విద్యా సిన్హా (1947 – 2019)

బసు ఛటర్జీ  చీరల టేస్ట్ అలాంటిదో లేక విద్యా సిన్హా కడితే ఏ చీర అయినా అంత అందంగా కనపడుతుందో, “రజనీగంధ” సినిమా చూస్తున్నంతసేపు next ఏ చీరలో విద్యా కనిపించబోతోంది అనేదే నా curiosity.  

“Chhotisi baat” చూసాక ఇంకో బసు ఛటర్జీ సినిమా చూద్దామనిపించి చాలాసార్లు విన్న రజనీగంధ మొదలుపెట్టాను, opening scene కే flat. ఆ సీన్ తోనే అర్ధమైపోతుంది ఇది female centric సినిమా అని, విద్యా సిన్హా పాత్ర పేరు దీప, psychology లో post graduate చేసిన  అమ్మాయి. తన boyfriend సంజయ్ (అమోల్ పాలేకర్) కోసం థియేటర్ దగ్గర ఎదురు చూస్తున్నప్పుడు టైటిల్స్ మొదలవుతాయి, entire title sequence విద్యా waiting మీదే. ఈ సీన్ చూస్తే అనిపిస్తుంది బసు ఛటర్జీ ఆమె మీద ఎంత ట్రిప్ అయ్యాడో అని. విద్యా సిన్హా కళ్ళలోనే ఉంది magic అంతా, very simple performer, కొన్ని సీన్స్ లో కోపంగా మూడీగా ఉండే ఆమె టక్కున pleasant గా మారి నవ్వుతుంటే హమ్మయ్య అనే relaxing feeling మనకీ వస్తుంది.

కోపంగా ఉన్న ప్రేయసి నవ్వినప్పుడు వచ్చే ఆనందమే వేరు.  

సింపుల్ కథ, ఢిల్లీలో అన్నా వదినల దగ్గర ఉండి చదువుకుంటున్న దీప, ఐదేళ్లుగా సంజయ్ తో ప్రేమలో ఉంది, అతనికి promotion రాగానే పెళ్లి చేసుకోవాలన్నది వాళ్ళ ప్లాన్, ఇంట్లో వాళ్లకి కూడా ఇదంతా తెల్సు. దీప ఎంత dreamy నో సంజయ్ అంత practical. Delhi రోడ్ల మీద బస్టాపుల్లో కాఫీ షాపుల్లో సీన్లు చూస్తుంటే నాకు అర్జెంటుగా ఏదో ఒక షూట్ మొదలుపెట్టాలి అనిపించింది. 1974 లో delhi ని చూడొచ్చు ఈ సినిమాలో, low budget సినిమా అంటే రోడ్డెక్కాల్సిందే, సిటీని set లా వాడాల్సిందే. అలా రొమాంటిక్ గా గడిచిపోతున్న కథలో చిన్న turn, దీపకి బాంబేలో lecturer గా job offer. అక్కడికెళ్లిన దీపకి 17 ఏళ్ళ వయసులో తన తొలి ప్రేమికుడు నవీన్ కలుస్తాడు, అది ఆమెకి ఇష్టం లేకపోయినా తప్పదు. నవీన్ విషయం సంజయ్ కి కూడా తెల్సు. నవీన్ ఇప్పుడొక Ad filmmaker, దీపకి ఎలాంటి ఇబ్బంది రాకుండా బాంబే అంతా తిప్పుతుంటాడు, కానీ ఆ పాత ప్రేమని చూపించడు. దీప మొదట్లో దూరంగా ఉండటానికి ప్రయత్నించినా మెల్లిగా నవీన్ మీద మళ్ళీ ప్రేమ మొదలవుతుంది, నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను అని నవీన్ చెప్పాలని కోరుకుంటుంది. అది జరిగిందా లేదా, దీపకి ఇప్పుడు నవీన్ కావాలా సంజయ్ కావాలా? ఆమె dilemma నే కథ. 

నాకు ఇలాంటి కథలంటే చాలా ఇష్టం, man woman relationships & conflicts, especially ప్రేమ ఇంకో వైపుకి shift అవడం అనేది interesting పాయింట్. 1966 లో మను భండారి రాసిన “yehi sach hai” short story ని తీసుకుని చేసిన సినిమా రజనీగంధ, బసు ఛటర్జీ screenplay లో కొన్ని మార్పులు చేసాడు.  original కథలో దీపకి సంజయ్ కి మధ్య physically intimate scenes ఉంటాయంట, కానీ సినిమాలో అలాంటివి ఏం లేవు కానీ almost ఇంక సెక్స్ జరగబోతోంది అన్నంత tension ఉంటుంది అది కూడా దీప సైడ్ నుంచే, బట్ మంచోడైన సంజయ్ ఆమెకి రజనీగంధ పూలు ఇచ్చి వెళ్లిపోతుంటాడు. 

చిన్నప్పట్నుంచి హిందీ సినిమాలు చూడటం వల్ల ఆ తరం హీరోయిన్లు కొంతవరకు బానే తెల్సు నాకు, కానీ విద్యా సిన్హా గురించి ఎప్పుడూ వినలేదు. ఇంత అందమైన performer ఎందుకు అంత popular అవలేదు అనిపించి research చేసా. ఆమె  తాత, తండ్రి దర్శక నిర్మాతలైనా విద్యా ఎప్పుడూ సినిమాల్లోకి రావాలనుకోలేదు, 18 ఏళ్ళ వయసులో మోడలింగ్ మొదలుపెట్టి, miss bombay గా గెలిచి చాలా బ్రాండ్స్ కి model గా చేసింది. 21 ఏళ్లకే పక్కింటి తమిళ్ బ్రాహ్మిణ్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అవుతున్న టైంలో “రాజు కాకా” అనే సినిమాతో బాలీవుడ్ లో ప్రవేశం, అదే సంవత్సరం బసు ఛటర్జీ “రజనీగంధ” లో అవకాశం. సినిమా హిట్టు, మళ్ళీ బసు తోనే “chhotisi baat” అది కూడా హిట్. అక్కడ్నుంచి అన్నీ చీరకట్టు పాత్రలే వస్తుండడంతో image మార్చుకోవడానికి ట్రై చేసినా వర్కౌట్ అవలేదు. పదేళ్లలో 25-30 సినిమాలు చేసింది. పిల్లలు పుట్టకపోవడంతో ఒక అమ్మాయిని adopt చేసుకుని సినిమాల నుంచి రిటైర్ అయిపోయింది. అక్కడ్నుంచి ఎన్నో కష్టాలు. 

Rajkapoor “సత్యం శివం సుందరం” లో జీనత్ అమన్ పాత్ర విద్యానే చేయాల్సింది కానీ అటువంటి కాస్ట్యూమ్స్ లో చేయడం ఇష్టం లేక వదులుకుంది. 

Rajanigandha available on amazon prime. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *