Hou(హో) నాకు చాలా, చాలా ఇష్టమైన ఫిల్మ్ మేకర్ అండ్ అక్టర్. ఎవరైనా ఏమైనా సినిమాలు, సీరీస్లు చూడమని సజెస్ట్ చేసి చూసే దాకా వెంటపడుతూ “నువ్వు ఇప్పుడు ఇవి చూడాల్సిందే ” అంటే నాకస్సలు అంత ప్రెషర్ మీద అవేమీ చూడాలనిపించదు .
ఎప్పుడో చాలా రోజుల తర్వాత మెళ్లిగా నేనే ఒక రాండమ్ మార్నింగ్ చూడడం మొదలు పెడతా, అలా చాలా సినిమాలు, సీరీస్లు చూసి ఎంజాయ్ చేశా. కానీ ఎందుకు దీని ఇన్ని రోజులు ఇగ్నోర్ చేశా అనే ఫీలింగ్ ఉండదు, అసలు ఎప్పుడో అప్పుడు explore చేసినందుకు సంతోషం తప్ప. అలా మొదలైందే ఇది కూడా.
2019 లో ఫస్ట్ టైమ్ చూసిన హో సినిమా, “A Summer at Grandpa’s”. ఇది coming of age trilogy లో హో మొదటి సినిమా.
అప్పుడప్పుడే Taiwanese సినిమాలూ చూడడం మొదలు పెట్టిన రోజులు, Edward Yang సినిమా “Yi Yi” నేను చూసిన ఫస్ట్ సినిమా. ఒక ఫంక్షన్ హల్లో మినిమల్ హడావిడిలో స్టార్ట్ అవుతుంది సినిమా, అదొక ఫ్యామిలీ ఫంక్షన్, పెళ్లనుకుంట. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కథ, అమ్మ నాన్న, పెళ్ళాం, పిల్లలు అండ్ ఉద్యోగం చేస్తున్న కంపెనీలో వచ్చే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ వాటి చూట్టూ తిరిగే కథ. అనుకోకుండా 30 years బ్యాక్ ప్రేమించిన అమ్మాయిని బిజినెస్స్ మీటింగ్ కి వెళ్తే కలుస్తాడు. ఇంత ఫ్యామిలీ డ్రామా మధ్యలో ఒక బ్రీఫ్, ఓల్డ్ లవ్ స్టోరీ రీ విసిటింగ్ ఉంటుంది. చాలా nostalgia ఉండే బ్యూటిఫుల్ సీక్వెన్స్. వదిలేసి వెళ్ళిపోయినందుకు క్షేమాపన కోరే ఛాన్స్ దొరికింది అనుకుని గుడ్ బై చెప్పకుండా వచ్చేస్తాడు.
Taiwanese సినిమాలో చాలా ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, మధ్యలో ప్రేమ కథ ఉన్నా, gangsters ఉన్నా ఏమున్నా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. Dysfunctional families నుండి వచ్చే పిల్లలు, వాళ్ళ inferiorities, strong cultural influences, grandparents etc. లాంటివి వాళ్ళ సినిమాలో చాలా important గా ఉండే సబ్జెక్ట్స్.
Yang and Hou new wave Taiwanese filmmakers and close friends. ఒకరి సినిమాలకి ఒకరు పని చెయ్యడం, డబ్బులు పెట్టడం, ఆక్ట్ చెయ్యడం, ఫ్రెండ్స్ అందరు కలిసి చూసే సినిమాలు, వాళ్ళ మీద వచ్చిన డాక్యుమెంటరీ “Flowers of Taipei” చూస్తే అర్ధం అవుతుంది. Koreeda, Apichotpong weerasethukal, Jia Zhangke లాంటి crazy film makers Hou and Yang సినిమాల గురించి మాట్లాడుతుంటే మనం ఎంత ఎక్సయిట్ అవుతామో వాళ్ళ మాటల్లో మన్నకి మననే చూసుకున్నట్టు ఉంటుంది.
“Taipei Story” Yang తీసిన సినిమా, చూడడం మొదలు పెట్టాను. హీరోని చూస్తుంటే బాగా తెలిసిన వ్యక్తిలా ఉన్నాడు, ఎక్కడో చూసాను, ఏ సినిమాలో చూసానో గుర్తు రావట్లేదు. సినిమా అయిపోయింది, browse చెయ్యడం మొదలు పెట్టా. హీరో ఎవరో కాదు డైరెక్టర్ Hou. Yang చెయ్యమని అడిగితే casual గా చేసి పడేశాడు. అసలు hou ని అంత చిన్న వయసులో ఉన్నప్పుడు, ఆయన లవ్ స్టోరీ అదికూడా ఫ్రెండ్ సినిమా, హీరోయిన్ yang wife Tsai Chin, మొత్తం సినిమా background స్టోరీ వేరే, kick-ass film. Opening short నుండే మైండ్ బ్లోయింగ్. Yang, Hou, Koreeda ఆలోచిస్తే వీళ్ల అన్ని సినిమాలో ఎంప్టీ రూమ్స్, లాంగ్ షార్ట్‌లో రోడ్లు, structure of houses ఇవ్వని చాలా impactful గా ఉంటాయి. అంటే ఫలానా సినిమా అని గుర్తు చేసుకోగానే visually strong memory ఉంటుంది, calm గా ఉండే narrative style, bridges, trains, cafes, kitchens, charecters their conflict within,deep thoughts and beaches, you get to think of all these at a one go when you get to think about Taiwanese films.
Coming of age lo రెండో సినిమా, “A Time to Live , A Time to Die”, మూడోది “Dust in the wind” ఈ మూడు సినిమాలు కూడా Hou జీవితంలో డిఫరెంట్ టైం పీరియడ్‌లో జరిగిన పర్సనల్ ఇన్సిడెంట్స్ నుండి వచ్చినవి. Trilogy లో రెండో సినిమా చాలా వరకు వాళ్ళ సొంత ఊర్లో, పాత ఇంట్లో షూట్ చేసారు. వాళ్ళ నాన్న నటించాడు . చిన్నప్పటి మెమోరీస్ గుర్తు చేసుకోవడమే, వాటిని షూట్ చెయ్యడమే ఈ సినిమా లక్ష్యం, ఎలా వస్తుంది, ఏం షూట్ చేస్తున్నాము, సీన్స్ ఏంటి కంటే చిన్నపుడు చేసిన పనులు, ఇంట్లో జరిగిన సంఘటనలు, అసలు సొంతూరు, ఇల్లు చూస్తే గుర్తొచ్చేవి తీశాడు. చాలా వరకు అందరూ non actors, ఫ్యామిలీ డ్రామా అండ్ ఎస్పెషల్లీ hou వాళ్ళ నాన్ననీ తలుచుకుంటూ ఉండే సినిమా.
మూడోది hou young age లో ఉన్నపుడు అనుకోవచ్చు, లవ్ స్టొరీ. అండ్ ఉద్యోగం కోసం సిటీ కి వచ్చే ఒకే ఊరు అమ్మాయి అండ్ అబ్బాయి. వాళ్ళ ప్రేమ కథ, కచ్చితంగా మలుపులు తిరిగే సీన్స్ అండ్ చివరికి కలుస్తారో లేదో చాలా మోడర్న్ గా కనిపించే, అనిపించే లవ్ స్టొరీ.
Hou చేసినా సినిమాలో నాకు బాగా నచ్చిన సినిమాలు, “The Green, Green Grass of Home”, “The Boys from Fengkuei” (hou కూడా చేశాడు ఈ సినిమాలో), “Flowers of Shanghai”, “Coming of Age Trilogy”, “Millenium Mambo” నాకు పర్సనల్ గా మిగితా సినిమాల కన్న ఇవి చాలా ఎక్కువ ఇష్టం, “Puppet Master ” లాంటి grandeur కూడా తీశాడు, “City of Sadness” లాంటి war time సినిమాలు, “The Assassin” తీశాడు అండ్ Cannes లో రెండు మూడు సార్లు best director awards కూడా అందుకున్నాడు.
తనకు ఇష్టమైన ఫిల్మ్ మేకర్ Ozu కు homage గా “Cafe Lumiere” తీశాడు.
Hou నీ ఏ ఇంటర్వూలో, మాస్టర్ క్లాస్ వీడియోస్ లో చూసిన బాగా తెలిసిన మనిషిలాగే ఉంటాడు. Maybe, ఆయన తీసిన సినిమాల స్టైల్, సబ్జెక్ట్స్, అండ్ hou as a actor in Taipei story వల్లనేమో.
ఎవరికైన hou సినిమాలూ చూడాలనిపిస్తే డౌన్లోడ్ చేసుకోండి, మంచి ప్రింట్లు దొరకపోతే నన్ను అడగండి, కొన్ని బ్యూటిఫుల్ రిప్స్ నాదగ్గర ఉన్నాయి, ఇర్ఫాన్ పంపినవి, శశాంక్ డౌన్లోడ్ చేసినవి.
అనుకోకుండా Hou సినిమాలు గుర్తు చేసుకుంటూ ఇవ్వాళ father’s day అన్న విషయం తెలిసింది, Hou celebrate చేసినంతగా ఇంకెవ్వరూ father’s నీ వాళ్ళ సినిమాలో celebrate చేసి ఉండరు.
“Flowers of Taipei” trailer