నాకెప్పుడూ ఒక “డ్రీమ్ రిలీజ్” ప్లాన్ ఉండేది, ఒక మల్టిప్లెక్స్ స్క్రీన్ & ఒక సింగిల్ స్క్రీన్ లో “శీష్ మహల్” సినిమా రిలీజ్ చేయాలని. చాలా సింపుల్ రిలీజ్, ఒకవేళ మంచి టాక్ వస్తే షోలు పెరుగుతాయి, లేదా రెండు స్క్రీన్ల ఖర్చుతో బయటపడిపోవచ్చు. ఇలా “అండర్ డాగ్ రిలీజ్” అయ్యి హిట్లు సంచలనాలు అయిన సినిమాలలో నాదీ ఒకటవుతుందనే పిచ్చి ఫాంటసీ కూడా ఇంకో కారణం. శీష్ మహల్ తో ఆ కోరిక తీరుతుందని కలలు కంటూ కంటూ ఇంకేం కంటాలే అని, అయినప్పుడు అవుతుంది, అయితే అవుతుంది లేకపోతే లేదు అనే జోన్ లోకి వచ్చేసాను. ఇది వైరాగ్యపు zone కాదు, very practical zone. రెండు మూడేళ్ళ క్రితమే థియేటిరికల్ రిలీజ్ మీద ఆలోచనలు ఆపేసా, డిజిటల్ రిలీజ్ చాలు, హ్యాపీస్ & ఫుల్ పీస్.
ఇలా గడచిపోతున్న మా లైఫ్ లోకి శీష్ మహల్ రిలీజ్ ఆఫర్ వచ్చింది, 2021 లో, ఈ ఊహించని పరిణామానికి ఉక్కిరిబిక్కిరి అయు, ఉత్సాహంగా ఐదు ప్రైవేట్ స్క్రీనింగ్స్ వేసాం, అన్నీ హౌస్ఫుల్సే. నచ్చిన వాళ్ళు మాతో చాలాసేపు మాట్లాడారు, కొందరు హగ్గులిచ్చారు, నచ్చని వాళ్ళు సైలెంట్ గా వెళ్ళిపోయారు, మేజర్ గా పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. మా ఫ్రెండ్స్ & ఫ్యాన్స్ నుంచి వచ్చిన రియాక్షన్స్ కన్నా అస్సలు పరిచయం లేని వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా హ్యాపీగా అనిపించింది. మా సినిమాని నగేష్ కుకునూర్ కి చూపించడం is most memorable.
కానీ ఆ రిలీజ్ ప్లాన్ వర్కౌట్ అవలేదు, మినిమం 20 స్క్రీన్స్ అన్నారు, ప్రమోషన్ కి బడ్జెట్ అన్నారు, ఇవేవీ మా వల్ల అయే పని కాదు అని, మా ఉత్సాహాన్ని చంపేసుకుని మళ్ళీ కొత్తవి తీసుకుంటూ పోయాం.
ఈ సంవత్సరం రవీంద్రభారతి లో జరిగిన స్క్రీనింగ్ అతి పెద్ద సర్ప్రైజ్, నిలబడటానికి కూడా చోటు లేనంత ఫుల్ అయిపోయింది, 90% ఆడియెన్స్ కొత్తవాళ్లు. ప్రతి స్క్రీనింగ్ కి ముందు ఎప్పుడూ ఉండే టెన్షనే ఆరోజు కూడా, సగం థియేటర్ అయినా నిండుతుందా అనుకుంటూ చాయ్ సిగరెట్ తాగి వచ్చేసరికి, నేను లోపలికి వెళ్ళడానికి కూడా gap లేనంత మంది వచ్చేసారు. మామూలు ఆనందం కాదది, ఇంటర్వెల్ కి సగం మంది ఉన్నా చాలు అనుకుంటే సినిమా అయేవరకు ఎవ్వరూ కదల్లేదు.
సినిమా అయిపోయాక Q & A సెషన్ లో ఈ సినిమా ఎలా జరిగిందో మాట్లాడాను, ఉజ్వల్ కశ్యప్ అనే ఫ్రెండ్ వాళ్ళ అమ్మని తీసుకొచ్చాడు, ఆమె లేచి మాట్లాడుతూ “నేను రిటైర్డ్ జడ్జిని అండీ, చాలా బాగుంది మీ సినిమా, పాత హైదరాబాద్ ని మళ్ళీ చూసినట్టు ఉంది” అన్నారు ఆవిడ, yes అదే నేను కోరుకున్నది, “శీష్ మహల్” లో హైదరాబాద్ ఒక పాత్ర, పాత జ్ఞాపకాలని గుర్తు చేసే పాత్ర. ప్రతి స్క్రీనింగ్ తర్వాత ఇలా సిటీ గురించి మాట్లాడినవాళ్లు చాలా మందే ఉన్నారు. కొన్ని రోజులు social media లో మా tagline అదే, “NEVER SEEN HYDERABAD ON SCREEN”. ఈ స్క్రీనింగ్ తర్వాత మళ్ళీ రిలీజ్ మీద ఆశ పుట్టింది.
ఇంత fancy & flashy భారీ సినిమాలు చూస్తున్న జనాలకి ఇలాంటి సినిమా ఎక్కుతుందా అంటే, ఎవరికి తెల్సు ఏ సినిమా ఎక్కుతుందో లేదో, సినిమా రిలీజ్ ఎప్పుడూ జూదమే. ఇప్పుడైతే ఒక్క ప్రసాద్ multiplex లో ఒక్క షో తో రిలీజ్ అయితే చాలు అని నా ఫీలింగ్. Particular గా ప్రసాద్స్ ఎందుకంటే, శీష్ మహల్ లో ఉండే నాలుగు కథల్లో ఒక కథకి ఆ multiplex తో లింక్ ఉంది, అందుకే అక్కడ ఒక్క చోటైనా విడుదల అయితే అది మాకు ఒక పెద్ద achievement లాంటిదే.
చూద్దాం, ఏం జరుగుతుందో, ప్రస్తుతానికి నా కోరిక తీరే miracle day వస్తుందనే ఆశతో బతికేయడమే.