Aite

ఈ సినిమాకి నాకూ ఉన్న కనెక్షన్ గురించి ఒకట్రెండు ఇంటర్వూల్లో మాట్లాడాను. కెమెరామాన్ సెంధిల్ 2001 నుంచి ఫ్రెండ్, రెగ్యులర్ గా మా రూంకి వస్తుండేవాడు. నా రూమ్మేట్ సర్వేష్ మురారి అప్పుడు JNTU fine arts college లో ఫొటోగ్రఫీ కోర్స్ చేస్తుండేవాడు, సెంధిల్ పరిచయంతో “అమృతం” సీరియల్ కి తన అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాడు. (అనుకోకుండా ఒకరోజు, విక్రమార్కుడు DoP sarvesh) నేను అప్పుడు Ad & corporate films కి పనిచేసేవాణ్ణి. ‘ఐతే’ మొదలవుతున్న టైంలో సర్వేష్ నన్ను అడిగాడు “ఈ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేస్తావా” అని, చేస్తా అన్నాను, next day చంద్రశేఖర్ ఏలేటి తో మీటింగ్. నాకు suit అవుతుందా లేదా అనే ఆలోచన లేకుండా భుజాల దాకా జుట్టు పెంచిన రోజులవి. చందు నన్ను ఏదో అడిగాడు నేను ఏదో చెప్పాను, తను కన్విన్స్ అవలేదు, తను ఇంకేదో చెప్పాడు నేను కన్విన్స్ అవలేదు. ఎక్కువసేపు ఏం జరగలేదు మీటింగ్, సాయంత్రం సర్వేష్ రూంకొచ్చి “ఆయనేం అడిగాడు నువ్వేం చెప్పావ్” అని అడిగాడు, అంతా చెప్పాను. “ఏమన్నా చెప్పేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడవయ్యా” అని క్లాస్ పీకుతుంటే, నేను చందుతో మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు నాకు అనిపించింది చెప్పాను అని ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నా. “సరేగాని రేపట్నుంచి ఆఫీసుకొచ్చేయ్” అన్నాడు, ఇంక నా సినీ ప్రస్థానం మొదలైనట్టే అనుకున్నా, మూడోరోజు తీసేసారు నన్ను, కారణం నా నోటిదూల, జీతం విషయంలో నాకు అనిపించింది టంగు స్లిప్పు అయ్యా, నా attitude నచ్చక తీసేసారు. అప్పుడు నేను మాట్లాడిన మాటలు కరెక్టే అని ఇప్పటికీ ఫీల్ అవుతా.

తీసేసినందుకు నేనేం పట్టించుకోలేదు, నాకు చేసుకోగలిగినంత పనుండేది, డబ్బులొచ్చేవి, నెలకి పది రోజులు పని చేస్తే చాలు. నేను ఐతే కి జాయినయినపుడు హను రాఘవపూడి & అమర్ నా కొలీగ్స్. మూడు రోజులే అయినా మంచి ఫ్రెండ్స్ అయ్యాము. ఐతే షూటింగ్ మొదలైంది, సర్వేష్ నుంచి రెగ్యులర్ అప్డేట్స్ తెలిసేవి, అప్పుడప్పుడు హను & అమర్ కలిసేవాళ్ళు. అందరూ కొత్తవాళ్ళే ఆ సినిమా actors & technicians, ఆ విషయం నాకు చాలా exciting గా curious గా ఉండేది. ఎందుకంటే నేనూ అలానే సినిమా తీయాలి అని ఆలోచన్లు ఉండేవి. అనుకున్న దానికన్నా షూటింగ్ రోజులు పెరిగాయి బడ్జెట్ పెరిగింది ఐతే కి. చందు గురించి బాగా డిస్కషన్స్ అయేవి, తన అస్సలు compromise అవని making style మీద చాలా విన్నా, సినిమా మీద ఇంకా ఇంట్రస్ట్ పెరిగిపోయింది నాకు.

సినిమా రిలీజు రోజు, సుదర్శన్ 70mm లో మార్నింగ్ షో, విపరీతమైన జనం, సినిమా టీం అంతా వచ్చారు, వాళ్ళ families & friends, థియేటర్ గోలగోలగా ఉంది. అన్నిరోజులుగా పరిచయం ఉన్న సెంధిల్ కెమెరా వర్క్ చూడాలన్న ఆత్రుత ఒకవైపు. సినిమా మొదలైంది, మొదటి ఫ్రేమ్ నుంచే stun అయిపోయా. “అన్ని సినిమాలూ ఒకలా ఉండవు” అని పోస్టర్ మీద వేసేంత గట్స్ ఉండాలంటే ఆ సినిమా ఎలా ఉండాలి ? ఐతే అలా ఉంటుంది, తెలుగులో నేను అప్పటివరకు అలాంటి image చూడలేదు, అంత కొత్తగా ఉంటుంది సినిమా. సెంధిల్ నా ఫ్రెండ్ అని గర్వంగా feel అయిన moment. మెల్లిగా మొదలైన నవ్వులు అరుపులు రచ్చరచ్చగా మారిపోయాయి, సినిమా ఎంత కొత్తగా ఉందో అంతే entertaining గా ఉంది. నాకు గుర్తున్నంత వరకు మార్నింగ్ షో నుంచే blockbuster.

ఒక్క శివాజీరాజా తప్ప తెలిసిన మొహం లేదు, experienced technicians లేరు, అయినా magic create చేసింది ఐతే team. First cinema కొత్తగా ఏదన్నా చేయాలి అనే తాపత్రయం ప్రతి frame లో కనిపించిన సినిమా ఐతే.

అలాంటి సినిమాకి పని చేయడం మిస్ అయినందుకు నేను ఫీల్ అయ్యానా అంటే లేదు నేను అలా ఫీల్ అయే టైపు కాదు.