శశి ఎత్తులు వేస్తే ! – Part 2

ఏప్రిల్ 2021 – exactly second lockdown announce చేసిన రోజు మధ్యానం. ఎత్తులు షూట్ డే 2. 

రెండు రోజుల షూట్ కోసం ఫార్మ్ హౌస్ వెళ్ళాం. మొదటి రోజు హ్యాపీ గా ఏదో ట్రిప్ కి వచ్చిన ఫీలింగ్, శశి కి బడ్జెట్ ఇష్యూస్, ఫోన్ కాల్స్, నెక్ట్స్ డే షూట్ కి కావాల్సిన డబ్బులు, ఫార్మ్ హౌస్ ఎక్స్టెండ్ అవుతుంది అని పెర్మిషన్ కోసం కాల్, ఇలా చాలా. షాట్ మధ్యలో సడెన్ గా శశి ఎక్కడ అని చూస్తే దూరంలో నించోని ఎవరితోనో మాట్లాడుతూ కనిపించేవాడు, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్న ఇలాంటి సిట్యుయేషన్నీ(మరీ షూట్ టైంలో ఇలాంటి టెన్సన్స్ నీ).

రేపు షూట్ కోసం ఇవ్వాళ షూట్ లొకేషన్ నుండి డబ్బులు కోసం ప్రయత్నాలు. ఇలాంటివి శశి స్మూత్ గా హ్యాండిల్ చెయ్యగలడు. లోపల ఎంత టెన్షన్ పడుతున్న బైటకి కూల్గా కనిపిస్తాడు, అది ఆయన వయసు,ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చిందనుకుంటున్న. 

ఇంకో ఇంపార్టెంట్ విషయం ఈ సినిమాకి ఫస్ట్ రోజు బాచి అండ్ జగదీష్ ప్రొడక్షన్ చూసుకుంటే, నెక్ట్స్ డే ఏదో షూట్ ఉందని జగదీష్ వెళ్ళిపోవాలి, మోస్ట్లీ అన్ని పనులు బాచి గాడు efficient గా చూసుకున్నాడు. షూటింగ్లో మనం ప్రశాంతంగా షూట్ చేసుకోవాలంటే ప్రొడక్షన్ ఎంత స్మూత్ గా నడవాలో స్పెషల్ గా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. సో, ఈ సినిమాకి బాచి గాడి పని తత్వం చాలా ఉపయోగ పడింది. 

Actors కూడా అంతే, ఎంత స్మార్ట్ ఆక్టర్ అయితే అంత ఈజీ. పవన్ లాంటోడు ఉంటే ఏ షూట్ అయినా ఈజీ అవ్వడమే కాదు వాడి పర్ఫార్మెన్స్ వల్ల పిచ్చ ఎనర్జీ వస్తుంది. అలాంటి యాక్టర్ మాకు దొరికినందుకు,మాకే దొరికినందుకు ఎన్ని exciting ఐడియాస్ వస్తాయో (పవన్ ఆక్టింగ్ గురించి ఒక పోస్ట్ రాయాలి, త్వరలో). కళ్యాణ్ విలన్, హీరో లాంటి విలన్. మంచి అందమైన ఫార్మ్ హౌస్ లో గర్ల్ ఫ్రెండ్ తో ఉంటూ, చెస్ ఆడుతు, అప్పుడప్పుడు ధంకీలు, నెత్తి పగల్ కొట్టడాలు చేస్తూ, చాలా ప్రశాంతంగా సిటీ కి దూరంగా బ్రతుకుతున్న ఓల్డ్ ఫాషనెడ్ క్రిమినల్ కం ఫైనాన్షియర్. 

రఫీ, సంజు, సుమంత్ ఆల్ టైం హెంచమెన్.. దీక్షీ కళ్యాణ్ గర్ల్ఫ్రెండ్, క్యాంప్ ఒక అప్పుల బారిన పడి, అప్పు+ఇంటరెస్ట్ ఎగ్గొట్టి తిరుగుతున్న అప్పారావు కారెక్టర్ చేశాడు. 

ఇంకో ఛార్మింగ్ కారెక్టర్, CI సాబ్ కిరణ్(అదే మన స్టోరీ డిస్కషన్ లోని మాణిక్ రావు) చేశాడు. 

రెండో రోజు పొద్దున షూట్ స్టార్ట్ అయింది. అప్పటికి కానీ ఇంకా పవన్ గాడి షూట్ స్టార్ట్ అవ్వలేదు. పొద్దునే స్టార్ట్ చేశాం. 

ఫార్మ్ హౌజ్ లోని హల్లో న్యాచురల్ లైట్ తక్కువే, recce అప్పుడే లైట్స్ బానే వాడాలి అని తెలిసింది. శశాంక్ ఫ్రీడమ్ వాడుకొని కావాల్సిన రెండు లైట్స్ చెప్పాడు. బ్లాక్ మేజిక్ పాకెట్ కెమెరా, సీపీ 3 లెన్స్, ప్రోబ్ లెన్స్(చెస్ బోర్డ్ షాట్స్ కి వాడిన లెన్స్), స్లైడర్ etc బానే ఎక్విప్మెంట్ వచ్చింది(మనలో మన మాట సినిమా స్క్రీనింగ్ కూడా అయింది కానీ మేము ఇంకా కెమెరా రెంటల్స్ కి డబ్బులు కట్టలేదు. అడిగి అడిగి వాళ్ళు మర్చిపోయారు, మనకి రెంటల్స్ తక్కువనా అని మేము, లేదులే డబ్బులు ఉంటే ముందు మేము చేసే పెమ్నెట్స్ రెంటల్స్, సింక్ సౌండ్ కే, ఈ సారి అనుకోకుండా అలా జరిగింది లాస్ట్ మినిట్ ఇష్యూస్ వల్ల) 

బైట తోటలో, ఇంటి ముందు lawn లో, వెనక వరండాలో తీసిన సీన్లకు ఎక్స్టర్నల్ లైటింగ్ మాటే లేదు, మొస్ట్లి వీలైనంత natural light వాడుతాం. ఇంక అవసరానికి, లేదా పర్టిక్యులర్ గా ఈ షాట్ ఇలా అనుకుంటే తప్ప లైటింగ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండదు. 

శశాంక్ కి లైటింగ్ బాగుండాలి(అది ఏ లైట్ అయినా), షాట్ కి తగ్గట్టు, టైం కి తగట్టు, ఒకవేళ external lighting వాడాల్సి వస్తే మాత్రం మంచిగా టైం తీసుకొని నచ్చినట్లు సెటప్ చేసుకుంటాడు, కొన్ని సార్లు టైం constraint వల్ల ఇబ్బంది అనిపించిన తర్వాత చూస్తున్నప్పుడు వావ్ అనిపిస్తుంది, ఎస్పెషల్లీ లైటింగ్. 

కెమెరా కూడా అంతే, శశాంక్ చాలా నెమ్మదిగా(ఒక వేళ మంచిగా టైం ఉంటే) అన్ని చూసుకొని ప్రశాంతంగా ఒక సీన్ అయినా సరే కొత్తగా, క్రేజీ గా, ఇంటరెస్టింగ్ గా తీస్తే చాలు, పది సీన్లు కలిపి కొట్టేసేకన్నా మెల్లిగా కంపోజ్డ్ గా ఒక బ్యూటిఫుల్ సీన్ చేద్దాం అనే ముడ్లో ఉంటాడు. తప్పని పరిస్థితిలో హడావిడిగా చేసి, “అబ్బా ఇంకొంచం టైం ఉంటే ఇంకా కిక్ ఆస్ షూట్ చేస్తుండే” అన్న చాలా సార్లు, surprisingly ఆ హడావిడి వల్లనే బ్యూటిఫుల్ గా, మెంటల్ గా అనిపించిన షాట్స్ ఉన్నాయి. 

ఇంక లెన్స్ గురించి మాట్లాడితే, నాకు మొన్న మొన్నటి దాకా అస్సలు పెద్ద ఐడియా లేదు. ఇప్పుడు ఏదో ఉందని కాదు, శశాంక్ వల్ల, ఏవో ఒకటి షూట్ చెయ్యడం వల్ల బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థం అయింది, తెలుసు అనిపిస్తుంది. ఏదైనా షూట్ ఉంది అంటే ముందు శశాంక్ కెమెరా ఏది వాడలో ఆలోచిస్తూ కొన్ని వీడియోస్ (టెస్టింగ్) చూసి, ఈ సినిమాకి, ఇలాంటి సీన్స్, షాట్స్ కి ఇలాంటి కెమెరా అయితే flexible గానో, కలర్ సెన్స్ వల్లనో, రోడ్ మీద వాడాలి అంటే ఇది అయితే బెస్ట్, కెమెరాలో ఉండే ఫీచర్స్ &  లైటింగ్, గ్రేడ్, లెన్స్ గురించో కొన్ని టెస్టింగ్ వీడియోస్ చూస్తుంటాడు, ఒకే ఇంట్లో ఉంటాం కాబట్టి అప్పుడప్పు ఎక్సయిట్ అయ్యి నాకూడ చూపిస్తాడు, దాని వల్లే ఏదో లైట్ గా కొన్ని విషయాలు అర్థం అయ్యాయి..

ఏదో కొంచం అయినా బ్రౌజింగ్ తో background రీసెర్చ్ అయితే జరుగుతుంది. ఒకసారి దిగితే షూట్ మోత్తం అయ్యేదాకా నువ్వు ఎవడైనా జాంతా నై అనే attitude and (అది లోపల ఉంటది, బైటికి కనిపించదు), రోహిత్ డైరెక్షన్ లో అయితే ఇంకా ఈజీగా ఉంటుంది అని చాలా సార్లు అంటుంటాడు. అంత సింపుల్గా కూల్ గా ఉంటూ బ్రిలియంట్ ఇమేజెస్ క్రియేట్ చేస్తూ సెట్ మీద ఉన్న వాళ్లకి instant గా మెంటల్ ఎక్కించే శశాంక్ వర్క్ నీ దగ్గర నుండి చూడడం, అసలు ఎంత రీసెర్చ్ ఉంటుందో గుర్తుకు తెచ్చుకోవడం, ప్రతి సినిమాతో visually ఇంకా మేజిక్ క్రియేట్ చెయ్యడం చూస్తునందుకు చాలా inspiring గా ఉంటుంది. 

అంతా అయిపోయింది. లేదు ఇంకా అయిపోలే రోహిత్ దిగాడు సెకండ్ డే షూట్ సాయంత్రం/మధ్యానం. అస్సలు ఇన్వాల్వ్ చేయ్యోదనే అనుకున్నాం, జస్ట్ చిల్ అవ్వుదామనే వచ్చాడు అండ్ అవుతున్నాడు. ఆ రోజు మిడ్నైట్, ఎర్లీ మార్నింగ్ దాకా అయింది,లాస్ట్ ఎస్కేప్ తీస్తేది బ్యాలన్స్ ఉంది. అది ఎలాగో రోహిత్ డైరక్ట్ చేస్తాడు అని ముందునుండి ప్లాన్. 

సో ఎర్లీ మార్నింగ్ మేము పడుకున్నాం. కాస్త సన్ రైస్ టైంలో తీస్తే బాగుంటుంది అని వెయిట్ చేసి, శశాంక్, రోహిత్, పవన్, రఫీ, రాహుల్ వీర్ వెళ్ళారు. లేచి చూస్తే లేరు, వెయిట్ చేస్తున్న ఇంకెప్పుడు వస్తారని, రారు. శశి లేచి టీ అండ్ పూరీ తెచ్చాడు. తిన్నం ఇంకా రావట్లేదు. ఎట్టకేలకు ఒక రెండు మూడు గంటల తరవాత వచ్చారు ముట్టుకుంటే కింద పడిపోయేలా. వచ్చి చెట్టు కింద సోయి లేకుండ నిద్రపోయారు.. మొహాలు చూస్తే అర్ధం అవుతుంది ఏదో బానే గట్టిగా కొట్టారని. రోహిత్ రెండు మూడు షాట్స్ చూపించాడు, మ్యాడ్. అసలు ఎస్కేప్ ఓపెనింగ్ కెమెరా మూవ్ అవుతుంటేనే మెంటల్ ఎక్కింది, ఇంక చాలు అర్థం అయింది. రెండు రోజులు చేసిన డ్రామా ఒక వైపు ఒక ఎస్కేప్, చేజింగ్ ఒకవైపు. 

షూట్ వ్రాప్ అప్!!!

షూట్ రెండో రోజు నైట్ తెలిసిన విషయం, సెకండ్ లాక్డాన్ అనౌన్స్ చేశారని. 22- 23 మంది దాకా అందరం అక్కడే ఉన్నాం. 

షూట్ అయిపోగోట్టుకొని సిటీలోకి ఎంటర్ అయ్యాం, lockdown వాతావరణం అర్థం అవుతుంది. వచ్చిన మూడు నాలుగు రోజుల్లో రోహిత్ ఒక కట్ చూపించాడు. కళ్యాణ్ & పవన్ గేమ్ సీన్స్ చూసి ఎంత స్టైలిష్ గా, ఎంత యూనిక్ గా ఒక దానికి ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయో చూసి mesmerize అయ్యాను. శశి పెర్ఫార్మెన్స్ మళ్ళీ మళ్ళీ నవ్వించింది, బాధ పెట్టింది, పవన్ situation కి భయమేస్తుంది. లాస్ట్ చేసింగ్ మజా ఒచ్చింది. 

వెంటనే smaran కి పంపించాడు రోహిత్, ముందు నుండే smaran musical అనుకున్నాం. భయ్యా chase కి కొట్టిన run ఒక మాడ్ మాక్స్ స్టఫ్. మోస్ట్ ఎనర్జిటిక్ వన్. మ్యూజిక్ అయింది కానీ సౌండ్ కే కొంచం టైం పట్టింది, అది కూడా పుర్లీ డబ్బులు లేక. చివరికి ఎలాగో అలా ఫినిష్ చేద్దాం అని అక్కడ ఇక్కడ డబ్బులు ట్రై చేసి, రమణ నే బెటర్ అనుకొని సౌండ్ ఫినిష్ అవ్వాలంటే మీరే ఇవ్వాలి అని మాట్లాడితే ఒకే అన్నాడు. మిక్స్ అయింది..

ఇంక లేట్ ఎందుకు మొత్తం మజా పెద్ద స్క్రీన్ మీద చూసుకోడానికే కదా అని వీలైనంత త్వరగా స్క్రీనింగ్ ప్లాన్ చేశాం. 

బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, నేను ప్రెగ్నంట్ అని తెలిసాక immediate గా జరిగిన అవంతి ఈవెంట్స్ లో ఎత్తులు స్క్రీనింగ్ ఒకటి, కడుపులో పిల్లాడితో చూసిన ఫస్ట్ బిగ్ స్క్రీన్ సినిమా ఎత్తులు, ఫీల్స్ మాజికల్!

థాంక్స్! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *