కంగనా రనౌత్

Gangster cinema లో first time ఈ అమ్మాయిని చూసినపుడు wow ఎవరీ అమ్మాయి ఇంత unconventional beauty ఇంత captivating గా ఉంది అనిపించింది. ఊర్మిళ టాబు తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి మీదైనా కెమెరా పెట్టాలి, నా contemporary, ఖచ్చితంగా కంగనాతో ఏదోటి చేయాల్సిందే అనిపించింది. Fashion చూస్తున్నప్పుడు wow what a grace this is, she is so powerful అనుకున్నా. ఆ తర్వాత తన హిట్ సినిమాలు ఏం చూడలేదుగానీ కంగనా అలా brain లో ఉండిపోయింది, star heroine అయిపోయింది. ఇంక తన గురించి ఆలోచించలేదు. కానీ తన growth is sensational, హే ఏంటి ఆ curly hair beauty ఇంత wild statements ఇస్తోంది, ఎంత ధైర్యం కావాలి అలా చేయటానికి, హీరోల వల్ల కూడా కాని పని ఇది. అంత powerful bollywood పెద్దలని ట్వీట్లలో కెలుకుతోంది question చేస్తోంది, fearless beauty. ఎలా ఇంత ధైర్యం? Film industry లో జరిగే exploitation మీద మాట్లాడటానికే భయం అమ్మాయిలకి, ఈ అమ్మాయి ధిక్కార ధోరణి నచ్చింది. కేవలం తన హిట్ సినిమాలే తనకి ఇంత ధైర్యమిచ్చాయా ? కాదు, తను industry లోకి అడుగుపెట్టినపుడు జరిగిన అనుభవాలు రాటుదేల్చాయి. Online info ప్రకారం మొండి మూర్ఖపు పిల్ల టీనేజ్ నుంచే, అది clear గా తెల్సిపోతుంది తన interviews n posts లో. ఏ మగాడయినా తనంత తెగిస్తే statements ఇస్తే వాడు film industry లో survive కాలేడు, but this curly hair beauty survived, very rebellious. ఆమె political stand మీద మేధావులకి ప్రశ్నలు ఉంటాయి, కానీ బాలీవుడ్ లో ఉంటూ అక్కడి ‘పెద్దలు’ ని ఏకేసే తన ధైర్యానికి hatsoff. Bollywood లో fake మేధావులకి కొదవ లేదు, సందుకొకడుంటాడు. కంగనా తెంపరితనం నాకిష్టం, మీరు నన్నేం పీకలేరు అనే ఆ గట్స్ నాకిష్టం. Political power వాడుతోంది అనే వాళ్ళకి అదెంత ఆర్టో తెలియదు, అసలు బాలీవుడ్ కి against గా మాట్లాడే ఆమె ధైర్యం ఒకటే అనిపిస్తుంది, మొండిపిల్ల పెంకిపిల్ల అలాంటోళ్ళు ప్రపంచానికి నచ్చరు, ఆడోళ్ళయితే అస్సలు నచ్చరు. I love this small town arrogant girl, she is  rebellious n arrogant.

Curly hair girls are something else. I know it’s a very sexist statement, can’t help it.