చాలామంది ఈ విషయంలో తెగ మధనపడిపోతున్నారు, ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాలో ‘తెలంగాణ సినిమా’ తన existence చాటుకుంటోంది. ఇలాంటి కొత్త సినిమా వస్తున్నప్పుడు filmmakers ఎప్పుడూ చూపించని వాళ్ళ ఊర్లని మనుషుల్ని వాళ్ళ జీవనవిధానాల్ని చూపించే ప్రయత్నం చేస్తుంటారు, especially low budget సినిమాలకి source పరిసరాలే. తాగుడు ని తెర మీద చూపించాలని చాలా మంది filmmakers కి ఉంటుంది, మందు కొట్టాక వచ్చే comedy కావచ్చు violence కావచ్చు చాలా entertaining గా ఉంటుంది. మా “నిరుద్యోగ నటులు” చూసి ఎంత తాగుడురా నాయనా అని చాలా మంది అన్నారు, brand వేసేసారు కూడా “మందు సిగరెట్ filmmakers” అని, we love it. రాబోయే సినిమాల్లో మరింత ఉధృతంగా ఉంటుంది మందు, కాస్కోండి.
పరేషాన్ నాకొక special film, ఆ సినిమా నిర్మాతలే మా Double Engine నిర్మాతలు, viswa & siddu. మాకు అపరిమిత freedom ఇచ్చి, script అడగకుండా just కథ విని go ahead అన్న వాళ్ళ ధైర్యానికి hats off. Director rupak ఆరేళ్లుగా ఫ్రెండ్, cameraman vasu, వాళ్ళ టీంలో సునీల్, art director శ్రీపాల్, direction టీం వాళ్ళు అందరూ మంచి ఫ్రెండ్స్ నాకు. Actors లో ఫ్రెండ్స్ ఉన్నారు, అందుకే స్పెషల్ ఫిలిం నాకు. కరోనా peak moment లో చాలా కష్టపడి ఈ సినిమా చేసారు, నా friends అనో, కష్టపడ్డారనో hit అవ్వాలి అని కోరుకోలేదు. నాలుగు ప్రివ్యూలు చూసి బాగా నచ్చింది సినిమా. ఎంత నచ్చిందో instagram లో రాసాను.
ఈ సినిమా రివ్యూస్ లో మందు గురించి చాలా మంది ‘బాధపడ్డారు’, ఇలాంటోళ్ళ బాధ ఏంటో అర్ధం కాదు నాకు. Yes, చాలా సీన్లలో మందు ఉంది, దాంతో పాటు మందు వల్ల పాత్రల జీవితాల్లో జరిగే అనర్ధాలు కూడా ఉన్నాయి, నాకు కనిపించాయి, మీకు కనిపిస్తాయో లేదో నాకు అనవసరం. ఆ సినిమాలో నాకు మంచిర్యాల కనిపించింది, opening లో వచ్చే బొగ్గు గని షాట్ నాకు ఎంత నచ్చిందంటే, నేను కొత్తగా ఏదో చూసాను అని నా ఫీలింగ్. హీరో తండ్రి ఉద్యోగం retirement plan దానికోసం జరిగే process నాకొక కొత్త విషయాన్ని చూపించాయి. ఇది కాక ఎన్నో కొత్త మనుషుల జీవితాలు చూసాను నేను పరేషాన్ లో. రోహిత్ నాతో మాట్లాడుతూ “పరేషాన్ లో బైక్ అనే ఎలిమెంట్ చాలా బాగా వాడుకున్నారు” అని, అది దర్శకుడు చూసిన జీవితం, అది బాగా reflect అయింది సినిమాలో, అలాగే తాగుడు కూడా అని నా ఫీలింగ్.
కథ లేదు, ఇదొక complaint, కథ లేకుండా ఉండదురా నాయనా, ఈ సినిమా ఒక చిన్న point మీద నడిచే సినిమా, ఇలాంటి కథలకి screenplay చాలా కష్టం. ఒక పాయింట్ తో రెండు గంటలు hold చేయాలంటే ఈజీ కాదు, అది బానే చేసాడు రూపక్. పరేషాన్ మీదా నాకూ కంప్లైంట్స్ ఉన్నాయి, కానీ అంతకన్నా ఎక్కువ entertain చేసే విషయాలున్నాయి, so i enjoyed ఫిలిం.
ఇది నా దృష్టిలో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా, మందు తాగితే అన్ని రకాలుగా సంకనాకిపోతారు అనే అద్భుతమైన సందేశాన్ని సమాజానికి ఇచ్చింది 😁. దర్శక నిర్మాతల అలా ఆలోచించారో లేదో తెలియదు కానీ నాకైతే అలానే అనిపించింది. అయినా సినిమాల్లో మెసేజ్ లు టెలిగ్రాంలు ఎందుకు బ్రో, సినిమా చూస్తే చిల్ అవ్వాలి, అలాంటి చిల్ film పరేషాన్.
నా రాత మీకు నచ్చితే కింద qr code ఉంది కొట్టగలిగినంత కొట్టేయండి.