Konkana Sen Sharma

“Iti Mrinalini” అనే బెంగాలీ సినిమా చూస్తున్నంత సేపు నాకు కొంకణ చాలా బాగా తెలిసిన వ్యక్తిలా అనిపించింది. 2010 లో వచ్చిన ఈ సినిమా, అపర్ణ సేన్ డైరెక్ట్ చేసింది, యంగ్ ఏజ్లో ఉండే కథలో కూతురు కొంకణ చేస్తే, ఓల్డ్ ఏజ్లో అదే కారెక్టర్ అమ్మ, డైరెక్టర్ అయిన అపర్ణ చేసింది. ఇదొక ఊమెన్ సెంట్రిక్ సినిమా, చిన్నప్పటి నుండి పెద్దగా అయ్యే వరకు ఉండే ఆక్ట్రేస్ కథ. చాలా బోల్డ్ గా ఉండే కొన్ని సీన్స్ (అంటే 10 సంవత్సరాల ముందు చూసిన సినిమా, అప్పటికి అవే ఘోరమైన బోల్డ్ సీన్స్ అనిపించే ఏజ్), పబ్లిక్గా మాట్లాడుకునే విషయాలు చాలా కొత్తగా, అమ్మో అనిపిస్తే ఇంకో పక్క కొంకణ. నాకు పర్సనల్గా తెలిసిన అమ్మయికేనా ఇన్ని విషయాలు జరుగుతున్నాయి, ఇదంతా ఒకత్తే ఎలా డీల్ చేస్తుంది అని లోలోపల ఫీల్ అవుతూ చూసి, ఇప్పటి వరకు ఎప్పుడు ఈ సినిమా గుర్తొచ్చిన పర్సనల్గా ఫీల్ అవ్వడం వెనకాల కొంకణ ఫన్టాస్టిక్ పెర్ఫార్మెన్స్ కారణం అని అప్పుడు తెలీదు.

అప్పటి నుండి ఎప్పుడు కొంకణ కనిపించినా, అది తను ఆక్ట్ చేసిన సినిమా అయినా, ఇంటర్వ్యూ అయినా, తనే డైరెక్ట్ చేసిన సినిమా, షార్ట్ అయినా చూడాలనిపిస్తుంది. సినిమాలో ఏది బాగున్న బాగుండకపోయినా కొంకణ ఉంటే చాలు, బాగుంటుంది అని నమ్మే హార్డ్ కోర్ ఫ్యాన్స్ టైప్స్.

అందుకే, “lipstick under my burkha” కూడా ఫస్ట్ డేనే చూసా జస్ట్ ఆమె కోసమే. కానీ కొంకణతో పాటు రత్న పాతక్ ఫ్యాన్ గా theatre లోపల నుండి బైటికొచా. కొంతమంది పెర్ఫార్మెన్స్ ఎప్పటికీ మర్చిపోలేము, ఏదైనా సరే సింపుల్గా చింపేసే టాలెంట్, appearance చాలు వాళ్ళ సినిమాలు చూడడానికి.

దానిలో భాగంగా మొన్న Lust stories వచ్చే పది పదిహేను రోజుల ముందు నుండే ట్రైలర్, తిలోతమ షోమ్ ఇంటర్వ్యూస్, కొంకణ మేకింగ్ పిక్చర్స్, ఇవ్వని చూస్తూ కచ్ఛితంగా చూడాల్సిందే అనుకుంటునే, మళ్ళా అబ్బా “Lust Stories” లో హార్డ్లీ ఒకటి రెండు షార్ట్స్ కన్నా ఇంకేం ఇంటరెస్టింగ్గా ఉండవు, ఓకే లాస్ట్ టైం లాగా మొత్తం చూడకుండా ఓన్లీ కొంకణ షార్ట్ చూదాము అనుకున్న. ఈ సారి డబుల్ ధమాకా తిలోతమా షోమ్ కోసం కూడా. ఉన్న అతి తక్కువ ఆడ లెజెండ్ యాక్టర్స్లో తీలోతమ ఒకరు, “Monsoon Wedding” లో Alice కారెక్టర్ చేసి భూమి ఉన్నంత వరకు తనని మర్చిపోకుండా చేసింది. రోజూ Insta లో తిలోతమ పెట్టే ఫొటోస్, lust stories వస్తుంది , వస్తుంది, వచ్చేస్తుంది అని రిమైండర్లలా పనిచేశాయి.

ఎట్టకేలకు చూద్దామా వద్దా అనే డైలమా, అసలే పెద్దగా happening ఏమి లేదు అనే ఒకరకమైన disappointment లో ఇలాంటి బేకార్ సినిమాలు చూసి మూడ్ ఇంకా ఖరాబ్ చేసుకునే ధైర్యం, ఓపిక ఏమి లేవు. అందుకే సినిమాలు చూడాలంటే భయమేస్తుంది. కానీ ఏం చేస్తాం ఏమైనా కొత్తగా రిలీజ్ అయితే ఏమైనా exciting factors ఉంటే చూడకుండా ఉండలేము. అదొక weakness.

సరేలే, విల్ ట్రై అని చూడడం స్టార్ట్ చేశా, డైరెక్ట్గా ఫస్ట్ షార్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి. పేరు పడింది, ఎలాంటి expectations లేవు, జస్ట్ తిలోతమని మోడర్న్ రోల్లో చూడాలనే కోరిక, అండ్ కొంకణ డైరెక్షన్ తప్పా.

ఫస్ట్ ఫ్రేమ్ నుండే తనకు నచ్చినట్లు ఉంది ఎలా అంటే అలా తీయొచ్చు సినిమా అనే ఫీలింగ్. PC Sreeram cinematography. Straight గా సోది లేకుండా కథలోకి వెళ్ళింది. డీప్ గా వెళ్ళే అంతా టైం అండ్ స్కోప్ కూడా లేదనుకోవచ్చు. 30 minutes short లో మొత్తం కథ చూపించాలి అనే ఆతురత లేదు, ఎక్సాక్ట్లి కథ అంతే ఉండాలేమో అనిపించింది.
దరిద్రాన్నికి ఎప్పుడు తిలోతమ ఎవరింట్లోనో పనిమనిషి కారెక్టర్లే చేస్తుంది, అవే ఇస్తారు. సినిమాలో బాగా సక్సెస్ఫుల్ maid. మొదటిసారి ఇంటి ఓనర్ కారెక్టర్ ఇచ్చి స్టీరియోనీ బ్రేక్ చేసింది కొంకణఅనుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ చూస్తూంటే వెంటనే సర్ప్రైజ్.

అబ్బా, ఇంటి యజమాని అయితే ఎంటి దరిద్రపు గొట్టు మొగుడికి పెళ్ళాం రోలా ఇప్పడు? ఇదేం దరిద్రం తిలోతమకి అనిపించింది. lust stories అనగానే మళ్ళీ ఇంట్లో పెళ్ళాం/గర్ల్ ఫ్రెండ్ లేని టైమ్లో బాయ్ ఫ్రెండ్/హస్బెండ్ ఇంకో అమ్మాయితో అఫైర్, ఇంతకన్నా బేసిక్ ప్లాట్ దొరకదా మనోలకి, సరే నడుస్తుంది. ఏం చేస్తాం, నడవని అనుకున్నా, “అసలు ఈమెకి ఇవి తప్ప ఇంకేం ఇవ్వార?” యాంగిల్ ఎక్కువ నడుస్తుంది లోపల.

హమ్మయ్య, థాంక్స్ గాడ్. లేదు లేదు, హస్బెండ్ కాదని తెలిసి మళ్ళీ కాసేపు relaxed. ఇంట్లో పనిమనిషి, ఓనర్ లెన్నప్పుడు సైలెంట్గా ఇలాంటివి నడుపుతుంది అనుకున్న. సినిమాలో ఒకదాని తర్వాత ఒక సర్ప్రైజ్, అసలు ఎంత ఎంజాయి చేస్తున్నానో చెప్పడం కష్టమే. అదంతా పక్కన పెడితే ఇద్దరు actress “నువ్వా నేనా” రేంజ్లో పెర్ఫార్మెన్స్ ఇస్తుంటే అసలు తట్టుకోలేకపోయా. ఈ సినిమాలో కాస్టింగ్ ఒక పెద్ద achievement, maid husband character చేసిన అతను కూడా సింపుల్ అండ్ intense.

ఈ సారి మళ్లీ lust stories అనగానే అమ్మాయి అబ్బాయి మధ్యలో కథ కాకుండా కాస్త ముందుకెళ్ళి ఇంకేవేవో కూడా ఉంటాయి కదా, అవి కూడా ఈ కేటగిరీ కిందకే వస్తాయి అని బ్రిలియంట్గా రాసుకుంది కొంకణ. Visually సినిమా చాలా సింపుల్, fascinating and very very interesting. Single shots లో చాలా surprising elements మీద కాన్సంట్రేట్ చేశారు. స్టోరీ బేస్డ్, సింపుల్ కథ. బొంబాయిలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అనిపించే కథ. చాలా వరకు వైల్డ్ గా ఇమాజిన్ చేసుకొని ఇంట్లో ఆడ పని మనుషులు మేల్ ఓనర్ల తో, మోగ పని వాళ్ళు ఇంట్లో ఉండే సెక్సీ ఆంటీలతో అఫైర్లు కామన్.

మా భూమి సినిమాలో Sai Chand పనికోసం తన సొంతూరు వదిలి ఇంకో ఊర్లో ఒక రిచ్ ఇంట్లో పనికి కుదురుకుంటాడు, బాగా డబ్బులున్న ఏజ్ ఓల్డ్ uncle వైఫ్ ఎవరు లేని టైంలో Sai Chand నీ మొలేస్ట్ చెయ్యడానికి ట్రై చేసి, తను ఒప్పుకోకపోతే ఇంట్లో నగలు, డబ్బులు దొంగతనం చేశాడు అని cruel గా బిహేవ్ చేసి మొగుడితో Sai Chand నీ పనిలో నుండి ఫైర్ చేయించి తన కోపాన్ని, ఇగోనీ satisfy చేసుకుంటుంది. ఒక పక్క ఇదైతే, ఇలాంటి ఈగో ట్రిప్పింగ్ అయితే ఇంకో వైపు casualty ఒకటి. రెండు రెండు రకాలు. ఇలాంటివి ఇప్పటికే 50-60 సంవత్సారాల నుండి Indian/foreign సినిమాలో చూసి చూసి, మళ్ళీ వచ్చిన చూస్తూనే ఉంటాం. కొత్తేమీ లేదనుకున్న మళ్ళా చూస్తూనే ఉంటాం, సబ్జెక్ట్ మాటర్ అలాంటిది, ఎప్పటికీ పాత పడనిది.

కానీ ఇప్పుడున్న exposure కి, ఆల్రెడీ చాలా బైట దేశాల సినిమాలో రకరకాల సెక్స్ exploitation లు, bisexuality, లస్ట్ స్టోరీస్ బోల్డ్ గా, మోడర్న్గా తీస్తున్న టైంలో మనం ఇంకా, కింక్ అని ఫీల్ అవుతూ మనేజర్, ఓనర్, హాస్పిటల్లో నర్సు, డాక్టర్ స్టోరీలు, లేకపోతే “హిట్లర్” లాంటి తెలుగు కుటుంభ సమేతంగా చూసే సినిమాలో కూడా టీచర్ అండ్ స్టూడెంట్ కింకులు, ఇలాంటివి వస్తూనే ఉన్నాయి, ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. ఇంతకు మించి ముందుకు వెళ్ళే వీళ్ళే లేదులే అనే సిట్యుయేషన్లో ఉన్నట్టు ఉంది పరిస్తితి.

అలాంటి ఓల్డ్ స్టోరీస్ మధ్యలో వచ్చిన కొత్త స్టొరీ కొంకణ లస్ట్ స్టోరీస్లో ఒక స్టోరీ. మనం చాలా సినీ బఫ్స్ మనం ఇలాంటివి ఎప్పుడో చూసేసాం, ఇదేమైన కొత్తా? అవ్వని ఓకే, తెలుసులే. బాగా తెలిసిన మొహాలు పెట్టి సింపుల్ గా లస్ట్ కాన్సెప్ట్ మీద కొత్త టాపిక్స్ ఎంచుకోవాల్లన్నా, సినిమాలు చెయ్యాలన్నా, చూడాలన్నా ఒక రకం ఇబ్బంది, చాలా opposition ఉంటుంది ఇన్ఫ్యాక్ట్(సినిమాలు చేసే వాళ్ళకి, అందులో ఆక్ట్ చేసే వాళ్ళ గురించి)

Loneliness, ఎంతటి గొప్పదో. ఏమైనా explore చెయ్యొచ్చు అనిపించే ధైర్యం, సాహసం చేసే ఒక చాన్స్, ఫ్రీడమ్, ఎవరు జడ్జ్ చేసే వాళ్ళు ఉండరు అనే కంఫర్ట్ ఫీలింగ్, అసలు ఒక విషయాని దాచల్సిన అవసరం లేకపోవడం దానితోపాటు ఘోరమైన డిజైర్..అదే కథ. ఇదొక adult స్టోరీ, ఏ లస్ట్ స్టోరీ అయినా adult స్టోరీనే అనిపిస్తుంది. కానీ ఇది adult adult స్టోరీ, అంటే! అంటే adult స్టోరీనే . లోన్లీగా ఉన్నపుడు, explore చెయ్యలనిపించే విషయాలో sexuality ఒకటైతే, సెల్ఫ్ indulgence ఇంకొకటి. కేవలం సెక్స్ కోసమే అయితే ఇంకో వ్యక్తిని పెద్దగా Compatability బాగలేకున్న ఎలా భరిస్తాము అనుకున్నే వాళ్ళు ఎక్కువగా experience చేసే everyday డిజైర్లో నుండి వచ్చిన కథ లాంటిది ఈ సినిమా.

ఒక unexpected విషయం నుండి మెల్లిగా కోలుకొని, దాని ఎంజాయి చెయ్యడం, రోజు అది చేయాలనిపించడం, excitement ఇంకేం కావాలి. ఒక ఇద్దరు మన కళ్ళ ముందు సెక్స్ చేసుకుంటుంటే చూసి షాక్ అయ్యి, అది అసలు ఎలాంటి ఫీలింగో కూడా అర్ధం కాకుండా ఉండి, కానీ దాని వల్ల ఏదో ఒక కమ్ఫర్ట్. ఒకరకమైన ఇన్నర్ calmness, అదే కిక్ ఇస్తుంది, high ఇస్తుంది అని అర్థం అయ్యి సీక్రెట్గా ఇద్దరినీ రోజు వాళ్ళ పర్సనల్ స్పేస్లో చూస్తూ, వెట్ అవ్వడమే ఈ కథ. దీనికి తప్పు ఒప్పుల మోరల్ క్వెషన్స్ అనవసరం. పూరిలీ సెక్సుయల్ అండ్ ఫిజికల్.

ఇలాంటి సెన్సిబుల్ కంటేంట్నీ ఎంత sensible గా డీల్ చెయ్యాలో, తీసే వాళ్ళకి అందులో ఆక్ట్ చేసే వాళ్ల sensibilities ఎలా ఉంటే వర్క్అవుట్ అవుతుందో , మిగితా క్రూ ఫీలింగ్స్ ఏంటో? అండ్ ఒక ఆక్టర్ కొంచం అటు ఇటు గా చేసిన మొత్తం వైబే మారిపోయే chances ఎక్కువ. ఏమో, personally ఎంత fascinating అయినా ఎరోటిక్ చెయ్యడం, డీసెంట్ గా అచీవే చెయ్యడం సింపుల్ విషయమేమి కాదు అనిపిస్తుంది.

ఓనర్, పనిమనిషి మధ్యలో ఉండే రిలేషన్షిప్, ఒకర్ని ఒకరు అర్థం చేసుకునే ఓపిక, పైగా అలా ఒకరు మనని చూస్తుంటే వాళ్ళకి వచ్చే మజా, ఒకరు చూస్తున్నారు అని తెలిసి ఎక్కువ ఎరోటిక్ గా ఫీల్ అయ్యి సెక్స్లో పాల్గొనడం ఇంకోటి. ఈ రెండు కారెక్టర్లని చాలా matured గా, బ్యూటిఫుల్ గా రాసుకుని డైరెక్ట్ చేసిన కొంకణ, చాలా మోడర్న్ అండ్ బ్రిలియంట్ ఫిల్మ్ మేకర్..

బేసిక్గా కాసేపు sexuality పక్కన పెడితే, కామన్గా ఇద్దరి వ్యక్తుల మధ్య ఉండే హెల్తీ రిలేషన్షిప్, ఒకరి గురించి ఇంకొకరికి ఎమైన వాళ్ళ పర్సనల్ విషయాలు తెలిశాక బైటికి నార్మల్ గా బిహేవ్ చేసే దాంట్లో ఉండే డిఫరెన్సస్ ని ట్రీట్ చెయ్యడం క్రేజీ, అండ్ ఇంటరెస్టింగ్ పాయింట్ టు డూ ఈట్.

ఇలాంటి situations లో, అదే సీన్లో ద్ప్రైవాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ ప్రైవేట్ స్పేస్లో కి మూడో వ్యక్తి వచ్చి, వాళ్ళు కూడా involve అయ్యి, ఎక్సయిట్ అయ్యి రొటీన్ three some లాగా మార్చకపోవడం, personally నాకు బాగా నచ్చిన విషయం.

Luxury apartment లో ఉండే రిచ్ పీపుల్ Vs బస్తీలో ఒక రూంలోనే డజన్ మంది ఫామిలితో ఉండే చిన్న చిన్న పనులు చేసుకునే coupleకి ఉండే ప్రైవసీ ఇష్యూస్. ఇంట్లో అంతమంది ముందు పర్సనల్ గా husband తో టైం స్పెండ్ చెయ్యలేక, ఫీలింగ్స్ అణిచి వేసుకోలేక, హోటల్ రూంస్ అఫ్ఫోర్డ్ చేయలేని పరిస్తితిలో, ఫ్రీ గా దొరికే ప్రైవసీ స్పోటస్ వెతుకోవడం తప్ప ఏమి చేయలేని ఒక horny couple కథ.

ఒక మంచి అపార్ట్మెంట్లో పని చేస్తు, ఓనర్ లేనప్పుడు ఇంటి కీస్ ఉంటే వాటిని హ్యాపీగా వాడుకుంటూ, మధ్యానం హస్బెండ్ నీ అక్కడికి రమ్మని పిలిచి ఇద్దరు రొమాన్స్ చేసుకుంటు హ్యాపీగా సాగిపోతున్న వాళ్ళ సెక్సువల్ లైఫ్లో అనుకోకుండా ఒక మధ్యానం ఓనర్ ఇంటికి వస్తుంది, ఇంకో కీ తో డోర్ ఓపెన్ చేస్తే opposite mirror మీద తన బెడ్ మీద ఆమె పనిమనిషి ఎవరితోనో సెక్స్ చేస్తూ కనిపించే ఇమేజ్ తిలోతమ వల్ల కాదు. ఘోరమైన షాక్, అదే excitement కూడా. ముందు ఆక్సెప్ట్ చెయ్యలేదు, తన బెడ్ మీద ఇంకెవరో అలా, ఒక పొజిషన్లో, ఎలా? డైరెక్ట్ గా అడిగేదాము, మాట్లాడుదాం అనుకుంటుంది ఆమెతో, కానీ ఇబ్బంది. అంటే కనీసం నేను ఇలా చూశాను మీమల్ని, అని ఎలా చెప్పాలో కూడా అర్థం కాని ఇబ్బంది.

ఇంకో పక్క, maid ఇలా ఓనర్ లేనప్పుడు బ్రిల్లైంట్ గా ఇల్లు వాడుకుంటూ prostitution(paid) చేస్తోంది డబ్బులు కోసం అనుకున్న. కాసేపటికి, రోజుకో కొత్త వ్యక్తి కాదు, ఒకరే రోజు వచ్చి వెళ్తుంటాడు అని ఇంకో understanding. అపార్ట్మెంట్ వాచ్మన్ ఏమో. అదే ఇద్దరు అఫైర్ నడుపుతున్నారు అనుకున్న. అసలు ఇదెంత casual అలోచన, ఇది ఇలా జరగడం చాలా కామన్ విషయమే కథ అనిపిస్తుంది చూస్తునంత సేపు . ఓనర్ అమ్మాయి కాబట్టి అఫైర్ లేదు కానీ అదే అబ్బాయి అయితే అతనితో ఉండేదేమో, మోస్ట్లి.

Lust stories part 1 లో, జోయా అక్తర్ కథ అదే, భయ్యా భయ్య అంటూ పిలుస్తూనే, ఇంటి ఓనర్, bachelor తో అఫైర్ నడుపుతుంది భూమి. తనకి అది ప్రేమ, owner గాడికి జస్ట్ సెక్స్. అసలు విషయం reveal అయినప్పుడు వచ్చే ఆవేశం, బాధ, అసహ్యం సర్వ సాధారణం, నమ్మి మోసపోయిన పనిపిల్ల లస్ట్ స్టోరీ అది.

ఈ సినిమాలో అంత స్కోప్ లేదు కాబట్టి డబ్బుల ఇబ్బందికి ఇలాంటిదేదో వర్కౌట్ చేస్తుంది అనిపించింది. అయినా సరే అది ఒకరితోనే అయినా రోజుకో కొత్త మనిషి అయినా సంబంధం లేదు. తిలోతమకి మెల్లిగా అదే నచ్చుతుంది, తనకి అది హార్నీగా అనిపిస్తుంది అని రియలైజ్ అయ్యి సైలెంట్ గా వాళ్ళని వాళ్ళ పని చేసుకొనిస్తు, తిను తిన పని చేసుకుంటుంది, రోజు.

ఓనర్ అయిన తిలోతమ, maid అయిన అమృత ఇద్దరికీ తెలుసు. తన ఇల్లు వాడుకుంటుంది అని తిలోతమ, నా హస్బెండ్ తో నేను ఎంత వైల్డ్ గా ఉంటే అంత ఎంజాయి చేస్తుంది ఓనర్ అని రియలైజ్ అయ్యి సూపర్ ఎక్సయిట్ అవుతూ సైలెంట్ గా హిస్బండ్ తో కూడా చెప్పకుండా ఎంజాయ్ చేస్తున్న maid, రోజు ఇద్దరికీ ఇద్దరు వాళ్ళ సెక్సువల్ నీడ్స్ తీర్చుకుంటున్నారు. ఇద్దరికీ అది కొత్త excitement, ఏదో చెప్పలేని కొత్త ఫీలింగ్ అండ్ immense pleasure. Almost ఎండింగ్ దాకా హస్బెండ్కి తెలియదు ఇలా ఓనర్ కి విషయం తెలుసని, అది తన వైఫ్ కూడా తెలిసే చేస్తుంది అని.

ఆ కింక్ ఇద్దరికీ ఉంది కాబట్టి ఇద్దరూ సైలెంట్ గా ఎంజాయ్ చేస్తున్నారు, ఒకరోజు అనుకాకుండ విషయం బైట పడుతుంది. అప్పుడు ఈ ఇద్దరు ఆడ వాళ్ళు చేసే పెర్ఫార్మెన్స్ ఇస్ థ బెస్ట్. మోస్ట్ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్.

చాలా సెన్సిబుల్గా, యెట్ ఎరోటిక్గా సినిమా తీయడం అంటే చాలా challenging విషయమే, ఇలాంటివి ఇంకా వస్తాయి అనుకుంటున్న.

నాలుగు కథలో ఇది మాత్రం బ్యాడ్ ఆస్, మిగితావన్ని ఓల్డ్ రొటీన్ పోర్న్ షార్ట్స్ లాంటివే. నథింగ్ న్యూ, నథింగ్ ఇంటరెస్టింగ్. Make your Sunday night more thrilling and erotic with this brilliant 30 mins film.

Love you more Konkana!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *