Screenplay రాయడం ఎలా? అసలు కథలు అల్లడం, వాటికి తలాతోక జోడించడం, ట్విస్టులు, పంచ్ డైలాగ్స్, మధ్యలో ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ etc… గురించి ఏవో కాసేపు రాండమ్ గా ఆలోచిస్తుంటే, ఇలా తోచింది రాయాలనిపించింది.
సినిమా తీయడం వచ్చిన వాడే సినిమాలు తీయాలనే రుల్ లేనట్టే, రాయడం వచ్చిన వాడే, రైటర్ అనే వాడే రాయాలనే కండిషన్ కూడా లేదు. మిగితా వాళ్ళ విషయం నాకు సంబంధం లేదు, నాకైతే రాయడం అన్నది purely పర్సనల్, ఇమాజినేషన్ అండ్ ఏదో ఒకటి ఊహించుకొని/కుంటు తోచింది రాయడమే రాయడం.. అది ఏదైనా? ఒక్కొక్కరి ప్రాసెస్ ఒక్కొక్కరిది. కొంతమంది గాలిలోకి చూస్తూ ఆలోచిస్తూ కథ అల్లుకుంటారు, కొన్ని నిజంగా చూసినవి, చదివినవి, విన్న సంగతుల మీద base చేసుకొని కథలు, screenplays రాసుకుంటుంటారు. ఇంకొంతమంది ఒక టైటిల్ ఐడియా వల్లనో, చిన్న ఇంటరెస్టింగ్, ఫన్నీ ఐడియా వల్లనో రాయడం మొదలు పెట్టి, అది ఎలా వెళ్తుంటే కథ అలానే ముందుకి తీసుకుపోతుంటారు..
నా ప్రాసెస్ ఇదే.
నేను రైటరా? అని అడిగితే నేనేం చెప్తాను? ఏం చెప్పలేము, ఎందుకంటే ఎవరి ఉదేశంలో ఎవరికి ఏదో ఎవరికి సరిగా తెలియనప్పుడు నేను అది, ఇది మైసూర్ పాక్ అని కాన్ఫిడెంట్ గా చెప్పలేం కదా.
అండ్ actually “అవును నేను రైటర్!” అని చెప్పుకోడానికి ఇంటరెస్ట్ చూపించను ఎందుకంటే, “ఇదే నా ప్రొఫెషన్, నేను జస్ట్ ఏదో ఒకటి రాసి, ఎవరికో ఏదో రాస్తూ డబ్బులు సంపాదిస్తా, రైటర్ అని చెప్పుకోవాలి అనే కోరిక, నేనొక్క పోయెట్ అనిపించుకోవాలి, దానికోసం నేను నాకు తెలిసిన, చదివిన పదాలు అన్ని వాడి ఏదో ఒకటి రాసేదాం, ఎలాగో ఎవడో ఒకడు పబ్లిష్ చేస్తాడు, పోయెట్ అనే పేరు పడిపోతుంది, వుమన్ రైటర్ అంటే స్పెషల్ గా ఉంటుంది” లాంటి అంబిషన్స్ లేకపోవడమే.
“సరే, ఇప్పుడు నేను screenplay writer అని పడాలంటే, ఓకే ఏదో సినిమాకి పని చేద్దాం, తోచింది రాసి పడేదం, నో నో మొన్న చూసిన సినిమాలోని సీన్స్ as it is రాసేదాం, ఇంకో సినిమాలోని ఇంకో సీన్ ఇంకో రోజు రాస్తే పనైపోయింది కదా”
లేదు అయిపోలేదు, ఎప్పటికీ అయిపోదు. ఒక ఐడియా నచ్చి as it is చెయ్యడం తప్పు, బోరింగ్ అని నేను అనట్లేదు, ఎందుకంటే అలా ఏమైనా చూసినప్పుడు ఎక్కవ నచ్చి ఎక్సయిట్ అయితే అబ్బా ఇది ఇలాగే తీస్తే అని చాలా సార్లు నాకనిపిస్తుంది.
నేను అంటుంది, జస్ట్ రాయడం కోసమే కొంత మంది సినిమాలు చూస్తారు, పుస్తకాలు చదువుతారు, జస్ట్ అందులో నుండి ఏమైనా దొరుకుతుందా అని. అలాంటి వాటి గురించే, పరమ బోరింగ్ అనిపిస్తుంది. కాపీయింగ్ isn’t a boring thing, but copy చెయ్యడం కోసమే ఏదైనా పనికట్టుకుని చెయ్యడం అనేది పరమ దరిద్రమైన కండిషన్, ఏదో డ్యూటీ చేస్తున్నట్లు… రోజు ఇన్ని చూడాలి, అవ్వని గుర్తు పెట్టుకొని సేవ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం, అన్ని ఒక కలెక్షన్ మెయింటైన్ చెయ్యడమే ప్రాబ్లెమ్, ఒకసారి రెండు సార్లు ఓకే అనిపించొచ్చు, లాంగ్ రన్లో ఇది వర్కౌట్ కాదేమో.
ఇంకా, ప్రాసెస్ అని అడిగే వాళ్ళకోసం..
నీ ప్రాసెస్ నీది, నా ప్రాసెస్ నాది. నా ఇమాజినేషన్ నీకు తెలియదు అలాగే నీది నాకు తెలియదు. సో ఎవరికి తెలిసింది వాళ్ళు రాస్తారు, ఎవరికి వచ్చింది వాళ్ళు తీస్తారు, కాబట్టే కదా మన చుట్టూ లెక్కలేనంత మంది రైటర్స్, డైరెక్టర్స్.
ఎక్కడడైన పబ్లిష్ అయిన కథనో, కవితనో,రిలీజ్ అయిన సినిమా కి స్క్రీన్ప్లే రైటర్ అని పేరు పడితేనో మనం రైటర్స్, లేకపోతే ఎవడికి తెలియదు కదా సో, మనని రైటర్స్ గా గుర్తించరు. ఓకే నువ్వేమైనా ఇంటరెస్టింగ్ గా రాస్తే, రాయగలిగగితే నువ్వు గుర్తింపు గురించి మర్చిపోవాలి. అసలు నా వరకు నువ్వు రాయడం మొదలు పెట్టి నిన్ను నువ్వు మర్చిపోయి ఎదనిపిస్తే అది రాయగల్గుతున్నావ్ అంటే నువ్వు రాయగలవు. దానికి ఒక టెంప్లేట్, ప్రోఫార్మ అవసరం లేదు. మనమేదో ఒక ఫార్మ్ ఫిల్ చేసే ఉద్యోగమో, అసైన్ చేసే పనో చెయ్యట్లేదు, అదే టెంప్లేట్ ఫౌల్లో అవ్వడానికి.
రోజూ ఏదో ఒకటి కొత్తది రాయలనిపిస్తుంది, ఎందుకు? ఏమో నాకేం తెలుసు. జస్ట్ ఏమనిపిస్తే అది రాయలనిపిస్తుంది.
ఒకోసారి కూర్చొని ఆలోచిస్తే ఒక కథ తడుతుంది, characters పేర్లు ఏవో పెట్టుకొని దాని చుట్టూ ఒక కథ అనేసుకొని మొదలుపెట్టి ఎక్కడి దాకా వెళ్తానో నాకుడా తెలియదు. ఇది ఆల్మోస్ట్ everyday కథ, నేను రోజుకో కథ రాసుకుంటూ, అది శశాంక్ కి చెప్పి, ఇది షూట్ చెద్దాము అని చెప్తాను. అలా ఇప్పటికీ లెక్కలేనన్ని సార్లు జరిగింది. కొన్ని సార్లు ఆల్మోస్ట్ షూట్ చెయ్యాల్సిందే అని యాక్టర్స్ కి కూడా చెప్తాను, కెమెరా కూడా సెట్ అవుతుంది, ఎక్కువ సార్లు ప్రొడక్షన్ ఖర్చులు, సింక్ సౌండ్ కి డబ్బులు సెట్ కాకపోవడం వల్లే చాలా ప్లాన్స్ cancel అయ్యాయి.
సో, నేను చెప్పేది ఏంటంటే(pickpocket సినిమా తీసిన కాస్త అనుభవంతో, ఫ్రెండ్స్ సినిమాల కోసం రాసిన screenplay experience తో), జస్ట్ రాయడం మొదలు పెడితే చాలు, ఒకవేళ మీకు natural గానే రాసేటప్పుడు ఫ్లోలో ఏదో ఒకటి రాసుకొని, వీలైనప్పుడు దానే మళ్ళీ మళ్ళీ చదివితే మీకే అర్థం అవుతుంది ఎక్కడ ఉంచాలో ఎక్కడ పీకి పడేయాలో.
అంతే సింపుల్, నిన్నే ఒక YT ఛానల్లో ఒక ఎడిటింగ్ వీడియో చూసా, Michael kahn చెప్పింది కూడా అందే. మీరు ఎలా ఎడిట్ చేస్తారు? ఎక్కడ కట్ చెయ్యాలో? ఎక్కడ కాసేపు అలాగే వదిలేస్తే బాగుంటుందో ఎలా అర్థం అవుతుంది ? అని అడిగితే, “ఏముంది ఏది ఎలా అనిపిస్తే అలా చెయ్యడమే, its like dancing, నీకు నచ్చినట్టు నీ ఫ్లోనీ బట్టి నువ్వు ఎలా డాన్స్ చేస్తావో ఎడిట్ కూడా అంతే. ఒకరు చెప్తే నేర్చుకునేది కాదు.
మరి ఎలా? అంటే
సింపుల్, ప్రాక్టీస్ చెయ్యడమే. ఆటోమేటిక్ గా ఏది మనకి నచ్చుతుందో, బాగుందో లేదో మనకే అర్థం అవుతుంది” అని.
Exactly, it implies to everything. రైటింగ్ కూడా అంతే, ప్రాక్టీస్. రోజూ ఏదో రాస్తుంటేనే ప్రాక్టీస్ అయ్యి ఇంకేమైనా రాయాలని ఎక్సయిట్ అవుతాం, అది ఫిక్షన్ అయినా ఇంకేదైనా. నాకైతే అంతే మరి. ఎక్కువ రోజులు రాయకుండా సడెన్ గా ఏమైనా రాద్దామని కూర్చుంటే మన మీద మనకే డౌట్ వచ్చి, అబ్బా ఎంటి ఇది ఇంత ఘోరంగా రాస్తున్న అనిపిస్తుంది, పర్లేదు. నేను అయితే ఏదైనా రాయాలని స్టార్ట్ చేస్తే, అది మొత్తం ఫినిష్ అయింది, ఇంకా చాలే ఆపెద్దాం అనుకునే దాకా మల్ల వెన్నకి వెళ్లి ఒకో లైన్ చదవను. ఒకేసారి రాసేసాక ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా? లేదా ఏదైనా లైన్ తీసేయొచ్చా అనేది అప్పుడే, చదువుతున్నపుడే అర్థం అవుతుంది..
అండ్ రాయడం మొదలయ్యాక అసలు బాగా రాస్తున్నామా? Does it make any sense? అబ్బా ఈ లైన్ ఇంకా క్రియేటివ్ గా రాస్తే, లాంటి వాటి గురించి ఆలోచిస్తూ, పదాల గురించి beautification కోసం లైన్స్ వెత్తుకుంటు ఒక సెంటెన్స్, ఒక చోటే అనవసరంగా ఆగిపోకుండా, ముందైతే ఏది తోస్తే అది రాసి పడేయడం బెటర్ అని నా ఫీలింగ్. అది ఎలాగో నువ్వు బైటికి పెట్టేదాకా నువ్వు ఏమైనా రాసి వెలగబెట్టావని కూడా ఎవడికి తెలియదు. మరెందుకు భయం, ఎవరైనా చదివేసి ఏమైనా అనుకుంటారా? జోక్ చేస్తారా? అని పిచ్చి ఆలోచనలు.
మన రాత మన స్స్టైల్ మన ఇష్టం, ఎక్కడి నుండైనా స్టార్ట్ చెయ్యొచ్చు ఎక్కడైనా ఆపెయోచ్చు, నచ్చింది నచ్చినట్లు honest గా రాయడం, రాస్తూ ఎంజాయ్ చెయ్యడం ఒకటే ముఖ్యం. అది ఎలా వచ్చింది, ఎన్ని తప్పులు ఉన్నాయి, ఎంత డ్రిఫ్ట్ అయ్యా? అమ్మో ఇది ఎవరైనా చదివితే నాకసలేమి రాదనుకుంటారు? వద్దులే.. ఎవరికి పంపొద్దు లాంటి వాటి వాళ్ళే చాలా మంది రాసుకున్నవి బైట పెట్టడానికి ఆలోచిస్తుంటారు. నువ్వు రాసి పోస్ట్ చేసినవి అన్ని అందరూ చదవరు, చదివే ముగ్గురు నలుగురుకీ మాటర్ ఎలాగో అర్థం అవుతుంది. లేకపోతే అసలు చదివే ఇంటరెస్ట్ కూడా చూపించరు. ఇంత విజువల్ మీడియం చల్లామనిలో ఉన్న రోజులో రాయాడం చదవడం చాలా తగ్గిపోయింది.
రాసే వాళ్ళు, ఇంటరెస్ట్ తో చదివే వాళ్ల కోసమైనా రాయాలి! అండ్ కొత్తగా చెప్పేది ఏముంది కానీ, రాయడం ఒక కిక్. రాసే పిచ్చోడికి చదువరులు కూడా అవసరం లేదు. ఎవడు చదివితే ఏంటి? చదవకపోతే ఏంటి? నీ పిచ్చాంతా ఏదో ఒకటి రాయడం, ఎంజాయ్ చెయ్యడం, అంతే.
నువ్వు ఛిల్ అవుతూ రాస్తావా? ఏం రాస్తావ్ అన్నది కాదు మాటర్, రాస్తావా? అయితే రాయి. రాస్తూనే ఉండు. సినిమాలు చూడడం, పుస్తకాలు చదవడం చాలా ఉపయోగ పడతాయి, నీకు రాయాలన్న ఇంటరెస్ట్ పెంచుతుంది, ఊహించుకోవడం, తట్టిందల్లా రాయడం, ఫ్రీగా చెయ్యొచ్చు రుపై ఖర్చు లేకుండా.
నాకుడా రాయడం రాదని అర్థం అయ్యింది కదా, సింపుల్. Write & read, and more importantly don’t hesitate to give it to others to read.
Have monday fun!
Bye..