2016, మా Screening లు మొదలైన సంవత్సరం,” A Love Letter To Cinema” ఈ సినిమాని మొదటిసారి screening చేసాం. 200/- ticket పెట్టి back to back రెండు షోలు వేస్తే housefull అయిపోయాయి, విపరీతమైన వర్షం, final film render అవకపోతే cpu ఎత్తుకొచ్చి edit timeline screen చేసేసాం, అదొక adventure. First time మేము తీసింది జనాలకి చూపించింది ALLTcinema నే, మేము expect చేయనంత positive response వచ్చింది.
ఆ తర్వాత మా blockbuster screening “నిరుద్యోగ నటులు”, 10 episodes show at saradhi studio. 9 ఎపిసోడ్లు youtube లో బయటపెట్టి 10th episode premier చేసాం. ఆరు గంటల Screening, 90 seater theatre లో 170 మంది పైనే చూసారు. జనాలతో చూసేదాకా మాకు అర్ధం కాలేదు దాంట్లో అంత కామెడీ ఉందని, ఊహించని చోట నవ్వులు అరుపులు కేకలు, community viewing లో ఉన్న మజానే అది. ఈరోజుకి ఐదేళ్లు అవుతోంది “నిరుద్యోగ నటులు” first స్క్రీనింగ్ జరిగి, అలా మొత్తం వేద్దాం సారధి స్టూడియోలో అనే ఐడియా జగదీశ్ డి, మిగతా ముగ్గురు నటులతో కలిసి plan చేసి, వాళ్ళే డబ్బులు arrange చేసుకుని షో వేసారు. రెండు intervals, బయట చాయ్ సమోసా & సిగరెట్స్ కూడా ఫ్రీ గా ఇచ్చాం అప్పుడు.
చూసాక మీకు నచ్చినంత ఇవ్వండి అంటే, 12,000/- వచ్చాయి.
ఇంక అక్కడ్నుంచి మా దగ్గర డబ్బులుంటే free screening లేకపోతే ticketed screening, అలా చేసుకుంటూ ఈరోజుతో 30th screening దాకా వచ్చాం. ఈ screenings వల్ల మాకు జరిగిన లాభమేంటి అంటే, we had fun, చూసినవాళ్ళు also had too much fun. Big screen మీద చూసుకోవాలి మా fiction అనే కోరిక ఎప్పటికప్పుడు తీర్చుకుంటున్నాం. కానీ ఈరోజు screening మాత్రం special, ఎందుకంటే ఇది business screening, కొంతమంది distributors & producers చూడబోతున్నారు. మేమూ సినిమాలు అమ్మే level కి వచ్చాం, అమ్మగలుగుతామా లేదా అన్నది ఈ ఒక్క screening తో తేలిపోదు, వచ్చే వారం ఇంకొంతమంది చూడబోతున్నారు.
“Avanti screenings” అంటే అదొక special craze వచ్చేసింది and ఎప్పుడు బయటకొస్తాయో తెలియని మా సినిమాలు big screen చూడటం is fun. Sheesh mahal & Double Engine screenings కి కర్నూల్, తిరుపతి, ఒంగోలు, వైజాగ్, విజయవాడ,నిజామాబాద్, సంగారెడ్డి నుంచి కూడా వచ్చారు, ఇది biggest surprise & compliment మాకు. ఈరోజు తణుకు, గద్వాల్, సిద్దిపేట నుంచి fanboys వచ్చారు. ప్రతి screening housefull & over crowded, నేల మీద & extra chairs లో థియేటర్ అంతా పరుచుకున్న ప్రేక్షకుల అరుపుల కేకలతో రచ్చ రచ్చే. ఒక్కోసారి మాకు అస్సలు పరిచయం లేనివాళ్లు, non film industry వాళ్ళు వచ్చి సినిమా చూసి exciting గా మాట్లాడుతుంటే మేమూ ఇంకా excite అయిపోతాం.
రాబోయే రోజుల్లో open announcement screenings ఉండబోతున్నాయి, దానికి ఎవరైనా రావచ్చు, ఈరోజు షో full అయిపోయింది.