నన్ను అత్యంత influence చేసిన filmmakers లో మీరా effect వేరు & very స్ట్రాంగు.
Salaam bombay నా filmmaking దారిని decide చేసింది. నీ చుట్టూ locations ఉన్నాయి నీ చుట్టూ పాత్రలు వాళ్ళ కథలున్నాయి అనే ఆలోచన కలిగించింది ఆమె సినిమా. రాంగోపాల్ వర్మ రగిలించిన మంటలో పెట్రోల్ మీరా నాయర్. తన సలాం బాంబే నాకు forever inspiring, బాంబే slums లో మీరా shoot చేసింది, just to imagine her directing is fascinating. 1988 లో రిలీజ్ అయింది ఈ సినిమా.
“మన కథలు మనం కాకపోతే ఇంకెవరు చెప్తారు” అనే మీరా నాయర్ statement చదివిన రోజున అనుకున్నా “mira I am doing it” అని. నేను film industry లోకి enter అయ్యాకే మీరా నాయర్ గురించి తెల్సింది, చూడటమే “salaam bombay” తో మొదలుపెట్టా, పిచ్చెక్కిపోయా.
“నాకూ ఇలానే తీయాలనుంది మీరా, ఎలా తీయాలో తెలియని నాకు నువ్వొక ఐడియా ఇచ్చావ్” అనే confidence ఇచ్చిన సినిమా సలాం బాంబే. ఆ సినిమా ఎలా తీసిందో online research చేసా, చాలా విషయాలు simple అనిపించాయి. మీరా నాయర్ చేసినంత preproduction planning మన వల్ల కాదు అని అర్ధమైంది, still her words are inspiring. నేనూ తీయగలను సినిమా అనే నమ్మకం కలిగించిన filmmaker మీరా.
“Monsoon wedding” నేను చూసిన మీరా రెండో ఫిల్మ్, my all time favourite film, i want to achieve that simplicity. What a film, ఆ సినిమాలో actors performance చూస్తే కుళ్ళుపుడుతుంది ఇలాంటి actors నాకు దొరుకుతారా అని. Cinematography చూస్తుంటే భయం & ధైర్యం, భయమెందుకంటే how to do this అని, ధైర్యమెందుకంటే yes we can try this అని.
నువ్వూ తీయగలవు సినిమా అనే confidence ఇచ్చిన filmmaker మీరా నాయర్, తన interviews చూస్తే ఎక్కడ లేని బలమొస్తుంది, తన మాటలు వినటం అదొక ఆనందం. మీరా నవ్వులో ఏదో magic ఉంది.
నేను తన సినిమాలు అన్నీ చూడలేదు, చూడను కూడా, చూసినవి చాలు. మీరా interviews అన్నీ చూసా చూస్తా. తను మాట్లాడుతుంటే అలా వినేయచ్చు, I love you Mira.