దొరకడేందిరా….

“హే ఈ దిమ్మరి లొల్లేందో నీకెరుకనా”  కొత్తపోరడు కోసం నేను రాసిన పాట, స్మరణ్ సంగీతంలో వివేక్ సాగర్ పాడిన పాట, సింపుల్ గా ఉండాలి లిరిక్స్ అని నేను నిరంతరం చేసే చేసిన ప్రయత్నాల్లో ఈ పాట very special. ఎందుకంటే నేను ఇంకో దర్శకుడి కోసం రాసిన పాట. చాలాసార్లు రాసినా కొత్తపోరడు గురించి మళ్ళీ రాయాలనిపిస్తుంది, కాబట్టి మీరు చదివిన విషయాలు repeat అవ్వొచ్చు. 

ఈ మధ్య నేనూ పవన్ వేసవి రాత్రుల్లో బీర్లు తాగుతూ OTT లకి వస్తున్న తెలుగు సినిమాలు చూస్తున్నాం, మొత్తం చూడం 5-10 నిమిషాలు లేదా అలా డ్రాగ్ చేసుకుంటూ కొంత దూరం వెళ్తాం and హిట్ అయిన జనం మెచ్చుకున్న సినిమాలు చూడం. Mostly first time directors సినిమాలు. 

 “హెచ్చరిక”

ఇక్కడ నుంచి నా RANT మొదలవబోతోంది. అలాంటివి చదవము అనుకుంటే ఇక్కడితో ఆపేయండి. 

అంత ఘోరంగా ఉందేంటి man తెలుగు so called new age cinema, ఎన్ని స్లోమోషన్ షాట్లు అంటే ఒక్కో సినిమాలో, ఖచ్చితంగా ఇది tiktok inspiration అని నేను fix అయిపోయా. అర్రే, హీరోయిన్ నిద్ర లెగిస్తే స్లోమోషన్, మొహం కడుక్కుంటే స్లోమోషన్, కదలకుండా కూర్చున్నా స్లోమోషన్, జుట్టు ఎగురుతుంటుంది కద. భరించలేనంత స్లోమోషన్. 100% lead actors are bad, 90% other actors are bad, ఎక్కడో ఒకళ్ళు పర్లేదు decent acting  చేసేవాళ్ళు కనిపిస్తున్నారు. 150 మంది actors తో పనిచేసి, tfi కి మంచి నటులని అందించి, ప్రేక్షకులకి “wonderful acting” experience చేయించిన గర్వంతో చెప్తున్నా, telugu cinema acting standards చాలా ఎదగాలి, ప్రేక్షకులు కూడా ఇదింతే అని adjust అయిపోయినట్టుంది. నేను నెగటివ్ మాట్లాడుతున్నాను అనుకుంటే అది వాళ్ళ ఖర్మ, తెలుగు సినిమా మీద ప్రేమతో మాట్లాడుతున్నాను. అయినా flop &  bad films చూసి అలా ఎలా మాట్లాడ్తావ్ అంటే, entire తెలుగు సినిమా acting అలా ఉంది, trailers చూస్తుంటా, రోహిత్ అన్నం తింటున్నప్పుడు తెలుగు కమర్షియల్ సినిమా చూస్తుంటాడు, అలా ఒక్కో సినిమాని మూడు నాలుగు రోజులు చూస్తాడు, ఒక్కోసారి నేనూ చూడాల్సొస్తుంది, చెప్తున్నా any film, తెలుగు సినిమాల్లో acting standards చాలా poor గా ఉన్నాయి. ఇది పూర్తిగా directors ని blame చేయాల్సిన విషయమే, చాలా మంది మంచి actors ఉన్నారు, వెతికి పట్టుకోవాలి. Casting agents ఉన్నారు, associate directors వందల ఆడిషన్స్ చేస్తుంటారు, youtube వీడియోల్లో వెతుకుతుంటారు, ఈ effort సరిపోవడం లేదు. చాలా మారాలి. 

My dear actors & actresses మీరు చాలా ఎదగాలి నటీనటులుగా, మనకి మంచి సాహిత్యం ఉంది చదవకండి, కాదుకాదు చదవండి, చదివే అలవాటు లేదా తెలుగు రాదా కనీసం audio books వినండి, మంచి సంగీతం వినండి,  పాటలు వినండి చూడకండి, రోజుకొక్క సినిమా అయినా చూడండి, dance వేయండి, ఈ పనులు చేస్తే imagination పెరుగుతుంది, ఆలోచనా పరిధి విస్తృతమవుతుంది. దర్శకుడు చెప్తాడు మీరు దాన్ని ఎంత బాగా చేయాలి అనేది మీ భాద్యత. హోర్డింగుల మీద ఉన్నామా లేదా కాదు  జనాల మస్తిష్కాల్లో ఉన్నామా లేదా అనేది ముఖ్యం. దర్శకుల్ని ప్రేక్షకులని అలరించండి surprise చేయండి.

“ప్రతి ఇంట్లో గోడలు ఎందుకు కొత్తగా ఉంటాయి, అందరూ ఇస్త్రీ బట్టలు వేసుకుని ఎందుకు తిరుగుతుంటారు సినిమాల్లో” అని నేను 5th class నుంచి అడుగుతున్నా, why raja why ?

అలా beautification చేస్తేనే ప్రేక్షకులు చూస్తారు quality film అనుకుంటారు, production values అంటే అవే అనే  భ్రమలో బతికేస్తున్నారు తరతరాలుగా. లేదు audience కి ఆ fakery కాదు కావాల్సింది, వాళ్ళు చాలా మారుతున్నారు, మారిపోయారు. రంగులతో ఇస్త్రీ బట్టలతో సినిమాలు హిట్ అవవు, అన్ని సినిమాలు ఒకటే pattern, background colors కి actors బట్టల matching, damn boring to see that “plastic cinema”. కాస్త organic అవండి, అవసరమైతే fruits కొంచెం ఎక్కువ తినండి. Visual style rhythm తొక్క తోటకూర నాకూ తెల్సు, కానీ అన్నీ అలానే ఉంటే ఎలా. ఇంకొన్ని సినిమాల్లో అయితే కళ్ళు బైర్లు కమ్మే రంగులు, ప్రేక్షకుల కళ్ళు పాడు చేయకండి, అవే మన సినిమాలు చూసేది. రంగుల obsessive compulsive disorder తగ్గించుకుంటే కొత్త ఆలోచనలు వస్తాయేమో. 

ఇలా ఎన్నో ఎన్నెన్నో, ఆస్కార్ దాకా వెళ్ళిపోయాము, ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూస్తోంది మనం shake చేస్తున్నాం అనుకుంటూ బతికేస్తే అంతకన్నా ద్రోహం ఉండదు, self ద్రోహం. 

Coming back to కొత్తపోరడు, ఎన్నో ఏళ్ళ తర్వాత పల్లెటూరి సినిమా magic experience ఇచ్చిన fiction. Village flavour అంటారు చూడండి దాన్ని తెర మీదకి ఆవిష్కరించిన webseries. ఇప్పుడు వస్తున్న rural telangana cinema feel ని చాలా బలంగా చూపించిన work ఇది. “Anvesh is from avanti” నేను గర్వంగా చెప్పుకుంటా. కథ City కి వచ్చినాక అంతేం ఉండదు అంటారా, నాకనవసరం. ఊరులో జరిగే కథకి నేను sold, ఆ తర్వాత ఎలాగున్నా నేను చూసేస్తా. 

Village లో కథ ఉన్నంత సేపు you can feel the village & people, this is an achievement for a first time filmmaker. Director గా hero గా debut is crazy and Anvesh nailed it. ప్రతి filmmaker కి నేనేదో కొత్తగా చూపించాలి అనే తాపత్రయం ఉంటుంది, తనకు తెలిసిన ఊరు బతుకులు చూపించాడు, అదే ఆ సీరీస్ కి కొత్తదనం, hats off to Allu aravind & aha for producing this. 

దీంట్లో music & image చాలు, అన్వేష్ ఈ idea అనుకోవటం వల్లనే కదా ఆ music & image సృష్టించబడ్డాయి. కొత్తగా ఏమన్నా చేద్దాం అనే ఆరాటపోరాటాల్లో విపరీత వింత కథల జోలికి పోకుండా simple గా తనకు grip ఉన్న చోట అన్వేష్ బానే ఆడాడు ఆట. చూద్దాం next ది ఎలా ఉంటుందో. 

అయిపోయింది

నా రాత మీకు నచ్చితే కింద qr code ఉంది కొట్టగలిగినంత కొట్టేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *