Part 1 : శశి ఎత్తులు వేస్తే!
నోట్ : ఇది ప్యుర్లి అవంతి నుండి వచ్చిన ఎత్తులు అనే షార్ట్ ఫిల్మ్ ప్లానింగ్, మేకింగ్ & స్క్రీనింగ్ etc వాటి గురించి కొన్ని విషయాలు రాసి పడేదాం, మూడు నాలుగు సంవత్సరాల తర్వాత చదువుకుంటే క్రేజీ గా ఉంటుందని, అంటే ఫ్యూచర్ ఫన్ కోసం ప్లానింగ్ అనమాట.
సో అసలు విషయానికి వస్తే, అది 2021 ఏప్రిల్. కోవిడ్ ఫస్ట్ ఫేస్ లాక్డౌన్ అయాక కాస్త బ్రేక్ దొరికిన అమూల్యమైన టైం.
ఇప్పుడొక పెద్ద బ్రేక్
ఇది నా పర్సనల్ ట్రివియా – ఎప్పటికీ చెస్ ఆడలేను అనుకున్న నేను lockdown వల్ల నా ఫ్రెండ్ ఒకరి హెల్ప్, సపోర్ట్ తో బేసిక్ చెస్ మూవ్స్ నేర్చుకున్న, కాస్త బాగా ఆడే వాళ్ళకి కొత్త వాళ్ళతో ఆడడం పరమ లోకువ అండ్ బోరు. అలా మిగితా వాళ్ళతో నేను ఎప్పుడైనా ఆడాల్సి వస్తే నాకు ఎంత భయంగా ఉండేదో. కానీ మెల్లిగా ధైర్యంగా ఆడడం మొదలుపెట్టా. తెలిసిన వాళ్ళతో ఆడితే నన్ను కేర్ చెయ్యట్లేదు, సరిగా ఆడట్లేదు అని ఏదో ఒకటి అంటారని చేస్.కామ్ లో ఆడడం మొదలు పెట్టాను.
నాకొక మంచి అలవాటు ఉంది, ఏదైనా నచ్చితే దాని అరగదీసి అవతల పడేసేదాకా వదలను, సో అలా మొదలైన నా ambitious chess learning నన్ను నా క్లోజ్ ఫ్రెండ్స్ తో బెట్టింగ్ ఆడే దాకా తీసుకెళ్లడమే కాదు వాళ్ళని ఒడిపించే లోలోపల బాగా ఎంజాయ్ చేసే దాకా వచ్చింది.
అలా మెంటల్ మెంటల్ గా గంటలు గంటలు గా ఆడుతూ, ఎప్పుడూ పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ చేతులు రాండమ్ గా మూవ్ చేస్తున్నట్లు ఇమాజిన్ చేసుకోవడం,పడుకుంటే కలలో మొత్తం మూవ్స్ గురించే కనిపించడం,పిచ్చి పీక్స్ కి పోవడం, ఇప్పటి నా హస్బెండ్ అప్పుడు నా రూం మేట్ అండ్ బాయ్ ఫ్రెండ్ తో రోజుకి 8-10 గంటల దాకా “నువ్వా నేనా?” నువ్వు గెలిస్తే ఛాయ్ నేను పెడతా! మరి నేను గెలిస్తే నువు క్లీన్ చెయ్యాలి, లేదా కుక్ చెయ్యాలి. ఒకోసారి అయితే, ఆకలేస్తున్నపుడు, టీ తాగితే బాగుండు అనిపిస్తునప్పుడు, ఒక గేమ్ ఆడుదాం, ఆడిన తర్వాత ఏదైనా ఆక్టివిటీ చేద్దాం అని డీప్ గా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం. ఇలా పిచ్చి ఎక్కిన టైంలో చెస్ సినిమా తీద్దామని ప్లాన్లు వేసుకునే వాళ్ళం. Shashank చాలా సార్లు anime తీస్తే బాగుంటుంది, చెస్ మూవ్స్ వేసేటప్పుడు ఏమని ఆలోచిస్తాం, ఎలా బ్రైన్ వర్క్ అవుతుందో అనిమే characters తో Vo లో చేస్తే బాగుంటుందని, క్రేజీ గా సినిమాటోగ్రఫీ, సీన్స్ షాట్స్ ఇలా తీస్తే మెంటల్ అని…ఇలా చెప్పలేనని కొత్త ఐడియాస్, రోజుకో character గురించి మాట్లాడుకుంటూ చిల్ అవుతున్న టైంలో శశి ఒకరోజు కలిసి తనకి పర్సనల్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పాడు.
ఎత్తులు – after the break
శశి ఎవరి దగ్గరో ఒకసారి అప్పు చేసి, కొన్ని నెలల తర్వాత మిత్తి కూడా కట్టడం ఆపేసి, వాళ్ళ ఫోన్ల కి రెడ్స్పిండ్ అవ్వకుండా ఉంటు ఒక extreme moment వరకు హోల్డ్ చేశాడు. వాళ్లేం పిక్కుంటారు నేను ఎక్కడెక్కడో తిరుగుతుంటా, లైట్ అనే ఫీలింగ్ లోకి వచ్చేసాక villains సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు. పలానా వాళ్ళు మిమ్మల్ని తీసుకొని రమ్మని పంపించారు, ఒక హోటల్ లో ఉన్నారు అని సైలెంట్ గా పట్టుకెలారు వచ్చి( ఇలా శశి మాట్లాడుతూ జస్ట్ పాజ్ ఇచ్చి స్మోక్ లైట్ చేసుకుంటున్నాడు, ఎవడైనా ఈ మూమెంట్ లో కథ కి పాజ్ ఇస్తారా?), తర్వాత, ఎమ్ముంది తీసుకెళ్ళి ఒక మధ్యాహ్నం/సాయంత్రం దాకా ఉంచుకున్నారు. Hahahah sorry శశి, ఉంచుకున్నారనే కదా అంటాము. కింద మీద పడి ఎలాగో అలాగ త్వరలో అప్పు తీర్చేస్తా అని వాళ్ళని బతిమిలాడుకొని బయట పడ్డాడు. పడి, అప్పు తీర్చాడా? లేదు ట్రైన్ ఎక్కి పరారి. ఎత్తులు షార్ట్ చూసారు కదా, పవన్ గాడి లాగే escape ayyaadu కానీ ఫైట్, running, smaran music లేవు అప్పుడు..
సో, అసలు ఎత్తులు తీయడానికి ఇంపార్టెంట్ విషయం ఏంటో ఎందుకు శశి కి అంత టెర్రర్ లా అనిపించిందో నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూసి సర్ప్రైజ్ అవుతారని. సో అక్కడ శశి వాళ్ళని చూసి ఏదైతే ఫీల్ అయ్యాడో అదే సినిమా.
మరి ఎత్తులు? చెస్?
అదంతా ప్లానింగ్, metaphor లా వాడడం ఎందుకు చెస్ ఆడిస్తే పొల. అసలే మా హీరో చెస్ పిచ్చోడు, పవన్ ఆల్మోస్ట్ ఎప్పుడూ కాళిగా ఉన్న చెస్ ఆడుతూ ఉంటాడు. అది కూడా అలాటప్ప ప్లేయర్ కాదు,ఎవరైనా తోపులు ఉంటే చెప్పండి బెట్ కట్టి మరీ ఆడి ఒడిస్తాడు, బెట్ పైసలతో పార్టీ ఇస్తాడు. And ఇంకో ఫన్నీ trivia, చాలా ఫన్నీ and రియల్. అప్పుడే yeleti “check” సినిమా రిలీజ్ అయిందబ్బా.. అసలు మినిమం చెస్ ఆడే వాడు ఎవడైనా సినిమా చూస్తే తిట్టకుండా ఉండడు అని చాలా సీన్స్ చెప్తూ పవన్ మమల్ని నవ్వించాడు. కానీ చెస్ పక్కన పెట్టినా, చెక్ సినిమా ట్రైలర్ చూసినవాడు ఎవడు కూడా ధైర్యం చేసి theatre కి వెళ్లి మరీ సినిమా చూస్తాడని నేను అనుకోను, చాలా ధైర్యం కావాలి. కానీ మనోడు దొబ్బటానికే వెళ్ళాడు, had full fun listening to pawan’s review through his expressions and actions.
ఎట్టకేలకు, అసలు నువ్వు చెస్ మీద సినిమా తీయడం ఏంట్రా? అది కూడా అర్థం పర్థం లేనిది అనుకొని, ఉండు మేము తీస్తాం, తీసి చూపిస్తాం(ఎవరికి? మాకు మేమే చూసుకుంటాం) చూడండి… అనే రేంజ్లో డిసైడ్ అయ్యాం తీయాల్సిందే బ్రో సినిమా అని.
ఇది ఇలా బేసిక్ ప్లాట్, “అప్పు చేసి తప్పించుకు తిరిగే శశి పర్సనల్ experience కి చెస్ జోడించిన కథే ఎత్తులు”.
And మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్, మేము ఈ సినిమాకి ఫ్రెండ్ ఫార్మ్ హోజ్ అనుకున్నాం(నిజానికి ఫ్రెండ్ కాదు, ఒక ప్రొడ్యూసర్ డబ్బులు, ఫార్మ్ హౌస్ ఇప్పిస్తాను అని చెప్పి…. తర్వాత సంగతి తర్వాత కనీసం ఫార్మ్ హౌస్ దోర్కింది), recce కి కూడా వెళ్ళాం. చిల్ అవుతూ పాటలు వింటూ వెళ్లి ఫార్మ్ హౌస్ చూసి surprise అయ్యాం..మేము అనుకున్న దానికంటే చాలా పెద్దది, మమాడి తోట, ఆడుకోడానికి కావల్సినంత ప్లేస్, అందమైన ఇల్లు, అంతకన్నా మించి ఇంటి ముందు మాడ్ lawn… ఎత్తులు చూడండి బ్రో మీకే అర్థం అవుతుంది.
Location ఫిక్స్, ఏవో లాస్ట్ మినిట్లో అన్నుకున్నని డబ్బులు రాలేవు కానీ ఎంతో కొంత వచ్చాయి, అందరం రెఢీ అయ్యాము. 19 మంది దాకా యాక్టర్స్, technicians, sasi and me, లక్కీగా రోహిత్ రాలేదు. నేను శశి పిచ్చ ఎంజాయ్ చేశాం షూట్ చేస్తూ, నాకు శశి పెద్ద టీచర్ రోహిత్ టీచర్. శశి షూట్ చేసే టైంలో, “ఈ సీన్ నువ్వు చేసే” అని ఒకటి రెండు సార్లు ముందు షూట్లో అనడం వల్ల ఏదో ట్రై చేసి, ఫుల్ టైం నేనే చేస్తే అనే ఆలోచన వచ్చేలా చేశాడు కాబట్టి.
అలా ఇద్దరం డైరెక్ట్ చేస్తూ,మాకు నచ్చినట్లు కెమెరామన్ కి ఇలా పెడదాం ఫ్రేమ్, నేనైతే మరీ ఓవర్, లెన్స్ ఇవి మారుద్దాం అనే ఇంస్ట్రక్షన్లు ఇస్తు, అబ్బా అసలు ఎత్తులు షూట్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ నెక్ట్స్ లెవెల్ .
Pickpocket 1 షూట్ నేను ఒక్కదాన్నే చేశా కాబట్టి అది వేరే, అసలు అది ఇష్టం ఉన్నట్లు, ఎవరి అప్రూవల్ అవసరం లేదు అండ్ విజయ్ అంటే చాలా ఇష్టం, ఎంత ఈజీగా షూట్ చెయ్యొచ్చు విజయ్ ఉంటే. ఇంకా,శశి సీన్స్ డైరెక్ట్ చేస్తునప్పుడు వచ్చిన మజా అయితే క్రేజీ, భయ్య చింపేసే పెర్ఫార్మెన్స్ లైవ్ లో చూస్తూ నవ్వలేక నవ్వలేక నా చెంపలో నొప్పి ఒచ్చింది. మా కోసమే పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడా టైప్ లో ఉండే. షూట్ మొత్తం, దివ్య, “ఏదైనా క్రేజీ గా చేద్దాం, నన్ను టార్చర్ పెట్టాలి వాళ్ళు, గిల్లాలి, కొట్టాలి, చెట్టుకు ఎలాడ దీయాలి” లాంటి మాడ్ ఐడియాస్ ఇస్తు పిచ్చ ఎంటర్టై్మెంట్ ఇచ్చాడు.
అందులో ఆక్ట్ చేసిన విజయ్, దీక్షి, సంజు, సుమంత్ ఫస్ట్ టైం మాతో చేసిన వాళ్ళు. పవన్ హీరో, కళ్యాణ్ విలన్. శశాంక్ కెమెరామన్, సౌండ్ చేసింది సాయి వర్మ. సౌండ్ ఒక పెద్ద ఎపిసోడ్ ఈ సినిమాకి, ఎంత ఒద్దనుకొని కంట్రోల్ చేసుకుందాం అన్న దీని గురించి మాట్లాడకుండా ఆపుకోలేను.
ముందు రోజు వరకు ఎప్పుడు అవంతి వాళ్ళకి సింక్ సౌండ్ చేసే ఆదిత్య వస్తాడు అనుకున్నాం, కానీ అవంతి అప్పులోల లిస్ట్ లో సౌండ్ ఎక్విప్మెంట్ ఇచ్చేవాళ్ళు ఉండడం, ముందు బ్యాలన్స్ పేమెంట్ చేస్తే కానీ అదిత్యని పంపడం కష్టం లాంటిది ఏదో లాస్ట్ మినిట్లో జరగడం వల్ల, అండ్ డబ్బులు ఇస్తాం అన్న ఇద్దరు ప్రొడ్యూసర్స్ లో ఒకరు లాస్ట్ మినిట్ హ్యాండ్ ఇవ్వడంతో, ప్లాన్ చేసుకున్న వాటికే బడ్జెట్ సరిపోదు. షూట్ చెయ్యడానికి కెమెరా, లెన్స్, accessories, lights etc లాంటివి రెంటల్ వాళ్ళకి ముందే చెప్పి పెట్టాం కాబట్టి, payment షూట్ అయ్యాక కానీ అడగరు కాబట్టి సెట్. ఫార్మ్ హౌజ్ సెట్, ట్రావెలింగ్ కోసం ముందే బుక్ చేసిన కార్లు వచ్చేశాయ్, తినడానికి, సిగరెట్లకి డబ్బులు ఉన్నాయి.
మరి సౌండ్ ఎలా? శశి ఆలోచించి, ఆల్మోస్ట్ అందరూ వచ్చేశారు షూట్ కి స్టార్ట్ అయ్యి వెళ్ళే టైమ్ అయితుంది ఇపుడు సౌండ్ వాళ్ళని సెట్ చెయ్యలేం, సింక్ సౌండ్ వాళ్ళు తక్కువ, అందులో మనకి తెలిసిన వాళ్ళు ఇంకా తక్కువ, ఇంత షార్ట్ నోటీస్(గంట టైం లో వాళ్ళు మాతో షూట్ లొకేషన్లో ఉండాలి)లో ఎవరైనా సెట్ అయి ఊరవతల ఉన్న ఫార్మ్ హౌజ్ కి రావాలంటే అవ్వని పని. సో, లైట్ తీసుకొని షూట్ ఫినిష్ చేద్దాం, డబ్బింగ్ తర్వాత చేసుకుందాం అనుకున్నారు రోహిత్ అండ్ శశి. అదే మాట నాకుడా చెప్పారు, నేను ఆరోజు ఉన్న ఊపులో ఎవరి మాటా వినేలా లేను. అదేంటి మనం సౌండ్ లేకుండా ఎలా తీస్తాం? అదే కదా excitement అండ్ వెంటనే రోహిత్ సినిమా కట్ చేస్తే చూడొచ్చు, అసలు సౌండ్ లేకపోతే వర్కౌట్ కాదు అని ఫస్ట్ టైం చాలా మొండిగా ఆర్గ్యూ చేశా.
చాలా చెప్పడానికి ట్రై చేసి అలిసిపోయి ఒకే మరి ట్రై చేద్దాం, వర్కౌట్ అయితే అవుతోంది అన్నారు వాళ్ళ స్టయిల్లో.
తర్వాత ఆలోచిస్తే నాకుడ చాలా ఫూలిష్ గా అనిపించింది. ఏదైనా మనం ఫస్ట్ టైం చేసేటప్పుడు తెలియకుండానే పర్ఫెక్షన్ కోసం పాకులాడుతాం, అసలు ప్లాన్ చేసుకున్నది చేసుకున్నట్లు జరగాలి అనే ఆతురత, లేకపోతే ఎలా? మోతం స్పాయిల్ అయింది అని చాలా ఓవర్గా ఫీల్ అవుతాం, అదంతా అతి. కొన్ని సార్లు unnecessary అని అర్థం అయ్యాక అబ్బా అనిపించింది.
కానీ అప్పుడు నేను కొంచం వేరు, ఇప్పుడు ఇంకొంచ్ వేరు..అదే ఇప్పుడు అయితే కాస్త కూల్ గా ఉండి ఓకే ఎలా అయితే అలా, డబ్బింగ్ అయితే ఇంకా క్రేజీ గా ఉంటుంది ఇలాంటి సినిమాకి అనుకుంటున్న.
ఎలాగో అలా వేరే వాళ్ళ కాంటాక్ట్ తో సాయి వర్మ కాంటాక్ట్ దొరికింది..చెప్పగానే వెంటనే అరగంటలో స్టార్ట్ అయ్యి ఒక్కడే వచ్చాడు, బూమ్ ఆపరేటర్ కూడా వస్తాడు అనుకున్నాం కానీ ఎవరూ available లేక ఒక్కడే వచ్చాడు, సౌండ్ చేశాడు. షూట్ అయిన వెంటనే రోహిత్ కట్ చేశాడు అందరం కలిసి చూసి వావ్ అనుకున్నాం.
ఇంకా మిగితా విషయాలు ఇంకోసారి మాట్లాడుకుందాం
పార్ట్ 2 లో కెమెరా, లైటింగ్, ఎడిట్, మ్యూజిక్, మిక్సింగ్, కలర్ గ్రేడ్ అండ్ అవర్ ప్రైవేట్ స్క్రీనింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పుకుందాం.
అప్పటిదాకా బై
హ్యాపీ సండే బ్రోస్