చిన్నప్పుడు ఎప్పుడు కమల్ హాసన్ నీ చూసిన భయం, చిరాకు, కోపం వచ్చేది. అస్సలు నచ్చని యాక్టర్స్ లో కమల్ ముందుండే వాడు. కమల్ కనిపిస్తే చాలు ఛానల్ మార్చేసేదాని. ఎందుకో మరి, కమల్ మొహం చూస్తే నాకు అస్సలు నచ్చేది కాదు, “ఎర్ర గులాబీలు” అనుకుంటా నేను చూసిన ఫస్ట్ కమల్ సినిమా. మొత్తం కూడా చూడలేదు, కాసేపు అలా అంతే. మా అమ్మ ఎలాంటి సినిమా అయినా చూసేస్తుంది ప్లే అవ్వడం స్టార్ట్ అయ్యాక, నాకు అదే అలవాటు వచ్చింది రాను రాను. అలా ఆమె వల్లా నేను చిన్నప్పుడు చాలా తెలుగు సినిమాలు చూడల్సి వచ్చేది, బాగా ఎంజాయ్ చేసేదాన్ని కూడా. అందుకే నాకు కొత్త సినిమాలు నచ్చేవి కూడా కాదు, పాత సినిమాలో ఏదో కన్ఫర్ట్ ఉంటుంది, అది ఇమేజ్ అవ్వచ్చు, స్ట్రాంగ్ కథ అవ్వచ్చు, ఏదో ఒక ఎలిమెంట్ కట్టి కూర్చొపెట్టేది టీవీ ముందు.
సో, కమల్ నీ ఒక సినిమాలో చూసి ఇంకా ఎప్పటికీ నాకు కమల్ అంటే ఇష్టం లేదు అని డిసైడ్ అయ్యిన ఏజ్ అది. అందుకే చాలా సంవత్సారాలు వరకు నాకు ఎప్పుడు కమల్ సినిమా వచ్చిన చూడాలని ఉండేది కాదు, అదొక గొడవ కూడా ఇంట్లో. టీవీ ఛానల్ మార్చడానికి రీజన్ కమల్ అంటే ఇష్టం లేకపోవడమే. కాస్త పెద్దగా అయ్యి, స్కూల్ అయిపోయి కాలేజ్ కి వెళ్తున్నప్పుడు సెల్ఫ్ గా సినిమాలు, పాటలు, యాక్టర్స్ నీ explore చేసే టైమ్‌లో “స్వాతి ముత్యం” చూసాను. మళ్ళీ అదే, మళ్ళీ కమల్, అసలు కమల్ హాసన్ ఎట్లా హీరో అయిండు అని చాలా సార్లు అనుకుంటుండే. బాగా ఓవర్ యాక్షన్ చేసే యాక్టర్ అని గట్టిగా పడిపోయింది, ఇంకో పక్కన రజినీ కాంత్. మా అన్న ఫేవరెట్, ఆటోమేటిక్ గా నాకు favourite అయిపోయిండు. బాషా,నరసింహ లాంటివి ఎప్పుడు టీవీలో వచ్చిన కదలకుండా చూసే వాళ్ళం. అప్పటి నుండే రజినీ అంటే ప్రేమ, కమల్ అంటే కోపం చిరాకు.
తర్వాత ఎప్పటికో ఇలాగే ఫ్రెండ్స్ ఇంట్లో “పంచతంత్రం” ప్లే అవుతుంటే, ఇబ్బందిగా చూడదు అని ఫీల్ అవుతూ లేచి బైటికి వెళ్దాం అని ట్రై చేస్తుంటే, వర్కౌట్ కాక కూర్చోవాల్సి వచ్చి సినిమా చూడ్డం మొదలు పెట్టా. నేను అనుకునంత బ్యాడ్ ఏమి కాదు అని టర్మ్స్ కి వచ్చాను. దాని తర్వాత నుండి టీవీలో కమల్ హాసన్ పాటలు వస్తుంటే మార్చడం మానేశా, మా మమ్మీ హప్పీస్. అప్పుడే స్వాతి ముత్యం, సాగర సంగమం, ఇంద్రుడు చంద్రడు, భారతీయుడు, anbe sivam ఇలా కొన్ని టీవీలో ప్లే అవుతుంటే చూసేదాన్ని. మెల్లిగా ఆ భయం, కోపం bubble నుండి బైటికొచ్చా. “మరో చరిత్ర” చూసి మ్యాడ్ అయింది కూడా ఇదే టైంలో. అడ్వర్టైజ్ లో ముందు నుండే మరో చరిత్ర వస్తుంది అని తెలిసి, వెయిట్ చేసి మరీ చూసిన మొట్ట మొదటి కమల్ సినిమా అదే.
అనవసరంగా చాలా జడ్జ్ చేశా అనిపించింది, కానీ నా ఏజ్ నీ బ్లేం చెయ్యాలి సో లీవ్ ఇట్ అనుకున్న.
ఇప్పటికీ నాకు “మరో చరిత్ర”లో కమల్ కారెక్టర్ అంటే చాలా ఇష్టం, పర్సనల్ గా అలాంటి మనుషులంటే ఇష్టం అని అర్దం అవుతున్న వయసు కూడా అదే.
“బ్రహ్మచారి” చూసి ఎంజాయ్ చేసినంత కమల్ ఏ సినిమా చూసి ఎంజాయ్ చెయ్యలేదు, “నాయకన్” తప్పా. అలా exploration లో భాగంగా, “Hey Ram” ఒక గంట చూసా. అక్కడి దాకా చూడడమే చాలా ఎక్కువ అనిపించింది, హెవీ సబ్జెక్ట్ డీల్ చెయ్యాలంటే అంత ఓపిక, ఎనరిజీ, మూడ్ కావాలి, అవేవి లేక తర్వాత ఎప్పుడు hey ram కంటిన్యూ చెయ్యలేకపోయాను.
కమల్ చాలా వరకు అన్ని సినిమాలు వాటి సబ్జెక్ట్ మాటర్ వల్లే చూడలేము అని అనిపిస్తున్నా కొద్ది, చిల్ ఉండే సినిమాలు చూడాలని ఎక్కువ కోరిక పెరిగింది. “దశావతారం” చూడలేక నిద్రపోయా theatre లో, “విశ్వ రూపం” అయితే ఇంకా దారుణంగా అనిపించింది. “Uttama villain” చాలా వరకు చాలా బెటర్ గా అనిపించిన్న సినిమా ఆఫ్టర్ దశావతారం & Vishwaroopam.
ఇంక రీసెంట్ టైంలో theatre లో చూసి ఘోరంగా ఎంజాయ్ చేసిన సినిమా, “విక్రమ్”, తర్వాతా ఇంట్లో రాండమ్ గా చూడడం మొదలు పెట్టి ఫినిష్ అయ్యేదాకా లెవ్వ బుద్ది కానీ సినిమా “నాయకన్”.
చిన్నప్పుడు సినిమాటిక్‌గా ఉండడం వల్ల “Bombay” నచ్చింది కానీ ఒక 3 years back మళ్లీ చూద్దాము అని స్టార్ట్ చేస్తే పరమ బోర్ కొట్టడమే కాదు సంబంధం లేకుండా ఉంది సినిమా అనిపించింది. ఒక మంచి పాట షూట్ చేశాం, weather మెంటల్ మెంటల్ గా ఉంది, మనీషా కోయిరాలా అందంగా ఉంది, లిరిక్స్ గుచ్చేస్తున్నాయి అని తప్పా అసలు “ఉరికే చిలకా” పాట ఎందుకు అప్పుడు అక్కడ సినిమాలో వస్తుందో నాకు అర్ధం కాక, మని రత్నం మీద చిరాకెసింది.
Social issues మీద, religion, caste system మీద సినిమాలు తీయడం అంటే అది తన పర్సనల్ ఇంటరెస్ట్, అండ్ అవ్వని పక్కన పెడితే “బొంబాయ్” సినిమాలో ఏమైంది అని అరవింద్ స్వామి ఏడుస్తూ పాట పాడుతుంటాడు? Manisha ఏమో ఏదో అయిపోయినట్టు లవర్ కోసం పరిగెత్తుకుని రావడం. దాని జస్ట్ ప్రైవేట్ ఆల్బమ్ లా, సింగిల్ గా చూస్తే ఇలా అనిపించకపోవచ్చు..కానీ సినిమాలో ఫస్ట్ టైం మనీషా కోయిరాలా నీ అప్పుడే అనుకోకుండా ఒక చోట చూసి మన young journalist అరవింద్ స్వామి ఆమెని ఇష్టపడి ఆ పాట ఊహించుకోవడం is senseless, that killed the rest for me. అంటే అసలు ఇద్దరి మధ్య ఇంకేం జరగలేదు, అసలు hi, hellos కూడా. ఎందుకంత చచ్చిపోతుండు అరవింద్. ఆ పిల్లని ప్రేమించి ఇంట్లో వాళ్ళు పెళ్లికి వద్దంటే, పెద్దలు విడదీస్తే, లేకపోతే వీళ్లిద్దరూ కొట్టుకొని ఒకరిని ఒకరు మిస్స్ అవుతుంటే కదా వచ్చే heavy పాట అది. అసలేం అనుకోవాలి ఆ పాట అప్పుడు వస్తె, చూసే వాళ్ళు ఎడ్డోలా, అరవింద్ స్వామి ఎడ్డొడా, మని రత్నమా?
అందుకే నాకు మని రత్నం సినిమాలు పెద్దగా నచ్చవు, సినిమాటిక్ గా, మంచి ఫీల్ గుడ్ మ్యూజిక్, అందమైన హీరో, హీరోయిన్, అంతకు మించి బ్యూటిఫుల్ లొకేషన్స్ అండ్ weather కానీ డీల్ చేసే విషయాలే కొంచం హెవీ, అంత సింపుల్ మనుషుల లైఫ్ లో ఎందుకంత ఏడుపు, బాధ అండ్ మని రత్నం అర్థం పర్థం లేని టైమ్‌లో ఇష్టం వచ్చినట్లు ఎది పడితే అది, సీన్, మొనోలాగ్, ఏడుపు, పాట, మళ్ళా ఏడుపు మళ్ళా మోనోలాగ్ అండ్ మళ్ళా పాట. ఏమైనా అంటే కాస్టీజం, మోడర్న్ thoughts అంటారు కానీ, ఏది తీసిన ఏదో ఒక హీవినేస్, అది కూడా బోరింగ్ గా ట్రీట్ చెయ్యడం, మధ్య మధ్యలో కాస్త distract చెయ్యడానికి అందమైన అమ్మాయిలు, అబ్బాయిలు, పాటలు.
Sorry, Mani ratnam fans ఎమైన ఫీల్ అవుతుంటే. ఇది రత్నమా, రాహులా కాదు మాటర్, బోరింగ్ స్టఫ్. ఎంత beautification చూస్తాం, కాస్త మధ్యలో ఏమైనా ఉంటే ఇంకా బాగుంటుంది కదా అని, అంతే.
సో, అలా మని రత్నం నీ ఇగ్నోర్ చేస్తూ, సరే కమల్ కోసం, పాటల కోసం, PC శ్రీరామ్ కోసం “నాయకన్” చూద్దామనిపించి మొదలు పెట్టాను.
నేను చూసిన సినిమాలో, the best in recent times. Throughout ఎంజాయ్ చేశాను, కమల్ లేని సీన్ లేదు, కమలే నాయకన్, నాయకన్ నే కమల్, no doubt ఇన్ ఇట్. అంత మంచి నాయకుడు ఉంటే? అలాంటి నాయకులు వుండాలి, మన దరిద్రాన్ని లేరు.
Godfather influence ఉందని అనిపిస్తుంటే ఇంకేక్కువ ఆనందంగా అనిపించింది. ఒకో సీన్, దాని లైటింగ్, cinematography, వెంటనే సీన్ కి తగ్గ Bgm, కమల్ యాక్టింగ్ ఒకో సీన్ ఒకో మాస్టర్ పీస్. ఎక్కడో ఒక చోట ఫ్లాట్ గా అంపించడం కామన్ కానీ సినిమా మొత్తం ఇంత kick ass గా తీయడం, ఎడిట్ etc చెయ్యడం అయితే నెక్స్ట్ లెవెల్.
PC శ్రీరామ్ గురించి ఎవరైనా ఎక్కడ నుండి మొదలు పెట్టగలరు. జీనియస్, బ్యూటిఫుల్ అండ్ మని రత్నం అదృష్టం. ఇంటెన్స్ సీన్స్, రొమాన్స్ రెండు కూడా అంత అందంగా లైట్ చేసి షాట్ పెట్టగలడు. దానికి తోడు రాజ మ్యూజిక్, చూస్తున్నంత సేపు Ardha Satya, Godfather చాలా సార్లు గుర్తొచ్చాయి. మని రత్నం అన్ని సినిమాలో, “నాయకన్” is the best అనిపించింది.
Opening shot నుండి లాస్ట్ వరకు మొత్తం మాజికల్, ఒక మనిషి మొత్తం జీవితాన్ని డాక్యుమెంట్ చేసినట్టే, సినిమాటిక్ గా. కమల్ నీ యంగ్ velu లా చూస్తూ చూస్తూ మెళ్ళి మెల్లిగా ముసలి వాడయే దాకా కమల్‌తోనే ఉంటాం. ఉండాలనిపిస్తుంది.. VaradaRajan Mudaliar నీ base చేసుకొని ఎన్ని సినిమాలు వచ్చిన “నాయకన్”, అండ్ “Agnipath” లో అమితాబ్ కారెక్టర్ ( loosely based on him) లు మాత్రం పిచ్చ సెన్సిబుల్ అండ్ బ్యూటిఫుల్.. వరద రాజన్ నీ బెస్ చేసుకొని “Ardh Satya” లో విలన్ రామ శెట్టి కారెక్టర్ కూడా ఉంటుంది కానీ దానికి నయకన్ లో velu కారెక్టర్ కి ఎంత తేడా. ఒక మనిషి కొంత మంది మనుషులకి విలన్, ఇంకొంత మందికి హీరో.
కమల్ వల్ల వరద రాజన్ నాకైతే హీరోనే.
Young కమల్ చూపించే దైర్యం సహాసలు చాలా casual గా ఉంటాయి. నాయకన్, జనాలని లీడ్ చేసేవాడు. ధారావి లోని వాళ్ళ బస్తినీ ఆక్రమించడానికి వచ్చిన సేటునీ ఎలా దెబ్బ తీయాలో అలా తీశాడు, జనాల మద్దతు, అవసరం ఉన్న చోట, వాడాల్సిన చోట వాడుకుంటూ ఒక్కడే డీల్ చెయ్యాల్సిన అవసరం వచ్చినప్పుడు ఒక్కడే వెళ్లి న్యాయం కోసం పోరాడం, తెలివైన నాయకులు చేసే పని.
టెర్రరిస్ట్ అని ముద్రపడి పోలీసుల చేతిలో కళ్ళ ముందే చనిపోయే తండ్రి తో మొదలయ్యే శక్తి వేలు కథే ఈ “నాయకన్”, జీవితాంతం న్యాయం కోసం, పేద ప్రజల కోసం, నలుగురుకీ ఉపయోగ పడుతుంది అంటే ఎలాంటి మార్గమైన ఎంచుకునే character గా ఎదుగుతాడు. Dharavi చూట్టూ పక్కన స్లమ్స్ లో లోకల్ డాన్ గా మారి, ఎంత మందికో నీడగా ఉండే వ్యక్తి వేలు. పెంచిన తండ్రి చావు చూసాకా ఇంక తనని ఎవరు ఆపలేరు. తండ్రిని అన్యాయంగా అరెస్ట్ చేసి లాక్ అప్‌లో చంపేసి ఉరేసిన దృశ్యం చూసిన కమల్ కోపంతో చంపిన పోలీస్ ఆఫీసర్ నీ నడి రోడ్డు మీద చంపేస్తాడు..చూసిన బస్తి వాసులు ఎవ్వరూ కూడా సాక్షం చెప్పడానికి ముందుకి రారు. అలా వేలు, వాళ్ళ మధ్యల దేవుడు అయ్యాడు.
ఎడిట్ B Lenin, Mani ratnam చాలా సినిమాలు లెనిన్ చేస్తాడు. సింపుల్ గా, క్లాసిక్ గా, narrative style ki తగ్గటు, rock చేశాడు. ఈ సినిమాకు PC శ్రీరామ్, కథ, కమల్, రాజ అండ్ లెనిన్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్స్. తోట తరణి సెట్లు, ప్రొడక్షన్ డిజైన్ల వల్ల కమల్ ట్రాన్సిషన్ into different ages, తన చుట్టూ ఉండే ప్రజలు, స్థలాలు, కథ చాలా realistic గా, impactful గా ఉంటాయి.
Pure action సినిమా, non stop happening, ఏదో జరగాలి కాబట్టి జరగాలి అన్నట్టు కాకుండా చాలా involved గా ఉంటాయి sequences అన్ని. జనాల మనిషి కాబట్టి అంత సెన్సిబుల్ గా చూపించడం అవసరం అనుకున్నారో, లేక కమల్ natural గా చింపేస్తున్నాడు అనుకొని కంటిన్యూ చేశారో ఏమో కానీ ప్రతి సీన్లో యంగ్ గా ఉన్నపుడు అలా, కాస్త ఏజ్ మారుతున్న కొద్దీ కమల్ appearance లో ఎంత తేడా, చూస్తునంత సేపు ఎంత ఓవర్ వెల్మింగ్ గా ఉందో. సరణ్య debut, చిన్న పొన్ను. Beautiful లిటిల్ గర్ల్ నీ బ్రోతల్ నుండి బైటకి తీసుకొచ్చి పెళ్లి చేసుకోవడం, ఆ సీన్ ఎంత సింపుల్, ఎంత ఎఫెక్టివ్, అండ్ ఎంత బ్యూటిఫుల్ couple montage after that. కమల్ సెట్ అయిపోయి, పిల్లలు పెళ్ళాం, దేని కోసమైతే హత్యలు, న్యాయ పోరాటం చెయ్యడం, తనే న్యాయస్థానాన్ని సెల్ఫ్ గా డీల్ చెయ్యడం మొదలు పెట్టాడో, మెల్లిగా అవ్వని ఈ process లో భార్య బిడ్డలని దూరం చేశాయి.
“నాయకన్” మళ్ళీ మళ్ళీ చూడాల్సిన సినిమా, ఒకసారి purely music, BGM కోసమైతే ఇంకోసారి ఉట్టి PC శ్రీరామ్ కోసమే, మళ్ళా ఇంకోసారి లెనిన్ కోసమైతే ఇంకోసారి కమల్ కోసం, అలా చాలా సార్లు చాలా వాటికోసం నాయకన్ revisit చేస్తునే ఉండాల్సిన సినిమా. మని రత్నం చేసిన సినిమాలో ఇదో అందమైన, చాలా మంచి సినిమా.