సినిమాబండి

మూడు రోజులుగా నేనూ రోహిత్ కక్ష కట్టినట్టు ఓటీటీల్లో తెలుగు సినిమాలు చూస్తున్నాం, మొత్తం కాదు ప్రతి సినిమా 15-20 నిమిషాలు చూస్తున్నాం, ఒక్క రాధేశ్యామ్ మాత్రం మూడు రోజుల్లో మొత్తం చూసాం. దాని గురించి నేనేం రాయటం లేదు, ఇలా చూసిన వాటిలో ఈరోజు ‘సినిమాబండి’ ఒకటి, 23 నిమిషాలు అయింది, ఫినిష్ చేసేస్తామనే అనిపిస్తోంది రాగల రెండు రోజుల్లో. మేం ఈ మూడురోజులు చూసిన అన్ని సినిమాలకన్నా సినిమాబండి చాలా బాగుంది, bad films తో compare చేసి బాగుంది అనటం లేదు. ఆ ఊరు, మనుషులు మొఖాలు లొకేషన్లు బట్టలు రంగులు very beautiful. కొన్ని ఇబ్బంది పెట్టే విషయాలున్నాయి but అవి అనవసరం. విపరీత తెలుగు సినిమా చూసిన మాకు ఈ సినిమా ఒక రిలీఫ్, ఇదే కదా జరిగేది, excess of bullshit cinema మధ్యలో ఒక ‘కొత్తసినిమా’ ఎప్పుడూవస్తుంది, వస్తుండేది. ఈ మధ్య అలాంటి సినిమా రావడంలేదు, సినిమా బండి అలా అనిపించింది. ‘కొత్తపోరడు’ లో చాలా సంవత్సరాల తర్వాత పల్లెటూరిని చూసి ఎంత wonderful achievement అనిపించిందో సినిమాబండి లో అంత nativity కనిపించింది, image nativity. filmmakers వాళ్ళకి తెలిసిన బాగా పరిచయమున్న ‘ప్రాంతం’ ‘ప్రజలు’ ని cinematic గా చూపించడం ఎప్పట్నుంచో జరుగుతున్నదే, కొత్తపోరడు & సినిమాబండి లో అది కనిపించింది. simple cinematography & long takes వదిలేసిన editing చాలా బాగా అనిపించాయి సినిమాబండిలో. కొంచెం….బాగుంటే ఇంకా బాగుండేది. (ఇక్కడొక complaint) చూసిన 23 నిమిషాల్లోనే నచ్చిన విషయాలు బానే ఉన్నాయి. త్వరలోనే మొత్తం సినిమా చూసి ఇంకేం రాయను. కొసమెరుపు: మా OTT exploration లో భాగంగా “గుడ్ లుక్ సఖి” కూడా చూసాం, మా ఇద్దరికీ అభిమాన ఇండీ దర్శకుడు నగేష్ కుకునూర్ పల్లెటూరిని ఎంత “చిరాకు” గా తీసాడో ప్రవీణ్ అంత “beautiful” గా తీసాడు. నీతి: ప్రతి filmmaker ఎప్పటికయినా సంకనాకిపోయి చెత్త సినిమా తీస్తాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *