నవతరం నిర్మాత

ఈ సినిమా ప్రొడ్యూసర్ దాము, డైరెక్టర్ శ్రీమాన్, actors పవన్, అన్వేష్, అభయ్ & రాజు మంచి ఫ్రెండ్స్ నాకు, ఇది ‘మనోళ్ళ సినిమా’ అని అనుకునే feeling ఇచ్చే సినిమా. వీళ్ళందరిలో ప్రొడ్యూసర్ దాము very special for Avanti Cinema, ఎందుకంటే నిరుద్యోగ నటులు జరగడానికి కారణం దాము. 2017 లో నేను ముంబైలో ఉన్నప్పుడు రాహుల్ రామకృష్ణ నుంచి కాల్ వచ్చింది “మా ప్రొడ్యూసర్ దాము నీతో మాట్లాతాడంట” అని దాముని పరిచయం చేసాడు, “అన్నా story discussion చూసాను, ఒక ఎపిసోడ్ try చేద్దాం అని మొదలుపెట్టి మొత్తం చూసేసా, fantastic work అన్నా, మనం ఏమన్నా చేద్దాం” అని నాతో దాము అన్న మాటలు చాలా exciting గా అనిపించాయి.

నచ్చి compliments ఇవ్వడం జరుగుతూనే ఉంటుంది కానీ ఒక ప్రొడ్యూసర్ collaborate అవుతాను అనటం ఒక filmmaker కి ఎంత energy ఇస్తుందంటే, basic గా confidence boost అవుతుంది. సాయంత్రానికి Story Discussion 2 కథ రెడీ చేసా, mohan kumar NTR biopic తీసే process లో జరిగే pre production drama నే SD2, కానీ బడ్జెట్ Season 1 కన్నా ఐదు రెట్లు ఎక్కువ. అదే చెప్పాను దాము కి, Mic tv YT channel run చేస్తున్నారు అప్పుడు దాము & సతీష్, అంత బడ్జెట్ కాకుండా low budget లో ఏమన్నా చేద్దాం అన్నాడు దాము.

సరే, opportunity అయితే వదులుకోకూడదు అనుకుని నిరుద్యోగ నటులు ఐడియా చెప్పాను, bound script కాదు కద one page script కూడా అడగలేదు, let’s do it అన్నారు. అలా జరిగింది NN, మాకు Story Discussion కన్నా ఎక్కువ reach & recognition తీసుకొచ్చిన web series, new age ప్రేక్షకులకి ఒక new experience ఇచ్చిన fiction అది. అది జరిగిందంటే కారణం దాము నే. దాము  ఎప్పుడూ ఏదన్నా కొత్తగా try చేద్దాం అనే మాట్లాడతాడు, అది ఎలా ఉండబోతోంది result ఏమవుతుంది అనే worry కన్నా different గా ప్రయత్నమైతే చేద్దాం అనే తపన ఉన్న నిర్మాత.

ఇలాంటి వాళ్ళు అవసరం మన ఇండస్ట్రీకి, దాము లాంటి producers కి financial success అవసరం, ఒక హిట్టు పడితే దాము మాలాంటి filmmakers ని ఖచ్చితంగా encourage చేస్తాడు, అందులో నాకెలాంటి డౌట్ లేదు. ఇప్పటికీ కలిసిన ప్రతిసారి “మనమొక సినిమా చేయాలన్నా” అనే తన మాట నాకొక hope, నాకూ అలాంటి young & energetic నిర్మాతతో చేయడం మంచి experience అవుతుంది, చూద్దాం జరుగుతుందేమో. తనొక కాబోయే దర్శకుడు కూడా, iam curious to see what kind of film he is going to do అని.