించింది, అంత superstar safe గా ఇంకో mass director తో కాకుండా గీతూ తో చేస్తున్నాడంటే, interesting.

మళ్ళీ యమలీల బ్రహ్మీ లాగా “మహిళా దర్శకులు ఎందుకింత తక్కువున్నారు?” ఇక్కడనే కాదు ప్రపంచవ్యాప్తంగా అంతే, why? Direction ఎంత కష్టమో అంత fun job, నాకు filmmaking process లో అందరికన్నా సుఖపడేది దర్శకుడే అనిపిస్తుంది. Stress tension ఇంకా చాలా ఉంటాయి కానీ director కి special treatment ఉంటుంది. కూర్చోవాలనుకుంటే కుర్చీ నీ కిందకి వస్తుంది, చెయ్యెత్తితే నీళ్ళ గ్లాసో జ్యూసో పెడతారు, ఎండ తగలకుండా గొడుగుంటుంది, నువ్వు ఏదన్నా చెప్పగానే ఆ పనిచేసే మనుషులుంటారు, director అంటే అంతే.

ఇలాంటి fun job వైపు ఆడవాళ్ళు ఎందుకు interest చూపించరు? Actress అవడం అంటే ఆపడం ఎప్పుడూ ఉన్నదే ఉండేదే, director అవుతామంటే కూడా ఒప్పుకోరా parents ? ఖచ్చితంగా ఒప్పుకోరు, నన్ను కలిసే young filmmakers నుంచి “ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదన్నా” ఈ మాట వింటూనే ఉంటా. Film industry అంటే ఉన్న opinion అలాంటిది & click అవచ్చు అవకపోవచ్చు, నన్ను మా అమ్మ ఇప్పటికీ వేరే ఏమైనా చూసుకోవచ్చుగా అంటుంటుంది.

ఏదో అనిపించింది రాసాను, ఎలా conclude చేయాలో అర్ధం కావడం లేదు, so ఇక్కడితో ఆపేస్తా.