PRATIDWANDI

నేను చూసిన Ray రెండో సినిమా PRATIDWANDI (1970), మొదటిది Nayak (1966). ప్రతిద్వంది చూసాక మాకు Ray  కి కొన్ని similarities కనపడ్డాయి, దరిద్రం, లిఫ్టులు, రోడ్లు, సిటీ, స్నేహితులు అన్నిటికన్నా ముఖ్యంగా సిగరెట్లు, ఎన్ని సిగరెట్లో, ఎక్కడ పడితే అక్కడ కాల్చేస్తుంటారు.(ఇలా మేము తీసిన వాటిని సత్యజిత్ రే లేదా ఇంకెవరైనా great directors సినిమాలతో పోల్చినపుడు కొంతమందికి కాలుతుంది చూడండి, భలే ఇష్టం నాకు అది, కావాలనే చేస్తుంటా ఇలాంటి పనులు) 

  తండ్రి చనిపోయాక మెడిసిన్ ఆపేసి హీరో ఉద్యోగం వెతుకులాట తో మొదలవుతుంది సినిమా. హీరో అంటే ప్రధాన పాత్ర, heroic గా ఏమి చేయడు, సాధారణమైన వ్యక్తే హీరో ఇక్కడ. టైటిల్స్ లో వచ్చే సిటీ బస్సు సీన్ ఇప్పటికీ ఏ సిటీ లో తిరిగేవాడైన relate చేసుకోగలుగుతాడు. Ray  అంతకుముందు సిన్మాలకన్నా ఈ సినిమా visual స్టైల్, ఎడిటింగ్ చాలా కొత్తగా ఉంటుందని, దీనికి కారణం ఫ్రెంచ్ న్యూ వేవ్ సినిమా ప్రభావం అని కొన్ని రివ్యూస్ లో రాసారు. 

హ్యాండ్ హెల్డ్ షాట్లు, చీకటి రోడ్లలో షాట్లు, సిటీ జీవితపు షాట్లు అన్నీ నాకూ రోహిత్ కి చాలా ఇష్టమైనవి. మేము తీసినంత Handheld గానీ City shoots గానీ గత రెండు దశాబ్దాల్లో ఏ దర్శకుడు తీసి ఉండడు అని గర్వంగా కాదు వినమ్రంగా చెప్పగలను.  నిరుద్యోగ నటులు చేసాక చాలా రోజులుగా నన్ను పట్టి పీడిస్తున్న ఆలోచన ఒక నిరుద్యోగి కథ సినిమాగా తీయాలని. ఉద్యోగం, ఎంత అవసరం మనిషికి, రాబోయే ఉద్యోగం మీద ఆశలు, అనుకున్న ఉద్యోగం దొరకని నిరాశ , అసలు ఉద్యోగమే దొరకని నిస్పృహ అదీ మధ్యతరగతి కుటుంబమైతే ఇక అంతా ఉద్యోగమే. అలాగని రాళ్లు ఎత్తటం, మట్టి తవ్వడం, ఆటోలు నడపటం ఇలాంటివి చేయలేడు మధ్యతరగతి జీవి, ఖచ్చితంగా కనీస గౌరవ పూర్వకమైన ఉద్యోగం దొరకాలి, తను నివాసం ఉంటున్న  ఊర్లోనే దొరకాలి,జీతం బాగుండాలి, ఆ ఉద్యోగం చూపించి పెళ్లి చేసుకోవాలి సెటిల్ అయిపోవాలి…ఇంకా ఎన్నో ఒక ఉద్యోగం చుట్టూ… ప్రతిద్వంది అంతా అదే….

రోజూ సర్టిఫికెట్స్ పట్టుకుని తిరగటం, ఫ్రెండ్ రూంకి వెళ్లి కాసేపు గడిపి నాలుగు సిగరెట్లు తాగి మళ్ళీ ఇంటికి రావడం. విధవరాలైన తల్లి, revolution అంటూ తిరిగే తమ్ముడు, మంచి ఉద్యోగం చేసుకునే ‘అందమైన’ చెల్లి. తన చెల్లికి ఉద్యోగం రావటంలో క్వాలిఫికేషన్ తో పాటు అందం కూడా కారణం అనేది చెప్పి చెప్పకుండా ఫ్రెండ్ కి చెప్తాడు హీరో ఒక సీన్లో. “అంతులేని కథ” గుర్తొస్తుంది చెల్లి పాత్ర చూస్తుంటే, (ఖచ్చితంగా ఈ సినిమా నుంచే బాలచందర్ కి ఐడియా వచ్చి ఉంటుంది అనేది రోహిత్ గట్టి నమ్మకం) హీరో కూడా రజనీకాంత్ లాంటివాడే, పిచ్చి తాగుడు, భార్య పిల్లలు ఉండరు కానీ నిరుద్యోగి. ఒక ఇంటర్వ్యూ సీన్ లో “ఆకలి రాజ్యం” గుర్తొస్తుంది, బాలచందర్ ని influence  చేసి ఉండొచ్చు ఈ సినిమా. 

Hero తలనొప్పిగా ఉందని మెడికల్ షాప్ లోనే టాబ్లెట్ వేసుకుని వెళ్లి సినిమాహాల్లో కూర్చునే సీన్ చూస్తుంటే Martin Scorsese “Taxi Driver” (1976) సీన్ లానే అనిపించింది, హీరో సీట్లో కిందకి జారటం, Travis Beckle కూడా అలానే జారతాడు. Scorsese సత్యజిత్ Ray  కి పెద్ద fan. ఎందుకు జరుగుతుందో తెలియదు సినిమా మధ్యలో థియేటర్లో చిన్న బాంబు పేలుడు, అందరూ కంగారుగా బయటకొచ్చేస్తారు, దీన్ని చూడగానే rgv సత్య సీన్ గుర్తొచ్చింది. ఎన్ని గుర్తొస్తాయో …. 

హీరో మందు తాగేసి  తాగేసి ఇంటికి నడిచి వెళ్తుంటే ఒక ఇంట్లోంచి అమ్మాయి పిలుస్తుంది, పరిచయం లేని అమ్మాయి,  fuse పోయిందని, ఇంట్లో ఎవరూ లేరని కాస్త fuse  వేస్తారా అని అడిగితే , ఆ పని చేసి చేతులు కడుక్కున్నాక  హీరోని  కూర్చోమని చెప్పి నిమ్మరసం ఇస్తుంది , ఇది కొంచెం ఓవర్ గా ఉంది, ఈ “modern” డైరెక్టర్లు ఏది అనుకుంటే అది చేసేస్తారు ఏంటో అనుకుంటున్న టైంలో ఆ అమ్మాయి చెప్తుంది, నేను మిమ్మల్ని ఈ రోడ్డులో చాలా రోజులగా చూస్తున్నా, మనిద్దరం ఒకే స్కూల్ కి  వెళ్ళాము అని ఇలా ఏదో కబుర్లు కలిపి ఫ్రెండ్స్ అయిపోతారు…just  beautiful…

నిరంతర సంఘర్షణ, జరుగుతున్న జీవితానికి తను కోరుకుంటున్న జీవితానికి, చెల్లికి బాస్ తో ఎఫైర్ ఉంది కాబట్టే అంత మంచి జీవితం అని,విప్లవం అంటూ తిరిగే మాట వినని తమ్ముడు, ఆలోచించడం కన్నా అనుకున్నది చేయటమే ముఖ్యం అనుకునే మిత్రుడు, వీటి తో పాటు తను ప్రేమించే కలకత్తా నగరం…వదిలి వెళ్ళలేడు…చివరికి ఏం జరుగుతుందంటే…

వీలైతే చూడండి… మంచి సినిమా…కాదు చాలా powerful cinema   

ఒక సినిమాలో ఎన్ని జీవితాలో….