ఆవారా కొడుకులు

“పనీపాట లేని గాలికి తిరిగే సన్నాసి కొడుకు & వాడి ఫ్రెండ్స్” చిన్నప్పట్నుంచి ఎన్ని సినిమాల్లో చూడలేదు ఇలాంటి ఆవారా హీరోని,ఎన్ని తీసినప్పటికీ ఎప్పటికీ అలాంటి కథలు వస్తూనే ఉంటాయి. చక్కగా చదువుకుని ఉద్యోగం చేస్తూ అమ్మానాన్నలని పట్టించుకుంటూ, అక్కకి పెళ్లి చేసి, చెల్లిని చదివించే హీరో కథ లో ఏముంటుంది?అంత పద్దతైనోడు అమ్మాయిల వెంటపడడు, మందు సిగరెట్ తాగడు, బూతులు మాట్లాడడు, టైంకి నిద్రపోతాడు, పొద్దున్నే లేచి యోగా చేస్తాడు, ఏముంది దీంట్లో so boring. హీరో ఎంత పనికిమాలిన వాడైతే అంత fun ఉంటుంది, అలా పనికిమాలిన వాడు interval bang తో మారిపోయి విలన్లని ఎముకలు విరిగేట్టు ఎగరేసి కొడితే వచ్చే ఆనందం ఎంత బాగుంటుంది.

గత ఇరవై ఏళ్లలో ఇలాంటి “తిట్టే తండ్రి తిట్టుంచుకునే కొడుకు” సినిమాలు కుప్పలుతెప్పలు వచ్చాయి, జనాలకి నచ్చినవి చాలానే ఉన్నాయి. ఇది young ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయే point అని చాలా మంది filmmakers నమ్ముతారు లేదా వాళ్ళ జీవితాల్లో కనిపించిన ఎవరైనా యువకుడి కథ అయుండొచ్చు లేక ఆ దర్శకుడి కథే కావచ్చు కూడా. నేను first day ఇడియట్ సినిమా చూసి వీడేం హీరో, అమ్మాయి వెంట పడి teasing చేస్తూ ప్రేమిస్తావా లేదా అని భయపెడుతూ, తన చెల్లిని ఎవడో గిల్లితే మాత్రం హర్ట్ అవుతాడు అనిపించింది, సినిమా నచ్చలేదు కూడా. అదే heroism అంటే అని నా ఫ్రెండ్ నాకు బాగా క్లాస్ పీకాడు, సినిమా blockbuster, నా ఒపీనియన్ ఏం మారలేదు దాని వల్ల. అన్ని సినిమాల్లో అంతే కదా హీరో హీరోయిన్ ని ఏమైనా చేయొచ్చు, సీక్రెట్ గా నిద్రపోతున్న టైంలో ఆమె ఒంటి మీద tattoos వేయొచ్చు, ముద్దు పెట్టొచ్చు, అదే విలన్ చేస్తే నరికేస్తారు.

ఆవారా కొడుకుల కథల్లో ఆ ఫ్రెండ్స్ మరీ ఏబ్రాసి వెధవల్లా ఉంటారు ఎందుకో? ముఖ్యంగా లుక్కులో, హీరో ఒక్కడు handsome, ఇవి చూసిచూసి నాకు విసుగొచ్చి, “హీరో ఫ్రెండ్స్” అని సెటైరికల్ సినిమా తీద్దాం అని కూడా అనుకున్నా, క్లైమాక్స్ లో హీరో ఫ్రెండ్స్ handsome హీరోని కుక్కని కొట్టినట్టు కొడతారు. నేను చాలా మంది young actors ని కలుస్తుంటా కదా, ఏం చేస్తున్నావ్ అంటే, “ఏముందన్నా హీరో ఫ్రెండ్ character” అని చాలా నిస్పృహగా చెప్తారు. హీరో రేంజ్ ని బట్టి హీరో ఫ్రెండ్స్ కి ఎంత screen space దొరుకుతుంది అనేది ఆధారపడి ఉంటుంది. కొంతమంది పరిస్థితి అయితే ఘోరం, 100 రోజులు హీరో ఫ్రెండ్ గా చేసి, ఆ సినిమా నాకేమన్నా హెల్ప్ అవుతుందేమో అని రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటారు, తీరా రిలీజ్ అయ్యాక సినిమాలో ఎక్కడో ఒక చోట మాత్రం కాస్త కనపడతారు.

కొడుకులు మారినా తండ్రులు మారరు, కోట శ్రీనివాసరావు ఎంతమంది కొడుకుల్ని తిట్టుంటాడో? మనకి ఆ age group actors చాలా తక్కువ దొరుకుతారు, ఇంక ఒక్కసారి తండ్రి రోల్ చేసి హిట్ అయితే ఇంక వరసపెట్టి అవే roles వస్తాయి, కాకపోతే కొంచెం తిట్లు మారతాయి. ఇప్పటికీ పెద్ద మార్పేమి లేదు కానీ, తెలంగాణ తండ్రులు వస్తున్నారు, ఇది కొంచెం refreshing, కానీ వాళ్లకి కూడా రొటీన్ అవే roles వస్తున్నాయి. ఈ ఆవారా కొడుకుల సినిమాల్లో mostly తల్లులు కొడుకుని గారాబం చేసేవాళ్ళే, ఎందుకంటారు?

నేను కూడా ఒక మారిపోయే ఆవారా కొడుకు కథ రాసాను, పవన్ రమేష్ హీరో ఆ సినిమాలో, ఇంకా screenplay డైలాగ్స్ రాయలేదు, అది కూడా అమ్మాయి వెంటపడే హీరో కథే సుమా, కొత్తగా ఏం ఆశించొద్దు. First నువ్వు తియ్యి బ్రో అంటారా, అలాగే బ్రో అంటా నేను. చూద్దాం మా ఆవారా కొడుకు ఎలా ఉంటాడో !

నా రాత మీకు నచ్చితే కింద qr code ఉంది కొట్టగలిగినంత కొట్టేయండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *