Learn Editing first

రోహిత్ ని కలిసే aspiring filmmakers కి తను చెప్పే మాట ఇది. నేను రోహిత్ ని కలిసిన కొత్తల్లో తను షూట్ చేసి ఎడిట్ చేసినవి చూపిస్తే wow అనిపించింది. అప్పటిదాకా తెలుగులో నేను చూడని కొత్తరకమైన ఎడిట్ అది. అప్పట్నుంచి రోహిత్ నాకు చాలా సినిమాలు recommend చేసేవాడు, download చేసి ఇచ్చేవాడు and discussions అయేవి, ఎడిట్ గురించి చాలా మాట్లాడుకునేవాళ్ళం. నాకు అప్పటికి AVID మీద ఎడిటింగ్ చేయటం అలవాటు, రోహిత్ premier much easier & fun అని చెప్తే అది నేర్చుకున్నా, నిజంగానే premier pro మీద ఎడిటింగ్ too much fun. రోహిత్ edit మీద అంత impress అయినా శీష్ మహల్ ఎడిటింగ్ తనతో అనుకోలేదు, సాంప్రదాయ తెలుగు సినిమా స్టయిల్లో ఒక industry assistant editor ని పట్టుకొచ్చా, ఒక సీన్ edit చేసి, దీన్ని ఎలా cut చేయాలి అని confuse అయిపోయి “నా వల్ల కాదు సర్” అన్నాడు. అప్పుడు రోహిత్ నేను చేస్తాను నచ్చకపోతే ఎవరినైనా ట్రై చెయ్ అని editing మొదలుపెట్టాడు. కొన్నిరోజుల తర్వాత ఒక సీన్ చేసి చూపించాడు, mind blowing cut, శీష్ ఆ style of edit లా ఉంటుందని అనుకోలేదు, అస్సలు ఏ style ఉండదు, నాలుగు కథలు ఎంత smooth గా వెళ్ళిపోతాయంటే beautiful ఎడిట్. కాకపోతే ఆ mind blowing cut ఏదైతే ఉందో hard disk crash అయ్యి cut పోయింది, recovery కోసం ట్రై చేస్తే చాలా డబ్బులు అడిగారు, ఎందుకులే శశి నేను మళ్ళీ ఎడిట్ చేస్తా అని, మళ్ళీ చేసాడు, first cut తో compare చేయకుండా ఈసారి cut కూడా equally beautiful. ఇంక అక్కడ్నుంచి AVanti ruya magic మీరు కూడా చూస్తున్నారు. 

“When I’m editing, I’m only concerned with the questions of ‘Is it good or bad?’ ‘Is it necessary?’ ‘Can I get rid of it ?’ ‘Does it work ?’ I am never concerned with how much difficulty there was to shoot something, how much it cost, and so forth. I’m never troubled losing material. I cut everything to the bone. When you’re shooting, you want to make sure you don’t miss anything and you cover it as fully as time and budget allow. When you’re editing, you want to get rid of everything that isn’t essential.” – stanley kubrick 

Director ఎందుకు edit నేర్చుకోవాలి? ఆ process ని ఎంజాయ్ చేయటానికి, ఎడిటింగ్ కథ రాయటం లాంటిదే, ఒంటరిగా తలుపులేసుకుని, system ముందు కూర్చుని ఆ footage చూడటం దాన్ని ఒక form లోకి తీసుకురావడం editing లో కథ రాసినట్టే.  Edit చేయాలి అనుకున్నపుడు ఉండాల్సిన most important quality ఓపిక, కూర్చుని footage అంతా ఒకరోజులో కాకపోయినా రోజుకి కొంచెం లెక్కన footage చూడటం మొదలుపెట్టాలి. మనమే  షూట్ చేసుకుని ఎడిట్ చేస్తుంటే అదంత కష్టమనిపించదు, బయటవాళ్ళవి చేసినప్పుడు చాలా భరించాలి. రోహిత్ చెప్పేది నీ సినిమా నువ్వే ఎడిట్ చేసుకో అని. 

“Scorsese has very defined ideas about how to shoot a scene, and he’s an editor himself—we cut together. It means he’s constantly thinking about my problems while he’s filming. It’s wonderful to work on footage by someone who understands how to get it to cut right, which a lot of directors don’t.” – Thelma Schoonmaker 

ఎలా నేర్చుకోవాలి ఎడిటింగ్ అంటే, simple, edit everyday. Phone ఎడిట్లు వేరే, system ముందు కూర్చుని మంచి monitor లో editing చేస్తుంటే వచ్చే కిక్కే వేరు. లక్ష లక్షన్నర పెడితే మంచి laptop or desktop set చేసుకోవచ్చు. ఎడిటింగ్ చేస్తుంటే నీకు filmmaking మీద చాలా command వస్తుంది, filmmaking అంటే ఏంటి, షాట్లు తీసి కట్ చేయడమేగా, so ఎడిట్ చేస్తుంటే నీ తప్పులు అర్ధమవుతాయి next టైం ఎలా తీయాలో తెలుస్తుంది, ఇది అవసరం లేదు అనిపించినవి తీయకపోతే on location time save అవుతుంది, ఈ అవగాహన రావాలి అంటే cut మీద grip ఉండాలి. ఎడిట్ కేవలం visual cut మాత్రమే కాదు, sound తో చాలా చేయాలి, అది most enjoyable thing. Sound తో ఆడుకుంటుంటే ఎంత మజా వస్తుందంటే, మజానే మజా. 

“Editing is the stage where a film really begins to come to life and one is never more aware of the uniqueness of the film medium than in watching a well-cut scene pulsate with a life of own” – Satyajit Ray 

గట్టిగా రోజుకి 4-5గంటలు edit మీద ఉంటే, experiments చేస్తుంటే ఇంక ఆ తర్వాత ఎడిట్ వదలరు, ఆ  time spend చేయటమే కష్టం చాలా మందికి, నాకూ అదే ప్రాబ్లెమ్, మా దగ్గర ప్రాక్టీస్ చేసుకోవటానికి టన్నుల టన్నుల footage ఉంది,  నాకే ఓపిక లేదు. బానే వచ్చు నాకు కానీ రెగ్యులర్ గా చేయను.  2015లో డబ్బుల కోసం పెళ్లి వీడియోస్ ఎడిట్ చేసేవాళ్ళం కొన్ని రోజులకి బోర్ కొట్టేసింది, పెళ్లి వీడియోస్ రెగ్యులర్ గా ఎడిట్ చేసేవాళ్ళకి దణ్ణం పెట్టొచ్చు. తెల్సిన పెళ్లిళ్ల ఎడిటర్ ఉంటే వాళ్ళ అక్కడికెళ్లి ప్రాక్టీస్ చేయొచ్చు, season కాకపొతే స్టూడియో దొరుకుతుంది. 

Editing నేర్చుకోవడానికి film schools మీద ఖర్చుపెట్టకండి, ఎడిటింగ్ సొంతంగా నేర్చుకోవచ్చు, all you need is good system & chair, మంచి chair కూడా చాలా ముఖ్యం, లేకపోతే నడుం నొప్పి, చేతులు లాగటం లాంటి side effects start అవుతాయి. చేసేటప్పుడు అదొక meditative process లాగ ఉంటుంది కానీ చాలా physical work. Online free గా కుప్పలుతెప్పలుగా వీడియోలు రైటప్స్ ఉంటాయి, వాటిని వాడుకుంటూ నేర్చేసుకోవడమే. ఫోన్ లో చేయండి, ఫ్రీగా కెమెరా దొరికితే ఇంకా మంచిది. నేనెప్పుడూ చెప్తా ఒక conversation తీయడానికి first, ఇద్దరు మాట్లాడుకుంటున్నది ఎలా తీయాలి ఎలా కట్ చేయాలి అనేది తెలియాలి, ఎలాగైనా తీయండి ఇష్టమొచ్చినట్టు కట్ చేసి చూసుకోండి, బాగా అనిపించిందా, happies, నీ కట్ నీకే నచ్చలేదా ఇంకా happies. ఎడిట్ వచ్చేసింది అనుకోవడానికి ఏముండదు,  every time అదొక కొత్తపనే. 

Renu saluja అని ఒక legendary editor మీద documentary ఉంది, చూడండి. 

Remembering Renu (2001) – YouTube 

నా రాత నచ్చితే కింద qr code ఉంది, buy me a drink or coffee bro.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *