HAPPY ENDINGS

ఇది “ఆ happy ending” గురించి కాదు, మా happy endings గురించి. “అన్నా మీరు ఎందుకు అన్నీ happy endings ఇస్తారు” అని మమ్మల్ని అడుగుతారు, happy ending ఎందుకంటే మేము happy గా ఉండటానికి మా సినిమాలు webseries లు చూసిన వాళ్ళు కూడా happy గా ఉండటానికి. 

నేను చిన్నప్పట్నుంచి ఎన్ని సినిమాలు చూసి ఏడ్చానో చెప్పలేను, కళ్ళు చెమర్చటం దగ్గర్నుంచి బోరుబోరున ఏడ్చే దాకా రకరకాల ఏడుపులు. ఇప్పటికీ ఏడుస్తా, అందుకే పదిహేనేళ్ల క్రితం decide అయ్యా నేను ఏడిపించే సినిమాలు చూడను తీయను అని. అదెంత గొప్ప సినిమా అయినా నాకు అనవసరం, నాకు “Once upon a time” లాంటి fun films కావాలి, ఒకవేళ మేము తీయగలిగితే అలాంటి cool films మాత్రమే తీయాలి. 

నిరుద్యోగ నటులు #1 లో మాత్రమే అనుకుంట కాస్త కదిలిస్తాయి మా సీన్లు, NN2 కూడా ఇంకొంచెం కదిలిస్తుంది గానీ ఏడిపించదు. మేము ఏది అనుకున్నా దాన్ని “ఆనంద ముగింపు” వైపే తీసుకెళ్తాం, అదేమీ చాలా ఆలోచించి చేసేది కాదు, ఆటోమేటిక్ గా అటు వైపు వెళ్ళిపోతుంది. 

మాది  చాలా వరకు open ending fiction , solid గా ప్రేక్షకుడిని satisfy చేసేవి కొన్నే. మా ఫస్ట్ film శీష్ మహల్ లో నాలుగు కథలు ఒక చోట ముగుస్తాయి కానీ ఈ పాత్రకి ఏదో ఒకటి జరిగింది అనే conclusion ఉండదు. ఒక్క feroze story లోనే కొంచెం ఉంటుంది, కమర్షియల్ సినిమా మాత్రమే ఎంజాయ్ చేసే ఫిరోజ్ ఒక ఇరానియన్ సినిమా చూడటం చూసాక కదిలిపోయి ఆ కథ canteen boy కి చెప్పడం. “సినిమాల మీద ఫిరోజ్ అభిప్రాయం మారింది” అనుకోవచ్చు. 

ఎక్కడో చోట కథ end చేయాలి ? ఎక్కడ చేస్తే ఎలా చేస్తే ఇప్పటిదాకా మనం చెప్పిన కథ “justify” అవుతుంది అనే deep discussion ఏం ఉండదు నాకూ రోహిత్ కి. ఇక్కడితో ఆపేద్దాం అనుకున్నవి చాలానే ఉంటాయి. మా climax లో ఏదో twist ఉంటుంది అని చాలామంది expect చేస్తుంటారు, మరి ఈసారి ఏం twist ఇద్దాం అనే ఆలోచనలు కూడా వస్తుంటాయి గానే, no ఆ zone లోకి వెళ్ళకూడదు, వస్తే వస్తుంది twist లేకపోతే simple గా flat గా end చేసేద్దాం అనుకుంటా. నాకు flat endings అంటే చాలా ఇష్టం, కష్టపడి కథని కొండెక్కించటంకన్నా మట్టి రోడ్డు మీద నడిపించటం is more fun. అయినప్పటికీ సగటు తెలుగు ప్రేక్షకుడిగా పెరిగినవాణ్ణి కాబట్టి ఏదో ఒక “మంచి ending” ఆలోచన వెళ్తూనే ఉంటుంది, అక్కడే మేము “happy endings” వైపు వెళ్ళిపోతాం. 

Sad or hard hitting సినిమాలు తీయడం పక్కన పెడితే, idea దగ్గర్నుంచే very painful, ఆ feel లో కథ screenplay dialogs  రాయాలి చాలా మందికి చెప్పాలి, నిర్మాతని ఒప్పించి తీయాలి, post production అయే వరకు ఆ దుఃఖపూరిత universe లో ఉండాలంటే మా వల్ల కాదు. అలాంటి సినిమాలు తీసేవాళ్ళు చాలా strong persons అని నా feeling, అవి  తీయాలంటే చాలా conviction & passion కావాలి, మాకు ఆ రెండూ లేవు, మాకు సినిమాలు తీయటం fun, కాబట్టి అలాంటివే తీస్తాం. నేను బాలా  సినిమా ఒక్కటే చూసా, “వాడు వీడు”, నాకు బాలా trailers చూడాలన్నా భయమే, hammershot లాంటి hard hitting elements ఎన్నుంటాయో అని.   

మన తెలుగు filmmakers ఎప్పుడూ అంత hard hitting zone లోకి వెళ్ళలేదు, వెళ్ళరు కూడా, మేమూ అంతే, కాకపోతే మాది ఒక different style, జనాల్ని మేము entertain చేసేది ఇబ్బంది పెట్టేది ఎక్కడంటే  realistic approach. దీన్ని అందరూ భరించలేరు, otherwise మా దాంట్లో చిన్నదో పెద్దదో ఆసక్తికరమైన కథ ఉంటుంది, మేము dialogs కి famous, మంచి acting ఉంటుంది, wonderful music ఉంటుంది, editing లో కొత్తదనం ఉంటుంది, visual గా ఎప్పుడూ ఏదన్నా different గా చేద్దాం అనే తపన ఉంటుంది. Repetition కూడా ఉంటుంది, తప్పదు అది natural. అన్నిటికీ మించి “happy ending” పక్కా ఉంటుంది, అది పాత్రలకి జరిగే happy విషయమే కాకపోవచ్చు, మా fiction చూసాక ప్రేక్షకుడికి కలిగే “happy ending” feeling makes us more happier. 

“A Love Letter to Cinema” one of my favourite endings మేము చేసిన వాటిలో, simple flat ending, కానీ end credits మీద vivek sagar music మొదలవగానే i feel extremely satisfied every time. “Azeeb daastaan” ఒక mysterious ending, మేమెప్పుడూ “grainy film” గురించి మాట్లాడుకుంటుంటాం, ఆ category film ఇది, i  love that image so much. 

మా రాబోయే film “పారిపోయిన దొంగలు” title లోనే climax చెప్పేస్తున్నాం, అది ఎలా END అవుతుంది అనేదే మిగతా కథ. 

Final గా చెప్పొచ్చేది ఏంటంటే మాకు “HAPPY ENDINGS” ఇష్టం, ఎవరికీ ఇష్టముండదు చెప్పండి 😉 

నా రాత నచ్చితే కింద qr code ఉంది, buy me a drink or coffee bro.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *