Agantuk (1991)

ఉత్తరం మీద closeup షాట్,  

“ఎవరి నుంచి” ఒక మేల్ వాయిస్ 

ఒకామె చేతిలో ఉత్తరం “handwriting ఎవరిదో తెలియడం లేదు” అని వెనక్కి తిప్పి చూస్తుంది ఎవరి నుంచో అని, “M.Mitra”

ఆమె భర్త న్యూస్ పేపర్ చదువుతూ “మీ ఇంట్లో వాళ్ళ నుంచే అయి ఉంటుంది”

“నాకు మిత్రా అనేవాళ్ళు ఎవరూ తెలియదు” అంటూ ఆమె ఉత్తరం ఓపెన్ చేస్తుంది చదువుతుంటే, పనివాడు టీ తెచ్చి భర్త పక్కన టీపాయ్ మీద పెట్టి వెళ్ళిపోతాడు. భర్త పేపర్ చదవటం ఆపి “ఇంతకీ ఎవరి నుంచి” అని ఆమెని అడుగుతాడు, చదువుతున్న ఆమె మోహంలో చిన్న ఆందోళన లాంటి expression, ఆమె అలానే చదువుతుంటే బయట చదువుకుంటున్న కొడుకు వచ్చి “ఎవరి నుంచి అమ్మా” 

మొహం మీద heavy expression తో ఆమె కుర్చీలో కూర్చుంటుంది,  

“అందులో ఏమన్నా దుర్వార్త ఉందా” 

అని అడుగుతాడు భర్త, ఆమె

 “తెలియదు” 

అంటుంది, భర్త ఆశ్చర్యపోతాడు.  

ఇంతకీ ఆ ఉత్తరంలో ఏముంది ఆమె ఎందుకు అంత ఆలోచనలో పడిపోయింది? తెల్సుకోవాలంటే సినిమా చూడండి.  

 కొన్ని రోజుల క్రితం ray సినిమా చూసి చాలా రోజులైంది ఏదో ఒకటి చూద్దాం, కనీసం ఇంటర్వ్యూ అయినా  చూడాల్సిందే అనుకుని youtube లో వెతుకుతుంటే ఈ సినిమా దొరికింది, Agantuk. చాలా మంచి copy, వెంటనే చూడటం మొదలుపెట్టా. 90% ఫిలిం ఒక ఇంట్లోనే జరుగుతుంది.చిన్న కథ. ఇది మనందరం experience చేసే  ఉంటాం, ఇంటికి ఇష్టంలేని చుట్టమో చుట్టాలో  వస్తున్నాము అని ఉత్తరం రాస్తే, వాళ్లకి ఏమి చెప్పలేక, రావద్దనలేక, వచ్చాక పడే ఇబ్బందులు, కానీ ఆ ఇబ్బంది ఫీలింగ్స్ లోపలే దాచుకుని బయటకి బాగున్నట్టు ఆనందంగా ఉన్నట్టు నటించడం లాంటివి జరుగుతుంటాయి.  అలాంటిది 20-25ఏళ్లుగా  దేశదిమ్మరిలా ఇల్లొదిలి దేశాలు పట్టి తిరుగుతున్న మేనమామ ఉత్తరం రాసి నేనొస్తున్నాను అంటే ఎలా ఉంటుంది? అతను వచ్చాక ఏం జరుగుతుంది? అసలు అతను మేనమామేనా ?ఈ చిన్న ఐడియా కి  మిస్టరీ లాంటిది జోడిస్తే అదే ఈ సినిమా కథ. తను  రాసిన  ‘అతిధి’ అనే షార్ట్ స్టోరీ ని సినిమా చేసేసాడు ray, చిన్న కథుంది కమాన్ సినిమా తీసేద్దాం అని రెడీ అయిపోవటం, అది సినిమా పిచ్చంటే. 

ఆ మేనమామ పాత్రని reveal చేసే సీన్ ఉంటుంది, హీరో introduction range లో ఉంటుంది. సినిమా జరుగుతున్నంతసేపూ మనమూ ఆ ఇంట్లో ఉంటాం, ఆ పాత్రల దైనందిన జీవితంలో భాగమవుతాం, ఇంతకీ ఆ మేనమామ నిజంగా చుట్టమా కాదా? సినిమా చూస్తున్నంతసేపు ఇదే curiosity. మంచి నటులు సంభాషణలు, హడావిడి లేని ప్రశాంతమైన సినిమా. క్లైమాక్స్ లో ఆనందంతో నా కళ్ళలోంచి నీళ్లు జలజలా కారిపోయాయి, నేనంతే ఊరికే ఏడుస్తా. 

Film LInk 

Agantuk || The Stranger 1991 Full bengali Movie 1080p Satyajit Ray’s Film – YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *