కాళోజి రాసిన ఈ పుస్తకం చాలాసార్లు చదవాలి అనుకున్నా, చాలారోజులు నా రూమ్లో నాకు అందుబాటులో ఉన్నా చదవలేదు. కొన్ని పుస్తకాలు సినిమాలు అంతే, షెల్ఫుల్లో హార్డ్ డిస్కుల్లో ఉండిపోతాయి. కనీసం ‘నేనా పుస్తకం చదివేను అని గొప్పలు చెప్పుకోవడానికో, ‘నువ్వా పుస్తకం చదవలేదా’ అని ఎవరినైనా అడగటానికో అయినా చదువుదామనుకున్నా చదవలేకపోయా. ఒక చిన్న కవితల పుస్తకం మాత్రం చదివా, పేరు గుర్తు లేదు.
కానీ నాకు ఈ పుస్తకం తెలియడం కన్నా ముందు “మన కాళోజి” చూసా, డాక్యుమెంటరీ. ఇక్కడ నా ఏడుపు ఒకటి, అదేంటంటే,
“సినిమా మరీ డాక్యుమెంటరీ లాగుంది బాసు”
కొంచెం రియలిస్టిక్ గా కనిపిస్తే చాలు,
“అమ్మో చూడలేం,డాక్యూమెంటరీలా మరీ దరిద్రంగా ఉంది”
ఇలా “డాక్యుమెంటరీ” అనే పదాన్ని చాలా derogatory పదంగా వాడుతుంటారు మనవాళ్ళు. నేను మరీ ఎక్కువ కాకపోయినా documentaries బానే చూసాను, చూస్తుంటాను.Discovery, History, NGC చానెల్స్ వచ్చిన కొత్తలో documentaries విపరీతంగా చూసింది మా generation, ఆ తర్వాత చాలా రోజులకి తెల్సింది, కొన్ని వందల డాక్యుమెంటరీ చానెల్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అని. సినిమాల కన్నా gripping గా ఉండే documentaries చాలానే ఉంటాయి,informative గా ఉండటం నుంచి రోమాలు నిక్కబొడుచుకునేంత అద్భుతంగా ఉండేవి ఎన్నో.
అతికొద్ది documentaries మాత్రమే చాలా personal level కి వెళ్లగలుగుతాయి, అలా నేను చూసిన వాటిలో బి.నర్సింగరావు “మా ఊరు” ఒకటి. ఆయన వాయిస్ ఓవర్ లో అది చూడటం ఒక beautiful experience. ఆ తర్వాత మళ్ళీ అటువంటి ఫీలింగ్ వచ్చింది “మన కాళోజి” తోనే. “మా ఊరు” కి దీనికి ఎటువంటి సంబంధం ఉండదు, కానీ ఇటువంటివి చూసినపుడు ఒక తెలియని ఆనందం, సరికొత్తదేదో మనకి పరిచయం అయిన అనుభూతి. “మన కాళోజి” కాన్సెప్ట్ కూడా బి.నర్సింగరావు దే.
కొంతమంది మీద documentaries తీయాలంటే చాలా వరకు వాళ్లకి సంబంధించిన ఎక్కువ footage దొరకదు , అతి తక్కువ ఫొటోస్ available ఉంటాయి, ఎక్కడెక్కడో వెతికి పట్టుకుని ఒక చోటకి చేర్చి కొన్ని నెలలపాటు కష్టపడితేగాని ఏదో ఒకటి తయారవదు. “మన కాళోజి” మొత్తం కాళోజి మనతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది, ఒక మంచి ముచ్చట్లు చెప్పే ఫ్రెండ్, జీవితాన్ని పలు కోణాలలో చూసి, మనిషి జీవితం గురించి అత్యంత సింపుల్ గా మాట్లాడే ఫ్రెండ్ తో కూర్చుని వింటున్నట్టే ఉంటుంది. అంత పర్సనల్ లెవెల్ డాక్యుమెంటరీ ఇది. ఎక్కడా బోర్ కొట్టదు, ఒకవేళ నేను చెప్పాక మీరు చూసి బోర్ కొట్టింది అనిపిస్తే నాతో మాట్లాడటం మానేయండి.
Documentary ఆయన భార్య, మనవడు చెప్పే విషయాలతో మొదలై కాళోజి దగ్గరకి వెళ్తుంది, అక్కడ కెమెరా సెటప్ చేయటం, కాళోజి కెమెరా లెన్సు వైపు చూస్తూ వేలు అటు వైపు చూపిస్తూ “something is going on, but what is that i cannot distinguish” అంటాడు, ఇటువంటి షాట్ ని చాలా మంది అయితే తీసేస్తారు, కానీ దర్శకుడు అలా వదిలేసి అక్కడ ఆయనతో మొదలుపెట్టడం is the moment for me. Ordinary people గురించి random గా ఆయన చెప్పడం మొదలుపెట్టాక ఇక్కడ నుంచి ప్రవాహమే. బెజవాడ వెళ్లి బార్ & రెస్టారెంట్ లో జాషువాని కలవటం, అప్పట్లో ఇరవై ఆరేళ్ళకి వయసులో తన కన్నా పదమూడేళ్ళ చిన్నామెని పెండ్లాడటం, ఆ పెళ్లి వెనక జరిగిన కథ, ఎటువంటి అడ్డు అదుపు లేకుండా తిరిగే తను పెళ్లి చేసుకోవడం గురించి రిగ్రెట్ అవడం, అసలు అప్పట్లో భర్తనేవాడు ఎలా ఉండాలో వివరించే ప్రయత్నం….
“But we are not even loyal to our vices” అని కాళోజి దాన్ని explain చేసే విధానం, వెనక కాకులు అరుస్తుంటాయి, దేవుడంటే ఎవరు అని మొదలుపెట్టి మనిషి ప్రస్తుత జీవనవిధానానికి ముడిపెట్టడం, ఏడు నెలల తనని ఏడేళ్ల అన్న భుజాలకెత్తుకుని ఇప్పటికీ దింపలేదు నేను దిగలేదు , వాడి మాటే వినని నేను ఇంకెవరి మాట వింటాను అంటూ తమ అన్నదమ్ముల relationship గురించి మాట్లాడటం…
ఇందులో నేను రాయనిది కాళోజి భార్య మాట్లాడిన విషయాలు, పదమూడేళ్ల వయసులో జరిగిన పెళ్లి ఆ తర్వాత ఆమెకి అతను ఎటువంటి మనిషో అనుభవంలోకి రావటం, ఫస్ట్ టైం డాక్యుమెంటరీ చూసినపుడు అనిపించింది, “అటువంటి వ్యక్తికి భార్యగా ఆమె ఎన్ని చెప్పుకోలేని బాధలు పడుంటుందో” అని… చాలా వరకు చెప్తుంది,still …
ఇంక రాయటం కష్టం …. ఓపికున్నవాళ్ళు చూడండి… ఇది official link కాదనుకుంటా… anyway
నా రాత నచ్చితే కింద qr code ఉంది, buy me a drink or coffee bro