రిలీజే అతి పెద్ద సక్సెస్

అభయ్ సినిమా ‘రామన్న యూత్’ రిలీజ్ అవుతోంది ఈ నెల 15th, అదే అభయ్ సాధించిన అతి పెద్ద సక్సెస్, హిట్టో ఫ్లాపో secondary. ఒక చిన్న సినిమా, తెలిసిన మొహాలు లేని సినిమా, ఎటువంటి భారీతనం లేని సినిమాని OTT or theatrical release దాకా తీసుకురావడం వెనక మామూలు కష్టాలు ఉండవు. ఏ దర్శకుడైనా తను అనుకున్న కథని సినిమాగా చేసే ప్రయత్నంలో మొదటి సక్సెస్ నిర్మాతని పట్టుకోవడం, ఆ తర్వాత మంచి టీం ని set చేసుకుని shooting మొదలుపెట్టడం ఇంకో సక్సెస్, ఇలా చెప్పుకుంటూ పోతే షూటింగ్ జరిగే ప్రతి రోజూ ఒక సక్సెస్ లాంటిదే.

పవన్ ద్వారా పరిచయం అభయ్, మెట్రోపాలిటన్ కేఫ్ దగ్గర మొదటిసారి కలిసాం, అప్పుడే నిరుద్యోగ నటులు జరుగుతోంది. తన energy, మాట్లాడే విధానం చూసి ‘బాంబే కోడైరెక్టర్’ character పుట్టింది, surprise చేసే actors అంటే మాకు విపరీతమైన లవ్వు, అభయ్ ఇచ్చిన acting surprise అయితే mind blowing. Script లేకుండా shoot చేసే మాకు spontaneous actors చాలా ముఖ్యం, అలాంటి వాళ్ళలో Abhay ఒక crazy actor. నిరుద్యోగ నటులు చూసిన వాళ్ళకి most favourite characters లో ఇదొకటి, character చెప్పాం situations చెప్పాం, రెచ్చిపోయాడు అభయ్, dialogs అన్నీ తనవే.

‘రామన్న యూత్’ కథ 2019 లో అనుకుంట first time నాకు చెప్పాడు, basic point చెప్పాడు, తను అనుకుంటున్న కొన్ని సీన్స్ narrate చేసాడు, చాలా నచ్చింది, ఎంత నచ్చిందంటే నాకు డైరెక్ట్ చేయాలనిపించింది. చిన్న పాయింట్, తనకు తెల్సిన పరిసరాల నుంచి పుట్టిన కథ, తన ఊర్లో షూట్ చేసాడు, ఆ సినిమాలో actors shooting విశేషాలు చెప్పేవాళ్ళు, మంచిగ అనిపించేది. నటుడిగా వస్తున్న పాత్రలు చేసుకుంటూ సుఖంగా బతకకుండా దర్శకత్వం అనే భారాన్ని మీద వేసుకుని సినిమా తీసి దాన్ని థియేటర్ల దాకా తీసుకొచ్చిన అభయ్ ఆల్రెడీ సక్సెస్ అయిపోయాడు నా దృష్టిలో.