Thondimuthalum Driksakshiyum

Watched this beautifully made Malayalam drama a year ago randomly while browsing aha, and got the reminder about the post I’ve written on the same night I watched the film on FB with great excitement, sharing here now to maintain the archive!

Thondimuthalum Driksakshiyum” is a Malayalam thriller directed by Dileesh Pothan and shot by Rajeev Ravi. Director’s second film after the commercial hit of “Maheshinte Prathikaaram” in 2016. 

ఆహా recent గా తెలుగులో డబ్ చేసే వరకు కూడా ఈ సినిమా గురించి తెలియదు. ట్రైలర్ చూసేముందు thumbnail మీద ఫాహద్ ఫాసిల్ మొహం చూసి ఖచ్చితంగా చూడలేమని ఫిక్స్ అయ్యా. ఈ మధ్య చూసిన రెండు మూడు సినిమాలో Fahad కారెక్టర్, అక్టింగ్ అన్నీ మరీ అతిగా చేస్తున్నాడు అనిపించి ఇంక చాలే భయ్యా ఏం చూస్తాం అనుకున్న. ఒకవేళ ఈ సినిమా చూసుండకపోతే ఇంకొన్ని రోజులు/నెలలు/సంవస్తరాలు  అలాగే అనుకుంటూ ఉండేదానేమో . ఇంత సింపుల్గా, intensed గా డ్రామా నీ తీయడం మల్లు వాళ్ళుకే వచ్చు అనేలా తయార్ అయింది పరిస్తితి . ట్రైలర్ మ్యాడ్, నాకు బాగా నచ్చింది. అబ్బా ఇదెప్పుడు వచిందబ్బా కనీసం ఎక్కడ వినలేదు చూడలేదు అనుకున్న. అంటే ఫాఫా సినిమా అంటే ఎక్కడో ఒక చోట హడావిడి కనిపించాలి కదా అనుకున్నా. కాని ట్రైలర్ చూసిన చాలా రోజుల వరకు ఈ సినిమా చూడడం వీలు కాలేదు, atlast ఇవ్వాళ సినిమా చూశాను .

 ఎన్నిసార్లు “దొంగాట” అనే టైటిల్ కనిపించిన(ఆహా తెలుగు డబ్బింగ్ సినిమా టైటిల్) ట్రైలర్ గుర్తొచ్చి వెంటనే సినిమా చూడాలి అనుకునేదాన్ని, కానీ ఎందుకో ఏమో చాలా రోజులు delay చేశాను.

ఏదో తెలుగు డబ్బింగ్ సినిమా అందులోనూ ఆహాలో ఉందంటే, అయినా ట్రైలర్ బాగుంది కదా, సరేలే కాసేపు చూద్దాం అనుకొని మొదలుపెట్టి, తెలుగులో చూస్తుంటే చిరాకేసింది. కొద్ది సేపటి వరకు ఎక్కడ ఆపెస్తానో అనే dilemma, కాసేపటికి మంచిగా అనిపిస్తున్న కొద్దికి స్టార్ట్ అయ్యింది దరిద్రమైన ugly తెలుగు డబ్బింగ్. అసలు మొత్తం సినిమా ఫీల్నే పాడు చేసేంత పాడుగా చేశారు ఆహా ముష్టి టీమ్.  అసలు ఇంత క్రేజీ సినిమా ఇలాంటి బ్యాడ్ డబ్బింగ్ లో చూడడం నా దరిద్రం అనుకొని వెంటనే hotstar లో ఒరిజినల్ మంచి ప్రింట్ ఉందని చూసి సినిమా చూడడం మొదలుపెట్టా . 

ఈ సినిమా గురించి, అంటే ఏ సినిమా గురించైనా ఏమైనా ఎక్సయిట్ అయ్యి ఇలా అనిపించింది అని రాయడం మొదలుపెట్టినప్పుడు చాలా రాయాలని ఉంటుంది, అంటే everything about it, అది అలా వర్కౌట్ కాదని రాయడం మొదలు పెడితే కానీ అర్థం కాదు చాలాసార్లు. ఎంత రాసినా ఎంత ట్రై చేసినా కొన్ని సార్లు మరీ మన బ్యాడ్ or సినిమా అలాంటిది అవ్వడం వల్ల చెప్పాలనుకున్నవి అన్ని చెప్పలేకపోతున్నా, రాయలేకపోతున్నా అనుకున్నపుడు రాయడం ఆపేసి, వీలైతే సినిమాలంటే ఇష్టం ఉంటే, ఓపిక ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడండి అని చెప్పాలనిపిస్తుంది. దయచేసి ఆహా లోని తెలుగు డబ్బింగ్ లో ఉన్న “దొంగాట” చూడద్దు, సినిమాలోని ఇంటెన్సిటీనీ చాలా దారుణంగా సిల్లీ dialogues తో చెత్త చేసింది. మలయాళంలో మాత్రమే చూడాలి, సినిమా తీసిన భాషలో చూస్తేనే అసలైన కిక్ వస్తుంది, అది ఏ సినిమా అయినా. అందుకే కదా subtitles అనే ఆప్షన్ ఒకటి ఉంది. ఇంత స్ట్రెస్ చెయ్యడానికి కారణం, నేను 20 నిమిషాల సినిమా తెలుగులో చూడడమే. 

రాజీవ్ రవి షూట్ చేసిన ఇంకో బ్యూటిఫుల్ సినిమా, ఆక్టర్స్ గురించి మాట్లాడడం మొదలు పెడితే ఇప్పుడు అది చాట భారతం అవుతుందనే భయంతో అంత ధైర్యం చెయ్యట్లేదు. కానీ ఖచ్చితంగా యాక్టర్స్ గురించి మాట్లాడుకోవాలి అనిపించే రేంజ్లో ఎవడికి వాడు ఇష్టం ఉన్నట్లు ఇచ్చి పడేశారు. 

“దొంగాట” అనే టైటిల్ తో తెలుగులో కూడా ఒక సినిమా వచ్చింది 1996 లో, జగపతి బాబు, సౌందర్య, సురేష్ లీడ్స్. చిన్నపుడు ఈ సినిమా థియేటర్లో చూసాను. అప్పుడు ఉన్న sensibilities కి, patience కి అదే చాలా ఎక్కువ, అసలు సినిమా theatre లో చూడడమే ఎక్కువ, అదొక luxury లాంటిదే .

ఈ టైటిల్ చూడగానే తెలుగు దొంగాట సినిమా అన్ని సీన్స్, సాంగ్స్, ఫైట్స్, లొకేషన్స్, ట్రైన్, జగపతి బాబు చేసిన దొంగ వేషం అన్ని ఒకదాని తర్వాత ఒకటి వద్దు అన్నా కళ్ళ ముందు రాపిడ్ ఫోర్స్ తో చకచకా వచ్చి వెళ్తున్నాయి .

ఇక మలయాళంలోని దొంగాట అదే మన తోండిముతలం ద్రిక్సాక్ష్యం సినిమా విషయానికొస్తే, ఒక అమ్మాయి అబ్బాయి ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంట్లో నుండి వచ్చేసి దూరంగా సింపుల్ గా బ్రతుకుతున్న వాళ్ళ జీవితంలో ఒక దొంగతనం వల్ల వచ్చే పరిణామాలు, తర్వాత అసలు దొంగ దొరుకుతాడా అనేది బేసిక్ ప్లాట్ పాయింట్. భార్య భర్తల కరెక్టర్స్ చేసిన నిమిష & సూరజ్ ఇద్దరు పిచ్చ believable గా సెట్ అయ్యారు, వాళ్ళు ఉండే ఇల్లు, వాళ్ళ expressions అబ్బా అసలు చాలా సేపు నేను అంత మర్చిపోయి mesmerise అయ్యి, మునిగిపోయి చూసిన సినిమా.. ఒక బస్లో జరిగే దొంగతనం, బస్ మొత్తం స్టేషన్ కి తీసుకొని పోయి చెక్కింగ్ మొదలు పెడతారు, స్టేషన్ లోని పోలీసులు, వాళ్ళ సెటప్ మొత్తం dealing సినిమా అనే విషయం మర్చిపోయేలా చేసి, ఇదేదో నిజంగా జరుగుతుంది అనెట్లు ఉంటుంది. అందులో ఫాహద్ చేసిన బ్రిలియంట్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. 

సినిమాలోని చాలా సీన్స్ చూస్తుంటే ఇది కదా అసలు కథ ఖార్ఖాన, ఇంత బేసిక్ విషయాల్ని అంత సింపుల్ గా తీయడం అంటే పెద్ద అచీవ్మెంట్ అనిపించింది. మ్యూజిక్, ఎడిట్, అక్టర్స్, ఓవరాల్గా ఇదొక కత్తి లాంటి సినిమా. చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి, నాకు బాగా నచ్చిన సినిమాలో, నా మోస్ట్ favourites లో ఇప్పుడూ ఇదొకటి. 

Fahad “అన్నయుం రసులుం” 2013 లో Kerala film festival లో బిగ్ స్క్రీన్ మీద చూసి ఇదేం సినిమా, అసలు వీళ్ళు ఏంటి ఇంత నిజాంగా ఉన్నారు, ఇలాంటి సినిమా నా లైఫెలో అప్పటిదాకా చూడలేదు అనుకుంటూ సర్ప్రైజ్ అయ్యా. అందుకే నాకు Fahad అంటే ఇష్టం, కానీ ఈ మధ్య వచ్చిన సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ చూసి జీర్ణించుకోలేక అబ్బా ఎంత ఘోరంగా చేస్తున్నాడు అనుకొని అస్సలు fahad సినిమాలు చూడదు అనుకున్న టైమ్లో కరెక్టుగా ఈ సినిమా చూడం వల్ల fafa, “Whatte great performance” అనిపించింది..ఇది 2017 లో వచ్చిన సినిమా, అప్పటికి ఇప్పటికి ఎన్నో మారాయి, ఎంత మంచి యాక్టర్స్ ఎంత చండాలంగా చెయ్యడం మొదలుపెట్టారు, చాలా జరిగాయి, crazy యాక్టర్స్ అనుకున్న వాళ్లు ఒక హిట్ తోనో ఫ్లాప్ తోనో యాక్టింగ్ ఘోరంగా చెయ్యడం మొదలుపెట్టారు, కొంతమంది డైరెక్టర్ల అతి instructions, బ్యాడ్ taste/judgement వల్ల కూడా అనిపిస్తుంది. 

నిమిష debut అంటే ఎవరైనా నమ్ముతారా ఈ సినిమా చూశాక? Powerhouse performance అంటే ఇది, ఇంత subtle గా, బ్యూటిఫుల్ గా చేసే అమ్మాయిని cast చెయ్యడంలోనే సినిమా ఆల్మోస్ట్ హిట్ అయినట్టే, మిగితా అంతా అడిషనల్.  “The Great Indian Kitchen” చూసినప్పుడే ఫిదా! మనకి ఒక Nimisha లాంటి క్రేజీ పర్ఫర్మ్ ఒకరు ఉంటే ఎంత బాగుంటుందో, అదేలే తీసే వాళ్ళు కూడా ఉండాలనుకో, అది వేరే విషయం. 

Bye! 

Trailer Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *