గాడ్ ఫాదర్

Godfather

last friday rohit నన్ను గాడ్ ఫాదర్ సినిమాకి ‘తీసుకెళ్ళాడు’, yes తీసుకెళ్ళాడు, ఒకవేళ రోహిత్ బలవంతం చేయకపోతే నేను వెళ్ళేవాణ్ణి కాదు. నేను సంవత్సరానికి రెండు మూడు సినిమాలు కూడా చూడను థియేటర్లో. దీని ముందు సినిమా కూడా రోహిత్ తీసుకెళ్ళిందే, No time to die, చాలా బోర్ కొట్టింది, ఎప్పుడెప్పుడు లేచి వెళ్ళిపోదామా అనిపించినా నా సహనాన్ని పరీక్షించడం కోసం మొత్తం సినిమా చూసా. దీనికి ముందు చూసింది Once upon a time in hollywood, చాలా సంత్సరాల తర్వాత థియేటర్లో enjoy చేసిన సినిమా.

గురువారం చూసి శుక్రవారం ఇంకోసారి చూడటానికి రోహిత్ రెడీ అయిపోయాడు. రాత్రి 10.40 షో, సెకండ్ షో సినిమా చూసి యుగాలయిపోయింది. ఇంకో రెండు గంటల్లో షో అప్పటకీ నేను వెళ్ళాలా వద్దా అనే డైలమాలో ఉన్నాను, నువ్వు రాకపోయినా నేనొక్కణ్ణే వెళ్ళిపోతా అన్నాడు రోహిత్. Basic గా ఆ క్లాసిక్ మాస్టర్ పీస్ ని నాకు చూపించాలన్నది రోహిత్ కోరిక, ఫైనల్ గా వెళ్ళటానికి రెడీ అయిపోయా. మూడు గంటలు థియేటర్లో, అప్ & డౌన్ ట్రావెల్  గంట పైనే, చాలా willpower కావాలి.

ఏంటి నీ బొక్కలో సెకండ్ షో గోల అనిపిస్తే ఇక్కడితో ఆపేయండి, ఇంకా చాలా ఉంది.

నన్ను ఎవరైనా కథ ఎలా రాయాలి అన్నా అనడిగితే, నీ ఇంటి దగ్గర్నుంచి నన్ను కలవటానికి వచ్చి వెళ్ళింది ఈ మధ్యలో జరిగింది అంతా రాస్తే అదే కథయిపోతుంది  అని చెప్తుంటా. అలా ఇప్పుడు మా ‘గాడ్ ఫాదర్ జర్నీ’ గురించి రాసే ప్రయత్నం చేస్తా.

రాత్రి 9-30 కి బేగంపేట్ నుంచి ఫోరం మాల్ కి వెళ్ళాలి 10-40 లోపు, మా దగ్గర బైక్ & కార్ ఆప్షన్ ఉన్నాయి, బైక్ మీద వెళ్తే రోహిత్ కార్లో వెళ్తే నేను తోలాలి, ఇద్దరికీ ఆ ఇంట్రెస్ట్ లేదు. ఆటో బుక్ చేయడానికి ట్రై చేస్తున్నాం, cab 570-640 మధ్య చూపిస్తోంది, రెండు ఆటోలు బుక్ అయి cancel చేసారు, టైం 9-40, నా జీవితంలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా సినిమాకి లేటుగా వెళ్ళలేదు, కనీసం అరగంట ఇరవై నిమిషాల ముందు అక్కడుంటా. అయితే అయిందిలే అని రోహిత్ cab book చేసాడు, 350/- లో దొరికింది. 9-46 కి కార్ బయలుదేరింది, వెళ్ళాల్సింది పది కిలోమీటర్లు, దారంతా లైట్లు, మైత్రివనం సిగ్నల్ వరకు స్మూత్ గా వెళ్ళిపోయాం, నేను ఫోన్లో టైం చూస్తూనే ఉన్నా, 10-02. మైత్రివనం సిగ్నల్ దాటగానే ట్రాఫిక్ జాం, అది చూసి సినిమా టైంకి వెళ్తామన్న నమ్మకం పోయింది, చాలా మెల్లిగా కదులుతున్నాయి వెహికల్స్, ముందు ఏమైందో అన్న క్యూరియాసిటీ లేట్ అయిపోతోందన్న టెన్షన్. డ్రంక్ & డ్రైవ్ చెక్ జరుగుతోంది, అది దాటాక రోడ్ ఫ్రీ, 10-11 అయింది. ఇంకా ఇరవై తొమ్మిది నిమిషాలు. మూడు గేర్లు మార్చేసరికి SR nagar దగ్గర ఇంకో చిన్న ట్రాఫిక్ జామ్, ఏదో accident, నాకు మళ్ళీ ఆశ చచ్చిపోయింది. నా బాధ ఏంటంటే సినిమా స్టార్టింగ్ నుంచి చూడాలి లోపలికి వెళ్ళే ముందు ఒక సిగరెట్ తాగాలి, ఫోరం మాల్లో స్మోకింగ్ జోన్ ఉందో లేదో తెలియదు, ఒకే ఒక్క సిగరెట్ తాగే టైం ఉంటే చాలు అని ఫీలింగ్. ఆ ట్రాఫిక్ జామ్ నుంచి బయటపడ్డాక ఎక్కడా ఆగలేదు, 10-29 కి ఫోరం మాల్ ముందు ఆగి డబ్బులిచ్చేసి రోడ్ దాటెళ్ళి సిగరెట్ కొనుక్కుని తాగుతుంటే ఆహా ఆ ఫీలింగే వేరు.

టైమయిపోతోంది, సిగరెట్ తాగుతూ రోడ్ క్రాస్ చేసి కక్కుర్తి పఫ్ఫులు రెండు లాగి సిగరెట్ పడేసి లోపలికి వెళ్తుంటే సెక్యూరిటీ దగ్గర ఎవ్వరూ లేరు, నో చెకింగ్, వారెవ్వా సెకండ్ షో ప్రేక్షకుల మీద ఇంత నమ్మకమా అనిపించింది, దేశమంతా ఇలా మాల్స్ బయట సెక్యూరిటీ లేని రోజులొస్తే  ? ఫ్లోర్లు దాటుకుంటూ ఎస్కలేటర్లు మారుతూ ముందు బద్దకంగా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్న కపుల్ ని ఓవర్టేక్ చేసి అదో అచీవ్మెంట్ లా ఫీలవుతూ, ఇక్కడ నాకు ఇంకో కక్కుర్తి ఉంది, popcorn. సినిమా బిగినింగ్ లో ఇంటర్వెల్లో popcorn ఉండాల్సిందే. ఇంకో రెండు నిమిషాలే ఉంది, screen 3 దగ్గరకెళ్ళే సరికి జనాలు బయట వెయిటింగ్, హమ్మయ్య popcorn కొనుక్కోవచ్చు. వెళ్ళి కౌంటర్ క్యూలో నిలబడ్డా, నా ముందు ఒక కపుల్ వాళ్ళ ముందు ఇద్దరమ్మాయిలున్నారు పెద్ద టైం పట్టదు అనుకున్నా, ఆ అమ్మాయిలిద్దరికే 5 నినిషాలు పట్టింది, నేను వెనక్కి తిరిగి చూస్తున్నా, ఇంకా జనాలు బయటే ఉన్నారు. కపుల్ వంతు వచ్చింది అప్పుడు డిస్కస్ చేసుకుంటున్నారు ఏం కావాలో, నాకు ఎక్కడో కాలింది, ఈ popcorn కోరిక లేకపోతే నాకు ఈ చిరాకుండదు కదా అనే తత్వం బోధపడుతున్నా కోరిక చంపుకోలేక వెయిట్ చేస్తున్నా. ఈ కోరికలే కదా మనిషి అసహనానికి గొడవలకి యుధ్దాలకి కారణం అని నాలో నేను డిబేట్ చేసుకుంటుండగా వాళ్ళ ఆర్డర్ పూర్తయింది, వెనక్కి తిరిగి చూసా ఇంకా జనాలు బయటే ఉన్నారు. 

ఇంతలో నాకో flashback

 No time to die కి వెళ్ళినపుడు ఇంటర్వెల్లో ఇలాగే కౌంటర్ లో క్యూలో ఉన్నా pipcorn కోసం, అప్పుడు కూడా నా ముందు ఇలాగే ఇంకో కపుల్, కౌంటర్లో వాణ్ణి బలవంత పెడుతున్నారు, దేనికోసం ? popcorn రెండు ఫ్లేవర్లు కలిపి ఇవ్వమని వాడు అలా ఇవ్వడం కుదరదని, ఛీ దీనెమ్మ జీవితం నేనెందుకొచ్చాను ఈ ముష్టి సినిమాకి popcorn ఎందుకు తినాలి ఇలాంటి కపుల్ నా ముందే ఎందుకుండాలి ? ఇద్దరిలో ఒకళ్ళకయినా సెన్స్ లేదా? వాడు అలా ఇవ్వడం కుదరదు మొర్రో అని మొత్తుకుంటుంటే వాదిస్తారేంటి ? fucking senseless idiots అని తిట్టుకున్నా. ఫైనల్ గా కౌంటర్ వాడే గెలిచాడు, ఈ ముచ్చటైన జంట argument కి లొంగిపోయి ఎక్కడ ఇచ్చేస్తాడో అని టెన్షన్ పడ్డా, “వీళ్ళ మీద కంప్లైంట్ చేయాల్సిందే” అని తిట్టుకుంటూ వెళ్ళిపోయారు కపుల్. అదే నాకు popcorn తినే కోరికే లేకపోయుంటే ఆ కపుల్ ఎవరో నేనెవరో.

Flashback అయిపోయింది

నా ముందున్న కపుల్ బిల్ల్ంగ్, కార్డ్ ఇచ్చాడు password తప్పుకొట్టాడు, గుర్తురావడం లేదు, ఇంకో కార్డ్ ఇచ్చాడు, బిల్ అయింది. అప్పుడే జనాలు లోపలికి వెళ్తువ్నారు, నా popcorn చేతికొచ్చింది.

అప్పటికే పది నిమిషాలు లేట్ ఇంకో పది నిమిషాలు Ads, షారూక్ గౌరిఖాన్ ల పరమ అసహ్యమైన డబ్బింగ్ Ad film అందులో ఒకటి. 

సినిమా మొదలైపోయింది, నేను షాక్ అయిపోయా, ఎలాంటి సిగరెట్ వార్నింగ్ వీడియోలు లేకుండా గాడ్ ఫాదర్ సినిమానా ? వావ్ ఇదెలా సాధ్యమైంది మన సెన్సార్ ఎలా ఒప్పుకుంది ? ఒప్పించారా ? ఏమోలే, టైటిల్ కి అరిచారు అలా అప్పుడప్పుడు అరుస్తున్నారు, ఆల్మోస్ట్ ఫుల్ సినిమా.

ఇరవై ఏళ్ళు అయిపోయింది గాడ్ ఫాదర్ చూసి, మళ్ళీ ఇప్పుడే ఇలా బిగ్ స్క్రీన్ మీద చూడటం, అద్భుతంగా ఉంది. మా ముందు వరసలో మా ముందు సీట్లలో ఇద్దరు యంగ్ ఎర్రి పుష్పాలు, సినిమా మొదలైన దగ్గర్నుంచి సినిమాని రికార్డ్ చేస్తూ instagram reels చేస్తున్నారు, ఒకప్పుడయితే ముందుకు వంగి గట్టిగానే వార్న్ంగ్ ఇచ్చేవాణ్ణి ఆపమని ఆపకపేతే కంప్లైంట్ ఇస్తానని, ఇప్పుడు ఆ ఆవేశం లేదు, నాకిదే ప్రాప్తం అనుకుని చూసేస్తున్నా, రోహిత్ ఒక పాయింట్ తర్వాత చెప్తే వెధవలు ఆపారు. థియేటర్ కి రాకూడదని ఇంకోసారి అనిపించింది. 

సినిమా చూస్తున్నంత సేపూ rgv నే mind అంతా, ఎంత బాగా adopt చేసాడు/ ఎంత బాగా copy కొట్టాడ/ఎంత బాగా influence అయ్యాడు ఇలా వర్మ మీద ఆరాధనా భావం. 

ఇప్పటికీ నన్ను వదలని ఆలోచన ఏంటంటే సినిమా starting లో సిగరెట్ వీడియో లేదు, on screen మందు సిగరెట్ disclaimers లేవు, ఎలా ? సినిమాని అంత క్లీన్ ఇమేజ్ తో చూస్తే ఎంత బాగుంటుంది ? ఈ సినిమాకి ఇచ్చిన ‘exception’ ఏంటో భారతీయ సినిమాకి కూడా ఇయ్యొచ్చుగా ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *