Friends with Avanti

నువ్వు సినిమా తీయాలనుకుంటున్నావా? ఆల్రెడీ ఏమైనా క్రేజీ గా అటెంప్ట్ చేసి ఎవరికైనా చూపించి లోలోపల మురిసి పోవాలనుకుంటున్నావా? నీకు నీ సినిమా నచ్చినంతగా హోనేస్ట్ గా ఇంకెవరికైన నచ్చి అది నీతో షేర్ చేసుకుంటే కిక్ ఆస్ గా ఉంటుండబ్బా అని వెయిట్ చేస్తున్నావా? 

ఏమైనా, నీకు సినిమా అంటే ఇష్టం ఉంటే, తీసే విషయం పక్కన పెడితే, చూసి చిల్ల్ అయ్యే ఎక్సైట్మేట్ ఉంటే, కొత్తగా ఏమైనా ట్రై చేస్తున్న వాళ్ళ కంటెంట్ చూద్దాం అనిపిస్తే మీరు రైట్ పోస్ట్ చదువుతున్నారు. 

నేను ఇన్ని ప్లాన్స్ చేసుకొని శ్రీనగర్ లోని మెట్రోపాలిటన్ కేఫ్ దగ్గర వెయిట్ చేసి రోహిత్ అండ్ శశి నీ కలవలేదు కానీ, casual గా వాళ్ళు సినిమాలు తీస్తున్న స్టైల్ నచ్చి ఇన్స్పైర్ అయి, అబ్బా నేను కూడా ఏదో ఒక random కథ అనుకొని అక్టర్స్ తో ఏవో నాలుగు మాటలు సింక్ సౌండ్ లో చెప్పిస్తు, ఆక్షన్ చెప్దామని ఫన్ కోసం pickpocket షూట్ చేశాం. నాలాంటి అస్సలు సినిమాలు తీదాం అనే ఆలోచన కూడా లేని వాళ్ళనే ఇలా మన సినిమా మనం తీసుకొని చూస్తే ఎలా ఉంటుంది అని వాళ్ళ సినిమాల వల్ల ఎక్సయిట్ చేశారంటే వాళ్ళు మాములోలు మాత్రం కాదు. 

వీళ్ళిద్దరికీ సినిమా తీయడం అన్నది జస్ట్ ఒక ఈవెనింగ్ శ్రీనగర్లో ఉన్న అవంతి సెట్టప్ లో చిల్డ్ బీర్ వేసేంత వీసీ & ఫన్. కొంతమంది కటోర దీక్ష పట్టి ఉర్లు మారి రిసార్ట్స్/బీచులో కూర్చొని గానీ రాయలేని, పెద్ద పెద్ద మీటింగ్స్, యాభై మంది టీంతో ఛాయ్ సమోసా తింటూ పేపర్లు పట్టుకొని తిరుగుతూ, తెగ సెటప్లు వేసి కూడా తీయలేని షాట్స్, సీన్స్, సినిమాలు, సీరీస్లు తీస్తూ రోజుకోసారైనా ఇన్స్పైర్ చేస్తూ అసలు సినిమా తీయడం ఎంత ఫన్ బ్రో అని గుర్తు చేస్తుంటారు.

శశి ఒక ఐడియా మెషిన్, ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయో ఆయన చెప్తేనే బాగుంటాయి, మనం అనవసరంగా ఇమాజిన్ చేసుకోవాలని ట్రై చేస్తే చాలా ఘోరంగా ఉంటుంది, ఎందుకంటే చాలా మంది ఫ్రెండ్స్/ఫ్యాన్స్ తో hangout అవుతున్నప్పుడు శశి మాట్లాడే మాటలు వింటే అర్థం అవుతుంది,క్యాంప్ పవర్ ఎంటో.  అచ్చం వర్మ కి ట్విన్ బ్రదర్ లా మాట్లాడే, సినిమా సింప్లిసిటీ తెలిసిన బ్యూటిఫుల్ హుమన్ బీయింగ్ అండ్ a fantastic spokesperson. ఏమైన కథ చెప్పడం మొదలు పెడితే శశి ఆపేస్తే మనకి కోపం వస్తుంది, అబ్బా ప్లీజ్ చెప్పు, ఆప్పొద్దు అని అడుకోవాల్సిందే.  

సో, ఈయన పొద్దునే లేచి ఒక ఛాయ్/కాఫీ తాగుతూ పెంట్ హౌజ్ టెర్రస్ మీద ఉన్న చైర్ ఆర్ సిమెంట్ బండ మీద కూర్చొని, రెండు సిప్పులు తాగి, ఒక సిగరెట్ వెలిగిస్తు ఎక్కడో ఒక చోటకి చూస్తాడు, లేదా ఫోన్లో ఏదో ఒక న్యూస్, అది లేదా అయితే లాస్ట్ నైట్ ఎవ్వడో కలిసి ఏదో ఒక్కటి మాట్లాడ్డం లేదా తిట్టించుకోడం లాంటి చిన్న ఆక్టివిటీ వల్ల శశి కి ఒక kick-ass ఐడియా వస్తుంది. 

వెంటనే రోహిత్ కి చెప్తాడు కాల్ చేసి, అసలు రోహిత్ కి శశి లాంటి వాడు తగల్డం, పిచ్చి పిచ్చి గా నచ్చి క్లోజ్ ఫ్రెండ్ అవ్వడం, అసలు రోహిత్ కి కాల్ చెయ్యని రోజు లేదు అనెంతగా వాళ్ళ ఫ్రెండ్షిప్ చూస్తే చాలా సార్లు బ్యూటిఫుల్ గా beyond beautiful గా అనిపిస్తుంది, అండ్ రోహిత్ చాలా లక్కీ బ్రో. 

చిన్నపుడు నిద్రపోయే ముందు అమ్మమ్మ, అమ్మ, నాన etc, వెరైటీ వెరైటీ కథలు చెప్పి పిల్లని ఎలా నిద్ర పుచ్చుతారో, రోజు నిద్ర లేవ్వగానే (Mostly), రోహిత్ నీ ఎక్సయిట్ అయ్యేలా శశి ఫోన్ చేసి మ్యాడ్ స్టోరీస్ చెప్తుంటాడు. ఇంతకన్నా మంచి ఫ్రెండ్ ఎవడికి దొరకడు బ్రో. 

రోహిత్ అది విని ఎక్సయిట్ అయ్యి  బండేసుకొని అవంతి వచ్చి, “ఇంకేంటి మరి? అని అడుగుతూ వెంటనే మెట్రోపాలిటన్ లో ఛాయ్ కొడుతూ మాట్లాడుకుందాం” అని ఇద్దరి లిఫ్ట్ దిగుతారు. 

మనుషులు, (అంటే ఏ పని చేసే వాళ్ళైనా) ఇంత కూల్ గా ఉంటే, ఇలా ఎక్సయిట్ అయితే ఇలాంటి సినిమాలు తీస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా? చాలా relaxed గా, పిచ్చ చిల్ గా, ఈవెనింగ్ లు ఎంజాయ్ చేస్తూ ప్రతి రోజు ఒక కొత్త ఐడియా, అప్పుడప్పుడు పిచ్చ gossiping (చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది, అప్పుడప్పుడు), డాన్సులు, మందు, నవ్వులు ఇంకా సినిమాలు, చాలా బాగుంటుంది.

టెన్షన్ పడి కింద మీద పడితే ఏమి రాదు బ్రో, అని చెప్తారు అనుకుంటాం. చెప్పరు..మనమే చూసినప్పుడు ఓహో అదా మాటర్ అనుకుంటాం. అందుకేనా మీకు రోజు వీకెండే, రోజు ఫుల్ మూనే.

రోహిత్ కి శశి ఎలా తగిలాడో, శశి కో రోహిత్ అలాగే, మనోడు ఎం తక్కువోడు కాదు.  ఇలాంటి కాంబినేషన్ ఇంతక ముందు ఎప్పుడూ కనీవినీ ఎరగను. అవంతి సినిమా అంటే వీళ్లిద్దరూ, వీళ్లిద్దరూ అంటే అవంతి సినిమా అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, అయిన గుర్తించినప్పుడల్లా మాట్లాడుకోవాలి అని అనిపిస్తుంది. 

వీళ్ళ గురించి నేను నాన్ స్టాప్ గా మూడు నాలుగు రోజులైనా ఏదో ఒకటి మాట్లాడగలను.. దానికి కావల్సినంత friendship ఉంది..

ఉట్టి వాళ్ళని చూసి సినిమా నేర్చుకుందాం అనో, ఏదో ఒక దాంట్లో నన్ను కూడా కాస్ట్ చేస్తారనో వాళ్ళతో పరిచయం ఏర్పడలేదు, కంటిన్యూ అవ్వలేదు కూడా. 

వాళ్ళ casualness నచ్చి hangout అవ్వడం స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటికీ ఆరు సంవత్సారాలు అయిపోయింది, సినిమా గురించే మాట్లాడుతున్నా కూడా సడెన్ గా నాకు వాళ్ళు సినిమా కంటే ఎక్కువ అని గుర్తొస్తుంది. ఇంత అందమైన మనుషులు ఇంత అందంగానే సినిమాలు తీస్తారు, దానికి sensibilities, taste, అనవసరమైన పెంట పెట్టుకోవద్దనే brilliance ,extra అవసరం.. ఈసీ వీసీ గా ఉండడం వీళ్ళ వల్లనే అలవాటైంది..

రోహిత్ ఎడిట్, రోహిత్ డైరెక్షన్ అండ్ రోహిత్ సర్కాసం, ముందు రెండు ఎంత పవర్ఫులో, మూడోది అంతకన్నా ఎక్కువ. ఖర్మ కాలి ఎవడైనా ఏమైనా అంటే వాడికి కూడా అర్థం కాకుండా వాడి మీద జోక్స్ వేసి, పక్కన కూర్చున్న వాళ్ళకి అర్థం అయ్యి, “అమ్మ్మో ఘోరం” అనిపించేంత ఎటకారం. 

అద్దొక్కటే కాదు నిజానికి చాలా సార్లు వెరీ కూల్ గా వేస్తుంటాడు పంచులు, అవే అలాగే ఎగ్జాక్ట్లీ ఎడిట్లో కూడా వాడుతాడు. విజయవాడ నుండి ఏమైనా వచ్చిందా అంటే,అదే…పెర్ఫెక్ట్ టైమింగ్ అండ్  ఘోరమైన ఎట్టకారం, ఈసీగా ఏమైనా ఎవరినైనా అనేయడం, పని చేయించుకోవడం etc.. ఇంత కమాండ్ ఉండడం వల్లనే అనుకుంటా రోహిత్ భాయ్ అంటే చాలా మంది కొంచం భయపడి ఇబ్బంది పడతారు, అంతెందుకు షూట్ లొకేషన్లో రోహిత్ నీ చూస్తే నాకుడా భయం వేస్తుంది, ఎవరిని ఏమంటాడో ఏమో? అనేదాక ఎవ్వడు ఊహించలేడు. 

ఇవ్వెం ఉత్తి పర్సనల్ క్వాలిటీస్ మాత్రమే కావు, రోహిత్ తో పని చేసినవాళ్లకి, చేస్తున్న వాళ్ళకి ఆయనతో ఉండే వర్క్ experience లాంటిది..

మొన్న రీసెంట్ గా జరిగిన నిరుద్యోగ నటులు సీజన్ 2, పైలట్ ఎపిసోడ్ కోసం షూట్ చేసిన విషయం చాలా మందికి తెలిసిందే. ఎంత కుదరదు అని నన్ను కన్విన్స్ చెయ్యడానికి ట్రై చేసినా రోహిత్ & శశి, నేను కచ్చితంగా షూట్ కి వస్తా పని చేస్తా అని వెంటపడా (నాకు నాలుగు నెలల చిన్న బాబు ఉండడం వల్ల వద్దు, ఇబ్బంది అని చెప్పడానికి ట్రై చేసారు). మొత్తానికి షూట్ రోజు సాయంత్రం అక్కడ ఉన్నాను, రోహిత్ ఏం చెప్తే అది చేద్దాం అని వెయిట్ చేస్తున్న.

ఎలా డైరెక్ట్ చేస్తున్నాడు అని ఎక్సయిట్ అవుతున్నా, మొస్ట్లీ ఎవ్వర్ని ఎక్స్ట్రా పీపుల్ నీ సీన్ జరిగే ప్లేస్ లో అస్సలు ఉండనివ్వడు.  ఎంత కూలో అంత నాటు, ఒక నాలుగైదు సార్లు సార్ మెల్లిగా ఆక్టర్స్ మీద వేసిన పంచులు, తిట్టిన తిట్లు గుర్తొస్తే ఓహ్ మై! I can’t express..

అసలు అదే అసలు సిసలైన ఫన్, అదెలే అందరికీ దొరికే easy ఫన్ కాదు. ఇన్సైడ్ జోక్స్ కూడా కాదు. .

ఇంతకీ ఏదో రాదం అని స్టార్ట్ చేసి ఏదో రాశా. సర్లే పడుంటుంది.

లేకపోతే ఊరికే నేను చెప్పే రాండమ్ విషయలు ఐదు నిమిషాలు విన్నాము అనుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *