అమృతం కురిసిన రాత్రి 

2016, nov 8th 

 అప్పట్లో రాహుల్ రామకృష్ణ etv లో  cookery program చేస్తుండేవాడు, వందల ఎపిసోడ్లు చేసాడు. ఒకరోజు రాహుల్ కి 20,000/- payment వచ్చింది, as usual payment వచ్చిన ఆనందంలో నేను రోహిత్ & రాహుల్ మందు తాగుతున్నాం, మూడు పెగ్గులయ్యాక నాకొక 1000/- నోటు ఇచ్చి “జాగ్రత్తగా వాడుకో daddy”  అన్నాడు, daddy అని ఎందుకు పిలిచేవాడో తెలియదు. నేను ఆ 1000/- నోటు తీసుకుని సిగరెట్  షాప్ కి వెళ్లి నోటు ఇచ్చి packet cigarettes  అడిగా, షాప్ వాడి మొహం మాడిపోయింది, టీవీలో మోదీ స్పీచ్ వస్తోంది demonetisation గురించి. Regular customer ని కాబట్టి తీసుకుని చిల్లర ఇచ్చి రేపట్నుంచి తీసుకోను అని చెప్పాడు. నేను వచ్చి పిచ్చి నవ్వుతో “mr. RK నీ దగ్గర ఉన్న నోట్లు చెల్లవు” అన్నాను, “అదేంది daddy దొంగ నోటా” అన్నాడు, “కాదు ఈ క్షణం నుంచి 500/- 1000/- నోట్లు చెల్లవు అని  మోదీ టీవిలో చెప్తున్నాడు” అంటే “ఊరుకో daddy జోకా” అన్నాడు “కాదు నిజం” అని చెప్పా. ఒకప్పుడు జర్నలిస్ట్ కావడంతో తన circle లో friend కి ఫోన్ చేసి అవతలివాడు చెప్తున్నది విని “what the fuck” అని ఫోన్ పెట్టేసి “ఏం చేసుకోవాలిరా ఇప్పుడు ఈ ఇరవై వేలు” అని నేలకేసి  కొట్టాడు. అక్కడ్నుంచి ఆ డబ్బుల మీద జోకులు వేసుకుని ఇంకొంచెం మందు తాగి నిద్రపోయాం. 

పొద్దున్న లేచేసరికి దేశమంతా అల్లకల్లోలం, ఎక్కడ చూసినా ఇదే టాపిక్, జనాలు పిచ్చెక్కిపోతున్నారు, ATM ల దగ్గర బ్యాంకుల దగ్గర పేద్ద క్యూలు. నాకు బ్యాంకు అకౌంట్ లేదు, రోహిత్ కి ఉన్నా అందులో డబ్బులుండవు. అప్పుడే plan చేసినట్టో scam చేసినట్టో paytm introduce అయింది, దాంట్లో డబ్బులు అడుక్కుంటూ బతికేస్తున్నాం. ఇలాంటి భారీ events ఏం జరిగినా నేను దానిమీద ఏదో ఒకటి తీస్తాను అని నా ఫ్రెండ్స్ నమ్మకం, “ఏంటి శశి ఏం తీయడం లేదా demonetisation మీద” అని కొంతమంది అడిగారు “లేదు బాసూ జనాల దగ్గర డబ్బులు లేవంటే ఇంకేం తీస్తాం” అని, నిజంగానే నాకు దాని మీద ఏం తీయాలని అనిపించలేదు. కానీ నేనాగగలనా ? NO . 

“America లో credit card ఉంటే చాలు సినిమాలు తీసేయొచ్చు” అన్న John cassavetes మాటలు గుర్తొచ్చాయి ఒకరోజు, అతనొక legendary american indie filmmaker లెండి. సినిమా తీయడానికి cash ఎందుకు, ఎలాగూ బతకడానికి ప్రతిరోజూ అడుక్కుంటున్నాం, ఇలానే ఎక్కువ అడిగితే ఏదో ఒకటి తీసేయొచ్చు కదా అని రోహిత్ కి idea చెప్పా, చేద్దాం అన్నాడు. Planning మొదలైపోయింది, film పేరు “అమృతం కురిసిన రాత్రి”, demonetisation వల్ల కష్టాలుపడుతున్న ఒక struggling filmmaker & actor కథ. 

ఎటు చూసినా నోట్ల రద్దు వల్ల suffer అవుతున్న మనుషులే, మేమేమో సినిమా తీస్తున్నాం, paytm లో వచ్చేవి, petrol కోసం friends credit card లు  వాడాం, ఎలా చేసామో తెలియదు కానీ షూటింగ్ ముగించేసాం, వివేక్ సాగర్ acting debut అది. చాలా మంచి soundtracks కూడా ఇచ్చాడు వివేక్, edit అయిపోయి ఆరేళ్ళు అవుతోంది, మిగతా postproduction కి డబ్బులు లేక అప్పట్నుంచి అలా hard disk లో ఉండిపోయింది. మాకు ఏ డబ్బులు వచ్చినా ఆ సినిమా  finish చేయాలని మా కోరిక, ఆ సినిమా opening one of my most favorite openings మేము తీసిన వాటిలో. 

 దేశాన్ని అతలాకుతలం చేసిన మోదీ ప్రభుత్వ నిర్ణయం మాకొక cinematic adventurous experience, మాకెప్పుడూ కెమెరాలు ఫ్రీగా దొరుకుతాయి, వాడేసాం, sound కి ఒక zoom recorder వాడాం, as usual మా flat & srinagar colony రోడ్లు ఇవే మా locations. అదొక challenge లా ఉండేది, మేము బతకడం ఒకవైపు film తీయడం ఇంకో వైపు. అప్పటికే A LOVE LETTER TO CINEMA screenings కూడా అయిపోయాయి, same cameraman దీనికి కూడా, Vyas. ఎవరు దొరికితే వాళ్ళు actors. 

రమణ అనే ఫ్రెండ్ film production లో ఉండేవాడు, ఒకరోజు రాత్రి మందు తాగుతుంటే “శశిగారు, ముప్పైలక్షలు black amount ఒకతని దగ్గర ఉంది, అన్నీ 1000/- 500/- నోట్లే, సినిమా తీద్దాం అంటున్నాడు, మీరు చేస్తారా” అన్నాడు, “తప్పకుండా చేద్దాం రమణ” అని రెడీ అయిపోయి ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయా, సినిమా తీసి హిట్టు కొట్టేసి మా జీవితాలు మార్చేసుకుందామా అని కొన్ని రోజులు wait చేసి చేసి చేసి అది వర్కౌట్ అవలేదు. 

చాలా మంది చేసిన help ఒక ఎత్తైతే మా సందు చివర ఉండే చాయ్ బంకు రెడ్డి చేసిన help మర్చిపోలేనిది, అమృతం కురిసిన రాత్రి లో తన మీద voice over ఉంటుంది

 “demonetisation పేరుతో ఒక ఛాయివాలా చావు దెబ్బ కొడితే, ఎప్పుడు అడిగితే అప్పుడు paytm లో డబ్బులు transfer చేస్తే cash ఇచ్చి ఆదుకున్నాడు మా చాయ్ రెడ్డి”  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *