ఐతే కి ఏలేటి fans అయిపోయాం, next ఏంటి అని wait చేస్తున్నప్పుడు తెలిసిందొక most happy & exciting news, సర్వేష్ మురారి, my roommate, చందు second cinema cameraman అని. Wow what a news that was, ఆరోజు పార్టీ చేసుకున్నాం. షూటింగ్ మొదలైపోయింది, సర్వేష్ ఆ ముచ్చట్లు పెద్దగా చెప్పేవాడు కాదు, “రిలీజ్ అయ్యాక చూసి చెప్పండి” అనేవాడు.
సినిమా రిలీజైంది, ఓడియన్ లో అనుకుంట, నేనూ, హరీష్ శంకర్, జయకృష్ణ గుమ్మడి, దశరధ్, గోపీమోహన్, ఉదయ్ నందనవనం ఇలా చాలా మంది ఫ్రెండ్స్ వెళ్ళాం. అప్పట్లో మాకదొక ఆచారంలా ఉండేది, కనీసం పదిమంది సినిమా వాళ్ళం ప్లాన్ చేసుకుని ఒక థియేటర్ కి రిలీజ్ రోజు మార్నింగ్ షోకి వెళ్ళేవాళ్ళం. అందరిలో ఒకటే curiosity ఈసారి ఏలేటి ఏం చేస్తాడో అని. Houseful, high expectations మీద వస్తోంది ఐతే తర్వాత, ఆల్రెడీ పాటలు పోస్టర్లు పిచ్చెక్కించాయి, సినిమా ఎలా ఉండబోతోంది? అనే ఉత్సుకత. సినిమా మొదలైంది, surprising గా జగపతిబాబు screen మీద కనపడగానే థియేటర్ blast అయింది. Red rose restaurant లో జగపతి బాబు, ఒకప్పుడు ఆ కేఫ్ struggling filmmakers అడ్డా. ఆ sequence చూస్తే అర్ధమవుతుంది rgv influence ఎంత ఉందో చందు మీద, pure RGVish.
గీతాంజలి గిరిజ, అంతం ఊర్మిళ తర్వాత అంత ప్రేమించింది ఈ సినిమాలో ఛార్మి ని. What a darling actress, మేకప్ లేకుండా ఆ స్కర్ట్స్ లో ఛార్మి మా పక్కింటి అమ్మాయి అనిపించింది. తను నటించలేదు అలా మధ్యతరగతి modern అమ్మాయిలా స్క్రీన్ మీద జీవించింది. తనని playback singer గా చూపించాలన్న చందు ఆలోచనకి hatsoff అనిపించింది. ఛార్మి ని screen మీద చూస్తున్నంత సేపు మేజిక్కే. ఛార్మితో సినిమా చేయాల్సిందే, ఇలాంటి actress ని డైరెక్ట్ చేయడం కన్నా bliss ఏముంటుంది. 30-40 రోజులు ఛార్మిని రోజూ చూస్తూ మాట్లాడుతూ తన performance camera ముందు చూస్తూ గడిపేయటం కోసమైనా తనతో పని చేయాలి, అదొక goal లా ఉండేది. ఛార్మి రిటైరైపోయి నిర్మాత కూడా అయిపోయింది. నా 30-40 రోజుల కోరిక తీరలేదు కానీ ఒకరోజు ఛార్మితో గడిపే అవకాశం దొరికింది. JC brothers Ad film కి నేను chief assistant director ని, only model chaarmi, తనకి shots లో ఏం చేయాలో చెప్పేది నేను. Maddest moment, సింధూరంలో కృష్ణవంశీ signature shot sanghavi బొట్టు పెట్టుకునే closeup, ఆ shot నేను ఛార్మి తో తీసా. Full cinema తీయకపోయినా ఆ రోజు చాలు అనిపించింది ఛార్మి తో.
ఈ సినిమా కెమెరామాన్ సర్వేష్ నా రూమ్మేట్ అని మళ్ళీ గర్వంగా ఫీల్ అయ్యా.
అదిరిపోయింది ‘అనుకోకుండా ఒకరోజు’, చందు నా expectations అందుకోలేదు, అంతకుమించి ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఊహకందనంత దూరం. Absolutely unpredictable film, setup చేసుకుంటూ పోతున్నాడు, random scenes తో సినిమా ముందుకెళ్తోంది, ఏదో build చేస్తున్నాడు కానీ ఎటు వెళ్తుందో ఊహించలేకపోతున్నాం. Everything about this film is too good, a wonderful film.
చంద్రశేఖర్ ఏలేటి ని ప్రేమించటానికి ఈ రెండు సినిమాలు చాలు.