DFI story

TFI లాగ DFI catchy గా ఉంటుందని పెట్టా, DFI – DECADE of FAILED INDIES story, అబ్బా ఎంత లేకి cringe రా నాయనా నువ్వు అనిపించిందా? ఆ DFI మేమే, నేనూ రోహిత్. నిన్నటికి పదేళ్లు మా so called “filmmaking journey” కి,  అంటే మా first  film  శీష్ మహల్ తీయడం మొదలైన రోజు. చాలా భారీగా సెలెబ్రేట్ చేద్దాం అనే plan వేసాం కానీ దాని గురించి ఎక్కువ ఆలోచించి చించి final గా అసలేం చేయొద్దు అని decide అయ్యాం. దశాబ్దపు విఫల సినీ జీవితం, మేము business పరంగా utter flop, views ఉండవు, రిలీజ్ అయిన వాటికి returns ఉండవు, shooting మొదలైనవి పూర్తవుతాయో లేదో తెలియదు, ఒకవేళ అయినా post production జరిగి బయటకి ఎప్పుడొస్తాయో చెప్పలేం. మా పదేళ్ల filmmaking process అంతా ఇలాగే జరిగింది, అంతులేని uncertainty. 

ఆశ నిరాశలు నిస్పృహలు కష్టాలు మరియు ఆర్ధిక కష్టాలు మా వెన్నంటే ఉన్నా జంకలేదు, మా ధైర్యమేంటో మాకూ తెలియదు, బహుశా నిరంతర ఆశావాదమే మా fuel అయుండొచ్చు లేదా ఏదో ఒకటి తీసి మేము చూసుకుని జనాలకి చూపించాలన్న తపనే మమ్మల్ని ముందుకు నడిపించిందేమో. బాగా dramatic అవుతోంది కద, ఒకోసారి అంతే. Workout అయినా అవకపోయినా ఇలానే తీస్తూ దరిద్రంలోనే బతుకుదాం అని మేమేం పంతం పట్టలేదు కానీ అలా అలవోకగా దశాబ్దం గడచిపోయింది. 

ఒక short film తీయడానికే ఎన్ని సమస్యలు ఎదురురవుతాయో మేము చూస్తూనే ఉన్నాం, మా ఇద్దరికీ ఆ భయం ఎప్పుడూ కలగలేదు, బాగా excite చేసిన idea ఎలాగైనా తీయాల్సిందే అనే మొండి పట్టుదలే మా బలం. Beg, borrow or steal అన్న మాటల్లో మొదటి రెండింటిలో experts మేము, stealing మాత్రం తెలియదు, దీని మీద డబ్బులు పెడితే ఖచ్చితంగా వెనక్కి వస్తాయి అనే మోసం కూడా చేయలేదు. చాలా clear గా డబ్బలు రావు అనే చెప్పాం, మాకు support చేసేవాళ్ళకి కూడా ఆ విషయంలో clarity ఉంది. ఇవ్వగలిగినంత ఇద్దాం ఏం తీస్తారో చూద్దాం అనే curiosity create చేసాం, అదే మా success. 

అవంతి నుంచి ఏదైనా బయటకొస్తోంది అంటే, ఖచ్చితంగా ఏదో ఒక interesting thing ఉండే ఉంటుంది అనే ఉత్సుకత రేకెత్తిస్తూనే ఉన్నాం పదేళ్ళుగా, ఇది మామూలు achievement కాదు. మేము చేసినవి నచ్చి మమ్మల్ని అభిమానించి compliments ఇచ్చే వాళ్ళే మాకు ఇష్టం, విమర్శించి విశ్లేషించే వాళ్ళతో మాకు అవసరం లేదు. తప్పైనా ఒప్పైనా మాకు మేమే పెద్ద critics. ఇది arrogance అనిపిస్తే వాడి ఖర్మ, ఇది అపరిమిత స్వేఛ్చ, ఆస్వాదిస్తేనే తెలుస్తుంది. 

ఇంతే స్వేఛ్చగా continue అవగలమా? చెప్పలేను, return on investment ఆశించే నిర్మాతలకి కథలు చెప్పడం మొదలుపెట్టాం, మాకూ ఈ దరిద్రంలో బతకాలని లేదు, compromise తప్పదు. Adjust అవుదాం అనుకుని ముందుకు పోవడమే, బడ్జెట్ పది వేలైనా పది లక్షలైనా కోట్లైనా మా effort లో ఎలాంటి compromise ఉండదు, మేము అంత enjoy చేస్తాం filmmaking process ని. 

అసలు ఇన్ని రోజులు కలిసి ఎలా పని చేస్తున్నారు అని చాలా మంది అడిగారు, ఏమో మాకూ తెలియదు, అలా గడచిపోయింది కాలం. May be త్వరలోనే విడిపోయి వేరువేరుగా సినిమాలు తీస్తామేమో, ఇది ఎప్పట్నుంచో మేమిద్దరం అనుకుంటున్నదే.