హరి రెబెల్

పొద్దున్నే లేచిన ఐదు నిమిషాలకి తెలిసింది హరి చనిపోయాడని, విన్న వెంటనే shock, mind blank అయిపోయింది, ఏడుపు కూడా రాలేదు. ఎవరయినా చనిపోయినపుడు నేనెప్పుడూ ఇలా రాయలేదు, ఇప్పుడు కూడా ఎందుకు రాస్తున్నానో తెలియదు. 

నేను ఎవరయినా చనిపోయినపుడు చూడటానికి వెళ్ళను, చివరిసారి వాళ్ళని ఎలా చూసానో అదే గుర్తుండాలి, అందుకే హరిని చూడటానికి హాస్పిటల్ కి వెళ్ళలేదు. హరి పరిచయమై బాగా క్లోజ్ అయి సంత్సరం కూడా అవలేదు. ఒక నాటకంలో చూసాం, చాలా బాగా చేస్తున్నాడు, interesting face & voice. ఖచ్చితంగా తనతో character చేపించాల్సిందే అనుకున్నాం, గోపీ గాళ్ళ గోవా ట్రిప్ లో one scene character చేసాడు, చాలా ఈజీగా చేసేసాడు. హరి నుంచి మేము ఏం expect చేసామో అది exact గా deliver చేసాడు. Next ఏం చేసినా పెద్ద role చేపించాల్సిందే, ఇలాంటి actors తో పని చేయడం చాలా happy గా ఉంటుంది. నిరుద్యోగ నటులు 2 లో పెద్ద role అనుకున్నాం, తన look ఏంటి character ఎలాంటిది అన్నీ discuss కూడా చేసేసాం. 

Coolest person Hari, ఎప్పుడు కలిసినా నవ్వు మొహంతోనే కనిపిస్తాడు, “కీడా కోలా” లో మంచి role చేసానని, తరుణ్ భాస్కర్ చాలా compliments ఇచ్చాడని, ఖచ్చితంగా మంచి break అవుతుందని చాలా hope తో ఉన్నాడు. 

ఈరోజే తెల్సింది తనకి ఏవో health issues ఉన్నాయని, డబ్బులు వచ్చినపుడు treatment తీసుకోవాలని అనుకుంటున్నాడని. నాకు కలిసే actors కి ఎప్పుడూ చెప్తుంటా, మీరు healthy గా strong గా ఉండాలిరా ఏ సినిమాలో ఏం చేపిస్తారో తెలియదు, fit గా ఉండండి, మీ healthy లుక్కే మీ investment అని. Health discipline లేని నేను ఇలా చెప్పడం జోక్ గా అనిపించొచ్చు but వాళ్ళకి చెప్పడం నాకు నేను చెప్పుకోవడం కూడా. 

ఎప్పుడు అవకాశం వస్తుందో తెలియని actors life చాలా భయంకరంగా ఉంటుంది, వాళ్ళు realize అయేలోపు depression లో కూరుకుపోయి health పాడయిపోయి, సరిగ్గా తినీతినక, మందు సిగరెట్ల వైపు drift అయిపోయి, industry వదలి వెళ్ళలేక నలిగిపోతుంటారు. ఇంకో వైపు ఏదో రకంగా health maintain చేసుకుంటూ workouts చేస్తూ మందు సిగరెట్ అలవాటున్నా control లో ఉంటారు, ఇలా maintain చేయడం అంత easy కాదు. 

కరోనా lockdown ease అయ్యాక గిరి అనే actor friend call చేసాడు వాళ్ళ ఊరి నుంచి, తనొక struggling actor, “అన్నగారూ కొన్నేళ్ళు ఇండస్ట్రీ వదిలేసి రియల్ ఎస్టేట్ లోకి దిగుతున్నా,, రెండేళ్ళకి సరిపడా savings set చేసుకుని మళ్ళీ industry లోకి వస్తా, మీ అభిప్రాయం తెలుసుకుందామని కాల్ చేసా” అని చెప్పాడు, “fantastic decision giri, చాలా మంచి practical plan నీది, all the best” అన్నాను. Real estate లోనే ఉన్నాడు ఇంకా, industry కలలు మాత్రం వదల్లేదు. 

అవకాశం వస్తే డబ్బులొచ్చే పనులు చేయండి actors, మీ life చాలా కష్టమైనది, health పట్టించుకోండి, నేనూ పట్టించుకుంటా, మనం కలిసి పని చేద్దాం. Mental గా stress feel అవుతున్నప్పుడు friends దగ్గరకి వెళ్ళి chill అవండి, మంచి cinema చూడండి music వినండి. Stress చంపేస్తుంది. 

ఇలాంటివి జరిగినపుడు మన చేతుల్లో ఏం లేదు అనిపిస్తుంది, చేయగలిగినంత చేద్దాం health పరంగా. చెప్పడం ఈజీనే move on from hari death అని, time పడుతుంది. మన జీవితాల్లోకి హరి లాంటి వాడు వచ్చి వెళ్ళిపోయాడు, వాడి memories తో బతికేద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *