Harish Shankar

ఏ సంత్సరంలో కలిసాడో హరీష్ నాకు గుర్తు లేదు, అప్పటికే నేను Ads & corporate films లో chief AD గా చేస్తున్నాను,ఎప్పడెప్పుడు సినిమా తీసేద్దామా అని ఊగిపోతున్న రోజులు. నా రూమ్మేట్ ఉదయ్ (nikhil శంకరాభరణం డైరెక్టర్) ఒకరోజు హరీష్ ని రూంకి తీసుకొచ్చాడు, వాళ్ళిద్దరు ఆదినారాయణ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నారు. హరీష్ లో విషయముంది అని first గమనించినవాడు ఉదయ్, తను దుర్గా ఆర్ట్స్ లో join అయి హరీష్ ని కూడా తనతో పాటు తీసుకెళ్ళాడు. హరీష్ తెలుగు & ఇంగ్లీష్ books బాగా చదివినవాడు & చాలా బాగా narrate చేస్తాడు ఏదైనా కథని, మంచి మాటకారి. కలిసిన కొత్తలో calm గా అనిపించాడు కానీ 2-3 meetings కే అర్ధమైపోయింది వీడు మాటల మనిషి & దూసుకుపోయే తత్వం అని. BHEL middle class అబ్బాయి, అక్కడ పెరిగిన వాళ్లో something is peculiar. అప్పుడప్పుడు sittings వేసే వాళ్ళం, discussions నుంచి arguments level కి వెళ్ళింది మా friendship, ఒకసారి తాగుతున్నప్పుడు “నీ ఇంగ్లీష్ నవలల talent నా దగ్గర చూపించకు” అని తిట్టేసా హరీష్ కూడా గట్టిగానే counter ఇచ్చాడు, ఎంత తిట్టుకున్నా next day మళ్ళీ కలిసి చాయ్ తాగేవాళ్ళం. Harish debut Shock is a big shock for all of us, కోన వెంకట్ దగ్గర హరీష్ పని చేస్తున్నప్పుడు rgv కి Shock story narration కి వెళ్తే హరీష్ చెప్పాడు కథ,”బాగా చెప్తున్నావ్ నువ్వే డైరెక్ట్ చేయచ్చు కద” అని rgv offer ఇచ్చాడు హరీష్ చేస్తా అన్నాడు, ఇది జరిగింది నాకు గుర్తున్నంత వరకు. ఆ news తెలిసిన రోజు what the fuck, సినిమా వాళ్ళ జీవితాలు రాత్రికి రాత్రి మారిపోతాయని వినటమే గాని నా కళ్ళ ముందు జరిగింది, అది కూడా రవితేజ & జ్యోతిక ఇంకేం కావాలి ఏ first time director కి అయినా. నేనైతే మామూలుగా excite అవలేదు, అస్సలు హరీష్ ఎలాంటి సినిమా తీస్తాడు అనే idea లేదప్పుడు, కథ workout అవలేదు కానీ బానే తీసాడు అనిపించింది, అది హిట్టయ్యుంటే ఎలాంటి సినిమాలు తీసేవాడో?

షాక్ flop అయింది తర్వాత మా మధ్య కూడా gap వచ్చింది, పెద్దగా కలిసేవాళ్ళం కాదు. నేను చిత్రలేఖ స్టూడియోస్ అనే production & postproduction house కి head అయ్యాను, అలాంటి టైంలో హరీష్ నుంచి cal వచ్చింది పూరీ office కి రమ్మని. పూరీ జగన్నాధ్ అప్పుడు ‘చిరుత’ preproduction లో ఉన్నాడు, మాటీవీకి short lenght weekly thrillers produce చేయమని offer వచ్చింది పూరీకి, కొత్త directors కోసం చూస్తుంటే హరీష్ నన్ను suggest చేసాడు, తను అప్పుడు writer గా చేస్తున్నాడు. వెళ్ళాను పూరీని కలిసాను తను దూరదర్శన్ కి already చేసిన రెండు shor films కథలు చెప్పి నన్ను ఏదో ఒకటి చేయమన్నాడు. అలా రెండు మూడుసార్లు కలిసాను, most coolest person. నాకొక executive producer ని ఇచ్చి మీకు ఏం అనిపిస్తే అది చేయండి అని full freedom ఇచ్చి puri & harish bangkok వెళ్ళిపోయారు. పూరీ చెప్పిన రెండు కథలు కాకుండా కొత్త కథ mail చేసా, go ahead అన్నారు, నేను చేసిన delay కి అది సాగిసాగి final గా మాటీవీ వాళ్ళు ఆ proposal cancel చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ హరీష్ ని కలవలేదు. ఇప్పుడు మా DoubleEngine కి invite చేయడానికి try చేస్తా.