Blogరాతలు

2015 లో అనుకుంట నేను నవతరంగం అనే website లో blogs రాయడం మొదలుపెట్టింది, వెంకట సిద్జారెడ్డి run చేసేవాడు. నా facebook పోస్టులు చూసి, మా website కి రాయచ్చు కదా, ఇంకా చాలా మంది రాస్తున్నారు అని నన్ను encourage చేసాడు. సరే try చేద్దాం అనుకుని వాళ్ళ blogs చదివా, ధైర్యం వచ్చింది, ఈ మాత్రమయితే నేనూ రాయగలను అనుకుని మొదలుపెట్టా. చెలరేగి పోయా, రాసుడే రాసుడు, ఏమనిపిస్తే అది రాసేసా. Almost 30+ articles రాసుంట, next post ఎప్పుడు అన్నా అని అడిగే fans తయారయ్యారు, వాళ్ళలో కొందరు మా friends అయ్యారు, ఇంకొందరు మేము తీసేవాటికి నిర్మాతయ్యారు. ఇప్పుడా website available లేదు, orchive.org లో కొన్ని దొరకొచ్చు. 

2020లో నా Facebook పోస్టులకి ఒక వ్యక్తి  fan అయి, “కలవచ్చా అన్నా” అని messenger లో message పెట్టి, నన్ను కలిసి, friend అయిపోయి, మూడేళ్ళలో ఆప్తమిత్రుడైపోయి అవంతిలో భాగమైపోయాడు. ఇప్పటికి మా మీద 35-40 లక్షలు ఖర్చుపెట్టాడు, మా మూడు productions కి producer, వ్యక్తిగత అవసరాలకి డబ్బులిస్తుంటాడు. నేను తీసినవి ఏవీ చూడలేదు కేవలం నా రాతలకి impress అయి ఇవన్నీ చేసాడు. త్వరలో మేమిద్దరం ఒక  సినిమా చేయబోతున్నాం. అతని పేరు cinema theatres లో చూస్తారు. లాభమో నష్టమో నా రాతలు తను enjoy చేస్తుంటాడు తన కంపెనీ నేను enjoy చేస్తుంటా. 

ఇంకొంతమంది చిన్నచిన్న donations చేస్తుంటారు. నేను రోహిత్ తో అంటుంటా “ఇంత కష్టపడి సినిమాలు తీసేకన్నా ఇలా రాసుకుంటూ donations తో మా camp లో బతికేయొచ్చేమో” అని. మరీ ఎక్కువేం రావు కానీ అప్పుడప్పుడు surprising గా ఒక amount పడుతుంది “చూసావా రోహిత్ నా కష్టార్జితం” పోసులు కొడుతుంటా. 

ఇప్పుడు రాతల్లో మార్పు “ no offensive writing” నాకు ఎవ్వరి మనోభావాలు దెబ్బతీయాలని లేదు, i want my writings to be fun reads. రాసేటప్పుడు నాకు fun అనిపించాలి చదివేవాళ్ళకి same అనిపించాలి అదే నా intention. Social media వదిలేయటానికి కారణం అదే, చేయాల్సినంత రచ్చ చేసాను ఇక చాలు అనిపించింది. Wild kid లా కాకుండా good boy image కి మారే ప్రయత్నం.  రోజుకొక్కటి రాయాల్సిందే అని మొదలై ఇప్పుడు కొంచెం slow అయ్యాను. 

నేను రాయటం మొదలుపెట్టడానికి కారణం, writing habit అయి అదే ఊపులో నేనొక script రాయాలి అనే ఉద్దేశంతో. మేమొక రెండు కోట్ల సినిమా చేసే దిశగా వెళ్తున్నాం, నిర్మాత అంత పెట్టాలంటే పూర్తి script ఉండాలి. మేము కూడా రాబోయే రోజుల్లో ‘రాసిన సినిమాలు’ తీయాలనుకుంటున్నాం. Script రాయటం fun అనుకుంటే ఫన్ను pain అనుకుంటే పెయిను. నేను pain నుంచి fun కి transform అవుతున్నా, మా రాబోవు సినిమాకి రాయడం మొదలుపెట్టా. 

నన్ను “ఎలా రాయాలండి” అని అడుగుతుంటారు, రాస్తూ ఉండండి రోజూ అని చెప్తుంటా. నాకైతే కెమెరాతో రాయడమే ఇష్టం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *