మూడు సినిమాలు

మా చేతిలో ఇప్పుడు మూడు పూర్తైన సినిమాలు ఉన్నాయి, శీష్ మహల్ 5.1 మిక్స్ కూడా అయిపోయింది, 3GT & Double Engine లకి అదొక్క పనే మిగిలి ఉంది. ఈ పదేళ్లలో మా “VICTORYYYYYY” ఇది, తెలంగాణ తో పాటు మేమూ పదేళ్ల పండగ చేసుకునే సమయం ఇది. ఈ మూడు సినిమాలు కాక ఇంకెంత చేసామో మా గురించి తెల్సిన వాళ్లకి చెప్పనక్కర్లేదు. ఎంత మ్యూజిక్ సృష్టించామంటే, ఇది కదా “NEW AGE MUSIC” అని మేము గర్వపడే దశాబ్దం ఇది. వివేక్ సాగర్ మొదటిసారి తన సినిమా/web series పాటలతో EXT లో concert చేస్తే 18 పాటల్లో 6 పాటలు మావే, jam packed అయిన ఆ బార్ లో వివేక్ “మన అవంతి సినిమా” అనగానే bar burst అయింది జనాల అరుపులతో. ఒక ఇండిపెండెంట్ ప్రొడక్షన్ హౌస్ పేరు విని అంత అరిచారంటే, మామూలు విషయం కాదు, it’s a dream like scene. మీ పాటలు viral అయిపోవాలి మార్కెటింగ్ చేయొచ్చు కదా ఇంకా popular అవుతారు అని చాలా మంది సలహా ఇచ్చారు, మార్కెటింగ్ మాకు రాదు చేసే వాళ్లకి మేము డబ్బులు ఇవ్వలేం, popularity మాకెప్పుడూ priority కాదు, ఏదో ఒకటి తీసుకుంటూ పోవడమే మాకు ముఖ్యం. మా music directors కూడా అలాంటిదేం కోరుకోరు, అవంతి సినిమా కి మంచి music ఇవ్వాలి అని మాత్రమే అనుకుంటారు.

ఇలా ఇంకెంత కాలం అంటే, జరిగినంత కాలం. మీరు కొంచెం కమర్షియల్ గా ఆలోచిస్తే తెలుగులో sensational directors అవుతారు అన్న వాళ్ళు ఉన్నారు, అవునా? ఏమో మాకు అంత confidence లేదు, మా commerciality ఇంతే. 28 ఏళ్ళ వయసులో నాకు commercial cinema ఒక్క phone call away, నేను నోరు తెరిచి అడగాలే కానీ ఏదో ఒక భారీ సినిమాకి join అవొచ్చు, నేనడగలేదు. When i was 25, దాసరి నారాయణరావు దగ్గర చేస్తావా అని ఒక ఫ్రెండ్ అడిగాడు, చేయను బాసు అన్నాను, ఏం చూసుకుని నీకు అంత బలుపు? అని అడిగాడు వాడు, బలుపు కాదు బాసు, ఆయన దగ్గర ఎంత సీనియర్స్ ఉంటారు ఎంత పెద్ద టీం ఉంటుంది, నేనక్కడ ఏం నేర్చుకోగలను ? అని జవాబిచ్చా, వాడు బలుపనే ఫిక్స్ అయిపోయాడు. దాన్ని ఇంకోసారి నిజం చేసా, సురేష్ వర్మ దగ్గర offer తీసుకొచ్చాడు, చేయను అన్నాను, ఎందుకు అంటే, అప్పటికే నేను అతని debut “మృగం” చూసాను, bad film, very bad film, అలాంటి director తో నాకు పని చేయాలని లేదు. మావాడు నాకు “బలుపు శశి” అని నామకరణం చేసాడు. Rgv దగ్గర పని చేసి ఆయన style ని ape చేసే ప్రయత్నం workout అవలేదు, కానీ పాతికేళ్లకే దర్శకుడవటం సురేష్ వర్మ achievement. ఇలా బానే chances వచ్చేవి, ఒక point లో వీడు చేయడు అని అందరూ ఫిక్స్ అయిపోయారు. So నాకు భారీ కమర్షియల్ సినిమా వైపు వెళ్లాలని ఎప్పుడూ లేదు, low budget సినిమాలే చేస్తా, అవి అద్భుతాలు చేయకపోయినా పర్లేదు, మరీ దారుణమైన loss లు తేకపోతే చాలు. అలా చిన్న సినిమాలు చేస్తూ, వచ్చే డబ్బులతో దేశమంతా bike వేసుకుని తిరిగేద్దాం అనుకున్నా, కానీ అలా జరగలేదు, కనీసం ఒక బైక్ కూడా కొనలేకపోయాను. No regrets all happies, అనుకున్న సినిమా తీసుకుంటూ బతికేస్తున్నా.

మరిప్పుడు ఎక్కడున్నాం? ఇదిగో ఈ మూడు సినిమాలని బయటకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం, శీష్ మహల్ ott లకి నచ్చలేదు, no issues, మాకు తెల్సు అది మీకు నచ్చదని. నాకు ఎవరన్నా magical గా ఐదు లక్షలు ఇస్తే బాగుండు, శీష్ మహల్ ని కనీసం హైదరాబాద్ ప్రేక్షకులకైనా చూపిస్తా, ఇలాంటి కలల్లో బతుకుతుంటా. నా మొదటి సినిమా కదా ఆ మాత్రం ప్రేమ ఉంటుంది.
ఏం జరగకపోతే మా సొంత platform ఉంది, అక్కడ పెట్టుకుంటాం శీష్ మహల్ ని.
“Double Engine” OTT news ఈ నెలలో బయటకి రావచ్చు, కానీ మాకు అది థియేటర్స్ లోకి వస్తే బాగుంటుంది అనే ఆశ ఉంది, ఆ landscape ని ఆ music ని big screen మీద experience చేస్తే అది మ్యాజిక్కే. Violence లేదు, vulgar పాటల్లేవ్, కానీ బూతులున్నాయి, censor కి వెళ్తే అవి mute అవొచ్చు. A certificate ఇచ్చినా పర్లేదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో పది థియేటర్స్ లో అయినా రిలీజ్ అయితే చాలు అని చిన్ని కోరిక.

“గోపీగాళ్ళ గోవా ట్రిప్” theatrical గా రిలీజ్ చేయాల్సిందే అనే ఉద్దేశంతో తీసాం, ఆ పరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇద్దరు భారీ నిర్మాతలని approach అయ్యాం, వాళ్ళ reply కోసం ఎదురుచూస్తున్నాం. వాళ్ళు మా సినిమా చూసి నచ్చి distribute చేస్తాం అంటారేమో అని పెద్ద ఆశ, అలా జరగొచ్చు జరగకపోవచ్చు. కానీ ఈ మూడు సినిమాలు ఈ సంవత్సరం బయటకు వస్తాయి అని మా నమ్మకం.

అవంతి సినిమా ని దరిద్రం పట్టుకున్నప్పుడల్లా మేము పోరాట యోధుల్లా తిరగబడి, కొత్త సినిమా plan చేస్తాం. మళ్ళీ peak దరిద్రంలో ఉన్నాం, ఇప్పుడు మా ఆశలన్నీ ఈ మూడు సినిమాల మీదే.

పదేళ్ళ అవంతి పండగ చేసుకోవటానికి డబ్బుల్లేవ్ కింద లింక్ క్లిక్ చేసి “pay as you wish” బ్రో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *