నాకొక అతి పెద్ద fear ఉండేది, నేను ad films corporate films లో పని చేయడం వల్ల పూర్తి స్థాయి fiction కి పని చేయలేదు. Hyderabad Ad films లో పెద్దగా acting అవసరం ఉండేది కాదు అప్పుడు. ఆ పదేళ్లలో 3-4 వందల మందిని audition చేసుంటా, rare గా ఒక మంచి actor or actress దొరికేవాళ్లు. Ad films లో look, personality, skin colour ఇవి ముఖ్యం ఆ తర్వాత acting, కొంచెం చేసినా చాలు, 4-5 expressions తో పనయిపోయేది. నాకు బెంగ పట్టేసుకుంది, మంచి actors కనపడటం లేదు, నేనేమో introvert and shy, ఇప్పుడేదో నేనిలా open గా మాట్లాడుతున్నా కానీ నేను మహ సిగ్గరిని ఒకప్పుడు, ఇప్పటికీ ఉంది నాలో సిగ్గు. కొంతమంది actors interviews లో చెప్పేవాళ్ళు “ఆ director act చేసి చూపిస్తాడు” అని, సచ్చింది గొర్రె అనుకున్న, నాకేమొచ్చు acting చేసి చూపించడానికి.
ఒక time లో theatre workshop కూడా join అవుదాం అనుకున్నా కానీ ఎందుకో ఆ ధైర్యం కూడా రాలేదు. అప్పుడే ఒక magic జరిగింది, ఒక సాయంత్రం హేమంత్ ఆప్టే అనే friend phone చేసి “సౌరవ్ శుక్లా ని కలవటానికి వెళ్తున్నా వస్తావా” అని అడిగాడు, సౌరవ్ శుక్లా ఎవరో తెలియని వాళ్లకి rgv సత్య సినిమాలో కల్లు మామ. అంతకంటే ఏం కావాలి, ready అన్నాను. Green maruti van లో బయలుదేరాం, matter ఏంటంటే సౌరవ్ ఒక తెలుగు సినిమాలో villain గా చేస్తున్నాడు, రామోజీ ఫిలిం సిటీ లో shooting, five star hotel ఇచ్చారు కానీ bar bill మాత్రం మీరే కట్టుకోవాలి అని production వాళ్లు చెప్పారంట, బిల్లు పేలిపోతోంది. హేమంత్ ఎప్పట్నుంచో పరిచయం తనకి, city నుంచి రెండు ఫుల్లు signature whiskey bottles తెమ్మన్నాడు. So మందు కొనుక్కుని బయలుదేరాం, గంట పైనే పట్టింది.
వెళ్లేసరికి సౌరవ్ శుక్లా bar లో కూర్చుని phone మాట్లాడుతున్నాడు, ఒక సోఫాలో మనోజ్ పావా ఉన్నాడు, ఇతనొక legendary model & actor. వాళ్లిద్దరూ కలిసి తాగుతున్నారు.
మేము కూర్చున్న sofa కి కొంచెం దూరంలో bar counter దగ్గర సౌరవ్ వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడు, topic ఏంటంటే వాళ్ళ అమ్మకి కొత్తగా వచ్చిన set top box remote ఎలా వాడాలో నేర్పిస్తున్నాడు. అది ఎంత funny గా ఉండిందంటే, ఒక villain entry కి అలాంటి scene పెడితే ఎలా ఉంటుంది అనిపించింది.
Call అయిపోయాక నలుగురం సౌరవ్ room కి వెళ్లి మందు మొదలుపెట్టాం, నేను floor మీద కూర్చున్నా, first time అనుకుంట నేను five star hotel room చూడటం. వాళ్ళు ముగ్గురూ మాట్లాడుకుంటుంటే నేను full enjoy చేస్తున్నా, అలాంటి actor ముందు కూర్చుని తను చెప్తున్న జోకులు వినటం మామూలుగా అనిపించలేదు, మనోజ్ పావా ఏం తక్కువ కాదు. Not just jokes ఇంకా చాలా విషయాలు చెప్తున్నారు, నాకు కొంచెం కిక్కెక్కినాక సౌరవ్ ని అడిగాను హిందీలో “సార్ మీరు శేఖర్ కపూర్ తో చేసారు కదా ఆయన actors కి ఎలా చెప్తారు సీన్లు అని, “ఏం చెప్పడు, సీన్ చదివావు కదా let’s do అంటాడు, చేసాక ఏమన్నా ఉంటే చిన్న corrections చెప్తాడు అంతే” అన్నాడు, నాకాదొక eye opener brain opener అన్నీ, మంచి actors దొరికితే నువ్వేం చేయక్కర్లేదు, వాళ్ళే చేస్తారు నువ్వు వాళ్ళని “direct” చేయాలి అంతే.
కానీ “మంచి actors” ఎక్కడ దొరుకుతారు ? ఎలా judge చేయాలి ఇది మంచి acting అని? Trained actors అయితే కొంతవరకు safe అనిపించింది, but theatre actors మీద bad opinion ఉండేది అప్పట్లో industry వాళ్లకి , ఒకటి over acting రెండు పొగరు ఈ రెండు మాటలు బాగా తిరిగేవి. Ad films కోసం నేను చేసిన 300-400 auditions లో నాకూ experience అయింది over acting చేసే theatre actors తో. But నాకైతే theatre మీద hope ఉండేది, ఆ groups ని కలిసి వాళ్లలో కొంతమంది actors ని try చేసేవాణ్ణి ad films లో, workout అయేది.
ఇంక శీష్ మహల్ మొదలుపెట్టాక actors ని personal space లో వెతుక్కోవడం మొదలైంది, mostly చుట్టూ ఉన్న friends లో, అలా నేను ఫస్ట్ అనుకున్న actor రాహుల్ రామకృష్ణ, ఖచ్చితంగా వీడి screen presence బాగుంటుంది, బాగా మాట్లాడగలడు, చదువుకున్నాడు, చాలా విషయాల మీద ఏదో ఒక అవగాహన ఉంది, acting ఎలా చేస్తాడో camera పెట్టాక చూసుకుందాం ఫిక్స్ అయ్యా. ఆ cinema లో మేము అనుకున్న acting అయితే చేసాడు రాహుల్. మిగతా actors ని కూడా చాలా random గా పట్టుకున్నాం. శీష్ లో కొంత part Hyderabad ఉర్దూ లో ఉంటుంది, దానికి theatre actor ఫిరోజ్ ని తీసుకున్నాం, తను నా old friend, scenes తీస్తున్నప్పుడు తను over చేస్తున్నాడా అనే doubt ఉండేది నాకూ రోహిత్ కి, even edit తర్వాత కూడా. Screenings మొదలయ్యాక అందరూ ఫిరోజ్ character ని తన acting appreciate చేయడం మాకు surprise అయింది.
శీష్ మహల్ లో జరిగిన ఒక situation నా life లో ఊహించనిది మా filmmaking “journey” ని మలుపు తిప్పిన సంఘటన అది. నేను acting చేయడం, పెళ్లిళ్లలో camera ముందుకి వెళ్ళటానికే సిగ్గుపడే నేను తప్పనిసరి పరిస్థితిలో actor అయ్యాను, అదొక్కటే cinema లో hilarious scene, మన సినిమాలో బ్రహ్మానందం నువ్వే శశి అన్నాడు రోహిత్. ఒక actor hand ఇస్తే, నువ్వు చేసేయ్ శశి అని మా team అంతా motivate చేసి చేపించారు. నా acting preparation ఏంటో తెలుసా ? “రోహిత్ నాకు వరుణ్ goggles కావాలి, ఒక face wash తెప్పియ్” ఇంతే, నల్ల కళ్లజోడుతో వచ్చే confidence & మొహం కడుక్కుంటే వచ్చే freshness, ఈ రెండే నా బలం, actually ఇప్పటికి కూడా. మొదటి take నుంచే రెచ్చిపోయా most convincing performance. అదెలా వచ్చిందంటే నేను చూసిన కొంతమంది tfi cameramen ని గుర్తు చేసుకున్నా, అదే reference point. ఇదొక simple technic, చాలా మంది actors కూడా చెప్తుంటారు, real life persons reference గా తీసుకోవడం ఒక పాత్రకి.
ఆ తర్వాత మాకు actors వెతకడం అనేది పెద్ద కష్టం అనిపించలేదు, interesting గా అనిపించిన ప్రతి ఒక్కరిని అడిగేవాళ్ళం ఇప్పటికీ అడుగుతాం “నువ్వు acting చేస్తావా” అని. అస్సలు auditions చేయం, మాతో కలిసి మాట్లాడటమే audition. ఒక person ఎలా మాట్లాడుతున్నాడు తన expression ఎలా ఉంది, ఎలా react అవుతున్నాడు, ఇవన్నీ పనిగట్టుకుని ఏం చేయం, ఆ process కి అలవాటుపడిపోయాం. కొంతమంది పెద్ద పరిచయం లేకపోయినా try చేస్తాం, చిన్న scene తో మొదలుపెట్టి అది బాగా చేస్తే next time or అదే film or web series లో character పెంచేస్తాం.
On location deal చేయటం ఎలా ? special deal చేయాలి అనే plan ఉండదు, ఇన్నేళ్ల experience లో already మాతో చేసిన మంచి actors first preference ఆ తర్వాత కొత్తవాళ్లు. మేము actors ని మరీ push చేయం, వీలైనంత వాళ్ళ comfort zone లో ఉంచుతాం, మాది ఎక్కువ శాతం improv కాబట్టి వాళ్లకి అవగాహన లేని విషయాలు మాట్లాడించం. Actually మా technic కొంచెం unusual అనే చెప్పొచ్చు regular industry పద్దతి ప్రకారం చూస్తే. Makeup ఉండదు written script ఉండదు, మేము separate గా reaction shots తీయము. And చాలా freedom ఇస్తాం actors వాళ్ళేదైనా idea చెప్పి “అన్నా ఇలా చేయనా” ఏదన్నా చెయ్ కానీ మంచిగ చెయ్ అని encourage చేస్తాం. చాలాసార్లు most surprising and beautiful expressions actors నుంచి వస్తుంటాయి, అవి చాలా enjoy చేస్తాము మేము.
ఇవ్వాళ “Avanti Cinema” అంటే actors hub అనే పేరొచ్చింది ఇండస్ట్రీలో, మాతో పనిచేయాలని చాలా మంది actors ఉత్సాహపడుతుంటారు, మాతో పని చేస్తే “BREAK” వస్తుందనే నమ్మకం ఏదో ఉంది actors కి, అదంతా తూచ్. కానీ నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది actors విషయంలో భయపడిన నేను ఇంత create చేసాను అంటే. Of Course చాలా మంది support తోనే ఇదంతా జరిగింది, ముఖ్యంగా actors, మేము ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బులు అడక్కుండా shooting కి వచ్చేస్తారు పని చేసుకుని వెళ్ళిపోతారు. మాకు ఇవ్వాలనే ఉంటుంది కానీ మా దగ్గర ఉండవు.
మా next projects లో చేసే ప్రతి actor కి ఖచ్చితంగా remunerations ఇస్తాం, అలాంటి budget ఉంటేనే shoot కి వెళ్ళాలి అని decide అయ్యాం.
ఒకటి మర్చిపోయా rgv కూడా ఒక పెద్ద force actors విషయంలో ఎవరి మీదైనా camera పెట్టొచ్చు అనే నమ్మకం ఇచ్చింది ఆయనే.
నా రాత నచ్చితే కింద qr code ఉంది, buy me a drink or coffee bro.