Vanta

“రెండేళ్ల క్రితం కరోనా రెండవ వేవ్ లో రాసింది, సరదాగా మళ్ళీ post చేస్తున్నా” 

“వంటింట్లో నీకేం పని రా” అనే మాటతో మగజాతికి తీరని అన్యాయం జరిగింది. వంట ఆడవాళ్లు మాత్రమే చేయాలనే కాన్సెప్ట్ ఏ దరిద్రుడు సృష్టించాడో గాని అదొక పనికిమాలిన ఆలోచన. ఇది మగాళ్లు మాత్రమే కాదు ఆడవాళ్లు కూడా బలంగా మూఢంగా నమ్మిన ఐడియా, మగాడు కూరగాయలు తేవాలి కానీ కట్ చేయకూడదు, ఆడవాళ్లు ఒళ్ళు హూనం అయేట్టు కిచెన్లో కష్టపడాలి మగాడు హాల్లో కూర్చుని టీవీ చూడాలి, ఎందుకలా ? నేనిక్కడ సమానత్వం గురించి మాట్లాడటం లేదు, స్వయంగా వంట చేసుకుని తినటం అనేది ప్రతి మనిషికి వచ్చి ఉండాలి. వండగలిగిన మగాళ్లు వండలేని ఆడవాళ్లు లేరని కాదు, అందరికీ వంటొస్తే ప్రపంచం ఎంత మారిపోతుంది, ఆలోచించండి.  

పిల్లలకి వంట నేర్పండి, ప్రతి సండే, ప్రతి హాలిడే రోజు వంటలో involve  చేయండి. చదువులాగే అది కూడా విద్యే. వంట మాత్రమే కాదు  అంట్లు తోమడం బట్టలు ఉతకడం ఇల్లు ఊడవటం తుడవడం బాత్రూములు కడగటం ఇలా అన్నీ నేర్పండి. చదువుకున్నాక ఉద్యోగం దొరకక తిరిగే టైంలో కనీసం వండుకుని తిని ఆరోగ్యంగా ఉంటారు. ఎంత మార్పు వస్తుందో ఊహించండి, వంట చేయడం ఆడదాని ప్రాధమిక హక్కులా  feel అయ్యే ముష్టి ఆలోచన మారుతుంది, food discipline  వస్తుంది, బయట తినే fast food  ఎంత బ్యాడో తెలుస్తుంది, కూరగాయలు పళ్ళు ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో అవగాహన పెరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే కనీసం వంద ఉపయోగాల గురించి చెప్పుకోవచ్చు. 

నేనున్నాను, నాకు మ్యాగీ చేయటం వచ్చు, ఎలక్ట్రిక్ కుక్కర్ లో రైస్ పెట్టడం వచ్చు, టీ కాఫీలు పెట్టుకోగలను అంతే ఇంకేం రాదు, ఎంత helpless నేను, ఒక అప్రయోజకుణ్ణి చేతకానివాణ్ణి. . 25ఏళ్లుగా తింటున్నా హోటల్ కూడు, విరక్తి వచ్చేసింది, వండుకోలేను, కడుపు నిండాలిగా అని ఏదో ఒకటి తినటం అంతే. నాకు వంట వచ్చుంటే నా జీవితం వేరేగా ఉండేదని నా నమ్మకం.  నేను రూమ్ కి వెళ్లి వండుకుని తినగలను అనే ఆలోచనే ఒక ఎంపవరింగ్ ఆలోచన. ఏముంటే దానితో tasty వంట చేసే నా ఫ్రెండ్స్ ని చూస్తే ముచ్చటేస్తుంది కుళ్లుపుడుతుంది. 

అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ ఆడవాళ్లు మాత్రమే కిచెన్ & ఇంటి పనులు చేసుకునే couples నాకు తెల్సు. అదే చిన్నప్పటినుంచే ఇవి ఆడవాళ్ళ పనులు మాత్రమే కాదు ప్రతి ఒక్కరి బాధ్యత అని నేర్పిస్తే wife & Husband మధ్య అనుబంధం వేరే విధంగా ఉంటుంది, పనులు “పంచుకోవడం” మంచిదే. ఒకవేళ నాలాంటి bachelor life అనుకోండి, happy గా ఇంటికి వెళ్లి వండుకుని తింటారు, అలా వండుకోవాలంటే planning ఉండాలి, అప్పుడు automatic గా lifestyle  కూడా మారుతుంది. 

ఆలోచించండి, ఏ వయసులో అయినా వంట నేర్చుకోవచ్చు, ఒప్పుకుంటా, కానీ నాలాంటి కొందరు bad  స్టూడెంట్స్ ఉంటారు వాళ్లకి కష్టం. అదే నాకు 7-8 ఏళ్ళ వయసునుంచే ఉల్లిపాయలు టమాటాలు కోసే పనులు చెప్పుంటే నాకూ వంట మీద ఆసక్తి పెరిగేది. అలా జరగలేదు. సో మీ పిల్లలకి వంట వంటింటి పనులు ఇంటి పనులు నేర్పిచండి, ఖచ్చితంగా ఇది వాళ్ళ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. 

“వంట రాని మగాడు waste fellow” – Prakash chowdary, Story Discussion 2


 నా రాత నచ్చితే కింద qr code ఉంది, buy me a drink or coffee bro

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *