హైదరాబాద్ ట్రాఫిక్ sudden గా unusual level కి వెళ్లిన feeling వస్తోంది నాకు. నేను బాచుపల్లి to బేగంపేట్ మధ్య regular గా తిరుగుతుంటా, ఆటోల్లో, మెట్రోలో, బైక్ మీద, కారుల్లో ఇలా రకరకాల అనుభవాల్లో తిరుగుతుంటా. అది ఏ రోజు అనేది సంబంధం లేకుండా ట్రాఫిక్ జాంలు పెరిగిపోయాయి, దట్టమైన శబ్దవాయు pollution ఇంకోపక్క, తమ driving skills తో భయపెట్టే వాహన చోదకులు ఇంకో పక్క. 31 ఏళ్లుగా ఈ రూట్లో తిరుగుతున్నాను, పనున్నా లేకపోయినా తిరుగుతుంటా, పనిలేనప్పుడు ఇంట్లో కూర్చువచ్చుగా అంటే అది నావల్ల కాదు, చిన్నప్పట్నుంచి నేనొక చంచలస్వభావుణ్ణి. నా childhood నుంచి 20s దాకా రకరకాల ప్రాంతాల్లో పెరిగాను, అలా మొదలైన నా తిరుగుడు ఆగటం లేదు.
నా నగర జీవితం restless అయిపోయింది, నేను traffic లో youtube లో గడుపుతున్న సమయం నాకు పిచ్చెక్కిస్తున్నాయి, ఇవి కాక ఇతర వ్యసనాలు నన్ను అతలాకుతలం చేస్తున్నాయి. విపరీతమైన content consumption కి addict అయిపోయాను, ప్రపంచమంతా అలానే ఉందనుకోండి. ఆ వీడియోలు రీళ్లు నా మనోభావాలతో ఆడుకుంటున్నాయి, ఎంత వొద్దనుకున్నా వేళ్ళు కళ్ళు అటే పోతున్నాయి. Laptop ఇచ్చే నొప్పులు ఒక రకం మొబైల్ ఇచ్చే నొప్పులు ఇంకో రకం, అంతా పెయినే. ఒక్కోసారి ట్రాఫిక్ లో ఇరుక్కున్నప్పుడు పగోడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు అని కోరుకుంటా, నాకెవ్వరి మీదా పగ లేదు.
ప్రతిరోజూ ఈరోజైనా ప్రశాంతంగా ఉందాం అన్ని వ్యసనాలని దూరం పెడదాం, ఇలా మెల్లిమెల్లిగా anxiety & stress తగ్గించుకుందాం అనుకుంటా, కానీ నావల్ల కావడం లేదు. ఇంక నాకు మానసిక వైద్యుల సహాయం తప్పదేమో అనే feeling వచ్చేసింది, actually వెళ్ళాలి డాక్టర్ల దగ్గరకి, కానీ ఆ పని చేయను. మరేం చేయాలి ? పారిపోవాలి నగరానికి దూరంగా, ఇది escapism, నాకు తెల్సింది అదే, సమస్యల నుంచి పారిపోతుంటా. Permanent solution మీదకి నా ఆలోచన ఎప్పుడూ పోదు, చాన్సు దొరికినప్పుడల్లా city వదిలి పోతుంటా. ఇది నాకు వర్కౌట్ అవుతుంది, రెండు రోజుల క్రితం హంపీకి వచ్చాను ఫ్రెండ్స్ తో, ఎవడి డబ్బులు వాడివి పధ్ధతి మీద. ఈసారి ఒక కథ కూడా రాయాలి.
సిటీని వదిలిన వంద కిలోమీటర్లకే నాలో మార్పు కనిపించింది, ఇంకొన్ని గంటల్లో నేనొక beautiful place కి చేరుకోబోతున్నాను, ఒక hut లో నిద్రపోబోతున్నాను, మంచి ఫుడ్ తింటాను, కొండల మధ్య బీర్ తాగుతా, ఈ ఆలోచనలతో నా నరాలు relax అయ్యాయి, clear గా తెలిసింది ఆ difference. పొద్దున పదింటికి ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కిన మేము చీకటిపడేసరికి హంపి చేరుకున్నాం, సిటీ ని హైవేలని పట్టణాలని గ్రామాలని దాటుకుంటూ కొండల మధ్య పచ్చటి పొలాలు చెట్లు కొబ్బరి తోటల మధ్యకి చేరుకుని అక్కడొక తడికెల hut లో చల్లటి తుంగభద్ర నీళ్లతో స్నానం చేస్తే, ఆ feeling వర్ణించలేను, magical transformation.
మా ప్రయాణం మొత్తంలో రెండుసార్లు మొబైల్ వాడాను, airplane mode లో పడేసా, అక్కడికెళ్ళాక కూడా వాడలేదు, పది గంటలు నీ మొబైల్ కి దూరంగా ఉంటే కలిగే ఫీలింగే వేరు. సిటీని వదిలి 60 గంటలు ఇక్కడికి చేరుకుని 30 గంటలు అవుతోంది, ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉంది. Youtube చూడాలనిపించటం లేదు, పెన్ను పుస్తకం పట్టుకుని నా కథకి వస్తున్న ఐడియాస్ రాసుకుంటున్నాను, 4-5 కిలోమీటర్లు walk చేస్తున్నా, రాత్రిపూట లిమిటెడ్ గా కర్ణాటక old monk వేస్తున్నా. ఇంకొన్ని రోజులు ఉండబోతున్నాం, ఎలాంటి భాద్యతలు లేని నేను ఇలా తిరుగుతుంటే “అదృష్టవంతుడివి బాసూ” అంటుంటారు. నిజమే అనిపిస్తుంది, కానీ ఇలా ఎన్ని రోజులు గడుస్తుంది అంటే నాకూ తెలియదు, జరిగినంత కాలం జరుగుతుంది.
ఇలా నగరాన్ని వదిలేసి రాలేకపోవడానికి జనాల దగ్గర ఎన్నో కారణాలు ఉంటాయి, నాకు obstacle ఒకటే, డబ్బులు. నా దగ్గరే ఉండగలిగే డబ్బులుంటే ఇక్కడే ఉండిపోతా, షూటింగ్ ఉన్నప్పుడు సిటీకి వస్తా, ఇంకా అంత luxury రాలేదు. నావి అన్నీ crowdfunding trips, మా సినిమాల్లాగే, నా చుట్టూ ఇవ్వగలిగే వాళ్లకి ఇదే చెప్తా, ఈ నగరానికి దూరంగా కొన్ని రోజులు వెళ్తున్నాను support చేయండి అని, నన్ను అర్ధం చేసుకునే మంచోళ్ళు చాలామందే ఉన్నారు, so trips వేయగలుగుతున్నా. ఈసారి హైదరాబాద్ వచ్చేసరికి కథ ముగించుకునో లేదా వీలైనంత progress అయ్యో రావాలి, చేయగలను అనే అనిపిస్తోంది.
నిత్య శారీరక తిరుగుడు మానసిక నలుగుడు ఆగింది, ఇప్పటికైతే ఇది చాలు.