A LOVE LETTER TO ROAD

“ సినిమాలకి, రోడ్లకి ప్రేమలేఖలేమిట్రా పింజారి  వెధవ” అని మీరు “సుత్తి” స్టయిల్లో అనుకున్నా పర్లేదు, జీవితంలో ఒక్క రోడ్డు ఫిలిం అన్నా తీయాలి అనుకున్న నేను, ఇప్పుడు మా కథల్లో రోడ్డు లేకుండా తీయలేకపోతున్నా. అందరు తీసే వాటిలో రోడ్లు ఉంటాయి, కానీ మా ఫిక్షన్ లో కొంచెం ఎక్కువుంటాయని నా feeling. శీష్ మహల్ తో మొదలైన మా రోడ్డు ప్రేమ రోజురోజుకి పెరుగుతోంది, పెరుగుతూనే ఉంటుంది. Indie filmmaker ని ఉత్తేజపరిచేది ఉత్సాహపరిచేది రోడ్డు,  ఫకీర్ character ని city రోడ్ల మీద ఎంత నడిపించాం అంటే, పార్కుల్లో చెత్త డంప్ యార్డుల్లో గల్లీల్లో సనత్ నగర్ సంతలో కొండల మీద నడిపిస్తూనే ఉన్నాం, ఒంటె కూడా ఎక్కించాం.  ఎన్నో జరుగుతుంటాయి రోడ్డు మీద, పక్కన, అన్నీ ఇంటరెస్టింగ్ గానే ఉంటాయి. ఒకలా తీస్తే vlog ఇంకోలా తీస్తే ఫిలిం అయిపోతుంది, నీ పాత్రల్ని రోడ్డెకించు, అదే కథ. 

“A LOVE LETTER TO CINEMA” మా మొదటి పూర్తి స్థాయి “Road Film”, రోడ్ film అనగానే ఊరొదిలి దేశం మీదే ఎందుకు పడాలి, సిటీ రోడ్ల మీద తీసేది కూడా రోడ్డు ఫిల్మే. పనాహి తీసిన film చూసాం, మంచి ఐడియా ఎత్తేద్దాం అనుకున్నాం, మా స్టయిల్లో కారులో నుంచి కెమెరా బయటకు రాకుండా తీసిన సినిమా ఇది. సిటీ రోడ్ల మీద తిరిగినా ఏదో ఒక philosophy దొరుకుతుంది. ఇంక సిటీ వదిలితే ఆ philosophy next లెవెల్. Philosophy లేదు తొక్క లేదు కానీ road shoots are fun & challenging, permissions లేకుండా ఎలాంటి disturbance create చేయకుండా accident లాంటివి జరగకుండా shoot చేయడంలోనే smartness ఉంది. లెక్కలేనన్ని road shoots చేసినా నాకిప్పటికీ భయంగానే ఉంటుంది. చాలా ప్లాన్ చేస్తా team తో చాలా discuss చేస్తా, ఎలాంటి mistake జరగకుండా ఎలా షూట్ చేయాలి ఇదే నా ఆలోచన అంతా. అవకాశం ఉంటే నాకూ permissions తో చేయాలని ఉంటుంది, కానీ ఆ process లోకి వెళ్లేంత టైం ఉండదు, రేపు షూట్ అని ఈరోజు రాత్రి decide అవుతుంటాం చాలా సార్లు. 

Theatres లోకి రాబోతున్న మా మొదటి సినిమా “గోపీ గాళ్ళ గోవా ట్రిప్” ఇది కూడా రోడ్ ఫిల్మే, గోపాలపురం అనే మారుమూల పల్లెటూరి రోడ్డు మీద మొదలయ్యే ఈ సినిమా ఊర్లు పట్టణాలు దాటుకుంటూ single lane రోడ్ల నుంచి national హైవేల మీదుగా గోవా చేరుకొని అక్కడ రోడ్ల మీద సందుగొందుల్లో బీచుల్లో కొండల్లో గుట్టల్లో జరిగే సినిమా. పెద్ద కథేం లేదు, గోపాలపురం గోపీగాళ్ళు గోవా వెళ్తే అక్కడ ఫారిన్ తెల్ల అమ్మాయిలతో girlfriend experience  లాంటిది దొరుకుతుందని చిల్ చేయొచ్చని ఎవరో చెప్తే విని గోవాకి వెళ్తారు, అక్కడేం జరిగింది అనేదే కథ. Sexist & racist idea లాగా అనిపిస్తోందా, ఏం చేయలేము, ఇది కూడా నిజ జీవిత అనుభవాల విన్న తర్వాత వచ్చిన idea నే. ఒక్క బూతు లేని సినిమా ఇది. మాకు regular గా వచ్చే sync sound ఆదిత్య “ఏంటన్నా మన సినిమా లాగా లేదు, ఒక్క సీన్ లో అయినా బూతులు పెట్టండి అన్నా” అన్నాడు, ఎంత conscious గా avoid చేసామో బూతుల్ని. 

నాలుగు SUV లు వేసుకుని ఇరవై రోజులపాటు తిరుగుతూనే ఉన్నాం, రాత్రి పడుకునేటప్పుడు తప్పితే రోజంతా రోడ్లే. ఈ shoot మా అవంతి టీం achievement లాగా feel అవుతా mishap లేకుండా ముగించాం. మా unit ని ఎంత కష్టపెట్టినా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ పని చేసేవాళ్ళు. మా అంచనా ఎక్కడ తప్పిందంటే, బడ్జెట్ దగ్గర, అనుకున్నదానికన్నా double అయింది, ఎందుకంటే working days double అయ్యాయి. ఈజీ గా చేసేయొచ్చు అనుకున్నాం గాని, physical గా అది ఎంత కష్టమో ఊహించలేదు. చాలా అలసిపోయేవాళ్ళం దానికి తగ్గట్టు break తీసుకునేవాళ్ళం. Shooting టైంకి మా producers sita & raasta films సాయి, మమ్మల్ని ఏం అడగలేదు, మీరు satisfy అయేవరకు తీసుకోండి అన్న freedom ఇచ్చారు, thanks a lot guys. 

3gt లో most important prop old Maruti Zen, ప్రశాంత్ అనే friend మేము అడిగిన వెంటనే చాలా జాగ్రత్తలు చెప్పి ఇచ్చాడు, అది ఒకే ఒక్కసారి చిన్న repair ఇచ్చింది, ఆ situation ని కూడా మా scene లా మార్చేసుకున్నాం. ఆ కార్ safe గా వస్తే చాలు అనుకున్నా నేను, safe గానే వచ్చింది కానీ, ప్రశాంత్ ఒక మాట అన్నాడు “సంక నాకించేసారు అన్న కారుని” అని. అదొక్కటే కొంచెం బాధ. 

ఇంతకు ముందెప్పుడూ చూడని గోవా అని చెప్పనుగాని, ఇంతకు ముందెప్పుడు చూడని విధంగా మాత్రం ఖచ్చితంగా చూపించాం. This film is a visual  feast, మేము చెప్పాలిగాని నువ్వే చెప్తా ఎలా అంటే, అదంతే, మీరు నామాటతో ఏకీభవించాల్సిందే సినిమా చూసాక. Road films లో మజా ఏంటంటే  చాలా surprises ఉంటాయి, వాటికి నువ్వెలా respond అవుతావ్ situation కి తగ్గట్టు నీ approach ఎలా మార్చుకుంటావు అనేదే fun. మాకైతే ఎలాంటి major issue రాలేదు, surprises చాలానే ఉన్నాయి, beautiful surprises అయితే ఎన్నో, అవన్నీ మా సినిమాకి పనికొచ్చేట్టు వాడేసుకున్నాం, కొన్ని accidental గా జరిగిపోయాయి. 

Road shoot అనుకున్న ప్రతిసారి నేను ఆలోచించేది, ఎంత comfortable గా travel చేస్తున్నాం, ఎంత మంచి food & stay  ప్లాన్ చేస్తున్నాం అనేదే, ఆ రెండూ బాగుంటే అన్నీ smooth గా జరిగిపోతాయి. నేనైతే team లో ఎంతమంది రోజూ బీరు మందు తాగుతారో కూడా plan చేస్తా, camera తో రోడ్డు మీద పడ్డామంటే అది friends తో trip లాగుండాలి. 

ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మా నుంచి ఒక road film పక్కా. 

నా రాత నచ్చితే కింద qr code ఉంది, buy me a drink or coffee bro

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *