“It’s called the CBFC, and the CBFC means Central Board of Film Certification, unfortunately it’s known as the censor board. This is a legacy of the British raj, because the British censored films during their time where they showed nationalistic themes or patriotic themes. Sadly instead of certifying films we are continuing this hangover of the British thinking that we can do moral policing and I do not believe in it. I deal with students between the ages of 16 & 20 and i would like to say that in spite of my white hair i am on the same wavelength of 16 & 20 year olds, i know exactly how they talk and therefore i was somehow not happy with the ban of cuss words that was there, because i hear students talking all the time and i know what language they are using and i’m constantly learning new words from them, job of the CBFC is to certify films not censor” – Nandini sardesai, Ex CBFC member
ఒక TV debate లో ఆమె అన్న మాటలు ఇవి, మరీ అశ్లీలంగానో లేదా సమాజంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే విధంగానో ఉంటే CBFC అవి తీసేయమని filmmaker కి చెప్పొచ్చు, అప్పటికీ filmmaker fight చేయాలి ఆ scenes కోసం అనుకుంటే revising committee లేదా tribunal కి కూడా వెళ్లొచ్చు అని ఇదే debate లో ఆమె చెప్పింది. మన మెదళ్లలో “censor board” పాతుకు పోయింది
కాబట్టి ప్రస్తుతానికి అలాగే రాస్తాను.
నేను రోహిత్ గత సంవత్సరం “శీష్ మహల్” certification కోసం apply చేసాం, ఈ process మనం సొంతంగా చేసుకోవాలంటే చాలా కష్టాలు పడాలి, దాని కోసం ప్రత్యేకంగా ఆ పనులు చేసేవాళ్ళు film industry లో ఉంటారు. దీనికి DD కట్టాలి, film ని pendrive లో ఇవ్వాలి, సినిమా మొత్తం “censor script” రూపంలో రాయించాలి, అంటే cinema మొదటి frame నుంచి తెర మీద ఏం కనిపిస్తుంది పాత్రలు ఏం మాట్లాడుతున్నాయి అన్నీ రాయాలి, దానికొక format & professionals ఉంటారు. Apply చేసాక మనకొక date ఇస్తారు, ఆ రోజు director or producer వెళ్ళాలి, regional cbfc chairman and ఇంకో నలుగురైదుగురు cinema చూస్తారు, ముఖ్యమైన ritual ఏంటంటే “snacks”, cbfc office staff ki ఒక స్వీటు సమోసా చాయ్ తప్పకుండా తెప్పించాలి, రోజుకి ఎన్ని సినిమాలు చూస్తారో ఎన్ని snacks తింటారో అని doubt వచ్చింది నాకు. First time మా సినిమా ఒకటి censor అవుతోంది, నేనూ రోహిత్ office corridors లో తిరుగుతున్నాం బయటకెళ్ళి చాయ్ సిగరెట్లు తాగుతున్నాం. కాసేపటికి బోర్ కొట్టి దగ్గర్లో ఉన్న దివ్య ఇంటికి వెళ్ళి టైంపాస్ చేస్తుంటే కాల్ వచ్చింది “సినిమా అయిపోవచ్చింది వస్తారా” అని, వెళ్ళాం మా ఇద్దరినీ ఒక కాన్ఫరెన్స్ రూంలోకి పిలిచారు, అక్కడ బోర్డ్ చైర్మన్ & ఇంకో నలుగురు ఉన్నారు, ఆ నలుగురు “గౌరవ సభ్యులు” ఇలాంటి వాళ్ళు 60-70 మంది ఉంటారని తెల్సింది. సినిమా చూస్తున్నప్పుడు notepad పెట్టుకుని ఇవ్వాల్సిన cuts రాసుకుంటారు, శీష్ మహల్ లో 3-4 చోట్ల బూతులు ఉంటాయి definite గా అవి mute చేయమంటారని మేము expect చేసిందే. Board chairman పంజాబీ ఆవిడ, IAS లు ఎక్కడ పని చేస్తే ఆ భాష నేర్చుకుంటారు కాబట్టి ఆవిడ తెలుగులో ఏయే బూతులు mute చేయాలో చెప్తుంటే awkward గా అనిపించింది, బూతులు ఉన్నందుకు కాదు ఆవిడ పలుకుతున్నందుకు. ఒక సీన్లో గోడ మీద పచ్చి బూతు బొమ్మలు బొగ్గుతో గీసి ఉంటాయి, అవి మేము గీసినవి కాదు ఆల్రెడీ ఉన్నవి, అవి morph చేయమన్నారు. కానీ అలా చేయటం ఇష్టం లేక ఆ బొమ్మల్ని vfx లో చెరిపేసి plain wall చేసాం. ఇవన్నీ చేసి film మళ్ళీ ఇవ్వాలి, censor script లో కూడా ఆ మార్పులు చేయాలి. అప్పుడు certificate వస్తుంది. మీకు U/A ఇస్తున్నాం అని చెప్పారు, సరే అని తలూపి వచ్చేసాం. తర్వాత ఆలోచిస్తే అన్నీ mute చేసాం “objectionable” అన్నారని గోడ మీద బొమ్మ లేపేసాం, violence లేదు, vulgarity లేదు, ముంబై తెల్ల హీరోయిన్ exposing లేదు, మరి U/A ఎందుకిచ్చారు? “అఖండ” కూడా U/A నే ఇంక పెద్ద హీరోల భీభత్స భయానక violence ఉన్న అన్ని సినిమాలు కూడా. U/A తో చిన్న సినిమాలకి satellite pricing దగ్గర problem అవుతుంది, మా సినిమా ఎవరైనా కొంటారనే నమ్మకం మాకైతే లేదనుకోండి. But it’s not fair certification అని మాకు అనిపించింది, revising committee కి వెళ్లే ప్లాన్ లో ఉన్నాం.
ఇంకో విషయం ఏంటంటే certificate ఇచ్చేది ఎందుకు ? ఈ వయసు లోపు వాళ్ళు చూడకూడదు, ఒకవేళ చూసిన parents తో కలిసి చూడాలి అనే ఉద్దేశం లో, కానీ U/A సినిమాలకి ఎంత చిన్న వయసు పిల్లల్ని తీసుకెళ్తారంటే, ఎవరు monitor చేయాలి దీన్ని? ఎవ్వరు పట్టించుకోరు, ఈ మధ్య కొన్ని multiplexes allow చేయటం లేదు. సినిమాల్లో బూతులు Violence పిల్లల్ని ప్రభావితం చేస్తాయి అనుకుంటే అసలు ఈ generation పిల్లలు ఎలాంటి video content కి expose అవుతున్నారో అర్ధమవుతోందా? కొంచెం ignore చేస్తే ఎలాంటి obscene or violent video అయినా access చేయగలరు, ఇది మహా ప్రమాదం, parental locks మాత్రమే సరిపోదు ఇంకా చాలా చేయాలి. దీన్ని censor చేయగలరా ? ఆపగలరా? దేవుడి వల్ల కూడా కాదు.
ఏ సినిమా చూడాలి ఎలాంటి సినిమా చూడాలి అనేది ప్రతి వ్యక్తి అతడి choice ని బట్టి taste ని బట్టి ఉండాలి గానీ ఒక గదిలో ఐదుగురు కూర్చుని ప్రజలు ఏం చూడాలో నిర్ణయించుకోవటం కరెక్టేనా ? అస్సలు కాదు, నా సినిమాలో బూతులుంటే A certificate ఇవ్వండి, లేదా A+++++++ ఇవ్వండి, దాన్ని బట్టి ప్రేక్షకుడు రావాలో వద్దో నిర్ణయించుకుంటాడు. ఇంకో కామెడీ చెప్తా, శీష్ మహల్ లో ఒక చోట FUCK వస్తుంది, దాన్ని mute చేయాలి లేదా DUCK అన్ని dubbing లో మార్చాలంట, నేనూ రోహిత్ లోపల “డక్కా” అని బ్రహ్మానందం లెవెల్లో అవాక్కయ్యాం. ఇదేం కరెక్షనో, అంటే ఇప్పుడు ప్రేక్షకులు DUCK అనే అనుకుంటారని వాళ్ళ ఫీలింగా ? ఇది ప్రేక్షకుడి మేధ ని అవమానించటమే. నందిని సర్దేసాయ్ అన్నట్టు ఇవాళ్టి పిల్లల భాష బూతులు ఎక్కడికో వెళ్లిపోయాయి, వాళ్ళ generation సృష్టించుకున్న సృష్టిస్తున్న బూతులు reels shorts రూపంలో చేస్తున్న చేష్టలు ఊహకందనివి.
ఒక hero రెండు మూడొందల మందిని గాల్లోకి ఎగరేసి football ఆడి వాడి బాడీని టెన్నిస్ బంతిలా నేలకేసి కొట్టి తలని 360 డిగ్రీస్ వెనక్కి తిప్పి ఆ తర్వాత ముక్కలుగా నరికే సినిమాలకి D certificate ఇవ్వాలి, D అంటే dangerous అన్నమాట.
బూతులతో problem ఏంటి ? అవి లేవా మీకు వినపడటం లేదా ? ముండ అనేదయితే డబ్బున్నోళ్ల ఇంట్లో ఏమో గాని మా మధ్య తరగతి ఇళ్లలో common, ఇంట్లో నుంచి బయటకొస్తే అమ్మలక్కల బూతులు ఇంకా common, i agree they are offensive, women related పదాలే ఎక్కువ, కానీ ఏం చేస్తాం ? అవి మన భాషలో భాగమైపోయాయి, వాటిని మాయం చేయగలరా? అవి వాడాలా వొద్దా అటువంటివి చూడాలా వద్దా నా సినిమాలో బూతులు ఉండాలా వద్దా అనేది అనేది ఒక వ్యక్తికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఏం జరిగింది ఇన్ని దశాబ్దాల “censoring” వల్ల youtube ott లు రాగానే కట్టలు తెంచుకుంది, అరాచకపు levels కి వెళ్ళింది. అదే మన CBFC certification కే పరిమితం అయుంటే ఈ discussion ఉండకపోయేది, ఎవరికి నచ్చిన సినిమా వాళ్ళు చూసుకుంటూ ఉండేవాళ్ళు.
OTT లని censor చేయాలంట లేదా self censoring guidelines ఉండాలంట, మరి youtube ని ఏం చేస్తారు? Ban చేస్తారా? ఇంకొకటి వస్తుంది, ఇవన్నీ జరిగే పనులేనా ? వీటిని monitor చేయడానికి అయ్యే ఖర్చు ఎంత? చేయగలిగినన్ని porn sites ban చేసారు, vpn మార్చి చూసేస్తున్నారు, ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండాలని అనటం లేదు, internet తో అదంత వీజీ కాదు అంటున్నా.
ఇంకొక కామెడీ చెప్తా, ఇది Evv సత్యనారాయణ ఒక interview లో చెప్పింది, “అల్లుడా మజాకా” సినిమా censor అయ్యాక వాళ్ళు చెప్పిన cuts & objections లో ఒకటి ఏంటంటే, ఒక సీన్లో రంభ రమ్యకృష్ణ ఊర్లో చెరువులో swimsuits వేసుకుని ఈత కొట్టి బయటకొస్తారు, అలా బయటకొచ్చేటపుడు ఒక అమ్మాయి తొడలు obscene గా అనిపించాయి ఏమన్నా చేయండి అన్నారంట, ఇదెక్కడి అన్యాయం అని Evv చాలా feel అయ్యాడు.
1952 నాటి cinematography act మనది, దానికి ఇప్పుడు relevance ఏముంటుంది? ఏ ప్రభుత్వమూ మారిన మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా మార్పులు ఎందుకు చేయరు? ప్రపంచంతా indian cinema వైపు చూస్తోంది, తెలుగోడు మీసాలు మెలేయాలి అని జబ్బలు చరుచుకోవటమే గానీ మన filmmakers ని మరింత empower చేసే చట్టం చేయొచ్చు గా. ఉంది మనకి కావాల్సినంత freedom ఉంది express చేయొచ్చు, కానీ కోట్ల మంది చూడాల్సిన దాన్ని అతి కొద్ది మంది “censor” పేరుతో నిర్ణయించడం అయితే కరెక్ట్ కాదు.
శీష్ మహల్ censor తర్వాత ఒకటి decide అయ్యా నేను, board chairman నోట్లోంచి బూతులు విన్నాక ఎప్పటికైనా ఒక clean film తీస్తా board members పెన్ను paper మీద పెట్టకూడదు, ఒక బూతు ఉండదు, మందు సిగరెట్లు ఉండవు, కొంచెం కూడా cleavage కనపడదు, ప్రస్తుతానికి ఇదే నా జీవితాశయం.
నా రాత నచ్చితే కింద qr code ఉంది, buy me a drink or coffee bro.