పన్నెండు రోజుల్లో

“నిరుద్యోగ నటులు” పది ఎపిసోడ్లు పన్నెండు రోజుల్లో తీసాం, titles అన్నీ తీసేసి film cut చేస్తే రెండు గంటల యాభై నాలుగు నిమిషాలు. Crazy కదా, nearly 30 locations, close to 90 actors small or big roles లో, ఇంకా crazy కదా. అంత తక్కువ రోజుల్లో తీసామన్న విషయం మాకూ late గా తెల్సింది, మేమే surprise అయ్యాం. ఐదున్నర లక్షల్లో అలాంటి content produce చేయడం మామూలు విషయం కాదు, వేరే ఎవరైనా చేసున్నా నేను ఇదే మాట అనేవాణ్ణి, great job అని. Definite గా మేము ఆ విషయంలో చాలా proud గా ఫీలవుతాం, శీష్ మొహల్ తో మొదలైన మేము better అవుతూ వస్తున్నాం indie filmmaking లో. ఇంకా easy గా ఎలా తీయొచ్చు అనే దాంట్లో expertise పెంచుకుంటూ వస్తున్నాం.

నిరుద్యోగ నటులు shoot లో ఒక్క location కి rent కట్టలేదు, ఇద్దరు ముగ్గురికి తప్ప ఎవ్వరికీ remuneration ఇవ్వలేదు, ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేని పరిస్థితి. Cameraman Shashank కి రోజుకి 7500/- ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదు.

“ఆకలి రాజ్యం” సినిమా కథ ప్రస్తుత film industry నేపధ్యంలో జరిగితే అనే idea ని చాలా బాగా achieve చేసాం. Story Discussion తర్వాత మాకు అంతకన్నా ఎక్కువ fans ని ఇచ్చింది నిరుద్యోగ నటులు. ఇప్పటి వరకు మేము తీసిన వాటిలో most dramatic fiction ఇదే అనిపిస్తుంది నాకు, కొంచెం melodramatic కూడా. దాని వల్లే అంతమందికి నచ్చిందేమో, you see audience want that drama.

First five episodes నేను, మిగతా five episodes rohit direct చేసాం. ఇదొక interesting process, mostly ఇద్దరం location లో ఉంటాం, discuss చేసి improvise చేస్తుంటాం. నేనొక solid setup చేసి వదిలేస్తే rohit దాన్ని ఇంకొక level కి తీసుకెళ్ళాడు. “నువ్వు తీసిన episodes చాలా powerful గా ఉంటాయి శశి” అంటాడు rohit, yes i agree with him.

మేముద్దరం విడివిడిగా సినిమాలు గానీ shorts గానీ తీస్తే making styles చాలా different గా ఉంటాయి అని నా feeling. నేను చాలా simple secure easy shooting ఇష్టపడతా, వీలైనంత fun element ఉండేలా తీస్తా, అది ముదిరితే లేకి fun కూడా అవుతుంది ఎక్కువ takes కూడా చేయను, shot composition decision కూడా నాది చాలా quick. నేనొక restless filmmaker ని. Rohit completely opposite, shot composition కి time తీసుకుంటాడు, తను అనుకున్నది వచ్చేదాకా try చేస్తాడు, కొంచెం adventurous ఉంటుంది తన shoot. Rohit ఒక peaceful filmmaker, తీసేది బాగా రావాలి ఆ తర్వాతే next shot or scene గురించి ఆలోచిస్తాడు, late అవుతున్నా దాని వల్ల budget పెరిగినా don’t care, నేనేమో కక్కుర్తిగా ఉన్న టైము డబ్బుల్లో అయిపోవాలని ఆరాటపడుతుంటా.

నేను location లో ఉన్నా రోహిత్ ని కెలకను, మొదట్లో ఆ దూల బాగా ఉండేది, మెల్లిగా తగ్గింది ఆ ఆరాటం. ఒక brain చాల్లే మనం chill అవుదాం అని enjoy చేస్తుంటా. అప్పటికీ ఆపుకోలేనివి చెప్పేస్తా నచ్చితే తీస్తాడు లేదా అదెందుకు work out అవదో చెప్తాడు, ఈ youth తో కష్టమనుకుని పక్కకెళ్ళి సిగరెట్ అంటించుకుంటా.

నిరుద్యోగ నటులు ఇద్దరం విడివిడిగా తీసినా చాలా seamless గా ఒక్క డైరెక్టరే తీసినట్టుంటుంది, దానికి కారణం నేను establish చేసిన setup and characters, rohit పక్క దారి పట్టకుండా నా making తో influence చేసా😎 you see iam a ప్రభావిత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *