This is an old post from the archives that Divya wrote while looking to fund Pickpocket. You can still fund her but all the proceeds will go towards Pickpocket 2 which is currently in Production.
“కేవలం pickpocket సినిమా గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళ కోసమే” అని స్టార్ట్ చేద్దామనుకున్నా కానీ వద్దులే అని డిసైడ్ అయ్యాను. వీలైనంత మంది షేర్ చేస్తే pickpocket త్వరగా బైటికి వస్తుంది.
pickpocket Divya గా పిలుస్తున్న వాళ్ళందరికీ, సినిమా ఎలా ఉంటుంది అని వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ, సినిమా స్టార్ట్ చేసినప్పటి నుండి డబ్బులిచిన వాళ్ళందరికీ, సినిమాకి పని చేసిన నా ఫ్రెండ్స్ అందరికీ ఈ పోస్ట్ ద్వారా సినిమా గురించి అప్డేట్ ఇద్దామనుకుంటున్న. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో ఘాట్ స్టార్ట్ చేసి జనవరి లోపు ఫస్ట్ కట్ అయిపోయి, మేమందరం ఇప్పటికే మూడు నాలుగు సార్లు చూశాం. ప్రొఫెషనల్ గా మీటింగ్స్ పెట్టుకొని, మాట్లాడుకుని, బడ్జెట్ గురించి బార్గైన్ చేసిన రాదేమో అనిపించే లాంటి బ్యూటిఫుల్ మ్యూజిక్ composed చేశాడు. క్రౌడ్ ఫండింగ్ సినిమాకి డబ్బులు ఉండవు, చెయ్యి ఖర్చులకి తప్ప remunerations సంగతి దేవుడు ఎరుగు. స్మరణ్ ని అడుగుదాం అనుకోగానే ఫస్ట్ భయం వేసింది. అసలు చూస్తాడా సినిమా? చూసిన నచ్చుతుందా? నచ్చిన నేను అసలు పైసలు ఇవ్వగలనా? స్మరణ్ చెయ్యను అంటాడేమో? ఇలా చాలా అనుకున్న. కానీ సినిమా చూశాక స్మరణ్ కి నచ్చింది, చేస్తాను అని చెప్పాడు. చాలా ఎక్సైటింగ్ గా మాట్లాడాడు కూడా. నన్ను చాలా మంది అడుగుతున్న క్వశ్చన్, “స్మరణ్ ఎంత తీసుకుంటాడు అని?” . బైట వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ స్మరణ్ ఇంత అని ఎప్పుడు అడగలేదు! నేను చాలా ఇబ్బంది పడుతూ ఏమైనా వస్తే ఇస్తాను అన్న ప్రతిసారి, “అరే ఓకే బ్రో !” అని తను మ్యూజిక్ పంపిస్తూ సర్ప్రైస్ చేస్తున్నాడు.
ఇదంతా చెప్పాల్సిన అవసరం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒక ఇన్డిపెన్డంట్ సినిమా వెనకాల డబ్బులు లేకుపోవడం వల్ల జరిగే మాజిక్స్ చెప్పడం వల్ల చాలా మంది అప్‌కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కి hopeful గా ఉంటుందనిపించింది. ఇప్పటికే “తోడు దొంగలు”, ట్రైలర్ లో వాడిన ట్రాక్ కి మంచి response వచ్చింది. చాలా మంది స్మరణ్ మ్యూజిక్ విని నెక్స్ట్ లెవెల్ లో చేశాడు, కిరాక్ ఉంది భయ్యా అని చాలా పొగుడుతున్నారు. స్మరణ్ మ్యూజిక్ చేసి పంపించిన్న ప్రతి సారి ఒకటి రెండు రోజులు నమ్మబుద్ది కాలేదు, “ఇదంతా pickpocket కోసమేనా” అని. ఎన్ని సార్లు విని వావ్ అనుకున్న మళ్ళీ విన్నపుడు ఖచ్చితంగా మెస్మరైస్ అవుతాను. ఇది ఒక wonderful ఎక్స్పీరియన్స్, అసలు మన సినిమాకి పాటలు/మ్యూజిక్ ఉండడం అనే ఫీలింగ్ చెప్పడం కష్టం, అది కూడా ఇలా ప్రతిసారి అసలు ఎక్స్పెక్ట్ చెయ్యని ట్రాక్ పంపిస్తుంటే అల్మోస్ట్ overwhelming తో ఏడుపొచ్చేస్తుంది. స్మరణ్ గురించి ఎంత చెప్పిన తక్కువే అనే విషయం ఇప్పటికే చాలా మందికి తెలిసిన విషయం, pickpocket ఆల్బమ్ మొత్తం రిలీస్ అయ్యాక మిగితా వాళ్ళకి అర్ధం అవుతుంది అనుకుంటున్నా. ఇప్పటికే మ్యూజిక్ మొత్తం వచ్చేసింది, ఫైనల్ కట్ వచ్చేసింది. ఈ మధ్యే ఒరిజినల్ మ్యూజిక్‌తో సినిమా చూసి “ఇట్స్ ఎనఫ్”అనుకున్న! అసలు ఊహించని మ్యాజిక్ ఏమైనా అయింది అంటే pickpocket సినిమా పూర్తి చెయ్యడం, దానికి పని చేసిన, చేస్తున్న వాళ్ళు దాని ఇష్టపడి చెయ్యడం. డబ్బులిస్తే కానీ పని జరగదు అనే సిట్యుయేషన్ ఈ సినిమాకి రానందుకు చాలా హ్యాపీగా ఉంది. మొదటి సినిమాతోనే ఇంత సపోర్ట్ అండ్ హెల్ప్ దొరుకుతుంది అనుకోలేదు, In a way, I am the most luckiest.
ఎప్పటికప్పుడు నెక్స్ట్ మంత్ సినిమా వచ్చేస్తుంది అని చెప్తున్న అందరికీ, నేను కూడా అదే నమ్ముతున్న. కానీ సినిమా సౌండ్ మిక్స్ అవ్వాలి. అయిపోతుంది. స్క్రీనింగ్ పెట్టుకోవచ్చు అని వెయిట్ చేస్తున్న. నా అదృష్టానికి నాతో ఈ సినిమాకి పని చేసే వాళ్ళు డబ్బులు డిమాండ్ చెయ్యకపోయిన, బేసిక్ ఖర్చులకి క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన డబ్బులు ఉపయోగించాము.
ప్రస్తుతం సినిమా ముంబై లో సౌండ్ డిసైనర్స్ దగర ఉంది. సౌండ్ డిసైనర్స్ సినిమా చూసి చాలా నచ్చింది అని ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళు remunerations తీసుకోకుండా చేస్తాం కానీ స్టూడియో ఖర్చులు, foley చేసే వాళ్ళకి, వాళ్ళ టీంకి ఏదో కొంచం remunerations ఇవాల్సి వస్తుందని చెప్పారు. స్టోరీ డిస్కషన్ 2 కి సౌండ్ డిజైన్ చేసిన Teja అండ్ Jubin, pickpocket కి మిక్స్ అండ్ డిజైన్ చేస్తున్నారు.
ఇప్పటికే కొంత మంది అవంతి సినిమా ఫ్యాన్ బాయ్స్ చేసిన ఫండింగ్, pickpocket ట్రైలర్ చూసి నచ్చి పంపించిన డబ్బులు సినిమా ఫినిష్(వితౌట్ మిక్స్)చెయ్యడానికి పనికొచ్చింది. చివరిగా ఇంకో లక్ష ఉంటే సినిమా సౌండ్ కూడా ఫినిష్ అవుతుంది. ఎక్కడ కనిపించిన్నా, ఫోన్ చేసిన నన్ను అడుగుతున్న వాళ్ళందరికీ నేను చెప్పాలనుకున్నది ఒకటే, “pickpocket సినిమా బైటికి రావాలంటే, ప్రైవేట్ స్క్రీనింగ్ జరగాలంటే ఒక లక్ష రూపాయలు కావాలి. సౌండ్ మిక్స్, డిజైన్ అయిపోతే వెంటనే స్క్రీనింగ్ ప్లాన్ చేద్దామని వెయిట్ చేస్తున్న. సినిమా స్క్రీనింగ్ డేట్ announce చేశాక మొత్తం ఆల్బమ్ కూడా రిలీస్ చేసే ప్లాన్ ఉంది. రీసెంట్ గా “toxication” అనే ఇంగ్షీషు పాట రిలీస్ అయ్యింది. కొన్ని technical glitches వల్ల spotify లో అప్లోడు కాలేదు. కానీ wynk మ్యూజిక్ app లో పాట స్ట్రీమ్ అయితుంది. మెల్లిగా ఒకటి ఒకటి రిలీస్ చేస్తాము, ఆల్బమ్ మొత్తం యూట్యూబ్ లో అప్లోడు అవుతుంది. pickpocket కోసం నేను చెయ్యబోతున్న చివరి క్రౌడ్ ఫండింగ్ కాంపేన్ ఇదే. ఇప్పటి వరకు డబ్బులు పంపించిన వాళ్ళందరికీ థాంక్స్. పర్సనల్‌గా ఫోన్లు, మెసేజెస్ చేసి ఎవర్ని అడగాలో అర్ధం కాక ఇన్ని రోజులు వెయిట్ చేశాను. క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బులు ఉండి, పంపించగలిగే వాళ్ళు ఏమైనా ఫండ్ చేస్తే సినిమా ఫినిష్ అయిపోతుంది.
ఖచ్చితంగా సినిమా నచ్చుతుంది, ఇది ఇంకా delay అవ్వదు, వెంటనే బైట పెట్టాలనే కోరికతో స్టార్ట్ చేస్తున్న లాస్ట్ క్రౌడ్ ఫండింగ్ కాంపైన్.”
సినిమాకి పని చేసిన కామెరామెన్, ఎడిటర్, యాక్టర్స్ గురించి ఇంతక ముందే చాలా సార్లు మాట్లాడను, తేజ అండ్ జూబిన్ గురించి రాయాల్సి, మాట్లాడాల్సింది చాలా ఉంది. వాళ్ళ గురించి మాట్లాడాలంటే, స్టోరీ డిస్కషన్ 2 అండ్ శీష్ మహల్ గురించి మాట్లాడాలి. వాళ్ళ గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం.
ఫండ్ చెయ్యాలనుకున్న వాళ్ళు డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వండి, మీరు ఫండ్ చేసే ఎంత చిన్న అమౌంట్ అయినా లక్ష రూపాయాలకి add అవుతుంది.
థాంక్స్ !!!