World Cinema – Iranian

World cinema గురించి వినడమే కానీ చూడడం మొదలుపెట్టింది చాలా లేట్గానే. చిన్నప్పటి నుండే హాలీవుడ్ సినిమాలు చూడడం అలవాటైన, స్పెషల్ గా వరల్డ్ సినిమా అంటే ఏంటి? ఎవరు తీస్తారు? ఎక్కడ రిలీజ్ చేస్తారు? లాంటివేమీ తెలియదు.  అండ్ పుట్టి పెరిగింది పెద్దగా లిటరేచర్ అండ్ ఆర్ట్ ఫార్మ్ గురించి అవగాహన లేని ఫ్యామిలీలో, అలా అని అస్సలు సినిమాలూ చూసే వాళ్ళు కాదా అంటే? అదీ కాదు. మా ఇంట్లో ఘోరంగా హిందీ, తెలుగు సినిమాలు చూసేవాళ్ళు. మా అమ్మ ముస్లిం స్కూల్లో చదువుకుంది, మా డాడీ CRPF లో పని చేసి వచ్చాడు, అండ్ డాడీ వాళ్ళది ఓల్డ్ సిటీలో ఇల్లు. కచ్చితంగా హిందీ బాగా మాట్లాడడం, చూడడం, చదవడం వచ్చు, నాకు పెద్దగా మాట్లాడడం రాకపోయినా manage చెయ్యగలను. 

సో, అక్కడి వరకే. నెలలో ఒకటి రెండు సినిమాలు కచ్చితంగా సంధ్య, సుదర్శన్, ఓడియన్, దేవి ఏదో ఒక దాంట్లో చూసే వాళ్ళం(మా అమ్మ ఇల్లు ఇక్కడే). అలా చూసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇంట్లో ఇంగ్లీష్ సినిమాలు పెట్టేవాడు మా డాడీ, సబ్స్ ఉన్న అర్థం కానీ ఏజ్ అది. 

చదువు అయిపోయింది, ఇంకా ఏమైనా వెలగపెడదాం అని UPSC preparation స్టార్ట్ చేసాను. GK చాలా అవసరం, ఇంటర్నేషనల్ న్యూస్, అవార్డ్స్ extra అన్ని ఫాలో అవ్వాలి. అలా ఫస్ట్ టైం నాకు ఇంటర్నేషనల్ సినిమాల గురించి ఒక ఐడియా వచ్చింది. ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్, కాన్స్ etc న్యూస్లు ఫాలో అయ్యేదాన్ని, ఎక్కడ GK లో అడుగుతారో అన్న విషయం పక్కన పెడితే మిగితా టాపిక్స్ కన్న ఇవి చాలా ఇంటరెస్టింగ్ గా అనిపించేవి. 

అలా ఒకసారి,ఏదో జర్మనీ or ఏదో దేశం సినిమాకి ఆస్కార్ వచ్చింది, అదేం కేటగిరీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే నాకు తెలుసుకోవాలి అనిపించి browse చెయ్యడం మొదలు పెట్టాను. మెల్లిగా ఒకదాని తర్వాత ఒకటి అసలు ప్రపంచం అంటే పొలిటికల్, కల్చరల్ గానే కాదు సినిమాల పరంగా కూడా వేరే, అదొక పెద్ద థింగ్. అంటే తెలియని విషయం అని కాకపోయినా, సడెన్ realisation, there’s something else అని స్ట్రాంగ్ గా ఫీల్ అవ్వడం మొదలైన టైం. అలా నాకు గుర్తుండి నేను చూసిన ఫస్ట్ world cinema, Iranian cinema. 

ఉషా అండ్ మోషే వాళ్ళతో కలిసి 2012 లో అనుకుంటా,”Children of heaven” చూసాను, అలా తెలియకుండా నేను world cinema ఫస్ట్ experience చేసింది Majid Majidi సినిమాతోనే. నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. తర్వాత వెంటనే చూసింది Asghar Farhadi, “A Separation”. ఈ రెండు సినిమాలు నాకు eye opener లాంటివి. తర్వాత మెళ్లిగా explore చెయ్యడం మొదలు పెట్టాను. అలా ఇరాన్ నుండి స్టార్ట్ అయింది నా world cinema experience. తర్వాత Makhmalbaf, Abbas Kiarostami, Jafar Panahi సినిమాలు చూసాను. గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో రెండు మూడు న్యూ ఏజ్ ఇరానియన్ సినిమాలు చూసాను, కనీసం పేర్లు కూడా గుర్తులేవు. పెద్దగా ఎక్కని, చాలా abstract సినిమాలవి. అలాంటి రాండమ్ రెండు మూడు సినిమాల వాచింగ్ experience పక్కన పెడితే, ఎప్పుడు ఇరానియన్ సినిమా చూసిన చాలా ప్రశాంతంగా, బ్యూటిఫుల్ గా, జీవితంలో ఇంకా చాలా ఉంది, చాలా నెమ్మదిగా బ్రతకచ్చు, ఇరాన్ పోతే బాగుండు. వాళ్ళ ఇల్లు, అక్కడ రోడ్లు, వాళ్ళ బట్టలు, తిండి, కల్చర్, అసలు వాళ్ళు డీల్ చేస్తున్న విషయాలు, ఎంత సింపుల్ పీపులో అనిపిస్తుంది. 

అసలు అప్పటి వరకు ఊరికే అయిన దానికి కానీ దానికి ఫైటింగ్ సీన్స్, కామెడీ ఉండే సినిమాలా కాదని అర్థం అవుతుంటే cinema అంటే ఇంత సీరియస్గా తీస్తారా అని భయమేసింది. ఇలాంటి సినిమాలు బాగా చదువుకున్న వాళ్ళు, జీవితంలో రకరకాల ఎక్స్పీరియన్స్లు ఉన్నవాళ్లు, అదంతా వేరే ప్రపంచం, నా లాంటి వాళ్ళని అలాంటి సినిమా జీవితాన్నే మార్చేస్తుంది అని చూసినప్పుడు తెలియకపోయినా, ఎన్ని ఒపీనియన్స్ మారయో తలుచుకుంటే…అప్పటి వరకు నాకు నచ్చని తెలుగు unnecessary, ugly, routine కామెడీ సీన్స్, బ్యాడ్ ఫైటింగ్ సీన్స్ అండ్ stupid dances లాంటివి ఏమీ లేకుండా ఇంత మంచి సినిమాలు చూడచ్చు అనే ఫీలింగ్ రిలీఫ్ ఇచ్చింది. నాకు ఇలాంటివే చూడాలని ఉండే, ఇంత సింపుల్, కథలు ఇలాంటివే, చూడడానికి కళ్ళకి ఈజీ గా ఉండాలి, ఏమైనా చూస్తుంటే అందులో మునిగిపోయి చుట్టూ పక్కన జరిగేవి మర్చిపోయేలా ఉండాలి, అవ్వని experience చేస్తుంటే బయటకి ఎలా చెప్పాలో, ఎవరితో ఎలా షేర్ చేసుకోవాలో? అసలు ఇంత ఫీల్ అవడం కూడా అవసరమా? నేను మరీ టూ మచ్ గా ఆలోచిస్తున్న, మనకెందుకు? ఎప్పుడో ఒక రోజు ఒక సినిమా, మన ప్రిపరేషన్ మనది. అండ్ సినిమాల గురించి మాట్లాడేవాళ్ళు, అంటే నచ్చిన సినిమాల గురించి ఛాయ్ తాగుతూ కూర్చొని కాసేపు మాట్లాడే వాళ్ళు కూడా ఎవరూ తెలియదు, ఏదో ఒక తెలుగు సినిమా రిలీజ్ అవుతోంద,  అది చూసి కాసేపు కామెడీ చేసుకోవడం తప్ప, ఒక సినిమా చూసాక వచ్చే ఫీలింగ్స్, అసలు ఏమనిపిస్తుందో అది ఎలా చెప్పాలి అని కూడా తెలియదు, అలాంటి ఫ్రెండ్స్ కూడా అప్పటిదాకా ఎవరు తగలలేదు. 

అంటే అదేలే, వాళ్ళ దేశంలో కూడా నేను ఇందాక చెప్పిన ఎక్కని సినిమాలు ఉంటాయి. అలాంటివి బోలెడన్ని తీస్తారు కానీ నేను చూసిన సినిమాలు నాకు నచ్చే డైరెక్టర్, యాక్టర్స్ సినిమాలు అయితే అదొక ఫెయిరీ టైల్ ప్రపంచమే. ఇంత బిజీ Hyderabad నుండి ఒకసారి వాళ్ల స్ట్రీట్ సైడ్ ఉండే షాప్స్ చూస్తూ నడవాలనిపిస్తుంది, ఇంట్లో, కిచెన్లో స్మోక్ చేసే characters కనిపిస్తే హ్యాపీగా అనిపిస్తుంది. నిజ జీవితంలా ఉంటుంది, వాళ్ళకి సినిమాలు తీయడం వచ్చు, అందంగా అండ్ అర్థవంతంగా. 

లాస్ట్ ఇయర్ Asghar Farhadi తీసిన, “A Hero” Hyderabad లో రిలీజ్ అయ్యింది. ట్రైలర్ ముందెప్పుడో చూసాను. బుక్ మై షో లో హీరో సినిమా కనిపించగానే కచ్చితంగా ఈ సినిమా థియేటర్లో చూడలనుకొని చూసాను. “A Hero” సినిమా గురించి రాయాలనిపించి, మొదలు పెట్టాను కానీ నేను ఎక్కడెక్కడో తిరిగి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను.  హ్యాపీ! కనీసం వచ్చాను. 

సో, “A Hero” అనే ఇరానియన్ సినిమా చూడమని పర్సనల్గా చాలా మంది ఫ్రెండ్స్ కి చెప్పాను. Theatre లో చూస్తున్నప్పుడు, చూసాక నా వల్ల కానీ సినిమాలో ఇదొకటి. అసలు ఒక మనిషి జీవితంలో ఎంత జరుగుతుంది, దేనికి దేనికి లింకులు ఉంటాయి, ఎప్పుడో, ఏదో ఒకటి చేసిన దానికి ఎప్పటి దాకా దాని ప్రభావం ఉంటుంది, టెంపర్ లూస్ అయితే మనిషి ఎలా మారిపోతాడు ఇలా చాలా. అసలు, ఒకటి కాదు హీరో జీవితంలో కొన్ని రోజులు ఎలా ఉంటుందో చెప్పే కథే “A Hero”. 

జైల్ ముందు సైలెంట్ గా కామ్ గా స్టార్ట్ అయ్యి సినిమా జైల్ ముందే అయిపోతుంది. మధ్యలో అంతా, జైల్ నుండి ఒక 2 or 3 రోజులు లీవ్ మీద బైటికి వచ్చే ఒక క్రిమినల్ కథ ఇది. ఏదో పెద్ద క్రైం చేసినందుకు జైల్లో లేడు, డొమెస్టిక్ థింగ్స్ వల్ల. అందుకే క్రిమినల్ అని కూడా అనాలని లేదు. అతనికి ఒక కొడుకు ఉంటాడు, భార్య లేదు. డివోర్సి, వాళ్ళ అక్క బావ ఇంట్లో అబ్బాయిని ఉంచాడు ప్రస్తుతానికి. ఇలా అతని జీవితంలో వచ్చే ఇబ్బందులు, అతని తప్పేమీ లేదని నిరూపించుకునే దిక్కుగా నడిచే కథ, దానికి అక్క బావ చాల supportive. పెళ్లి, పెళ్ళాం etc వల్ల ఇంత damage అయ్యాక ఎట్టకేలకు ఒక అమ్మయి ఇష్టపడుతుంది తనని పెళ్ళి చేసుకుంటే తన కొడుకు, ఆ అమ్మయి, తను అందరూ కలిసి ఉండొచ్చు అనే ప్రయత్నం ఒక పక్క. ఇలా చాలా జరుగుతుంటాయి, మధ్యలో ఒక టైంలో బాదేసి ఏడుపొచేసింది. ఒక మనిషికి ఇంత జరుగుతున్నా, అతని ప్రయత్నం అతని పని అతను చేసుకుంటుపోవడం, his nature of understanding, కొడుకుతో ఉండే సీన్స్ అమ్మా….. మోస్ట్ బ్యూటిఫుల్. కథ, డ్రామా, characters, మొత్తం దీని చూట్టే. వాళ్ళ సినిమాలు Mostly అలాగే ఉంటాయి కదా,అనవసరమైన అతి బిల్డప్ ఉండదు. అందుకే వెరీ క్లోజ్ టు లైఫ్ ఉంటాయి. ఎప్పుడు ఇరానియన్ సినిమా చూసిన కూడా, వెంటనే ఇలా ఒకటి తీదం అసలు పెద్దగా ప్లాన్ చెయ్యొద్దు, ఎలా పడితే అలా ! ఏ కెమెరా ఉంటే దాంతో, ఇరానియన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. 

ఎప్పుడు hopeless గా అనిపించిన్న ఒక సినిమా చూస్తే చాలా బెటర్గా ఫీల్ అవుతాం, కానీ ఇరానియన్ సినిమా చూసాక కాన్ఫిడెన్స్, హోప్ అన్ని చాలా వస్తాయి. సినిమాలే సినిమాలు తీయడానికి ఇన్స్పిరేషన్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *