Ajantrik

ఇది 2nd lockdown లో రాసినది 

సత్యజిత్ రాయ్ ని అతని సినిమాలని తీవ్రంగా పబ్లిక్ గా విమర్శించిన దర్శకుడు Ritwik Ghatak,  ఘటక్ సినిమాల్లో ఒకటి, Ajantrik ( Bengali, 1958 )

ఒకరోజు  మధ్యాహ్నం రోహిత్ నుంచి మెసేజ్  “వీలైతే Ajantrik చూడు క్రేజీ ఫిలిం” అని. ఎలాగూ పనీ మామిడికాయ ఏం లేదు కాబట్టి వెంటనే చూడటం మొదలుపెట్టా, subtitles లేని ప్రింట్ చాలా బాగుంది, subtitles ఉన్నదేమో చాలా poor quality లో ఉంది. అర్ధమవ్వాలి కాబట్టి ఆ poor క్వాలిటీ ఉన్నదే చూడటం మొదలుపెట్టా. 

ఒక చిన్న టౌన్ లో టాక్సీ డ్రైవర్ కథ, కథంటే పెద్ద కథేం లేదు. ఆ టాక్సీ డ్రైవర్, వాడు అత్యంత ప్రేమించే “jagaddal” అని వాడు పేరు పెట్టుకున్న డొక్కు 1920 ల నాటి ఒక కారు కథ. ఆ కారే వాడి జీవితం జీవనాధారం. సినిమా మొదలవటమే రెండు పాత్రలు టాక్సీ కోసం వెతుకుతుంటాయి, కథ  వీళ్ళకి సంబంధించినది అయి ఉంటుంది అనుకున్నా, అలవాటుపడిపోయిన తెలుగు సినిమా బ్రెయిన్ కదా, కథ ఎవరితో మొదలైతే వాళ్ళతోనే జరగాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు, టాక్సీ డ్రైవర్ బిమల్ ఎంటర్ ఐన దగ్గరనుంచి అతను, అతని డొక్కు కారు, అతను ఎక్కించుకుని దింపే passengers. దీంట్లో కథగా చెప్పడానికి ఏముంది, ఏమీ లేదు. అవును కథ లేకుండా చిన్న పాయింట్ ఒకటి అనుకుని దాని చుట్టూ ఏవో కొన్ని సంఘటనలు అల్లుకుంటూ ఏదో ఒకటి తీసేయటం లో ఉన్న ఆనందమే వేరు.

మనిషికి  మెషిన్ కి మధ్య సంబంధమే ajantrik , నాకర్ధమైంది అదే. నేను, రోహిత్ వాళ్ళ నాన్న బైక్ మీద గత పదేళ్లుగా తిరుగుతున్నాం, పాపం పెద్ద repairs కూడా ఏమి చేపించం , ఒకోసారి అది లేనపుడు పనిచేయనపుడు ఎంత helpless గా అనిపిస్తుందంటే, చెప్పలేం. అటువంటిది తన జీవనాధారమైన బండి మీద ఒక మనిషికి ఎంత ప్రేమ ఉంటుంది? 

బిమల్ ఒంటరి మనిషి, అదీ స్మశానంలోనో,స్మశానం పక్కనో  బతుకుతుంటాడు, అతనికి ఉన్నదల్లా “Jagaddal” , సుల్తాన్ అనే కుర్రోడు అతని ఫ్రెండ్. బిమల్ కార్లో ఎక్కే పాత్రల ద్వారా భిన్నమైన మనుషులు వారి జీవితాలు, అతని పరిసర ప్రాంతాల్లో బతికే మనుషుల జీవితాలు టచ్ చేసి వదులుతాడు ఘటక్. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఘటక్ గురించి ఒక పుస్తకం దొరికితే చదివాను, సాధారణ మానవ జీవితాల కథలంటే ఆయనకి ఎంత ఇష్టమో అర్ధమైంది, కానీ ఒక్క సినిమా కూడా చూడలేదు, చూసిన మొదటి సినిమా Ajantrik . 

బిమల్ కార్లో తిరుగుతున్నప్పుడు ఆ landscape visuals చూస్తుంటే, ఆహా,  అప్పటి రోడ్లు, ట్రైన్లు, మనుషులు, మధ్యలో ఒక ట్రైబల్ ఊరేగింపు ఉంటుంది, పెద్ద పెద్ద జెండాలతో వెళ్తుంటారు, ఆ జెండాల షాట్ చూసి మెదడు మహదానంద పడిపోయింది. అలాంటి shot తీయగలిగితే అనిపించింది, Double Engine లో తీసేసాం. 

డబ్బుల్లేక, ఇచ్చేవాళ్ళందరి దగ్గర నాకేసాక ఏమీ తీయక చాలా రోజులైంది, తీసినవి పూర్తి కూడా చేయాలి. కానీ Ajantrik చూసాక నేనే ఆ సినిమా తీసిన ఆనందం, నేనూ ఇలాంటి సినిమా చేయగలను అని ఒక సంతోషం, ఘటక్ అంత “depth” కష్టమేమో గాని ఇలాంటి సినిమాలు తీయొచ్చు తీయాలి అని నమ్మకాన్ని మళ్ళీ కలిగించింది AJANTRIK. 

 నేను critic ని కాదు కాబట్టి నాకనిపించింది రాసాను, ఒకవేళ మీలో ఎవరైనా చూసి ఉంటే  నేను రాసిన దాంట్లో ఏమైనా అర్ధం పర్ధం లేని విషయాలు ఉంటే మీ క్రిటికల్ మనసుతో మన్నించండి. 

ఒక critic కామెంట్ తో ముగిస్తా 

Film critic Georges Sadoul shared his experience of watching the film in this way. He said, “What does ‘Ajantrik’ mean? I don’t know and I believe no one in the Venice Film Festival knew…I can’t tell the whole story of the film…there was no subtitle for the film. But I saw the film spellbound till the very end”

నా రాత నచ్చితే కింద qr code ఉంది, buy me a drink or coffee bro.

Ajantrik Film Link 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *