దిక్కుమాలిన ప్రేమకథ

ఇది నా డ్రీం సబ్జెక్ట్ , చిన్నప్పట్నుంచి ఎన్నో  ప్రేమకథలు సినిమాల్లో చూసి చూసి నేనూ ఎప్పటికైనా ఒక ప్రేమకథ సినిమాగా తీయాలనే కోరిక ఇంకా తీరడం లేదు. దీనికి కారణం రోహిత్, ఒక లవ్ స్టోరీ అనుకుంటున్నా అంటే, ఏం తీస్తావులే బ్రో లవ్ స్టోరీ ఏదన్నా క్రైమ్ వయలెన్స్ డార్క్ స్టోరీ ఏమన్నా చెప్పు అని నా డ్రీం కి అడ్డం పడుతుంటాడు. రోహిత్ పరిచయం కాకపోయుంటే నేనీపాటికి “camp sasi” గా కాదు “love sasi” గా popular అయుండేవాణ్ణి, ప్రేమ సినిమాలు తీసి డబ్బులు సంపాదించి BMW లో తిరుగుతూ, అమ్మాయిలతో  నాలుగైదు లవ్ స్టోరీస్ ఆరు బ్రేకప్స్ అయినా నా జీవితంలో జరిగుండేవి. ఒకమ్మాయికి అయితే నేనూ రోహిత్ relationship లో ఉన్నామేమో అని డౌట్ కూడా వచ్చింది. 

ఎంత బాగుంటాయి ప్రేమకథలు, జాతి మత కుల దేశాల అడ్డంకులు ఉండవు ప్రేమకి, అలాంటి కథలు ఎంత వైవిధ్యంగా చెప్పొచ్చు. అమ్మాయి వెంట అబ్బాయి పడటం ఇప్పటికి పన్నెండు లక్షల సార్లు తీసినా మళ్ళీ కొత్తగా తీయాలనిపిస్తుంది తీయొచ్చు కూడా. స్లోమోషన్ లో అమ్మాయి చిచ్చ్చుబుడ్డి చుట్టూ చప్పట్లు కొడుతూ చిన్న పిల్లలతో ఎగురుతుంటే ఎంత అందంగా ఉంటుంది చూడటానికి, అసలు అమ్మాయి నడుస్తున్నా నవ్వుతున్నా ఏడుస్తున్నా టెన్నిస్ ఆడుతున్నా కూరగాయలు కోస్తున్నా స్కూటీ తోలుతున్నా గేదెలు తోలుతున్నా అన్నీ slow motion లో ఊహించుకుంటే నా రోమాలు ఆల్రెడీ నిక్కబొడిచేసాయి. ఏ ఐడియా రాకపోతే ముంబై లో మనీషా కొయిరాలా లా పరిగెత్తించినా చాలు నా సినీ జన్మ ధన్యమనిపిస్తుంది. 

ఇంకొక advantage acting రాని భాష తెలియని ముంబై హీరోయిన్ అయితే చెప్పినవి చేస్తుంది, just ఆ అమ్మాయిని సెట్ మీద చూస్తూ గడిపేయొచ్చు అనిపిస్తుంది, వాళ్ళ అమ్మా నాన్న ఏం పెట్టి పెంచితే ఈ అమ్మాయి ఇలా గంధర్వ కన్యలా మెరిసిపోతోంది అనుకుంటూ కనీసం షూటింగ్ జరిగినన్ని రోజులైనా ఆ అమ్మాయితో express చేయని ప్రేమలో ఉండొచ్చు. ప్రేమించినంత మాత్రాన చెప్పాల్సిన అవసరం లేదు మూగ ప్రేమ లో ఉన్న తీయదనం ఎంత తీపుగా ఉంటుందంటే ఆ ప్రేమని హస్తప్రయోగం తో తీర్చేసుకోవచ్చు. 

ఎన్ని రకాల ప్రేమలు, అన్నీ ఒకేలా తీయొచ్చు, ఏముంటుంది ఇద్దరు ప్రేమించుకున్నారు, చెప్పుకున్నారు, కౌగిలించుకున్నారు, కామించుకున్నారు, సమాజానికి ఎదురుతిరిగి ఆ తర్వాత పెళ్లి చేసుకుని సుఖంగా బతికారా కొట్టుకు చచ్చారా అనేది అనవసరం, వాళ్ళిద్దరి మధ్య గాలి దూరే సందు కూడా లేని కౌగిలి మీద freeze చేసి “a film by శశి” వేస్తే, కుర్రకుంకలు కొట్టుకుంటూ వచ్చి మరీ చూస్తారు, ప్రేమ సినిమాలు అజరామరం, వాటి విలువ తెలియని రోహిత్ పక్క దారి పట్టి నన్నూ పట్టించాడు. 

ఒక ప్రేమకథతో హిట్టు కొట్టి ఆ తర్వాత నీకు చూడాలనిపించిన దేశంలో కథ ఊహించుకుని అలా హిట్లు కొడుతూ ప్రపంచ దేశాలన్నీ తిరగచ్చు, ఆలా తిరుగుతున్నప్పుడు హీరోయిన్ తోనో కుదరకపోతే హీరోయిన్ మెయిన్ ఫ్రెండ్ తోనో అదీ కుదరకపోతే 3rd 4th friend తోనో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకోవచ్చు. 

“మేక దేకని పోస్టర్” లాంటి regressive పాటలు కాకుండా “నువ్వు నవ్వని రోజు  ప్రపంచానికి పట్టదా బూజు” లాంటి progressive పాటలు రాసుకుని పాటంతా స్లోమోషన్ లో మండే ఎడారిలో షూట్ చేస్తే ఆ మజానే వేరు. 

ఇంకా చాలా కొత్తకొత్త ఐడియాస్ ఉన్నాయి నా దగ్గర ప్రేమకథలుగా చెప్పటానికి, నిర్మాత దొరకటమే ఆలస్యం “దిక్కుమాలిన ప్రేమకథ” మొదలుపెట్టేస్తా.  

నా రాత నచ్చితే కింద qr code ఉంది, buy me a drink or coffee bro.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *