శశి బ్లాగ్ పోస్ట్, “IT ఉద్యోగులు – సినిమాలు – Avanti Cinema” చదువుతుంటే సడెన్‌గా టైం ట్రావెల్ చేసినట్టు ఒక 10 years back వెళ్లొచ్చినట్టు అనిపిస్తుంది. మొన్నీమధ్యనా కావ్య అని నా economics masters క్లాస్మేట్ కలిసింది బషీర్ ప్లేకి వెళ్తే. తనని చివరగా నేను చూసింది 2015 లో, క్లాస్మేట్ అంటే అంతే అక్కడ వరకే. పెద్దగా క్లోజేమి కాదు, కనీసం hangout అయ్యే ఫ్రెండ్ కూడా కాదు. హాస్టల్లో, మెస్‌లో , క్లాస్ బైట కనిపిస్తే నవ్వుతూ, “హాల్లో” అని పలకరించే పరిచయం అంతే. కానీ కావ్య నాకు బాగా తెలిసిన వ్యక్తిలా అనిపిస్తుంది, ముందు నుండి కూడా.
మొన్న తనని కలవగనే చాలా overwhelm అయిపోయి అప్పుడప్పుడే మాటలొచ్చే నా కొడుకు వయసు దానిలా ఏది పడితే అది, అర్థం పర్థం అంటూ పెద్దగా ఏమి ఆలోచించకుండా ఎక్సయిట్ అవుతూ మాట్లాడాను. ఎందుకో చెప్పలేనంత ఆనందం వేసింది. “ఇంతకీ నువ్వేం చేస్తున్నావ్?” అని తను నన్ను అడగముందే ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే, “Yea yea, I’m following you on Insta. I’m very proud of you, but tell me how did it happen all of a sudden? I mean making films, getting married and you have a child now, wow !!” అని ఓల్డ్ ఫ్రెండ్ అడుగుతుంటే నేను పట్టలేని ఆనందంలో అవును ఎలా?అసలు మాస్టర్స్ చదుకోని, economics లో phd జాయిన్ అయ్యి, తర్వత discontinue చేసి, మధ్యలో కార్పొరేట్ జాబ్ ఒకటి అన్నీ ఆలోచిస్తూ, ఎక్కడ నుండి స్టార్ట్ చెయ్యాలో అర్ధం కాక, “ఏమో నాకు సినిమాలు తీయాలనే ఆలోచన లేదు కానీ రాయడం అంటే ఇష్టం, చిన్నప్పటి నుండే చాలా ఇష్టం అండ్ ఎవరికి రాసింది చూపించేదాని కాదు” అని నవ్వుతూ చెప్పాను.
ఇవ్వాళ శశి పోస్ట్ చదువుతుంటే అనిపించింది, ఉన్న ఉద్యోగం వదిలేసి, కన్సర్వేటివ్ ఫ్యామిలీస్ నుండి వచ్చి ఇలా ఎలా పడితే అలా బ్రతకడం, సినిమాలు part of it ఇంకా. నాకే చాలా surprising గా అనిపిస్తుంది. నేనేం పెద్ద ఘనకార్యాలు చెయ్యలేదు, ఉద్దరించలేదు, పీకి పీకి పందిర్లు వెయ్యలేదు కానీ ఏంటో 10 ఏయర్స్ లో చాలా మారిపోయింది, లైఫ్ స్టైల్ తో సహ.
సినిమాలు తీసే వాళ్ళతో తిరగడం,నాకూడ సినిమా తీయాలనిపించడం, కథలు, కారెక్టర్లు రాసుకుంటూ, అవి పక్కన ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోవడం, ప్రతి Idea నీ, ఇది ఫన్టాస్టిక్ ఐడియా, ఇది వీళ్ళని పెట్టి ఇలా తీదాం అని ఎక్సయిట్ అవుతూ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడం, ఇవ్వని రొటీన్ అయినా, ప్రతిసారీ కొత్త ప్రాసెస్ లా ఉంటుంది. ఆల్మోస్ట్ cinema తీసేసాం అనే ఫీలింగ్‌లో ఉండడం, తీయడం ఇంకా ఫన్ అండ్ అదొక extreme high in action.
నచ్చని డెస్క్ జాబ్స్ చేస్తూ ప్రతీ గంట check-out గురించి వెయిట్ చేస్తూ, ఏడుస్తూ పని చేసే కన్నా మానేయడం బెటర్ అని చెప్పలేనన్ని సార్లు అనుకునేదాన్ని. ఊరికే దీని గురించి ఎవరితో అయినా share చేసుకుందాం అంటే, “you know your position better so think and take decision” లాంటి పనికి రాని మాటలు మాట్లాడేవాళ్ళు. నాకు తెలియకనా వాళ్ళతో చెప్పుకునేది, ఏదో ధైర్యం చెప్తారేమో, పర్లే నచ్చకపోతే మానేసి నీకు నచ్చిందే చెయ్యొచ్చులే లాంటి మాటలతో ఏమైనా కాన్ఫిడెంట్ గా ఫీల్ అయెట్టటు హెల్ప్ చేస్తారేమో అని బ్రహ్మలో బతికేదాని. అనవసరంగా validation కోసం తాపత్రయ పడేదాని. కానీ ఒక్కరూ కూడా మానేసి నచ్చింది చేయి, అప్పు అయితే అయింది. ఇంట్లో వాళ్ళు బాధ పడితే పడ్డారు, ఏదైతే అది కానీ మానేయి అని ఒక్కరైనా చెప్తే గట్టిగా కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యి క్విట్ చేద్దం అని ఫులిష గా ఆలోచించేదాని. ఎందుకంటే ఏమి చెయ్యాలన్న భయం, ఇంట్లో వాళ్లకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉండాలి, ఒక నెల కూడా డబ్బులు పంపకుండా ఉండడం వర్కౌట్ కానీ పని. ఇప్పుడు ఈ వయసులో(అంటే నాకప్పుడు 27) ఉన్న ఉద్యోగం మానేసి, నాకు సినిమాల మీద ఇంటరెస్ట్ ఉంది, తీయాలని ఎప్పుడు అనుకోలేదు కానీ నా ఫ్రెండ్స్ నీ చూస్తుంటే నాకు inspiring గా ఉంది, సినిమాలు తీయడం ఎంత మజానో అర్థం అయ్యాక ఏమైనా సరే తీయాల్సిందే” అని మా పేరెంట్స్ తో కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోయా.
నేను రోడ్ మీద పడి, అప్పుల పాలై, మీకేం ఇవ్వలేను, మీరు మీకోసం డబ్బులు సంపాదించుకొండి, నా బతుకు నేను బతుకుతా అని మొహం మీద చెప్పకపోయినా నేను చేసిన పనులు అలాగే ఉండే,ఇంట్లో వాళ్ళే అర్థం చేసుకొని వదిలేశారు, ఒకరకంగా నేను lucky. మా పేరెంట్స్ నా నుండి ఏమి expect చేయకపోవడమే నా అదృష్టం. నాకు నచ్చినట్లు ఉండేలా చేసింది. అప్పుడప్పుడూ వాళ్ళు భయపడుతూ ఏదైనా సలహా ఇవ్వలనుకున్నా నేను వినేదాని కాదు. మెల్లిగా వాళ్ళకే అర్థం అయ్యింది, ఇంకేం చెయ్యలేము ఏదో ఒకటి తన ఇష్టం అని ఊరుకోవడం తప్పా అని . ఇప్పటికీ మా మమ్మీ డాడీ independent, మేము వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ చెయ్యలేము, వాళ్ళు expect చెయ్యరు.
అలాంటి టైమ్‌లోనే నా then boyfriend శశాంక్ చెప్పలేనంత కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. రోజు సాయంత్రం అలా chai తాగుతూ sunset చూస్తే లైఫ్ చాలా బాగుంటుంది అని చాలా casual గా అన్నాడు నా ఏడుపు చూడలేక. నేను ఆ మాటని చాలా serious గా తీసుకున్న, ఎప్పుడో ఒకసారి వీకెండ్లో , సిక్ లీవ్‌లో తప్పా ఆఫీసు బయిటికి వచ్చి గోల్డెన్ హౌర్ ఎక్స్పీరియన్స్ చేసి ఎన్ని రోజులైందో, చాలీచాలని జీతాల కోసం నెల మొత్తం గొడ్డు చాకిరీ చెయ్యడం, ఆఫీసు నుండి వచ్చాక ఒక సినిమా చూడాలన్న టైమ్ schedule అండ్ ప్లాన్ అంటూ వర్రీ అయ్యి పొద్దునే లేవాలి, సొ ఇప్పుడు ఎర్లీ గా పడుకోవాలి అని నిద్ర రాకపోయిన ట్రై చేస్తూ నిద్రపోవడం.
నిద్ర సరిపోక ఆఫీసుకి వెళ్ళి కురపట్లు పడడం, సేమ్ టెంప్లేట్లో 8 గంటలుచేసిన పనే మళ్ళీ మళ్ళీ రకరకాలుగా చెయ్యడం, చెక్ ఇన్ చేసిన అరగంట నుండే బ్రేక్ ఎప్పుడు వస్తుందో అని టైమ్ వైపే చూస్తూ పని సరిగా చేయకపోవడం. అసలు ఇందుల ఒక విషయం అయినా పాజిటివ్ గా అనిపిస్తుందా జాబ్ కంటిన్యూ చెయ్యడానికి. సరేలే మనకి ఒక ఉద్యోగం ఉంది, నెలకి ఎంతో కొంత డబ్బులు పడతాయీ అకౌంటులో అనుకుంటే, జీతం వచ్చిన మూడో నాలుగో రోజుకే మళ్ళా పరిస్తితి చిల్లరకి వస్తుంది.
అనవసరమైన ప్రెషర్, సరే పోనీలీ నా జాబ్ వల్ల నాకేమైన satisfaction ఉందా అంటే అది లేదు. aimless గా ఎన్ని రోజులో అదే కంపెనీలో అదే పొజిషన్లో జీతం కోసమే ఏడుస్తూ పని చేస్తాం? మన కొలీగ్స్, టీం మెంబర్స్ మారిపోతుంటారు, ఎందుకంటే వాళ్ళకి అదే కెరీర్, వాళ్ళు promotions, incentives కోసమైన మంచిగా పని చేసుకుంటారు, మరి నాకేం రివార్డ్? ఇలా నాలో నేనే రోజు మదన పడి పడి, ఏమి వర్క్ అవుట్ కాకపోతే హోమ్ tuitions అయినా చెప్పుకొని మినిమల్, బేసిక్ అమౌంట్ సంపాదిస్తూ సినిమాలు చేద్దాం, నా ఫ్రెండ్స్ ఘాట్ చేస్తుంటే వెళ్ళి చూడడానికైనా నాకు టైమ్ ఉంటుంది అనుకోని వెంటనే resign చేశాను.
ఇలాంటి బ్యూటిఫుల్ పేరెంట్స్, partners అండ్ ఫ్రెండ్స్ ఉంటే చాలు ఘోరమైన సిట్యుయేషన్లో కూడా, “అబ్బా వెంటనే ఈ cinema ప్లాన్ చేస్తే బాగుండు” అనిపించే మొడ్లోనే ఉంటాం Mostly.
డైరెక్ట్ చెయ్యడం మొదలు పెట్టేదాకా purely ఎంత ఫన్నో అర్థం కాలేదు. ఒకసారి ఒక సినిమా తీయడం మొదలైకా వచ్చిన మజా కోసం మల్ల మల్ల సినిమాలు తీయాలనే ఉంటుందని అప్పుడు అర్ధం అయింది. నాకు రాయడం, చదవడం, సినిమాలు చూడడం కన్నా ఇంకా వేరే ఆక్టివిటీస్ మీద పెద్దగా ఇంటరెస్ట్ లేదని realise అయ్యిన మూమెంట్ అది. ఈ మధ్య ఒక 3 years నుండి ఏదో చెస్ పిచ్చి పట్టుకుంది కానీ లేకపోతే అవే, మధ్య మధ్యలో వంట చెయ్యడం. ఇంతకన్నా ఇంకేం ఇంటరెస్ట్‌లు లేవు.
రాయడం అంటే, ఒక కారెక్టర్ అనుకొని ఏమైనా ఫీచర్స్ , వాళ్ళతో scenes ఆలోచిస్తూ ఇష్టం ఉనట్టు స్క్రీన్‌ప్లే రాస్తూ దానికి కథ అల్లడం లో వచ్చే హ్యాపీనెస్, జాయ్ఫ,satisfaction, థ్రిల్ అండ్ ఫన్ are inexplicable. you are just creating people, their world and everything around them, అసలు అది ఎంత మజా ఇచ్చే ప్రాసెస్.
అందుకే సినిమాలు అంటే ఇష్టం. 10 years గాప్‌లో నువ్వు చాలా మారిపోయావ్ అని చాలా మంది అంటుంటారు.
అవును, నిజమే. ఎంత చెంజో నాకుడా తెలియని, ఇంటరెస్టింగ్ టర్న్.. దానికి కారణం తెగింపు. ambition తొక్క తోలు లేకపోవడం, ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి అసలు తెలియకపోవడం వల్ల చాలా బెట్టర్ గా బ్రతకచ్చు అని అర్ధం చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు సినిమా అనే అందమైన ఎలిమెంట్ ని చాలా మిస్స్ అయ్యేదాన్ని, ఇంత బోరింగ్ లైఫ్ లో ఎలా బ్రతికేదానో ఇమాజిన్ చేసుకుంటేనే భయమేస్తుంది.
అందుకే ఏమి కాదు పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు నచ్చినటు పనులు చెయ్యొచ్చు. ఎవరు దాని సపోర్ట్ చేసి ఏదో సాధించావు అని అనరేమో,పొగిడి special గా ఫీల్ చెయ్యరేమో, అసలు మనం తీసిన సినిమాలు చూడరేమో, రాసినవి చదవరేమో కానీ చదివేటప్పుడు, మన సినిమా మనమే చూసుకుంటున్నప్పుడు ఉండే excitement, ఫీలింగ్ కోసమైన చెయ్యాలి. ఈ ride కోసం ఎంత ఇబ్బంది పడా ఓకే అనిపిస్తుంది. అలా అని అప్పులు చేసి ఇష్టం వచ్చినట్లు సెట్లు డిజైన్ చేసి పనికి మాలిన అతి చేయనంత వరకు it’s a fun bruh!