మగాడు

ఇది కూడా పాత పోస్టే, సరదా పోస్టు, ఒకమ్మాయి ఇది చదివి You are very narcissistic అంది, ఆ సర్లే అనుకున్నా 

మగాడు

మెట్రోలో వెళ్తుంటే ఒక పెద్ద హోర్డింగ్ , ఒంటి మీద బట్టలేమి లేకుండా ఒక చిన్న రంగురంగుల అండర్వేర్ తో కండలు తిరిగిన మగాడు, గజ్జల్లో నలుపు ఫోటోషాప్ లో తీసేస్తారేమో. అది చూడగానే నా సున్నిత మనసు కుచించుకుపోతుంది, ఎందుకిలా మగాడి శరీరాన్ని వాడుకుంటారు అని, ఆ ఆడవాళ్ళ లాంజరినో లింగరీనో ఆ హోర్డింగుల్లో కనీసం పైన కప్పుకుని ఉంటారు కానీ మగాడి మీద ఆ మాత్రం కనికరం లేదా. చెడ్డి అమ్మటానికి ఒళ్ళంతా ఎందుకు చూపియాలి. అసలే సిగ్గుతో నలిగిపోతున్న నాకు వాడి కండలు చూసి ఓహో ఆడవాళ్ళకి ఇటువంటి మగాళ్లే ఇష్టమేమో అనుకుని నా బుల్లి బొజ్జని చూసుకుని ఇంకో బాధ. 

చెట్లు కొండలు పుట్టలు గుట్టలు నదులు జలపాతాలు దాటుకుని అరలీటరు thumsup కోసం కష్టపడేది కూడా మగాడే, ఏ ఒక్క ఆడదాన్ని  అలా కష్టపెట్టలేరా ? ఎంత అన్యాయం ఇది ? మెల్లగా  చల్లగా మామిడి రసం లాంటి జ్యూస్ తాగే ప్రకటనలో ఏమో అమ్మాయి, ఆ అమ్మాయి చుక్క చుక్క చివరి చుక్క  తాగుతుంటే ఏవో తుంటరి ఆలోచనలు, కనీసం మగాడు మామిడి టెంకె చీకినట్టో నాకినట్టో ఒక ad తీస్తే మీ సొమ్మేం పోతుంది. తేరగా దొరికాడు మగాడు. 

ఇన్సూరెన్సు  చేసుకుని చచ్చిపోయి కుటుంబాలకి అండగా నిలబడే ads లో కూడా మగాడే, ఏ ఆడది ఇన్సూరెన్సు తీసుకోదా ? ఏది అమ్మాలన్నా మగాడే, మగాడి శరీరమే అవసరం. ఇంక అమ్మాయిల చేతిలో మగాడు వెర్రి పుష్పం అయే వాణిజ్య ప్రకటనలు ఎన్నో. చివరికి మగాడి చెమట కంపుతో కూడా వ్యాపారమే, అది కూడా కండల మాగాడి చెమట కంపుతో. ఈ ప్రకటనల కోసం కండలు పెంచి పెంచి వాటి కోసం అడ్డమైన టాబిలెట్లు ప్రోటీన్ డ్రింకులు  మింగుతూ ఆరోగ్యం పాడు చేసుకుంటున్న యువకులు ఏమైపోతారో, ఏమైపోతున్నారో ?  

ఇక సినిమాల్లో మగాడి పరిస్థితి మరీ ఘోరం, అన్నీ వాడే చేయాలి హీరోగా, కండలు పెంచాలి మక్కెలిరగ తన్నాలి, హీరోయిన్ ని  ఎత్తాలి దించాలి పడుకోబెట్టాలి, స్లో మోషన్ లో పరిగెత్తాలి, ఇక వాళ్ళు ప్రేక్షకుల ఆనందం కోసం చేసే డాన్స్ విన్యాసాలు చూసి కడుపు తరుక్కుపోతుంది. అంతా మగాడి అంగాంగ విశృంఖల ఎక్సప్లోయిటేషనే . 

సిగరెట్లు మందు తాగి నాశనం అయిపోయేది కూడా మగాడేనా? ఏం వాళ్ళు తాగటం లేదా ? 

“ ఈమె పేరు కమల, సిగరెట్లు తాగి తాగి ఈమెకి పెదాల కాన్సర్ వచ్చింది” అని అసహ్యమైన పెదాల ad ఒకటి చేయొచ్చుగా. 

మీ సెక్స్ శక్తి  సామర్ధ్యానికి ఈ బిళ్ళలు వాడండి అనే ప్రకటనలైతే గుచ్చి గుచ్చి బాధపెడతాయి, ఆ “పాడు సైట్లు” అయితే మరీ ఘోరం, “మీది మిరపయంత ఉందా మేము సొరకాయంత చేస్తాము మా టానిక్ తాగండి చాలు ” అనే యాడ్స్ ఎంతటి మానసిక క్షోభకి గురిచేస్తాయంటే, లేత మగ హృదయాల మీద అవి ఎంత ప్రభావం చూపిస్తాయి ? మగాడి మర్మాంగాన్ని కూడా వదలని వ్యాపార ధోరణి. మగాడి జుట్టు, గడ్డాలు, మీసాలు, పళ్ళు,కళ్ళు, భుజాలు,కండలు, ఎదలు,పొట్టలు, ఆకులు, తొడలు…..ఇలా అన్నీ వ్యాపారమేనా? లక్షల కోట్ల వస్తువుల అమ్మకాలకి మగాడి శరీరం కేవలం వ్యాపార వస్తువేనా….? 

ఎంత చించుకుని రాసినా  వాగినా తీరే వ్యధ కాదిది, ఇదొక “అంతులేని కథ”….    

నా రాత నచ్చితే కింద qr code ఉంది, buy me a drink or coffee bro 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *