రామ్ గోపాల్ వర్మ తీసిన కల్ట్ క్లాసిక్ “Shiva” కి Govind Nihalani తీసిన “Ardh Satya” చాలా ఇన్స్పిరేషన్ అని ఇంటర్వ్యూస్ లో చెప్తుంటాడు. ఎప్పుడు అర్ధ్ సత్య టాపిక్ వచ్చిన వర్మ మాటలో అదే excitement, ఆయన మాట్లాడుతూ ఒకో సీన్ చెప్తుంటే గూస్ బంప్సే. వర్మ మాటలో ఈ సినిమా గురించి విని విని నాకు తెలియకుండానే ఈ సినిమా బాగా తెలుసు అనే ఫీలింగ్ వచ్చింది. ఎవరికైనా ఏదైనా సినిమా నచ్చి దాని గురించి పిచ్చేకిపోయేలా మాట్లాడుతుంటే, వెంటనే మనకి కూడా అబ్బా, ఇప్పుడే చూసేస్తే పోలే అనిపిస్తుంది. అలా అనిపించి కూడా చాలా రోజుల వరకు నేను అర్ద్ సత్య చూడలేదు, వర్మ చెప్పిన మాటలు వింటూ ఆయన ఒకో సీన్ చెప్తుంటే ఇమాజిన్ చేసుకొని ఆల్రెడీ సగం సినిమా చూసేసాను అనుకున్నా. తర్వాత చూడడం కుదరలేదు, లేదా నా బద్దకం అయి ఉంటుంది.
Covid టైమ్స్ లో ఇంట్లో ఉండి చేసేదేమిలేక, సినిమాలు, సిరీసులు చూడడమే పనైపోయింది. అదొక మంచి టైం, కామ్ గా సినిమాలు చూడడానికి. పెద్దగా వర్రీ, గిల్ట్ లాంటివి ఎక్కువ ఫీల్ అవ్వకుండా లేచిన వెంటనే ఒక ఛాయ్ అండ్ ఒక రాండమ్ సినిమా. ఏదో ఒక సినిమా, డౌన్లోడ్ చేసిన సినిమాల కన్నా ఏదో ఒకటి కనిపించగానే ప్లే చెయ్యడం, అసలేం తెలియని సినిమాలు, obscure సినిమాలంటేనే ఎక్కువ మజా. హిట్టైన సినిమాలు చూడాలని ఉన్నా delay చెయ్యడం అలవాటైంది. అదే కేటగిరీలో కొన్ని సార్లు ఫులిష్ గా బ్యూటిఫుల్ సినిమాలు చూడడం postpone చేస్తుంటాం. అది purely నా అతి, laziness అండ్ నాకు చూడాలనిపిస్తేనే చూడాలనే ఒపీనియన్ అండ్ ఫీలింగ్.
అలా బాగా హిట్టైన సినిమా Ardh Satya అని తెలిసి సర్లే మెల్లిగా చూడొచ్చులే అనుకొని కొన్ని సంవత్సారాలు delay చేశాను. నా అదృష్టవశాత్తూ సెకండ్ lockdown లో ఒక మార్నింగ్ లేచి(అప్పుడు నేను శశాంక్ అవంతిలో హాలిడే చిల్లింగ్ మూడ్‌లో ఉండే), ఛాయ్ పెట్టుకొని, శశి కి ఒక కప్ ఇచ్చి నేనొక కప్ పట్టుకొని ఒక షార్ట్ ఫిల్మ్ ఆర్ డాక్యుమెంటరీ చూదామనుకొని Mubi లో ఈ సినిమా కనిపించగానే ప్లే చేశాను.
నేను “Satya” కి బిగ్గెస్ట్ ఫ్యాన్, ఎంత పెద్ద ఫ్యాన్ అంటే నాకు సత్య సినిమా రోజుకోసారైన గుర్తొస్తుంది. JD కారెక్టర్ రాయాలన్నా, అనుకోవాల్లన్నా చాలా సెన్సిబుల్ పర్సన్ అయి ఉండాలి, సైలెంట్‌గా ఉంటూ అంత డెప్త్ ఉన్న మనుషుల కారెక్టర్లు రాయడం, వాళ్లని మెయిన్ లీడ్‌గా అనుకోవడం is the brilliant thing, అంత introvert కి Manoj Bajpayee లాంటి లడలడా మాట్లాడే క్లోజ్ ఫ్రెండ్. వీళ్లిద్దరి కారేక్టర్స్ నాకు Pickpocket కీ చాలా ఇన్స్పిరేషన్.
ఊరికే ఏదో కలిసి క్రైమ్ చేసే ఇద్దరు వ్యక్తులు కాదు. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరు మహా ఇష్టం, బీకు మాత్రే లాంటి హైపర్ వ్యక్తితో బీచ్ దగర కూర్చొని JD ప్రశాంతంగా ఊర్మిళ గురించి, తన ప్రేమ గురించి చెప్పే సీన్, తన ఇష్టం అర్థం చేసుకునే ఇన్నోసెన్సే చూస్తుంటే నోట్లో నుండి మాట రాదు.
ఎంత క్రైమ్ చేసే కారెక్టర్లు అయినా, ఎంత హింస సృష్టించే వాళ్ళైనా, వాళ్ళని వాళ్ళతో తిరిగే గ్యంగ్/ఫ్రెండ్స్ నీ బ్యూటిఫుల్ గా, ఇన్నోసెంట్ గా, జోవియల్ గా చూపించడం అన్నది వర్మ sensibilities. ఒక క్రైమ్ సినిమా చూస్తూ, జనాలని చంపుతూ, విద్వాంసం శృష్టించే వీళ్ళ జీవితాలు మామూలు, వాళ్ళ పెళ్ళాలు, పిల్లలు, వాళ్ళ ప్రపంచం సర్వ సాధారణం, మనం ఊహించుకునే ugliness ఎక్కడ కనిపించదు అందుకు వర్మ అంటే ఇష్టం సత్య అంటే అంతకంటే ఇష్టం. సత్య ఇష్టం అని చెప్పడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, దాని స్టైల్, సింప్లిసిటీ, డ్రామా, కెమెరా, ఎడిట్, మ్యూజిక్, పెర్ఫార్మెన్స్, ఓపెనింగ్ అండ్ the ఎండింగ్..
సత్య ఎన్ని సార్లు చూసినా, క్లైమాక్స్ మళ్ళీ చూస్తుంటే ఏడుపు రాకుండా ఉండదు. బైటికి ఏడవకుండా ఉండడానికి ట్రై చేసి ఆక్ట్ చేసినా, లోపల మొత్తం చాలా ఘోరంగా ఉంటుది ఫీలింగ్. దానికి తోడు వర్మ నోట్ లాస్ట్‌లో, “My tears for Satya are as much as they are for the people whom he killed” అనే స్టేట్మెంట్తో సినిమా ఎండ్ చేశాడు కానీ ఇది గుర్తోచినప్పుడల్లా వర్మ నీ కలిసి ఒక హగ్ ఇచ్చి, “థాంక్స్ ఫర్ మేకింగ్ థిస్ ఫిల్మ్” అని honest గా చెప్పాలనిపిస్తుంది.
అలాంటి వర్మ మాటలో ఇంకో డైరెక్టర్ తీసిన సినిమాని ఆయన వర్ణిస్తుంటే ఎవరికైనా పిచ్చేకిపోవడం కామన్.
Ardh Satya చూస్తున్నంత సేపు, “అరే ఏమైనా సీన్ ఆ ఇది? అసల్ ఏమైనా షాట్ ఆ ? అనుకోకుండా ఒక నిమిషం కూడా ఉండలేకపోయాను. ఓపెనింగ్ సీన్‌తోనే సినిమా ఫుల్ మజా అనిపిస్తది. నేనేం రాసుకున్నా, చాలా సార్లు Ardh satya opening scene inspiration తో నేను కూడా సేమ్ సీన్ తో సినిమా స్టార్ట్ చెయ్యాలని రాసుకునేదాని, ఇప్పుడు కూడా రాసుకుంటూ ఎపుడైనా అలాంటి ఐడియా వచ్చినప్పుడు.
పర్సనల్‌గా చాలా నచ్చే సినిమా అండ్ అన్నీ సీన్స్ as it is లేపెయాలి అనిపించే సినిమా. గోవింద్ నిహలాని సినిమాటోగ్రాఫర్ అని తెలుసు. కానీ, ardh satya ki ఆయనే డైరెక్టర్ అని తెలియగానే, అదికూడా ఆయనే షూట్ చేసుకున్నాడు అని గూగుల్ లో చూసినప్పుడు అనిపించింది, అసలు మన సినిమాలు మనమే షూట్ చేసుకోగలిగితే, మనమే ఎడిట్ చేసుకోగలిగితే, మనమే రాసుకొగలిగితే అంతకన్నా నా అనిపించింది.
Om Puri & Smita Patil ఇద్దరు నాకు చాలా ఇష్టమైన యాక్టర్స్, అందులో స్మితా పాటిల్ అంటే ఇంకా ఎక్కువ. అప్పటికే “Bhumika”, “Gaman”, “Bazaar”, “Nishant” లో స్మితానీ చూసి తన ఇంటర్వ్యూస్ వెతికి, ఒకటి రెండు అవి కూడా చూసి తనంటే పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్న టైంలో Ardh Satya చూసా. ఇప్పుడు గుర్తు చేసుకుంటుంటే,అసలు స్మితా కోసమే ఈ సినిమా వెంటనే చూడలని మొదలు పెట్టానేమో, అప్పటి దాకా వర్మ మాటలో నేనేదో ఊహించుకుంటున్నా కానీ అసలు స్మితా angle నాకు గుర్తులేదు.
ఒక చిన్న పార్టీలో అనుకోకుండా ఇద్దరు ఒకరిని ఒకరు చూస్తారు, కలుసుకుంటారు.మెళ్లిగా అది ఫోన్ కాల్స్, తర్వాత ఫైన్ కేఫ్ షాప్స్ లో కాఫీ డేట్స్ వరకు, దాని తర్వాత ఒకరంటే ఒకరికి ఇష్టం అని చెప్పుకునే స్థాయి వరకు వెళ్తుంది కథ. ఇద్దరి మధ్యలో జరిగే intellectual conversations, ఇద్దరు educated అండ్ Om Puri Mumbai లో SI, Smita పేరు జ్యోస్త్న, తను లెక్చరర్.
వాళ్లిద్దరి మీటింగ్స్, బస్ కోసం స్మితా వెయిట్ చెయ్యడం, ఓం పూరి దగర enfield లాంటి సెక్సీ bike ఉన్నా మనోడు jyotsna తో రష్ బస్ ఎక్కుతుంటాడు తను ఉండే హాస్టల్ వరకు కంపెనీ ఇవ్వడానికి. వర్కింగ్ ఉమెన్ హాస్టల్ లో ఉండే స్మితా కి వార్డెన్ రుం కి ఓం పూరి నుండి ఫోన్ కాల్స్, హాస్టల్ లో ఉండే ఫ్రెండ్ తో స్మితా విషయాని షేర్ చేసుకోవడం, మెల్లి మెళ్లిగా వాళ్ళ రిలేషన్షిప్ డెవలప్ అయ్యే సీన్స్ బ్యూటిఫుల్, ఏదో ఒక montage లో మొత్తం చూపించేయడం చెయ్యలేదు, దశల వారీగా వాళ్ళ friendship, ప్రేమ, ideological differences, వాళ్ళ ఉద్యోగాల పట్లు వాళ్ళ ప్రేమ etc చాలా అందంగా మాట్లాడుకుంటు, కాఫీలు తాగుతూ, ఫోన్ కాల్స్, బస్‌లు ఇలా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టొరీ మధ్యలో ఓం పూరి ఉద్యోగం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, అండ్ కరప్షన్ వల్ల higher officials రౌడీలకి, దాదాలకి అమ్ముడుపోవడం, దాని ఓం పూరి సహించకపోవడం, ఎదురయ్యే ఇబ్బందులు వాటి మూలాన పడే కష్టాలు మెయిన్ ప్లాట్.
ఒక honest police officer కథా, ఎక్కడిదాకా అయినా వెళ్ళడానికి సిద్ధం కానీ ఈ గల్లీ రౌడీలకి, మాఫియాలకి భయపడి, వాళ్ళకి సలాం కొడుతూ ఉద్యోగం చెయ్యలేను అని గట్టిగా తన ఒపీనియన్ చెప్పే SI. Om Puri నాన్న అమ్రిష్ పూరి..చాలా స్ట్రిక్ట్, వాళ్ళ ఊర్లో కానిస్టేబుల్. కొడుకుని ఎట్టి పరిస్థితిలో పెద్ద పోలీస్ ఆఫీసర్ చెయ్యాలందే ఆయన కోరికా, Om Puri కి పెద్దగా ఇష్టం లేకపోయినా తండ్రి కోసం పోలీస్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు, తను కూడా అందరిలాగా corrupt అయ్యి నోరు మూసుకుని ఉండాలా? నాన్న కి నచ్చే ఉద్యోగం వదిలేయాలా? అనేదే biggest conflict in the film.
Wonderful police officer కథ, అంతకు మించిన performances and విజువల్స్. ఒకో షాట్ ఒక ఎపిక్, ముంబై స్ట్రీట్స్, రోడ్స్, లాంగ్ షాట్స్, Om puri ఉండే రూమ్, అందులోని కిటికీ నుండి కనిపించే sunrise, సినిమా పెయింటింగ్ లా ఉంటుంది. Ardh satya గుర్తుకి వచ్చిన ప్రతిసారీ సినిమాలోని లైటింగ్, విజువల్స్, Om Puri police uniform లో దర్జాగా Enfield మీద తిరిగే షాట్స్, సడెన్ గా ఒక ఈవెనింగ్ handsome boyfriend in a cafe లా, బ్యూటిఫుల్ స్మితా ఇన్ శారీస్, వాళ్ళ ఇద్దరి మీటింగ్స్ అండ్ అమ్రిష పూరి కారెక్టర్ గుర్తొస్తుంది.
నాకు Amrish అంటేనే భయం, ఈ సినిమా చూసాక ఇంకా ఎక్కువైంది. ఇంత స్ట్రిక్ట్ ఫాదర్ రోల్ అంటే మనకే ఇంత భయం వెస్తుందంటే ఓం పూరీకి ఎంత భయం వెయ్యాలి, నాన్న చెప్పాపెట్టకుండా ముంబై వచ్చేస్తాడు ఒకరోజు. వచ్చి చూస్తే రూం చిందరవందగా ఉంటుంది. ఓపికగా సర్దుతాడు, కింద బిస్తర్ వేసుకొని పడుకుంటాడు. కొడుకొచ్చి చూస్తే ఇంట్లో తండ్రి, ఒక మాట మాట్లాడకుండా తన బెడ్ మీద తను పడుకుంటాడు.
రామా శెట్టి సినీమాకి హైలైట్. ఎప్పుడు ఏ సినిమాలో విలన్ ఇంత casual గా అనిపించలేదు. రామా కి ఒక బిల్డింగ్ ఉంటుంది, బాయ్స్ అందరూ అక్కడే. ఎవరు ఎక్కడ ఎలాంటి డీల్స్ చెయ్యాలో చేసి మళ్ళీ అక్కడికి వచ్చి చిల్ అవ్వడం అక్కడ రొటీన్. ఒక సారి రామా నీ అరెస్ట్ చెయ్యడానికి Om Puri వెళ్తాడు, కింద గ్రౌండ్ ఫ్లోర్ నుండి పైన శెట్టి నీ చేరుకునే లోపు ఓం పూరీకి కనిపించే జనాలు, వాళ్ళ ఆక్టివిటీస్ ఇన్ డిఫరెంట్ ఫ్లోర్స్ వల్ల మనకి అసలు రామా శెట్టి గాడంటే ఎవడు? అసలు వాడి కథ ఏంటో అర్థం అవుతుంది. వెళ్లి కలుస్తాడు శెట్టీని, చాలా మర్యాదగా పలకరించి కూర్చోమని చెప్పి ఒక కవర్ తెపిస్తాడు రామా. ఓం పూరి వద్దని, అరెస్ట్ చెయ్యడానికి వచ్చానని, వారంట్ ఉందని చూపియబోతే అప్పుడు మెల్లిగా విలన్ కారెక్టర్ బయటికి వస్తుంది..ఎవడికైనా ఎప్పుడైనా ఫోన్ చేసి ఏమైనా మాట్లాడగలే పలుకుబడి రామా సంపాదించుకున్నాడు, ఓం పూరి అరెస్ట్ చెయ్యలేడు. హెడ్ ఫోన్ తీసుకొని, అక్కడ నుండి వెంటనే వెల్లిపోమని ఓం పూరి కి చెప్తాడు. వాడికి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం గులాం గిరి చేస్తుందని అర్థం చేసుకొని ఆవేశంతో స్టేషన్ కి వెళ్లి మిగితా పోలీసుల ముందు frustrate అవుతుంటే, వాళ్ళు కూడా మనకెందుకు భయా, వచ్చామా ఏదో కాస్త పని చేశామా? వచ్చే డబుల్ తీసుకున్నామా అన్నటు మాట్లాడుతారు, ఓం పూరి జీర్ణించుకోలేడు..
సినిమాలో ఓం పూరి honesty కి రామా శెట్టి అహంకారానికి, రౌడిస్మ్ కి మధ్యన వార్, మధ్యలో స్మితా పర్సనల్ ఒపీనియన్స్, ఐడియాలజీ వల్ల ఇద్దరికీ విభేదాలు రావడం, కొన్ని రోజులు ఓం పూరి టోటల్ గా ఒక depressed జోన్లోకి వెళ్లిపోవడం, Amrish Puri ambitiousness towards his son’s career etc continuous డ్రామా వల్ల పిచ్చ సీరియస్ ఫిల్మ్ లా ఉంటుంది, ఒకరకంగా.
Om Puri అసలు ఇవ్వనిటి మధ్యలో తనకేంకావలో అనే అన్వేషణ మొదలవుతున్న టైంలో డ్రామా, పవర్ఫుల్ విజువల్స్ తో చింపేసాడు Nihalani.
బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ visually, Ardh Satya is one of the best films ever made.