గత ఆరేళ్ళలో చాలామంది IT ఉద్యోగుల్ని కలిసాను, మా fiction నచ్చి మాతో మాట్లాడాలని చాయ్ మందు సిగరెట్ తాగాలనుకునే వాళ్ళే ఎక్కువ. వీళ్ళలో కొంతమంది short film తీయాలనుకునేవాళ్ళు, actor అవుదాం అనుకునేవాళ్ళు ఇలా రకరకాల ITians. కానీ అంత జీతం comfortable జీవితం వదులుకుని రావడం అంటే అది డేరింగ్ స్టెప్పే, కమిటైన లోన్లు, ఊర్లో కడుతున్న ఇల్లు, పెళ్ళాం పిల్లలు స్కూల్ ఫీజులు గర్ల్ ఫ్రెండులు ఇవన్నీ వదిలేసి సినిమాల్లోకి రావడం అంటే తెగించినట్టే. నన్ను కలిసి ఇండస్ట్రీలోకి రావాలనే ప్లాన్ ఎవరైనా చెప్పినప్పుడు ఒకటే చెప్తా “కనీసం సంత్సరం బతకడానికి సేవింగ్స్ ఉన్నాయా? నీ మీద ఇంట్లోవాళ్ళు డిపెండెంటా, ఆలోచించుకో, ఇక్కడ చాలా కష్టాలు పడాలి”.
ఒక పక్క నచ్చని డెస్క్ జాబ్ ఇంకో పక్క రారమ్మని పిలిచే film industry, ఎలా ఇప్పుడు? నేను ఏం చెప్తానంటే “నువ్వు డైరెక్టర్ అవ్వాలి అనుకుంటే జాబ్ మానొద్దు, ఆరు నెలలు లేదా సంవత్సరం పాటు ప్రతి వీకెండ్ ఏదో ఒకటి తీసి దాన్ని ఎడిట్ చేసి చూసుకుని, next time ఇంకేం బెటర్ చేయొచ్చో ఆలోచించు. ఆరు నెలల్లో 48 weekend days + public holidays + leaves, చాలా నేర్చుకోవచ్చు. Equipment సమకూర్చుకో, editing కి మంచి laptop కొనుక్కో, YouTube లో కుప్పలతెప్పలు filmmaking మీద వీడియోస్ ఉన్నాయి, రోజుకొకటైనా చూడు, మంచి music విను, చదవగలిగితే పుస్తకాలు చదువు లేదా audio books విను, రోజుకి ఒక సినిమా కొంచమైనా చూడు, ఇంకేం కావాలి నీకు”?
ఇదంతా చేసి నువ్వు తీసింది చూసుకుంటే నీ capacity ఏంటో నీకే అర్ధమవుతుంది, నువ్వు తీసింది family & friends కి ఒక screening వెయ్, అది first achievement filmmaker గా. Social media through producers కి filmmakers పంపితే వాళ్ళ through industry doors open అవ్వొచ్చేమో.
లేదా దివ్య బండారు route, ఏమైతే అయిందని చేస్తున్న ఉద్యోగం మానేసి సినిమా వాళ్ళతో తిరుగుతూ నానా కష్టాలుపడి బతుకుతూ సినిమాలు తీయడం.ఇది మామూలు దరిద్రంగా ఉండదు, సినిమా పిచ్చి వెర్రి పీక్స్ కి వెళ్తేనే ఈ దారి కోరుకుంటారు.
కొంతమందికి actor అవ్వాలనుంటుంది, ఇది చాలాచాలా కష్టమైన పని, job చేస్తూ సినిమా తీయచ్చేమోగాని acting side రావాలంటే అదంత వీజీ కాదు. ఇక్కడొక upcoming actor story చెప్తా, నాగరాజు అనే software engineer story. మేము story discussion-1 తీస్తున్నప్పుడు ఒక fb message, “అన్నా నేనొచ్చి మీ shooting చూడొచ్చా” అని, నా reply “చూడటానికైతే రావద్దు, వస్తే shooting కి help అవ్వాలి, ఏ పని చెప్పినా చెయ్యాలి” అని, “చేస్తా అన్నా” నాగరాజు reply. అలా పరిచయమైన నాగ తో చిన్న roles చేయించాం, కొత్తపోరడు లో విలన్ రోల్ దొరికింది, చెలరేగిపోయాడు నాగ. కొంతమందిలో ఆ flare ఉంటుంది, నాగ అటువంటి finest actor, తనని బాగా వాడుకోవటం దర్శకుడి responsibility. పుష్ప సినిమాతో బానే recognition వచ్చింది, వచ్చిన ఆఫర్స్ అన్నీ చేసుకుంటూ పోతున్నాడు, decent remuneration stage కి వచ్చాడు. ఖచ్చితంగా చాలా పెద్ద range కి వెళ్ళే actor నాగ. దివ్య లాగే తెగించి కొంత savings తో సినిమాల్లోకి వచ్చాడు, చాలా కష్టాలు పడ్డాడు. ఇలా చేసే ధైర్యం ఉంటే actor అవటం గురించి ఆలోచించండి లేదా ఆర్నెల్లు break తీసుకుని ప్రయత్నించండి, వర్కౌట్ అవకపోతే go back to job.
ఇప్పుడున్న content demand కి కొత్త దర్శకుల నటుల అవసరం చాలానే ఉంది. సినిమాలు తీయటం వాటిల్లో నటించడం is fun, ఆలోచించుకోండి.