Maybe I am wrong

“అన్నా మీరు చేసినవి చూసాక films మీద filmmaking మీద thoughts మారిపోయాయి అన్నా” అని ఎవడన్నా నన్ను కలిసినపుడు అంటే “ఇంకొకడు సంకనాకి పోయాడు” అనుకుంటా… మేమేదో మాకు వచ్చిన తోచిన నచ్చిన విధంగా తీసుకుంటూ పోతున్నాము, ఒక్క దానికి కూడా పైసా వెనక్కి రాలేదు, వైరల్ అవలేదు, అయినా తీయడం ఆపలేదు. నన్ను కలిసే కుర్రనా దర్శకులకి ఒకటే చెప్తా, రెండో సినిమాకి కోటి కావాలా వద్దా అని డిసైడ్ చేసుకో అని, అప్పుడు ఏం తీయాలి ఎలా తీస్తే ఎవరిని ఇంప్రెస్ చేయొచ్చు నువ్వు తీయబోయే మొదటి షార్టు ఫిల్మో ఫీచర్ ఫిల్మో నీకు ఇండస్ట్రీలో “డోర్స్” ఓపెన్ చేస్తుందా, నాని కాకపోయినా శర్వ డేట్స్ అయినా దొరుకుతాయా అనే కుట్రపూరిత ఆలోచన ఉండటం ఒక దారి. ఈ దారిలో సరిగ్గా ప్లాన్ చేసుకుని తప్పటడుగులో ఒప్పటడుగులో వేస్తే వర్కౌట్ అయితే రెండో సినిమా “సాహో” కూడా అవ్వొచ్చు. నాకు సుజీత్ మీద విపరీతమైన admiration, తిరుపతిలో తప్పని పరిస్థితిలో ట్రైన్ కోసం మూడు గంటలు వెయిట్ చేయడం ఎందుకులే అని మ్యాట్నీ షోకి “రన్ రాజా రన్” కి వెళ్లాను, అప్పటికే హిట్ టాకు, హౌస్ఫుల్లు. నా highest priority AC లో chill అవటం, ఇంకో ముఖ్య కారణం ఆ సినిమా ఎడిటర్ మధు, తమ్ముడు లాంటోడు. సినిమా మొదలైంది, అలా వెళ్ళిపోతోంది, జనాలు నవ్వుతున్నారు, అరుస్తున్నారు, ఎందుకు అరుస్తున్నారో అర్ధం కాలేదు. శర్వానంద్ ఏవో సిల్లీ పనులు చేస్తున్నాడు, హే ఈ కుర్ర డైరెక్టర్ ఎవరో భలే “పల్స్” తెల్సిన వాడిలా ఉన్నాడే, సరైన సీన్లు రాసుకున్నాడు జనాలు హ్యాపీ వాళ్ళని చూసి నేను హ్యాపీ. నేను భయపడినంత దరిద్రంగా అయితే లేదు, 23 ఏళ్ళ డైరెక్టర్ అని చదివి భయపడ్డా. సినిమా అయిపోయింది ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చేసా. కుర్రోడికి మంచి ఫ్యూచర్ ఉంది తెలుగు సినిమాలో మెల్లిగా పాక్కుంటూ దేక్కుంటూ ఒక స్టేజ్ కి అయితే వెళ్తాడు అనిపించింది. “రన్ రాజా రన్” ఒక జుజుబీ సినిమా, తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ “ఎంటర్టైన్మెంట్” కోసం మొహమాసిపోయి ఉంటారు కాబట్టి సినిమా నడిచిపోయింది అనిపించింది. Seriously తెలుగు ప్రేక్షకులకి “క్షమాగుణం” ఎక్కువ man, కొంచెం బాగున్నా హిట్ చేసేస్తారు. Ok, coming to the point, Sujeeth రెండో సినిమా “సాహో” announcement చూసి దిమ్మ తిరిగిపోయింది, ఇది కదా youthful adventure అంటే, ఎలా? “రన్ రాజా రన్” తీసి సాహో ఎలా ఒప్పించాడు నిర్మాతల్ని ? this is amazing, ఆ బడ్జెట్ ఏంటి? బాహుబలి తర్వాత ప్రభాస్ తో సినిమా అంటే… ఎలా? ఇది మామూలు విషయం కాదు అనిపించింది, hatsoff సుజీత్ అనుకున్నా. ఆ తర్వాత making of saaho visuals చూసి పిచ్చి దెంగింది, ఏంటిది? ఇక్కడ ఎవరికి పిచ్చి నిర్మాతలకా ప్రభాస్ కా అసలేంటిది ? ఒక వెరీ యంగ్ డైరెక్టర్ కి ఇంత “విసృంఖుల స్వేచ్చా” ? hatsoff సుజీత్, అసలేం చెప్పి ఒప్పించావ్? అంత నమ్మి డబ్బులు పెడుతున్న నిర్మాతల్ని చూసి ఎంత ముచ్చటేసిందో అంతే జాలి కూడా వేసింది, మనం హాలీవుడ్ లాంటి “action” తీయలేం అని వీళ్ళకెందుకు అర్ధం కాలేదు అని. రాసిపెట్టుకోండి ఇంకో 50 ఏళ్ళైనా మనం అలా “action” తీయలేం, మీరు ఎంత hurt అయినా నన్ను తిట్టుకున్నా ఇది మాత్రం నిజం, Hollywood Action sequences next level, అది అభివృద్ధి చెందిన దేశం బాసు సింపుల్గా. Ok, coming to the point, సుజీత్ లో నాకొక child కనిపించాడు, తను ఊహించుకున్నది screen మీద చూసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, loved him. నాకొక clarity ఉంది ఇది ఖచ్చితంగా silliest film అవుతుంది, రన్ రాజా రన్ తీసినోడు ఇలాంటి యాక్షన్ ఫిలిం ఎలా తీయగలడు అనే నమ్మకం, నా నమ్మకం వమ్ము కాలేదు. సుజీత్ made a stupidest film on grand scale, that’s why i love him, forever. Recent గా రాధే శ్యామ్ చూసా మళ్ళీ same feeling, ఎలా ఒప్పించావ్ రాధాకృష్ణా ? కానీ నా admiration మొత్తం సుజీత్ కే. Ok, coming to the point, so నువ్వు ఏం అవాలనుకుంటున్నావ్? రెండో దారి “నాకు నచ్చిన సినిమా” తీసుకుందాం అనుకుంటున్నావా? ఇది చాలా కష్టమైనది, simple గా చెప్పాలంటే డబ్బులు ఎక్కడ్నుంచి వస్తాయి? నువ్వు నమ్మిందే తీయాలనుకుంటే డబ్బులు పెట్టే నిర్మాతో కార్పోరెటో కావాలి, వాళ్లకి నువ్వు నచ్చాలి నీ కథ నచ్చాలి నీ Pitch deck నచ్చాలి నీ approach నచ్చాలి ఇలా చాలా ఉంటాయి. లేదు నేను crowdfunding తో చేస్తా అంటావా, ఇది మరీ కష్టం. కోటి పెట్టే ఒకరిద్దరిని ఒప్పించడం ఈజీనా? వేల మందిని కోటి కోసం అడుక్కోవడం ఈజీనా? మేము కూడా ప్రయత్నిస్తున్నాం కోటి రెండు కోట్ల కోసం, story narrated, nothing happening, మాకు కొంత bad name కూడా ఉందనుకోండి, “ఆ camp batch తో కష్టం” అని, still we are trying. Ok, coming to the point, మా నుంచి మీరు నేర్చుకోవాల్సింది “camp batch” లా అవకూడదు అని, సంకనాకిపోతారు, మంచి ఫ్లాటు దొరకదు అందమైన తెల్ల పెళ్ళాం దొరకదు. మా లెక్క వేరు, మాకసలు లెక్క లేదు, తొమ్మిదేళ్లుగా కోట్లు ఖర్చుపెట్టాం, పూర్తి అయినవి అవ్వాల్సినవి బయటికొచ్చినవి అన్నీ కలిపి 27 టైటిల్స్ ఉన్నాయి, మొన్నే లెక్కపెట్టా. మాతో పనిచేసిన వాళ్ళ జీవితాల్లో మార్పులొచ్చాయి కొందరు ఇంటి అద్దెలు కట్టుకున్నారు బట్టలు కొనుక్కున్నారు పెట్రోల్ కొట్టించుకున్నారు బిర్యానీలు తిన్నారు, అంతెందుకు నేనూ రోహిత్ బతుకుతున్నాం మందూ సిగరెట్లకి కొదవ లేకుండా, so మా filmmaking ని సీరియస్ గా తీసుకోకండి, మేమే తీసుకోము. సినిమా తీయడం మాకు passion కాదు ఇష్టం, అంటే, మండే ఎండాకాలం మధ్యాహ్నం బీరు తాగటం ఎంత ఇష్టమో సినిమా తీయడం కూడా అంతే మాకు, ఇదొక అద్భుతమైన ఆర్టు కళామతల్లి ఫోర్టు లాంటి ఫీలింగ్సు మాకేం లేవు, going to madhusala bar & making a film both are same for us. May be iam wrong అని టైటిల్ ఎందుకు పెట్టానంటే just clickbait

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *