Camp
సినిమా వాళ్ళ కథలు
ఆర్జీవి inspiration తో ఆత్రేయపురం నుంచి ఒక కుర్రాడు డైరెక్టర్ అయిపోదామని హైదరాబాద్ వచ్చాడు, చెప్పులు మోకాళ్ళ చిప్పలు అరిగేంత కాకపోయినా బానే తిరిగాడు పరిచయాలు పెంచుకున్నాడు, ఒక సినిమా ఆఫీసులో సెట్ అయ్యాడు.డబ్బుల కష్టాలున్నా ఎలాగో manage చేసేవాడు, జర్నలిస్ట్ కాలనీలో చిన్న రూం తీసుకున్నాడు. కొడుకుగా ఇంటి బాధ్యతలు కూడా ఉన్నాయి.
ఒక సినిమాతో మొదలై ఐదారేళ్ళలో నాలుగు సినిమాలకి పనిచేసాడు, కష్టపడతాడు టాలెంట్ ఉంది అని పేరు సంపాదించాడు, ultimate గా తను గురువుగా భావించే ఆర్జీవితో కూడా work చేసేసాడు. ఇలా పనిచేస్తూ తను తీయాలనుకుంటున్న మొదటి సినిమా కథ రెడీ చేసుకున్నాడు, బాగా దగ్గరయిన వాళ్ళకి చెప్పేవాడు, నెగటివ్ & పాజిటివ్ opinions,ఆ రెండూ కాకుండా కొన్ని పనికిమాలిన సలహాలు వచ్చేవి. కానీ వాడు అవేవీ పట్టించుకోలేదు తను అనుకున్న కథే తీయాలని fix అయిపోయాడు, సినిమాలకి పన్చేయడం మానేసాడు, నిర్మాతల్ని పట్టే పనిలో పడ్డాడు.
రోజులు గడచిపోతున్నాయి కాలాలు మారిపోతున్నాయి కథ వినేవాళ్ళేగాని చేద్దామనే వాళ్ళు దొరకటం లేదు, ఆ కథ అలాంటిది. చిన్న హీరోలని ట్రై చేస్తున్నాడు, ఈ కథ తెలుగోళ్ళకి వర్కౌట్ అవదు అనే feedback వింటున్నాడు కానీ కథ మార్చడం లేదు. వాడి నమ్మకం అలాంటిది. తమిళ్ వాళ్ళకి నచ్చుతుందేమో అని అక్కడా ప్రయత్నించాడు, ఏం జరగలేదు. ఇంకో పక్క father health issue, ఆ పనుల్లో hospital చుట్టూ తిరగడం డబ్బుల కోసం ఇబ్బందులు.
అలా రెండు సంవత్సరాల తర్వాత కొత్త హీరో కొత్త నిర్మాత దొరికారు, ఆఫీసు open అయింది పనులు మొదలైపోయాయి, జీవితపు కష్టాలు అలాగే ఉన్నాయి.
షూటింగ్ మొదలైంది, తను అనుకున్నది అనుకున్నట్టు తీసే ఫ్రీడం ఇచ్చే నిర్మాత దొరికాడు, ఇంకేం కావాలి? వాడు చెలరేగిపోయాడు, తన ఊర్లోనే సినిమా తీసేసాడు. రిలీజ్ కి రెడీ అయిపోయింది సినిమా.
ఇది ఆడితే జీవితం మారిపోతుంది, లేకపోతే???????
ఈపాటికి ఆ దర్శకుడెవరో మీకు అర్ధమైపోయుండాలి, Rx100 అజయ్ భూపతి. నేను పైన రాసింది exact అలాగే జరిగుండకపోవచ్చు, నాకు తెల్సింది dramatic గా రాసే ప్రయత్నం చేసాను. ఆ సినిమా సూపర్ హిట్టుతో అజయ్ జీవితం మారిపోయింది, ఊహకందనంత మారిపోయింది, ఇంతకన్నా classic underdog story ఏముంటుంది?
ప్రతి దర్శకుడి జీవితం అటూఇటుగా ఇలానే ఉంటుంది, ప్రాంతాలు కష్టాలు మారిపోవచ్చు. దర్శకులనే కాదు ఫిలిం ఇండస్ట్రీ నడిచేదే ఆ overnight success ఆశ దురాశ నిరాశలతో.
ఇదంతా ఎందుకు రాసానంటే
మా “సినిమా ఫిక్షన్” చూసి విసుగెత్తిన విసుగెత్తుతున్న ప్రేక్షకులు పెరిగిపోతున్నారు, మాకేమో ఎన్ని తీసినా ఎంత తీసినా సినిమా వాళ్ళ కథలు బోర్ కొట్టవు, film industry people ని చూస్తే నాకెప్పుడూ కొత్త కథ వస్తూనే ఉంటుంది. ఎక్కడ ఎలా మొదలుపెట్టాలో తెలియని uncertainty నుంచి ఏదో ఒకటి సాధించి పేరూ డబ్బులూ “సాధించేయాలన్న” ఆ తపన చూస్తే అది నాకు సినిమాలానే కనిపిస్తుంది.
ఇప్పటివరకు తీసినవి కాకుండా ఇంకో 15-20 సినిమా వాళ్ళ కథలతో fiction అయితే తీయబోతున్నాం, ఎవరైనా చూస్తారా లేదా అని ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ తీయలేం. నచ్చింది నమ్మింది తీసేయటమే.
కొసమెరుపు : RX100 hit అయితే నాకు సరదాగా రెండు లక్షలు ఇస్తా అన్న అజయ్ ఆ టాపిక్ మాత్రం మాట్లాడడు. Hit కొడితే అంతే, డబ్బులు దాచుకోవాలిగా.